Current Affairs April 18 | అంతర్జాతీయం
బాలికాటన్
అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల మిలిటరీ ఎక్సర్సైజ్ బాలికాటన్ ఏప్రిల్ 11న ప్రారంభమయ్యింది. బాలికాటన్ తగలోగ్ (భుజం నుంచి భుజం) అనే పదం నుంచి వచ్చింది. 18 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎక్సర్సైజ్ను దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వద్ద చేపడుతున్నారు. దీనిలో ఇరుదేశాలకు చెందిన 17,600 కంటే ఎక్కువ మంది సైనిక సిబ్బంది పాల్గొంటున్నారు. ఇరుదేశాల సంబంధాలు మెరుగుపర్చుకోవడం, చైనాను ఎదుర్కోవడం ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం.
హోమియోపతి దినోత్సవం
ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏప్రిల్ 10న నిర్వహించారు. హోమియోపతి పితామహుడు జర్మనీకి చెందిన శామ్యూల్ హనెమన్ జయంతి సందర్భంగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన 1796లో ఈ వైద్యవిధానాన్ని కనుగొన్నారు. ఈయన సృష్టించిన హోమియోపతి అనే పదం హోమియో, పాథోస్ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హోమియో అంటే సారూప్యత, పాథోస్ అంటే బాధ లేదా వ్యాధి అని అర్థం. ఈ ఏడాది దీని థీమ్ ‘వన్ హెల్త్, వన్ ఫ్యామిలీ’.
నేరాల నివేదిక
నేరాలపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికను ఏప్రిల్ 12న విడుదల చేశారు. దీనిలో అధిక నేరాలతో వెనెజులా మొదటి స్థానంలో ఉంది. పపువా న్యూగినియా 2, అఫ్గానిస్థాన్ 3, సౌతాఫ్రికా 4, హోండురస్ 5, ట్రినిడాడ్ 6, గయానా 7, సిరియా 8, సోమాలియా 9, జమైకా 10వ స్థానాల్లో ఉన్నాయి. దీనిలో భారతదేశం 77, యూఎస్ఏ 55, యూకే 65వ స్థానాలో ఉన్నాయి. అతి తక్కువ నేరాలతో తుర్కియే 92, జర్మనీ 100, జపాన్ 135వ స్థానాల్లో నిలిచాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?