జాతీయ-అంతర్జాతీయ వ్యవహారాలు (CURRENT AFFAIRS)
స్మారక ఉపన్యాసం
37వ ఎయిర్ చీఫ్ మార్షల్ పీసీ లాల్ మెమోరియల్ స్మారక ఉపన్యాసం మే 5న ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిర్ మార్షల్ జ్యోతిసింగ్, శైలేంద్ర మోహన్లతో కలిసి ‘ఇండో-పాక్ 1971 రెమినిసెన్సెస్ ఆఫ్ ఎయిర్ వారియర్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సెక్షన్ 124ఎ
బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టం 124ఎ అమలుపై సుప్రీంకోర్టు మే 11న స్టే విధించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక యిన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేష పూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహం నేరం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఎంకేఐ ఫైటర్ జెట్
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్‌కు చెందిన మెరుగైన వెర్షన్ క్షిపణిని మే 12న విజయవంతంగా పరీక్షించారు. దీని పరిధి 500 కి.మీ.. గాలిలో గమనాన్ని మార్చగలదు. 10 మీ. ఎత్తులో ఎగురుతుంది.
పుస్తకావిష్కరణ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ నవలను మే 7న ఆవిష్కరించారు. ఈ నవలను మాజీ పోలీస్ అధికారి ప్రకాశ్ సింగ్ రాశారు.
ఆసియా ఎన్నికల సంఘంలో భారత్
ఆసియా ఎన్నికల ప్రాధికార సంస్థల సంఘం (అసోసియేషన్ ఆఫ్ ఆసియాన్ ఎలక్షన్ అథారిటీ-ఏఏఈఏ) అధ్యక్ష పీఠానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మే 7న జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు, జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ ఈ పీఠాన్ని దక్కించుకుంది. భారత్ ఈ పదవిలో 2024 వరకు ఉంటుంది. కొత్త ఎగ్జిక్యూటివ్ బోర్డులో రష్యా, శ్రీలంక, తైవాన్, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
చెక్ రిపబ్లిక్
ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్ రిపబ్లిక్‌ను తీసుకునేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానించింది. మే 10న నిర్వహించిన రహస్య బ్యాలెట్లో 193 సభ్య దేశాలకు 180 దేశాలు పాల్గొన్నాయి. దీనిలో చెక్ రిపబ్లిక్కు అనుకూలంగా 157 ఓట్లు వచ్చాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక రష్యాను ఈ స్థానం నుంచి తొలగించారు.
ఆరామ్కో
సౌదీ అరామ్కో కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా మే 11న నిలిచింది. 2.43 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో యాపిల్ సంస్థను అధిగమించింది.
106వ క్లాస్ పులిట్జర్ బహుమతులను మే 9న ప్రకటించారు.
జర్నలిజంలో..
ఫీచర్ ఫొటోగ్రఫీ- రాయిటర్స్‌లో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖీకి లభించింది. ఈ అవార్డు ఆయనతో పాటు అదే సంస్థలో పనిచేస్తున్న సహచరులు అద్నాన్ అబిద్, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దవేలకు దక్కింది. భారత్‌లో కొవిడ్ రెండో వేవ్‌లో చోటు చేసుకున్న మరణాలకు సంబంధించి తీసిన చిత్రాలకు వీరిని ఈ అవార్డు వరించింది. పబ్ల్లిక్ సర్వీస్ విభాగం- ‘ది వాషింగ్టన్ పోస్ట్’, ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్- కోరీ జీ జాన్సన్, రెబెకా వూలింగ్టన్, ఎలి ముర్రే (తంపా బే టైమ్స్), బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్- ‘మియామి హెరాల్డ్ సిబ్బంది’, ఎక్స్ప్లానేటరీ రిపోర్టింగ్- క్వాంటా మ్యాగజీన్ సిబ్బంది, నటాలీ వోల్చోవర్, లోకల్ రిపోర్టింగ్‌లో మాడిసన్ హాప్కిన్స్, సిసీలియా రెయెస్, నేషనల్ రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్- ది న్యూయార్క్ సిబ్బందికి, ఫీచర్ రైటింగ్‌లో జెన్నిఫర్ (ది అట్లాంటిక్ సీనియర్ జర్నలిస్ట్), కామెంటరీ- మెలిండా హెన్నెబర్గర్ (కన్సాస్ సిటీ స్టార్), క్రిటిసిజమ్- సలామిషా టిల్లెట్ (ది న్యూయార్క్ టైమ్స్), ఎడిటోరియల్ రైటింగ్- లిసా ఫాల్కెన్బెర్గ్, మైకేల్ లిండెన్బెర్గర్, జో హోలీ, లూయిస్ కరాస్కో (హూస్టన్ క్రానికల్), ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ- ఫమిదా అజిమ్, ఆంథోని డెల్ కాల్, జోష్ ఆడమ్స్, వాల్ట్ హికీ, బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ- మార్కస్ యామ్ (లాస్ ఏంజెల్స్ టైమ్స్), విన్ మెక్‌నామీ, డ్య్రూ యాంగరర్, స్పెన్సర్ ప్లాట్, శామ్యూల్ కోరం, జాన్ చెర్రీ (గెట్టీ ఇమేజెస్), ఆడియో రిపోర్టింగ్- ఫ్యూచరో మీడియా, పీఆర్ఎక్స్ సిబ్బంది.
బుక్స్, డ్రామా, మ్యూజిక్‌లో …
ఫిక్షన్- ది నెతన్యాహు: యాన్ అకౌంట్ ఆఫ్ ఏ మైనర్ అండ్ అల్టిమేట్లీ ఈవెన్ నెగ్లిజిబుల్ ఎపిసోడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏ వెరీ ఫేమస్ (రచయిత జుషువా కొహెన్), డ్రామా- ఫాట్ హ్యామ్ (జేమ్స్ ఇజామెస్), హిస్టరీ- కవర్డ్ విత్ నైట్ (నికోల్ యూస్టేస్, క్యూబా), యాన్ అమెరికన్ హిస్టరీ (అదా ఫెర్రర్), బయోగ్రఫీ- చేజింగ్ మీ టు మైగ్రేవ్: యాన్ ఆర్టిస్ట్స్ మెమోయిర్ ఆఫ్ ది జిమ్ క్రో సౌత్ (దివంగత విన్‌ఫ్రెడ్ రెంబెట్ ఎరిన్-1 కెల్లీకి చెప్పింది), పోయెట్రీ- ఫ్రాంక్: సోనెట్స్ (డయాన్ స్యూస్), జనరల్ నాన్ఫిక్షన్- ఇన్విజిబుల్ చైల్ద్: పావర్టీ, సర్వైవల్, హోప్ ఇన్ యాన్ అమెరికన్ సిటీ (ఆండ్రియా ఇలియట్), మ్యూజిక్- వాయిస్‌లెస్ మాస్ (రావెన్ చాకన్).
గుకేష్
మే 8న స్పెయిన్‌లో నిర్వహించిన సన్వే ఫార్మెంటెరా ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో డీ గుకేష్ విజేతగా నిలిచాడు. ఇటీవల లా రోడ, మెనార్క్ టోర్నమెంట్లలో విజయం సాధించాడు. వరల్డ్ చెస్ ర్యాంకింగ్‌లో 64వ స్థానంలో ఉన్నాడు.
మాడ్రిడ్ ఓపెన్
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో కార్లోస్ అల్కరజ్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. మే 10న నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఒన్స్ జబీర్ (ట్యునీషియా) జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించి విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను గాబ్రియెలా డబ్రోవ్స్కి-గిలియానా ఒల్మోస్ జోడీ గెలుచుకుంది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్
4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్, లోగో, జెర్సీలను కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మే 7న హర్యానా పంచకులలోని ఇంద్రధనుష్ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ క్రీడలు జూన్ 4 నుంచి 13 వరకు హర్యానాలోని పంచకుల, చండీగఢ్, షహబాద్, అంబాలాలో నిర్వహించనున్నారు. ఈ క్రీడల మస్కట్ ‘ధకడ్’. వివిధ క్రీడాంశాల్లో 8500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్స్‌ను తొలిసారిగా 2018 (ఢిల్లీ)లో తరువాత 2019 (పుణె), 2020 (గువాహటి) లో నిర్వహించారు.
సింథియా రోసెన్‌జ్‌వీగ్
2022కు గాను ప్రపంచ ఆహార బహుమతి న్యూయార్క్‌కు చెందిన సింథియా రోసెన్జ్వీగ్కు మే 5న లభించింది. ఈమె వ్యవసాయ, పర్యావరణ సైంటిస్ట్. 1987లో నార్మన్ బోర్లాగ్ గౌరవార్థం ఈ అవార్డును నెలకొల్పారు. ఈ అవార్డు కింద 2,50,000 యూఎస్ డాలర్ల నగదు అందజేస్తారు.
పుష్ప్ కుమార్ జోషి
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్‌గా పుష్ప్ కుమార్ జోషి మే 8న నియమితులయ్యారు. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద చమురుశుద్ధి కంపెనీ. హెచ్‌పీసీఎల్‌ను 1974లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
జాన్ లీ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్ (హాంకాంగ్ పాలనకుడిగా) జాన్ లీ కా చియు మే 8న ఎన్నికయ్యారు. చైనా అనుకూల జాన్ లీకి 1500 మంది కమిటీ సభ్యుల్లో 1416 మంది ఓటేశారు. ఇదివరకు ఈ పదవిలో కేరీ లామ్ ఉన్నారు.
గురుస్వామి కృష్ణమూర్తి
ప్రవాస భారతీయుడు గురుస్వామి కృష్ణమూర్తికి ‘ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సివిల్ డివిజన్) అవార్డు-2022’ మే 9న లభించింది. ఈయన బ్రిటిష్ మెడికల్ టెక్నాలజీ సంస్థ అయిన పెన్లాన్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
రోడ్రిగో చావ్స్
కోస్టారికా కొత్త అధ్యక్షుడిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన రోడ్రిగో చావ్స్ మే 9న ఎన్నికయ్యారు. మాజీ ఆర్థిక మంత్రి అయిన ఈయన ప్రపంచ బ్యాంకులో 30 సంవత్సరాలు పని చేశారు. కోస్టారికా రాజధాని శాన్ జోస్. కరెన్సీ కోలన్.
యూన్ సుక్ యోల్
దక్షిణి కొరియా నూతన అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ మే 10న బాధ్యతలు చేపట్టారు. ఈయన యూన్ జే ఇన్ పాలనలో (2019-21) దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్ జనరల్‌గా పనిచేశారు. దక్షిణ కొరియా ప్రధాని కిమ్ బు-గ్యోమ్. రాజధాని సియోల్. కరెన్సీ కొరియన్ వాన్.
ఫెర్డినాండ్ మార్కోస్
మే 10న ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ విజయం సాధించారు. 1986లో నియంత అయిన అతడి తండ్రి ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ప్రజలే కొడుకుకు పదవి కట్టబెట్టడం విశేషం.
సంజీవ్ బజాజ్
భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) అధ్యక్షుడిగా సంజీవ్ బజాజ్ మే 12న బాధ్యతలు చేపట్టారు. ఈయన బజాజ్ ఫిన్సర్వ్కు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిలో 2023 వరకు ఉంటారు. ఇప్పటి వరకు ఈ పదవిలో టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ ఉన్నారు. సీఐఐ ఉపాధ్యక్షుడిగా టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ ఎన్నికయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?