Current affairs – Groups Special | ‘భారత్ ఉత్సవ్’ వేడుకలను ఏ దేశంలో నిర్వహించారు?

1. ఆగస్టు 15న ఏ దేశాలు స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తాయి? (4)
1) దక్షిణ కొరియా 2) కాంగో
3) ఉత్తర కొరియా 4) పైవన్నీ
వివరణ: ఆగస్ట్ 15న భారతదేశం మాత్రమే కాకుండా మరో అయిదు దేశాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. దక్షిణ, ఉత్తర కొరియా దేశాలు 1945లో జపాన్ నుంచి స్వాతంత్య్రాన్ని పొందాయి. అలాగే బహ్రెయిన్ 1971లో బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రాన్ని దక్కించుకుంది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. భారత్ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని పొందగా, అంతకు ఒక రోజు ముందు పాకిస్థాన్ అదే సంవత్సరం స్వతంత్ర దేశం అయ్యింది. ఏటా ఆగస్టు 14న భారత్‌లో విభజన రోజు మరణించిన వారి సంతాప రోజుగా నిర్వహిస్తారు.
2. ఏ సంవత్సరంలో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా జరగనుంది? (2)
1) 2026 2) 2025
3) 2024 4) 2028
వివరణ: 2025లో ప్రయాగ్ రాజ్ కుంభమేళా జరగనుంది. దీని నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లుజెర్న్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 5000 మందికి వసతి, ఉదయం అల్పాహారం, పేయింగ్ గెస్ట్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం అయిదు సంవత్సరాలు అమలులో ఉంటుంది. పర్యాటకాన్ని పెంపొందించే లక్ష్యంతో దీన్ని తీసుకు రానున్నారు. మహా కుంభమేళాకు హాజరయ్యే వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దీన్ని చేపట్టనున్నారు.
3. భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్ ఏ నగరంలో రానుంది? (3)
1) హైదరాబాద్ 2) చెన్నై
3) లక్నో 4) ముంబయి
వివరణ: భారతదేశంలో అతిపెద్ద ఐటీ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి కావాల్సిన బ్లూ ప్రింట్‌ను రాష్ట్ర రాజకీయ నిర్మాణ్ నిగమ్ రూపొందించింది. సుమారు 40 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయడంతో పాటు అంతర్జాతీయ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ 6.9 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది అమయిసి, నాదర్‌గంజ్ పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.
4. జీ-20 సినీ ఉత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? (4)
1) గోవా 2) హైదరాబాద్
3) లక్నో 4) న్యూఢిల్లీ
వివరణ: జీ-20 సినీ ఉత్సవాన్ని న్యూఢిల్లీలో ఆగస్టు 16న ప్రారంభించారు. పథేర్ పాంచాలి సినిమాను మొదట ప్రదర్శించారు. ఈ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే. జీ-20 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, జీ-20 సచివాలయాలు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఈ వేడుక సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుంది. సత్యజిత్ రే భారతదేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరు. ఆయనకు 1985లో దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డ్, 1992లో భారతరత్న దక్కాయి. మొత్తం 36 సినిమాలకు దర్శకత్వం వహించారు.
6. పైబోట్ను రూపొందించిన దేశం ఏది? (3)
1) ఆస్ట్రేలియా 2) ఇజ్రాయెల్
3) దక్షిణ కొరియా 4) జపాన్
వివరణ: దక్షిణ కొరియాలోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే శాస్త్ర పరిశోధన సంస్థ పైబోట్ను రూపొందించింది. విమాన పైలట్ నిర్వహించే పనులన్నీ చేసే రోబోనే పైబోట్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాక్పిట్లను ఏ మాత్రం మార్పు లేకుండా పైబోట్ విమానాలను నడపగలవు. మనుషుల తరహాలోనే కాక్‌పిట్‌లో ఉండే అన్ని రకాల నియంత్రణ సాధనాలను కూడా సమర్థంగా వినియోగిస్తాయి. కృత్రిమమేధతో పాటు రోబోటిక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇవి వినియోగిస్తాయి. గ్లోబల్ ైఫ్టెట్ చార్ట్‌లను కూడా ఇవి గుర్తుంచుకోగలుగుతున్నాయి. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో కూడా సమర్థంగా సంభాషిస్తున్నాయి.
7. జార్జి లెడ్లి ప్రైజ్‌ను పొందింది ఎవరు? (4)
ఎ. రాజ్ చెట్టి బి. మైఖేల్ స్ప్రింగర్
1) ఎ 2) బి 3) ఏదీకాదు 4) ఎ, బి
వివరణ: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చే జార్జ్ లెడ్లి ప్రైజ్‌ను భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టి, జీవశాస్త్రవేత్త మైఖేల్ స్ప్రింగర్‌లకు ప్రకటించారు. రాజ్ చెట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యక్తి పైకి ఎదిగే క్రమానికి సంబంధించి ఆయన ప్రత్యేక పరిశోధనలు చేసి, తగిన దత్తాంశాన్ని రూపొందించారు. వ్యక్తులు ఎదగకుండా ఎలాంటి అవరోధాలు ఉంటాయో ఈ పరిశోధన వల్ల తెలుసుకోవచ్చు. మరో వైపు మైఖేల్ స్ప్రింగర్ హార్వర్డ్ మెడికల్ పాఠశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఆవిష్కరణలో ఆయన దిట్ట.
8. నమో 108 దేనికి సంబంధించింది? (1)
1) కమల పుష్పం
2) కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం
3) కొత్త వాహనాలు 4) ఏదీకాదు
వివరణ: నమో 108 పేరుతో ఒక కమల పుషాన్ని సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ సంయుక్తంగా రూపొందించారు. దీనికి రేఖలు 108 ఉంటాయి. భారత 77వ స్వతంత్ర దినోత్సవం రోజున దీన్ని జాతికి అంకితం చేశారు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. ‘ఒక వారం ఒక ప్రయోగశాల’ కార్యక్రమంలో భాగంగా ఈ పుష్పాన్ని ఆవిష్కరించారు. నమో 108 కోసం కమలపు పుష్పాన్ని మణిపూర్ రాష్ట్రం నుంచి తెచ్చారు. సమగ్రంగా అధ్యయనం చేసి, జీనోమ్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. నమో 108 అనే పుష్పం, అరుదైన లక్షణాలను కూడా ప్రదర్శించింది. మార్చి నుంచి డిసెంబర్ వరకు ఇది వికసించడం విశేషం.
9. జీ-20 సమావేశ పత్రాల్లో వసుదైక కుటుంబం అనే పదం సంస్కృత భాషలో వినియోగించడం పట్ల అభ్యంతరం తెలిపిన దేశం ఏది? (3)
1) పాకిస్థాన్
2) సౌదీ అరేబియా
3) చైనా 4) ఆస్ట్రేలియా
వివరణ: జీ-20 కూటమి సమావేశాలకు ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తుంది. దీని లోగోలో భాగంగా వసుదైక కుటుంబం అనే పదాన్ని వినియోగిస్తుంది. ఈ పదాన్ని మహా ఉపనిషత్ నుంచి స్వీకరించారు. కేవలం యూఎన్వో అధికారిక భాషలనే వినియోగించాలని చైనా పేర్కొంది. అయితే భారత్ దీనికి దీటైన జవాబు ఇచ్చింది. వసుదైక కుటుంబం అర్థం వచ్చేలా, అన్ని ఇంగ్లిష్ పత్రాల్లో, ఇంగ్లిష్‌లోనే ఇస్తున్నట్లు పేర్కొంది. ఇంగ్లిష్ భాషలో ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ అని రాస్తున్నారు. అంటే ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అని అర్థం.
10. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘భారత్ ఉత్సవ్’ పేరుతో ఏ దేశంలో వేడుకలు నిర్వహించారు? (2)
1) సౌదీ అరేబియా 2) యూఏఈ
3) దక్షిణాఫ్రికా 4) దక్షిణ కొరియా
వివరణ: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజలు పాటు యూఏఈలోని దుబాయ్‌లో ‘భారత్ ఉత్సవ్’ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. అలాగే భారతదేశంలోని రాష్ర్టాల ప్రత్యేకతలను చాటేలా ప్రదర్శన చేపట్టారు. భారత సంప్రదాయ సంగీతం, సాంస్కృతిక ఎగ్జిబిషన్లు తదితరాలు ఆకట్టుకున్నాయి. భారత్, యూఏఈల మధ్య సంబంధాల పెంపునకు వీటిని చేపట్టారు. భారత్ తరఫున పార్లమెంట్ సభ్యులు కార్తికేయ శర్మ, చిరాగ్ కుమార్ పాశ్వాన్ పాల్గొన్నారు.
11. దేశంలో తొలి వ్యవసాయ డేటా ఎక్సేంజ్ అండ్ అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్ ఏ రాష్ట్రంలో వచ్చింది? (4)
1) ఒడిశా 2) పంజాబ్
3) మహారాష్ట్ర 4) తెలంగాణ
వివరణ: భారతదేశ తొలి వ్యవసాయ డేటా ఎక్సేంజ్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రవేశపెట్టడంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక ఫోరం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లతో అనునసంధానం అయింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతిలో క్రోడీకరించడం ద్వారా ఎంఎస్ఎంఈ, స్టార్టప్ సంస్థలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వేదికను ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. త్వరలో రాష్ట్రం అంతటికీ విస్తరిస్తారు. ఈ దత్తాంశాన్ని యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు కూడా వినియోగించుకొనేలా తీర్చిదిద్దనున్నారు
12. ముష్కుబుద్జి బియ్యం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవి? (3)
1) పుదుచ్చేరి 2) పశ్చిమబెంగాల్
3) జమ్మూకశ్మీర్ 4) మహారాష్ట్ర
వివరణ: ముష్కుబుద్జి బియ్యం జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి చెందినవి. ఇటీవల ఈ బియ్యానికి జీఐ ట్యాగ్ దక్కింది. ముఖ్యంగా వీటిని కశ్మీర్ లోయలో పండిస్తారు. సువాసనకు ఇవి పెట్టింది పేరు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అనంత్‌నాగ్, బిర్వా తదితర ప్రాంతాల్లో ఈ రకం బియ్యాన్ని విస్తృతంగా పండిస్తారు. సువాసనతో పాటు చిన్నగా ఉండటంతో ఎక్కువగా వీటిని వేడుకల్లో వినియోగిస్తారు. జీఐ ట్యాగ్ 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.
14. మలబార్ నావికా విన్యాసాలు ఆగస్టు 11న ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? (4)
1) అమెరికా 2) జపాన్
3) భారత్ 4) ఆస్ట్రేలియా
వివరణ: క్వాడ్ కూటమిలోని దేశాలు నిర్వహించే విన్యాసమే మలబార్. ఈ కూటమిలో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఉన్నాయి. ఈ విన్యాసాలు 1992లోనే భారత్, అమెరికా మధ్య ప్రారంభమయ్యాయి. తర్వాత క్రమంగా క్వాడ్ కూటమిలోని దేశాలకు విస్తరించారు. ఆగస్టు 11న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులు వీటిని నిర్వహించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అన్ని దేశాలకు సమాన అవకాశం ఉండటంతో పాటు చైనా ప్రాబల్యాన్ని తగ్గించే ఉద్దేశంతో దీన్ని చేపట్టారు.
15. ఎన్సీఈఆర్టీ పుస్తకాల సమీక్షకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (3)
1) కస్తూరి రంగన్ 2) వినయ్ శర్మ
3) ఎంసీ పంత్ 4) రాధాకృష్ణ శర్మ
వివరణ: పుస్తక సమీక్షకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ సమాయత్తం అవుతుంది. ఈ సంస్థను 1961లో స్థాపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ వ్యవస్థ రాజ్య నిర్వచనం పరిధిలోకి రాదు. 3వ తరగత నుంచి 12వ తరగతి వరకు ఉన్న పుస్తకాలను పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. ఇందుకు 19 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించారు. దీనికి ఎంసీ పంత్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
13. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది? (1)
1) భారత్ 2) సింగపూర్ 3) మలేషియా 4) చైనా
వివరణ: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది. తుదిపోరులో భారత్ మలేషియాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని రాధాకృష్ణన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ టోర్నీని ఆగస్టు 3 నుంచి 12వ వరకు నిర్వహించారు. ఈ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇది నాలుగో సారి. మూడో స్థానంలో జపాన్ నిలిచింది. ట్రోఫీలో అత్యధిక గోల్స్ చేసింది హర్మన్‌ప్రీత్ సింగ్. తొమ్మిది గోల్స్ సాధించాడు. అలాగే ఉత్తమ ప్లేయర్‌గా మన్దీప్ సింగ్ నిలిచాడు. 2007లో ఏషియన్ హాకీ చాంపియన్‌షిప్‌ను కూడా చెన్నైలోనే నిర్వహించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
-
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
-
Current Affairs – Groups Special | ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
-
August Current Affairs | 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా నిలిచింది?
-
Current Affairs | శ్రామిక్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
-
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?