Current Affairs May 17 | జాతీయం
జాతీయం
ఐఎన్ఎస్ మగర్
36 ఏండ్లు భారత నౌకాదళానికి సేవలందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ మగర్ మే 7న తన విధులకు స్వస్తి పలికింది. భారత నౌకాదళ చరిత్రలో ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైంది ఖ్యాతి పొందింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్‌లో దీన్ని రూపొందించారు. ఇది 1987, జూలై 15న నౌకాదళంలోకి ప్రవేశించింది. దీని పొడవు 390 అడుగులు, వెడల్పు 57 అడుగులు. వేగం గంటకు 28 కి.మీ.
సెమీ క్రయోజనిక్ ఇంజిన్
ఇస్రో సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను మే 10న విజయవంతంగా ప్రయోగించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ కేంద్రంలో ఈ పరీక్షను నిర్వహించారు. లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ మిశ్రమంతో పని చేసేలా దీన్ని రూపొందిస్తున్నామని ఇస్రో వెల్లడించింది. 2000 కిలో న్యూటన్ల సామర్థ్యం ఉన్న ఇంజిన్లను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
హరిత్ సాగర్
‘హరిత్ సాగర్’ గ్రీన్ పోర్ట్ గైడ్‌లైన్స్-2023ని పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీలో మే 10న ప్రారంభించారు. జీరో కర్బన ఉద్గారాలను సాధించే లక్ష్యంతో ఈ గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. ఇది పోర్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్‌లో పర్యావరణ వ్యవస్థ గతిశీలతను అంచనా వేస్తుంది. ‘వర్కింగ్ విత్ నేచర్’ కాన్సెప్ట్‌తో పనిచేయాలని నిర్దేశిస్తుంది. గ్రీన్ ఇంధనాలు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ ఇథనాల్ తదితరాలను వినియోగించాలని సూచిస్తుంది.
ఇండో-థాయి కార్పాట్
అండమాన్‌లోని సముద్రం వద్ద నిర్వహించిన 35వ భారత్-థాయిలాండ్ నేవీ ఎక్సర్సైజ్ ఇండో-థాయి కార్పాట్ మే 10న ముగిసింది. ఎనిమిది రోజులు సాగిన ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ కేసరి, హిజ్ థాయి మెజిస్టీస్ షిప్ (హెచ్‌టీఎంఎస్) సాయిబురి పాల్గొన్నాయి. ఇరుదేశాల మధ్య సముద్ర బంధాలు బలోపేతం చేయడం, హిందూ మహాసముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య మార్గం భద్రతను పెంపొదించడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం. ఇండియన్ నేవీ, రాయల్ థాయి నేవీ 2005 నుంచి ఈ కార్పాట్ను నిర్వహిస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు