జాతీయం 11 మే 2022
హైకోర్టు సీజేఐలు, సీఎంల సదస్సు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యం లో వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల 11వ సదస్సు ఏప్రిల్ 30న జరిగింది. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఈ సదస్సు నిర్వహించారు. న్యాయవ్యవస్థలో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని అన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్
భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియన్-ఐఏసీ) ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) రూపొందిం చింది. దీనిని త్వరలోనే నౌకాదళానికి అప్పగిస్తామని సీఎస్ఎల్ (టెక్నికల్) డైరెక్టర్ బెజోయ్ భాస్కర్ ఏప్రిల్ 28న వెల్లడించారు. 40,000 టన్నుల బరువు, రూ.23,000 కోట్లతో నిర్మించిన దీని గరిష్ఠ వేగం 28 నాట్స్. దీని పొడవు 262 మీటర్లు.
మితాన్ యోజన
ముఖ్యమంత్రి మితాన్ యోజన (మితాన్ అంటే స్నేహితుడు) పేరుతో డోర్‌స్టెప్ డెలివరీ పథకాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్ మే 1న ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వంటి 14 మున్సిపాలిటీల్లో దీనిని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఛత్తీస్‌గఢ్ పౌరులు జనన, కులం, ఆదాయం, వివాహ ధృవీకరణ పత్రాల డెలివరీతో సహా 100 ప్రజా సేవలను పొందవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14545.
హైడ్రోజన్ షిప్
దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన విద్యుత్ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డులో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మే 3న వెల్లడించారు.
న్యాట్‌గ్రిడ్
బెంగళూరులో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (న్యాట్‌గ్రిడ్) క్యాంపస్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 3న ప్రారంభించారు. స్వదేశీ టెక్నాలజీతో సైనిక వ్యవస్థను మరింట పటిష్ఠం చేసేందుకు నేషనల్ డేటాబేస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ డేటాబేస్ ద్వారా హవాలా లావాదేవీలు, ఉగ్రవాదులకు నిధులు, నార్కోటిక్స్, బాంబు దాడులు, స్మగ్లింగ్ వంటి ఉగ్రవాద చర్యలపై పర్యవేక్షణ సాధ్యపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?