Group I Special – General Essay | తరగతి గదిని దాటి.. ఇంటర్నెట్ను తాకి
విద్యారంగంలో టెక్నాలజీ (ఎడ్టెక్) వినియోగం గణనీయంగా పెరిగింది. గత రెండు దశాబ్దాలుగా వేగవంతంగా జరుగుతున్న డిజిటలీకరణ, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విస్తరణ, గాడ్జెట్లు, డేటా లభ్యత ఇందుకు దోహదపడింది. భారత ఎడ్టెక్ రంగం ప్రపంచంలోని పెద్ద రంగాల్లో ఒకటి. ఈ రంగానికి చెందిన ఉపవిభాగాల్లో 400 వరకు స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. గత దశాబ్ది కాలంలో ఈ స్టార్టప్‌లు వెయ్యి కోట్ల డాలర్లకు పైగా నిధులు సమీకరించాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన, అభ్యసన అనుభవం పెంచడంలోనూ వారి పరిజ్ఞానాన్ని పెంచి భవిష్యత్తు నైపుణ్యాలు అలవర్చుకోవడానికి ఎడ్టెక్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది.
ఎడ్టెక్ అంటే ఏమిటి?
- విద్యారంగంలో బోధన, అభ్యసన అనుభవాన్ని పెంచేందుకు టెక్నాలజీని ఉపయోగించడమే ఎడ్టెక్. ప్రస్తుతం ఎడ్టెక్ యాప్‌లు లోడ్ చేసిన స్మార్ట్ఫోన్లు విద్యారంగంలో వినియోగంలో ఉన్నాయి. తరగతి గదులు నాలుగు గోడల నుంచి బయటపడి క్లిక్‌లు, పోర్టళ్లకు మారాయి. విద్య మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న, నిరాదరణకు గురవుతున్న వర్గాల విద్యార్థులకు చేర్చే సామర్థ్యం ఎడ్‌టెక్‌కు ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఎడ్టెక్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది.
- విద్యార్థులు నేర్చుకునే వేగం, ైస్టెల్‌ను బట్టి వారి అవసరాలు భిన్నంగా ఉంటాయి. వయస్సు, నేర్చుకునే సామర్థ్యాలతో పని లేకుండా ప్రతి ఒక్కరికి ఎడ్టెక్ రంగం నాణ్యమైన విద్యను నిలకడగా అందించగలుగుతుంది.
భారతదేశంలో ఐసీటీ విప్లవం
- గత 25 ఏళ్ల నుంచి ఐసీటీ రంగం వేగంగా విస్తరిస్తుంది.
- 2022లో ఈ పరిశ్రమ 20 వేల కోట్ల డాలర్ల ఆదాయం, 50 లక్షల మంది పనివారి మైలురాయిని దాటింది.
- 2023 చివరి నాటికి ఐసీటీ రంగంపై 14,400 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా.
- ఇందులో ఒక సేవల రంగం వ్యయమే 52 శాతం ఉంది.
- ఈ పరిశ్రమ ఎంటర్ప్రైజ్ సర్వీసింగ్ నుంచి ఎంటర్ప్రైజ్ సొల్యూషన్కు పరివర్తన చెందడంలో ఎడ్టెక్ రంగం కీలక పాత్ర పోషించనుంది.
- దేశంలో వేగంగా జరుగుతున్న డిజిటలీకరణే ఎడ్టెక్ రంగం ఆవిర్భావానికి, వేగంగా అమలులోకి రావడానికి దారి తీసింది.
- ఐసీటీ మౌలిక వసతులు, గత రెండు దశాబ్దాలుగా గాడ్జెట్లు, డేటా అందుబాటులోకి రావడం కూడా ఎడ్టెక్ విస్తరణకు దోహదపడింది.
- 2010 నుంచి 2022 మధ్యకాలంలో భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 10 రెట్లు పెరిగి 9.25 కోట్ల నుంచి 93.22 కోట్లకు చేరింది.
- 2040 నాటికి వీరి సంఖ్య 153 కోట్లకు పెరుగుతుందని అంచనా.
- భారతదేశం ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా రేట్లు అమలులో ఉన్న దేశాల్లో ఒకటి కావడం కూడా ఎడ్టెక్ రంగం విస్తరణకు దారి తీసిన అంశం.
- మన దేశంలో 1 జీబీ డేటా ఛార్జి కేవలం రూ.14 ఉంది. డేటా ధరలు 2013 నుంచి 90 శాతం తగ్గాయి.
- 2010-2022 మధ్య కాలంలో దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 27 రెట్లు పెరిగి 3.4 కోట్ల నుంచి 93.1 కోట్లకు పెరిగింది.
- 2040 నాటికి వీరి సంఖ్య 153 కోట్లకు చేరిందని అంచనా. ఫలితంగానే గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి. సగటు ధర 12 శాతం మేర తగ్గింది.
- ఈ పరిణామాలతో పాటు బోధన, అభ్యాసాల్లో ఎడ్టెక్ రంగం అందిస్తున్న ప్రయోజనాలు ఆ రంగం విస్తరించడానికి దారి తీసింది. ఆ రంగంలోని పలు సంస్థలు తమ అస్తిత్వాన్ని, ఆచరణీయతను విస్తరించగలిగాయి.
విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది? - టెక్నాలజీ విద్యారంగాన్ని సమ్మిళితం చేయడంతో పాటు అన్ని రకాల విద్యార్థులు, అభ్యాసకులకు అందుబాటులోకి తెచ్చింది.
- భారత డిజిటల్ విప్లవంతో ఉత్తేజితం అయిన ఎడ్టెక్ రంగం దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించగలిగింది. ఎడ్టెక్ రంగం విద్యార్థులకు అందించే మూడు ప్రధాన ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి.
ఆటలతో అభ్యాసం: ఎడ్టెక్ రంగంలో ఉపయోగిస్తున్న క్రీడారంగ టెక్నిక్‌లు ప్రత్యేకించి కె-6 విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇది విద్యార్థులకు కాన్సెప్ట్‌లు సరళం చేయడంతో పాటు అభ్యాసాన్ని ఒక వినోదపూర్వకమైన
మార్చింది.
ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా తరగతులు: దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేర్చడం ద్వారా ఎడ్టెక్ రంగం విద్యను సమ్మిళితం చేసింది. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో క్లాసులకు హాజరు కావచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణులు కూడా తమ ఖాళీ సమయాల్లో కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు.
నిపుణులైన ఉపాధ్యాయుల లభ్యత: 2019 నుంచి విద్యారంగ స్థితి వార్షిక నివేదిక (ఏఎస్ఈఆర్) ప్రకారం దేశంలో మొత్తం పాఠశాలల్లో 30 శాతం ప్రైవేటు నిర్వహణలోనివే. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల సంఖ్య అధికంగా ఉంటుంది.
l కొన్ని నగరాల్లో 70 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. దీంతో నిపుణులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న పాఠశాలలు ఏటా రూ.లక్షల్లో ఫీజుల పెంచుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలకు విద్య అందుబాటులో లేకుండా పోతుంది. కానీ మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినాక పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. - ఎడ్టెక్ రంగం నిపుణులైన ఉపాధ్యాయులను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
ఉపాధ్యాయులకు ఏవిధంగా ప్రయోజనం? - ఎడ్టెక్ రంగం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఎంతో ఉపయోగకరం. వారు తమ బోధనా కార్యకలాపాలు కొనసాగించేందుకు, పోటీలో నిలిచేందుకు సహాయకారిగా ఉంటుంది.
- ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు, విద్యాజ్ఞానం అందించే వీడియోలు, వీఆర్/ఏఆర్ సిమ్యులేషన్లు, ఇతర డిజిటల్ వనరులు విద్యా బోధనకు, విద్యార్థులు అభ్యసన అనుభవం పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
- ఆటోమేటెడ్ గ్రేడింగ్, తరగతి గది నిర్వహణ పనిముట్లు, పేపర్‌లెస్ తరగతి గదుల వంటి సదుపాయాల ద్వారా విద్యారంగ విధానాల నిర్వహణలో ఎడ్టెక్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
- ఏఐ టూల్స్ ఉపయోగించి ఆటోమేటెడ్ గ్రేడింగ్ చేయడం వల్ల ఉపాధ్యాయుల కాలం ఆదా అవుతుంది.
- క్లాస్రూమ్ మేనేజ్మెంట్ టూల్స్ వల్ల మరింత సమన్వయపూర్వక వాతావరణంలో ఎలాంటి గందరగోళం లేకుండా పని చేసే వెసులుబాటు కలిగిస్తుంది.
- పేపర్‌లెస్ తరగతి గదుల వల్ల ప్రింటింగ్ ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణ మిత్ర హరిత విధానాలు పెంపొందే వీలుంటుంది.
ఆఫ్‌లైన్-ఆన్లైన్
- సంప్రదాయకమైన క్లాస్రూమ్ విధానంలో అద్దెలు, యుటిలిటీలు, ప్రాపర్టీ నిర్వహణ, ఉపాధ్యాయుల వ్యయాల వంటి ఎన్నో ఖర్చులుంటాయి.
సవాళ్లు
- ఎడ్టెక్ అధిక సామర్థ్యం, భారీ అవకాశాలు, విభిన్న స్థాయిల్లో విద్యారంగాన్ని పరివర్తన చేయగల సమర్థత ఉన్న రంగం అనే మాట వాస్తవమే అయినా సమాంతరంగా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
మానసిక, సామాజిక ప్రభావం: ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించే అవకాశం లేకపోవడం వల్ల వారి మానసిక ఆరోగ్యం, సామాజిక నైపుణ్యాలపై ప్రభావం చూపుతుంది. ఆన్లైన్ విద్యా కారక్రమాలు రూపొందించేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి: విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపడంతో పాటు ఉపాధ్యాయుల నుంచి మద్దతు, మెంటర్షిప్ అందాలంటే ఆన్లైన్ విద్యా కార్యక్రమాల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి తక్కువగా ఉండేలా చూడటం అవసరం.
ప్రాక్టికల్ వర్క్‌ను ఇంటిగ్రేట్ చేయాలి: ఎడ్టెక్ కార్యక్రమాలు ఇంటర్న్‌షిప్/అప్రెంటిస్‌షిప్‌ను పాఠ్యాంశాల డిజైన్‌లో ఇంటిగ్రేట్ చేయాలి. దీని వల్ల విద్యార్థులు పని ప్రదేశాల్లో అవసరం అయిన గ్రూప్ డైనమిక్స్‌ను, టీమ్ నిర్మాణాన్ని, వ్యక్తిగత నైపుణ్యాలను అలవర్చుకోగలుగుతారు. అలా చేయడం వల్ల వారు తమ పరిజ్ఞానాన్ని సాంకేతిక నైపుణ్యాలను పరీక్షించుకోగలుగుతారు. ఉద్యోగ జీవితంలో ప్రవేశించే సమయానికి కావలసిన విశ్వాసాన్ని, ఆత్మైస్థెర్యాన్ని అలవర్చుకోగలుగుతారు.
బహుళ భాషల్లో కంటెంట్ తయారీ: భారత జనాభాలో కేవలం 10 శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడుతుంటే 45 శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు. మిగిలిన 45 శాతం మంది ఇతర భాషలు మాట్లాడేవారే. కాబట్టి వారందరికీ అనుగుణంగా అన్ని భాషల్లో కంటెంట్ తయారు చేస్తే తొందరగా రీచ్ అవుతుంది.
భవిష్యత్తు ఏమిటి? - ఇటీవల జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలోకి వస్తుంది. సృజనాత్మక అసెస్మెంట్, ఫీడ్‌బ్యాక్, విద్యార్థుల అభ్యసన వేగాన్ని సర్దుబాటు చేయడం, రోజూ నిర్వహించే టాస్క్‌ల సమర్థ నిర్వహణ ఇందులో భాగంగా ఉంటాయి. విద్యార్థుల పురోగతి, ప్రాధాన్యాలు, అభ్యసన లక్ష్యాలు పరిగణనలోకి తీసుకుని నిరంతర మెరుగుదల ధ్యేయంతో బోధన, అభ్యాస కార్యకలాపాలను ఏఐ సిఫారసు చేయగలుగుతుంది. కానీ టెక్నాలజీ ఉన్నా లేకున్నా ఉపాధ్యాయుని పాత్ర అనివార్యం. ఏఐ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే సరళీకరణ కోసం ఉపాధ్యాయుడు-విద్యార్థి విధానాన్ని కొనసాగిస్తేనే భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
‘యోజన’ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు