Current Affairs | వార్తల్లో వ్యక్తులు
రామచంద్రరావు
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు 28వ చీఫ్ జస్టిస్ (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మే 30న ప్రమాణం చేశారు. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. ఓయూలో లా చదివారు.
సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ మాజీ సభ్యుడు సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర ‘స్మైల్ అంబాసిడర్’గా మే 30న నియమితులయ్యారు. ‘స్వచ్ఛ్ ముఖ్ అభియాన్’ కార్యక్రమానికి సచిన్‌ను స్మైల్ అంబాసిడర్‌గా నియమించారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశ వ్యాప్తంగా స్వచ్ఛ్ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లీన్ మౌత్ క్యాంపెయిన్ కోసం సచిన్ ఐదేండ్లు అంబాసిడర్‌గా ఉంటారు. సచిన్‌తో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
రాజబాబు
డీఆర్డీవోకు చెందిన హైదరాబాద్‌లోని క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల (మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్-ఎంఎస్ఎస్) డీజీ (డైరెక్టర్ జనరల్)గా మే 31న నియమితులయ్యారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన పదోన్నతిపై డీజీ అయ్యారు. 1988లో వైమానిక దళంలో కెరీర్ ప్రారంభించిన ఆయన 1995లో డీఆర్డీవోలో చేరారు. ఆయన నేతృత్వంలోనే ‘మిషన్ శక్తి’ పేరిట తొలి ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
అజయ్ యాదవ్
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్)గా మే 31న నియమితులయ్యారు. ఈయన బీహార్ కేడర్ చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఎస్ఈసీఐ మినీరత్న కేటగిరీ-1 సెంట్రల్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ (సీపీఎస్ఈ). దీన్ని 2011లో విలీనం చేశారు.
రవిచంద్రన్
జియో ఇన్స్టిట్యూట్ ప్రొవోస్ట్, ప్రముఖ సైంటిస్ట్, విద్యావేత్త గురుస్వామి రవిచంద్రన్‌కు టిమోషెంకో మెడల్ లభించినట్లు జియో ఇన్స్టిట్యూట్ మే 31న వెల్లడించింది. తమిళనాడులో జన్మించిన ఆయన ఎక్స్ట్రీమ్ మెకానికల్ ఎన్విరాన్‌మెంట్స్‌లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. అధిక పీడనం, ఒత్తిడికి గురైనప్పుడు లోహాలు, పాలిమర్లు తదితర పదార్థాల ప్రవర్తనపై ఆయన ఎంతోకాలం పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనల వల్ల అధిక ఒత్తిడికి గురై విఫలమవుతున్న పదార్థాల స్థానంలో అధిక ఒత్తిడిని తట్టుకునేలా నూతన పదార్థాల ఆవిష్కరణకు మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ ఇంజినీర్ టిమోషెంకో పేరిట 1957 నుంచి ఏటా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌లో ఈ అవార్డును అత్యంత గౌరవంగా భావిస్తారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?