అంతర్జాతీయం 11 మే 2022
వల్లభాయ్ పటేల్ విగ్రహం
ఉత్తర అమెరికాలోని కెనడాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మే 1న ఆవిష్కరించారు. ఒంటారియోలోని మార్గామ్‌లో సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అటవీ విస్తీర్ణం పెంపుపై ఒప్పందం
పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై ప్రధాని మోదీ, జర్మనీ ప్రధాని ఒలాఫ్ షోల్జ్ మే 2న సంతకం చేశారు. 2030 నాటికి సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాల కోసం భారత్‌కు సుమారు రూ.80,430 కోట్ల సహాయాన్ని జర్మనీ ప్రకటించింది. మొత్తం 9 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు.
ఇండియా-డెన్మార్క్
ప్రధాని మోదీ మూడురోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మే 3న డెన్మార్క్‌లో ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరం సదస్సు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య రక్షణ, ఆర్థిక, స్వేచ్ఛా వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సెన్తో చర్చించారు.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్
పత్రికా స్వేచ్ఛ రోజు సందర్భంగా 180 దేశాలతో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌ను మే 3న విడుదల చేశారు. ఈ జాబితాలో నార్వే మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్ 2, స్వీడన్ 3, ఎస్టోనియా 4, ఫిన్లాండ్ 5వ స్థానాల్లో నిలిచాయి.
భారతదేశం 150వ స్థానంలో నిలిచింది. ఎరిత్రియా 179, ఉత్తర కొరియా 180వ స్థానాల్లో ఉన్నాయి. 2021 సూచీలో భారత్ 142వ స్థానంలో ఉంది.
ఎస్ వో ఎఫ్ వో
‘ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ (ఎస్ వో ఎఫ్ వో)’ రిపోర్టును ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో మే 3న విడుదల చేశారు. పోషకాహారం, ఆహార భద్రతను మెరుగుపర్చడానికి అంతర్జాతీయంగా చర్యలు తీసుకునేందుకు ఈ రిపోర్టును రెండేండ్లకోసారి ఎఫ్ఏవో రూపొందిస్తుంది. 2030 నాటికి అటవీ నష్టాన్ని తొలగించడం, పునరుద్ధరణ, స్థిరమైన అడవిని సంరక్షించడం దీని ఉద్దేశం.
టైమ్స్ ఇంపాక్ట్ ర్యాంకింగ్
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) తన ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌ను మే 4న విడుదల చేసింది. 110 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 1,542 ఇన్స్టిట్యూషన్లు ఈ ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ర్యాంకింగ్‌లో వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) మొదటి స్థానంలో నిలువగా, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (యూఎస్) 2, వెస్ట్రన్ యూనివర్సిటీ (కెనడా) 3వ స్థానాల్లో నిలిచాయి. భారత్‌లోని అమృత విశ్వవిద్యాలయం 41, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 74వ స్థానంలో ఉన్నాయి. ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన 4వ దేశం భారత్.
నార్డిక్ దేశాల సమావేశం
డెన్మార్క్ రాజధాని కొపెన్‌హెగెన్‌లో 2వ ఇండియా-నార్డిక్ దేశాల ప్రధాన మంత్రుల సమావేశం మే 4న నిర్వహించారు. నార్వే, స్వీడన్/ఫిన్లాండ్, ఐస్లాండ్-డెన్మార్క్, ఉత్తర ఐరోపా-ఉత్తర అట్లాంటిక్ దేశాలను నోర్డిక్ దేశాలుగా పిలుస్తారు. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జొనాస్ గహర్ స్టోర్, స్వీడన్ ప్రధాని మాగ్డలీనా అండర్సన్, ఐస్లాండ్ ప్రధాని కేట్రిన్ జాకోబ్స్డాటిర్, ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ హాజరయ్యారు. మొదటి ఇండియా-నార్డిక్ సమావేశం 2018లో స్టాక్‌హోంలో నిర్వహించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?