Current Affairs – Groups Special | క్రీడలు

కిరాక్ హైదరాబాద్
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆగస్టు 13న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 28-30 తేడాతో కొచ్చి కేడీస్ చేతిలో ఓటమి పాలైంది. అండర్ కార్డు, మెయిన్ కార్డుల మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు సమంగా నిలిచాయి. టై బ్రేకర్‌లో సత్తాచాటిన కొచ్చి కేడీస్ తొలి సీజన్ ట్రోఫీ గెలుచుకుంది.
ఫిన్
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టీవ్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఆగస్టు 14న రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 34 ఏండ్ల ఫిన్ 18 సంవత్సరాల కెరీర్లో 36 టెస్టుల్లో 125 వికెట్లు, 69 వన్డేల్లో 102 వికెట్లు, 21 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.
శ్రీనివాస్‌రెడ్డి
బంగ్లాదేశ్ కబడ్డీ జట్టుకు కోచ్‌గా లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆగస్టు 15న ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన అతడు భారత కబడ్డీ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. 2018 దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో భారత జట్టు స్వర్ణ పతకం గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2014లో ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో కొరియా కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో కొరియా కాంస్య పతకం గెలుచుకుంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు