Current Affairs | సాంకేతికత వైపు చూపు.. దేశ భవిష్యత్తుకు రూపు
కరెంట్ అఫైర్స్
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ – 2023
- ఇది 108వ సమావేశం. జనవరి 3 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని ఆర్టీఎం
నాగపూర్ విశ్వవిద్యాలయంలో జరిగింది. - ఇతివృత్తం- మహిళా సాధికారతతో కూడిన సుస్థిరాభివృద్ధి కోసం సైన్స్& టెక్నాలజీ
- దీన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా అదాయోనాథ్ (2009 రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందారు. ఇజ్రాయెల్)
- ఐఎస్సీ అధ్యక్షులు- డా.విజయలక్ష్మి సక్సేనా
ముఖ్యాంశాలు - మహిళలతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రమేయంతో సైన్స్& టెక్నాలజీ, ఇన్నోవేషన్ ప్రాముఖ్యతను మోదీ పేర్కొన్నారు.
- ఈ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీవో హిమాలయ సరిహద్దులో లాజిస్టిక్ కార్యకలాపాలను నిర్వహించే లక్ష్యంతో ‘అన్టెథర్డ్ మల్టీ కాప్టర్ పేలోడ్’ను ప్రదర్శించింది. ఇది మానవ రహిత వైమానిక వాహనం. ఇది 5 కి.మీ ల వ్యాసార్థం వరకు వే పాయింట్ నావిగేషన్‌తో స్వయం ప్రతిపత్తి మిషన్లను నిర్వహించగలదు.
- దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్‌గా మార్చేందుకు సైన్స్ కమ్యూనిటీ కృషి చేయాలని మోదీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
- ప్రపంచ ఆవిష్కరణల సూచీలో 2015 సంవత్సరంలో భారత్ 130 దేశాల్లో 81వ స్థానంలో ఉండగా అది 2022 నాటికి 40వ స్థానానికి చేరిందని చెప్పారు.
- 2023, జనవరి 7న ఐఎస్సీ ముగింపు ఉత్సవంలో 109వ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డా.అరవింద్ సక్సేనాకు జ్యోతి అందించారు.
ఇచ్చిన అవార్డులు
1. అశుత్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు- ప్రొ.అజయ్‌కుమార్ సూద్
2. డా.సీవీ రామన్ బర్త్ సెంటినరీ అవార్డు- ప్రొ.ఎస్ఆర్ నిరంజన్
3. ఎస్ఎన్ బోస్ బర్త్ సెంటినరీ అవార్డు- ప్రొ.సుభాష్ చంద్ర సరిజ
4. ఎస్కే మిత్ర బర్త్ సెంటినరీ అవార్డు- డా.రంజన్ కుమార్ నంది
5. హెచ్‌జే బాబా మెమోరియల్ అవార్డు- డా.కౌశల్ ప్రసాద్ మిశ్రా
6. డీఎస్ కొఠారి మెమోరియల్ అవార్డు- డా.శ్యామల్‌రాయ్
7. ప్రొ.ఆర్సీ మల్హోత్రా మెమోరియల్ జీవితకాల సాఫల్య పురస్కారం- డా.యూసీ బెనర్జీ
8. ప్రొ.ఎస్ఎస్ కటియార్ ఎండోమెంట్ లెక్చర్ అవార్డు- డా.కెస్తూరు, ఎస్.గిరీష్
9. ప్రొ.అర్చనా శర్మ మెమోరియల్ అవార్డు ఇన్ ప్లాంట్ సైన్స్- డా.రాజీవ్ ప్రతాప్‌సింగ్
10. జీకే మన్నా మెమోరియల్ అవార్డు- డా.బసంత్ కుమార్దాస్
భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA) - భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ సంస్థ
- ప్రధాన కార్యాలయం పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో ఉంది. దీన్ని 1914లో ప్రారంభించారు.
- ఇది ప్రతి సంవత్సరం జనవరిలో సమావేశమవుతుంది. తొలి ఐఎస్‌సీఏ 1914లో కోల్‌కతాలో జరిగింది. 25వ సమావేశం 1938లో కోల్‌కతాలో నిర్వహించారు.
- 1947లో న్యూఢిల్లీలో జరిగిన 34వ సమావేశంలో తొలిసారి విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
- 50వ సమావేశం 1963లో న్యూఢిల్లీలో జరగగా 60వ సమావేశం 1973లో చండీఘర్‌లో జరిగింది.
- 1976లో విశాఖపట్నంలో జరిగిన 63వ సమావేశం నుంచి ఇతివృత్తం ప్రారంభించారు. 1988లో 75వ సమావేశం పుణెలో నిర్వహించారు.
- 100వ సమావేశం 2013లో కోల్‌కతా విశ్వవిద్యాలయం, కోల్‌కతాలో జరిగింది. దీని ఇతివృత్తం- భారతదేశ భవిష్యత్తును రూపొందించే సైన్సు
- 107వ సమావేశం 2020లో బెంగళూరులో నిర్వహించారు.
ఐఎస్‌సీఏ- తెలుగు రాష్ర్టాలు
24వ సమావేశం- 1937, హైదరాబాద్
41వ సమావేశం- 1954, హైదరాబాద్
54వ సమావేశం- 1967, హైదరాబాద్
63వ సమావేశం- 1976, విశాఖపట్నం
66వ సమావేశం- 1979, హైదరాబాద్
70వ సమావేశం- 1983, తిరుపతి
85వ సమావేశం- 1998, హైదరాబాద్
93వ సమావేశం- 2006, హైదరాబాద్
95వ సమావేశం- 2008, విశాఖపట్నం
104వ సమావేశం- 2017, తిరుపతి
ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ – 2023
- ఇది 12వ కాన్ఫరెన్స్. నడి, ఫిజీలో ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు నిర్వహించారు.
- ఇతివృత్తం- Hindi: From Traditional Knowledge to Artificial Intelligence
- నిర్వహించినవారు- భారత కేంద్ర విదేశాంగ శాఖ, ఫిజీ ప్రభుత్వం.
- ప్రారంభించినవారు- ఫిజీ ప్రధానమంత్రి : సిటివేణి రబుక
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి: సుబ్రమణ్యం జై శంకర్ - ఇందులో ఒక ప్లీనరీ సెషన్, 10 సమాంతర సెషన్స్‌ను వివిధ రకాల అంశాలపై నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- భారత్ నుంచి 270 మంది బృందం ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. 11వ హిందీ కాన్ఫరెన్స్ 2018లో మారిషస్‌లో జరిగింది. మొదటి ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ 1975లో నాగపూర్‌లో నిర్వహించారు.
బయో ఆసియా సదస్సు – 2023
- ఇది 20వ సదస్సు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు నిర్వహించారు.
- ఇతివృత్తం: Advancing for ONE shaping the next Generation of humanized healthcare
- బయో ఆసియా అనేది ఆసియాలో అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరమ్. ఇతివృత్తంలో ఉన్న ONE అంటే.. One Health, Next Generation, Eqvity
- ఈ సదస్సును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. డా. వాస్ నరసింహన్ మొదటి రోజు ప్రధాన ఉపన్యాసం చేశారు. ఈయన నోవార్టిన్ స్విట్జర్లాండ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి.
- వాస్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రపంచంలో అత్యధిక మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారని, ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్ మరణాలు, నరాల జబ్బుల మరణాలు అధికంగా
ఉన్నాయని పేర్కొన్నారు. - ఈ సదస్సు సందర్భంగా ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2023’ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన ప్రొ.రాబర్ట్ ఎస్ లాంగర్‌కు ప్రకటించారు.
- జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును తొలి బయో ఆసియా సదస్సు జరిగిన 2004లో ప్రారంభించారు. ఈ అవార్డును లైఫ్ సైన్సెస్ పరిశోధన, ప్రజారోగ్యంలలో విశేషమైన సహకారం అందించిన ప్రముఖ వ్యక్తులు, సంస్థలకు ఇస్తారు.
- ఈ సదస్సులో భాగంగా ‘ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోషియేషన్స్ (FABA) స్పెషల్ అవార్డు-2023ను డా.రేణు స్వరూప్‌కు ప్రదానం చేశారు.
- ఈ అవార్డును ‘డా.బీఎస్ బజాజ్ మెమోరియల్ FABA ఎక్సలెన్స్ అవార్డు’ అని కూడా పిలుస్తారు. రేణుస్వరూప్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మాజీ కార్యదర్శి. ఈమె దేశంలో సైన్స్& టెక్నాలజీ అభివృద్ధికి చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
- FABA స్పెషల్ అవార్డును 2010లో ప్రారంభించారు.
- బయో ఆసియా సీఈవో- శక్తి ఎం. నాగప్పన్
- సుస్థిర పర్వత అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం-XI (Sustainable Mountain Development Summit-XI)
- ఇది 11వ సమావేశం. లఢక్‌లోని లేహ్‌లో 2022, అక్టోబర్ 10-12 తేదీల్లో నిర్వహించారు.
- Integrated Mountain Initiative వారు నిర్వహించారు. వాతావరణ, సామాజిక, పర్యావరణ స్థితి స్థాపకత, సుస్థిరతను నిర్మించడంతో దాని సానుకూల సహకారాన్ని ఉపయోగించుకుంటూ, పర్యాటక ప్రతికూల ప్రభావాలను తగ్గించడం దీని లక్ష్యం.
- ఇతివృత్తం: సుస్థిరమైన పర్వతాభివృద్ధి కోసం పర్యాటకాన్ని ఉపయోగించడం.
- ఈ సమావేశాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ప్రారంభించి ప్రసంగించారు.
- ఈ సమావేశం సందర్భంగా యువత సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉపాధి కోసం అక్షరాస్యత, స్థానిక సంస్కృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, యువతలో శాస్త్రీయ సమగ్రతను పెంపొందించడంపై దృష్టి సారించారు.
- SMDS-XI లో భాగంగా Mountain Legislators Meet (MLM) ను కూడా నిర్వహించారు.
- కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో జీబీ పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ (GBPNIHE) ను ఏర్పాటు చేశారు. దాని ప్రాంతీయ కేంద్రాన్ని లేహ్‌లో నెలకొల్పనున్నారు.
- GBPNIHE ను 1988-89 లో
ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం అర్మోరా, ఉత్తరాఖండ్‌లో కలదు. - SMDS అనేది IMI వార్షిక సమావేశం. ప్రతి సంవత్సరం పర్వతాలు, కొండల గురించి తక్షణ దృష్టిని ఆకర్షించే, వాటికి సంబంధించిన మూడు నుంచి ఐదు ముఖ్యమైన ఇతివృత్తాలు తీసుకొని చర్చిస్తారు.
- SMDS తొలి సమావేశం నైనిటాల్లో 2011లో జరిగింది.
IMI
- ఇది భారతీయ హిమాలయ ప్రాంతం. ఆ ప్రాంత ప్రజల నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఒక ప్లాట్‌ఫాం. దీనిలో 11 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. దీని సెక్రటేరియట్ సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఉంది.
క్వాడ్ (QUAD) సమావేశం-2022
- దీన్నే చతుర్భుజ కూటమి అని పిలుస్తారు.
- QUAD- Quadrilateral Security Dialogue
- 2022, మే 24న వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది రెండో ప్రత్యక్ష సమావేశం, మొత్తంగా నాలుగో సమావేశం. క్వాడ్ మొదటి వర్చువల్ సమావేశం 2021 మార్చి 12న జరిగింది.
- క్వాడ్ మొదటి ప్రత్యక్ష, రెండో సమావేశం 2021, సెప్టెంబర్ 24న అమెరికాలోని వాషింగ్టన్ డి.సి. లో జరిగింది. క్వాడ్ మూడో సమావేశం వర్చువల్‌గా 2022, మార్చి నెలలో నిర్వహించారు.
క్వాడ్ సమావేశానికి హాజరైనవారు:
1. జో బైడెన్ (అమెరికా అధ్యక్షుడు)
2. ఫుమియో కిషిడా (జపాన్ ప్రధాని)
3. ఆంథోని అల్బనీజ్ (ఆస్ట్రేలియా ప్రధాని)
4. నరేంద్ర మోదీ (భారత ప్రధాని) - ఈ సమావేశంలో నాయకుల స్థాయి కార్యాచరణ బృందాలను ఆరు అంశాలపై ఏర్పాటును క్వాడ్ నాయకులు స్వాగతించారు.
1. కొవిడ్-19 పై ప్రతిస్పందన, ప్రపంచ ఆరోగ్య భద్రత
2. వాతావరణం
3. క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు
4. సైబర్ అంశాలు
5. అంతరిక్ష రంగం
6. మౌలిక సదుపాయాలు - క్వాడ్ శాంతియుత, సంపన్నమైన ‘ఇండో-పసిఫిక్’కు మద్దతునిస్తూ నాలుగు దేశాల మధ్య సహకారం పెంపొందిస్తుంది.
- అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశం IPEF (Indo-Pacific Economic Framework)ను ప్రకటించారు.
సమావేశ నిర్ణయాలు
- క్వాడ్ నాయకులు ఒక ప్రధాన సముద్రయాన కార్యక్రమం IPMDA ను ఏర్పాటు చేయడానికి అంగీకరించి స్వాగతించారు.
- IPMDA- THE Indo-Pacific Partnership for Maritime Domain Awareness.
- భాగస్వామ్య జలాల్లో నిజ సమయ కార్యకలాపాలకు సంబంధించి వేగవంతమైన, విస్తృతమైన, కచ్చితమైన సముద్ర చిత్రాన్ని IPMDA నిర్మిస్తుంది.
క్వాడ్ ఫెలోషిప్
- క్వాడ్ నాయకులు క్వాడ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం ప్రతి సంవత్సరం అమెరికాలో 100 మంది అమెరికన్, ఆస్ట్రేలియన్, భారతీయ, జపాన్ విద్యార్థులకు స్పాన్సర్ చేస్తుంది.
- ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం ‘క్వాడ్ టీకా భాగస్వామ్యం’ను ప్రకటించారు. కొవిడ్-19 బూస్టర్ డోసులు, చిన్న పిల్లల టీకాలను సభ్య దేశాలకు అమెరికా అందించనుంది.
- క్వాడ్ టీకా భాగస్వామ్యంలో భాగంగా భారత్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే సంస్థ టీకాల తయారీని విస్తరించి సభ్యదేశాలకు అందించనుంది.
- కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ సామర్థ్యం పెంపొందించేందుకు, భారతీయ ఆరోగ్య రంగాన్ని బలపరిచేందుకు జపాన్ బ్యాంకు ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (JBIC), భారత్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు (EXIM) 100 మిలియన్ డాలర్ల సౌకర్యం నెలకొల్పనున్నారు.
- క్వాడ్ వాతావరణ కార్యాచరణ బృందాన్ని 2021లో ఏర్పాటు చేశారు. క్వాడ్ క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల కార్యాచరణ బృందాన్ని 2021లో ఏర్పాటు చేశారు.
- 5జీ సరఫరా వైవిధ్య, ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌పై కొత్త మెమోరాండం ఆఫ్ కోపరేషన్ ద్వారా క్వాడ్ ఇంటర్ ఆపరేబిలిటీ, టెలీ కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యురిటీని ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతిక మార్పిడి, టెస్ట్‌బెడ్ కార్యకలాపాలపై సహకరిస్తుంది.
- 2022 క్వాడ్ సమావేశంలో పెట్టుబడిదారులు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో స్వతంత్రంగా పెట్టుబడి పెట్టేందుకు క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ అనే స్వతంత్ర సంస్థను ప్రారంభించారు.
- ఇండో-పసిఫిక్ దేశాల కోసం లాంగ్‌టర్మ్ సస్టెయినబిలిటీ గైడ్‌లైన్స్ అనే అంశంపై క్వాడ్ నాయకులు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించడానికి అంగీకరించారు.
- సభ్యదేశాల్లో విపత్తుల సమయంలో మానవతా సాయం, విపత్తు ఉపశమనం చేయడానికి నిర్ణయించారు.
- అంతరిక్ష రంగంలో సహకారం కోసం ‘Quad Satellite Data Portal’ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. క్వాడ్ డెట్ మేనేజ్మెంట్ పోర్టల్‌ను ప్రారంభించారు. క్వాడ్ పర్యావరణ మార్పులపై పోరాడేందుకు Q-CHAMP (Climate Change Adoption and Mitigation Package) ను ప్రకటించింది.
- క్వాడ్‌లోని నాలుగు దేశాలు ‘Free and Open Indo Pacific (FOIP)’ ని సాకారం చేసుకోవడానికి విస్తృత రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి.
- ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ సభ్య దేశాల నాయకులకు ప్రత్యేక బహుమతులు అందించారు.
1. జోబైడెన్‌కు షాంజీ ఆర్ట్ ప్యానెల్
2. ఆంథోని అల్బనిజ్కు గోండు ఆర్ట్ పెయింటింగ్
3. ఫుమియో కిషిడాకు చేతితో చేసిన చెక్కపెట్టే - క్వాడ్ ఐదో సమావేశం ఆస్ట్రేలియాలో జరగనుంది.
- 2004లో హిందూ మహాసముద్రంలోని సుమత్రా దీవిలో సంభవించిన సునామీ విపత్తు తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, భారత్, అమెరికా దేశాలు ఒక ప్రధాన గ్రూప్‌గా ఏర్పడి అంతర్జాతీయ సహకారాన్ని ముందుండి నడిపాయి.
- చైనా క్వాడ్‌ను ‘ఏసియన్ నాటో’ అని ప్రకటించింది.
- తొలి సీనియర్ అధికారుల సమావేశం 2007 మే లో జరిగింది. 2017 నవంబర్ నుంచి క్వాడ్ సీనియర్ అధికారుల సమావేశం ఏటా నిర్వహిస్తున్నారు.
- 2019, సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశం న్యూయార్క్‌లో జరిగింది. దీని సందర్భంగా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల తొలి సమావేశం జరిగింది. 2020, అక్టోబర్‌లో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల రెండో సమావేశం జపాన్‌లోని టోక్యోలో జరిగింది.
- 2022, ఫిబ్రవరి 11న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల నాలుగో సమావేశం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది.
క్వాడ్ ఐదో విదేశాంగ మంత్రుల సమావేశం - ఇది 2023, మార్చి 3న న్యూఢిల్లీలో జరిగింది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర నేతృత్వంలో జరగగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు హాజరయ్యారు.
- ఈ సమావేశంలో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
- ఈ సమావేశ ఎజెండాలో కొత్తగా చేరిన అంశం ఉగ్రవాదం. దీనిపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు చేయనున్నారు.
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా యూఎన్ చార్టర్‌తో పాటు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతి అవసరం అని ప్రకటించారు.
- మయన్మార్‌లో దిగజారుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
- టీ రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
Indian History | జలియన్‌వాలా బాగ్ ఉదంతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?