Current Affairs April 18 | జాతీయం
కోప్ ఇండియా
కోప్ ఇండియా 2023 (సీఐ 23) పేరుతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్), యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌ఫోర్స్ (యూఎస్ఏఎఫ్) మధ్య ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం ఏప్రిల్ 10న ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజ్ పశ్చిమబెంగాల్లోని పనాగర్, కలైకుండ్లో 12 రోజులు నిర్వహిస్తున్నారు. ఇరుదేశాల వైమానిక దళాల మధ్య పరస్పర అవగాహన, సహకారం పెంపొందించడం, వారి నైపుణ్యాలను పంచుకోవడం ఈ వ్యాయామ లక్ష్యం. ఈ ఎక్సర్సైజ్ 2004లో ప్రారంభించారు.
3డీ పోస్టాఫీస్
దేశంలోని తొలిసారిగా 3డీ ప్రింటెడ్ టెక్నాలజీతో పోస్టాఫీసును నిర్మిస్తున్నట్లు ఎల్ అండ్ టీ కంపెనీ ఏప్రిల్ 11న వెల్లడించింది. దీన్ని బెంగళూరులోని కేంబ్రిడ్జి లేఅవుట్లో నిర్మిస్తున్నారు. రూ.23 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నెల రోజుల్లో పూర్తి కానున్నది.
ఫైనాన్స్, ఎకనామిక్స్ సమావేశం
భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఫైనాన్స్, ఎకనామిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో నిర్వహించారు. దేశ, విదేశీ ప్రముఖ విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ సమావేశ ఉద్దేశం. డిఫెన్స్ ఫైనాన్స్, ఎకనామిక్స్‌పై రక్షణలో మానవ వనరులు నిర్వహించడం, జీతం, పెన్షన్లు, రక్షణ సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు.
నది లోపల రైలు
దేశంలోనే తొలిసారిగా నది లోపల ఏర్పాటు చేసిన మెట్రో రైలు ట్రయల్ రన్ ఏప్రిల్ 12న విజయవంతంగా పూర్తయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ఈ రైలును నడిపారు.
కనెక్టివిటీ మీట్
భారత్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల వాణిజ్య సామర్థ్యాన్ని ఉపయోగించుకునే కనెక్టివిటీ కార్యక్రమాల కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం భారత విదేశాంగ శాఖ సహకారంతో ఈశాన్య భారత్‌కు చెందిన థింక్ ట్యాంక్, ఏషియన్ కన్ఫ్లూయన్స్ ఆధ్వర్యంలో త్రిపురలో ఏప్రిల్ 11 నుంచి 12 వరకు చేపట్టారు. చిట్టగాంగ్‌లోని నౌకాశ్రయం, టోక్యో నిధులతో నిర్మిస్తున్న బంగ్లాదేశ్‌లోని మతర్బారి పోర్టుల నుంచి త్రైపాక్షిక వాణిజ్య అవకాశాలను అన్వేషించాలని చర్చించారు.
సెబీ లోగో
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 12న నిర్వహించారు. ఈ సందర్భంగా సెబీ కొత్త లోగోను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెబీని 1988, ఏప్రిల్ 12న ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?