Current Affairs – Groups Special | వార్తల్లో వ్యక్తులు
అష్ఫక్ సయ్యద్
అమెరికాలో ప్రముఖ నేపర్‌విల్లే పబ్లిక్ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతికి చెందిన సమాజ సేవకుడు అస్ఫక్ సయ్యద్ ఆగస్టు 5న నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఈయన ఈ బోర్డులో ట్రస్టీగా 2023, మే నుంచి సేవలందిస్తున్నారు. ఈ లైబ్రరీ పదేండ్లుగా లక్ష నుంచి రెండున్నర లక్షల జనాభా విభాగంలో అమెరికాలో నంబర్ వన్‌గా నిలుస్తుంది. నాన్సీ హేస్ వైస్ ప్రెసిడెంట్‌గా, నిక్ గువో సెక్రటరీగా ఎంపికయ్యారు.
జస్టిస్ సుభాసిస్
ఒడిశా హైకోర్టు 33వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తలపాత్ర ఆగస్టు 8న ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ ఆగస్టు 7న పదవీ విరమణ పొందారు. సుభాసిస్ తలపాత్ర 1961, అక్టోబర్ 4న త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో జన్మించారు. 2018, 2019లో రెండు సార్లు త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
సంజయ్ కుమార్
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్-సీబీఐసీ) చైర్మన్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ ఆగస్టు 7న బాధ్యతలు చేపట్టారు. గత చైర్మన్‌గా వ్యవహరించిన వివేక్ జోహ్రీ మే 31న పదవీ విరమణ పొందారు. సంజయ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. ఆయన సీబీఐసీలో 2022, మార్చి 1 నుంచి సభ్యుని (ఇన్వెస్టిగేషన్)గా ఉన్నారు.
జాన్ గుడ్విన్
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తన మొదటి అంతరిక్ష పర్యాటక రాకెట్‌ను ఆగస్టు 10న ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని మెక్సికో ఎడారిలోని స్పేస్‌పోర్ట్ అమెరికా నుంచి చేపట్టారు. ఈ యాత్రలో బ్రిటన్‌కు చెందిన మాజీ ఒలింపియన్ జాన్ గుడ్విన్ (80)తో పాటు కరీబియన్‌కు చెందిన తల్లీకూతుళ్లు కీషా షహాఫ్ (46), ఆనాస్టాటియా మేయర్స్ (18) ఉన్నారు. గుడ్విన్ ఈ యాత్ర టికెట్‌ను 18 ఏండ్ల క్రితమే కొనుగోలు చేశాడు. ఇతడు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నా ఈ యాత్ర చేపట్టడం విశేషం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?