Indian History | జలియన్‌వాలా బాగ్ ఉదంతం
జలియన్‌వాలా బాగ్ ఉదంతం
- జలియన్‌వాలా బాగ్, మహారాజా రంజిత్‌సింగ్ ఆస్థానానికి చెందిన పండిట్ జల్లాచే 19వ శతాబ్దంలో నిర్మించిన తోట పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది.
- అమృత్‌సర్‌లో 1919, ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ మైదానంలో జనరల్ డయ్యర్ ఎఫ్.సి. బ్రిగ్స్ సహకారంతో సైన్యంతో వచ్చి ప్రశాంతంగా సమావేశంలో ఉన్న ప్రజలపై హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపించాడు. దీంతో సుమారు వెయ్యికి పైగా మంది మరణించారు.
- జలియన్‌వాలాబాగ్ దురంతం తర్వాత పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకెల్ ఓ డయ్యర్ పంజాబ్ అంతటా సైనిక చట్టాన్ని (మార్షల్ లా) అమలు చేశాడు. గాంధీ రౌలత్ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఏప్రిల్ 18న ఆపివేశాడు.
- జనరల్ మైకెల్ ఓ డయ్యర్ జలియన్‌వాలా బాగ్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ‘Defender of British Empire in India’ అనే బిరుదు పొందాడు.
- మైకెల్ ఓ డయ్యర్ పదవీ విరమణ తర్వాత ఇంగ్లండ్ చేరుకున్నారు. పంజాబ్ విప్లవ వీరుడు ఉదయ్‌సింగ్ 1940లో అతన్ని కాల్చి పంజాబ్ అకృత్యాలకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
- పంజాబ్ దురంతాలకు వ్యతిరేకంగా ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ లేదా నైట్ హుడ్ బిరుదును త్యజించాడు. అలాగే గాంధీ కైజర్ ఎ హింద్ బిరుదును తిరిగిచ్చేశాడు.
హంటర్ కమిషన్ - జలియన్ వాలా బాగ్ దురంతాలను గురించి విచారణ జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఐదుగురు బ్రిటిష్‌వారు, ముగ్గురు భారతీయులతో హంటర్ కమిషన్‌ను నియమించింది.
- పంజాబ్ దురంతాలను పరిశీలించడానికి కాంగ్రెస్ కూడా ఒక స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ కార్యదర్శి కె.శాంతారామ్.
- హంటర్ కమిషన్ డయ్యర్ తప్పిదాన్ని తన విధులను అవగాహన చేసుకోవడంలో జరిగిన పొరపాటు అని లేకపోతే నిర్ణయానికి రావడంలో జరిగిన తప్పిదం అని పేర్కొన్నది.
- జలియన్‌వాలాబాగ్ దురంతాన్ని ఠాగూర్ ‘అమానుష యుద్ధానికి పుట్టిన అమానుష బిడ్డ’ అని వ్యాఖ్యానించగా, గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ స్థాపన జరిగింది ప్లాసీలో అయితే బీటలు వచ్చింది అమృత్‌సర్‌లో అని అన్నాడు.
- భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలియన్ వాలాబాగ్‌లో గ్రానైట్‌తో జాతీయ స్మృతి చిహ్నం నిర్మించారు. హిందీ, ఉర్దూ, గురుముఖి, ఇంగ్లిష్ భాషల్లో 1919, ఏప్రిల్ 13న మరణించిన అమరవీరుల స్మృతి అంటూ రాశారు.
- గాంధీ ప్రజలను సరిగా సమాయత్తం చేయకుండానే సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడాన్ని హిమాలయమంత తప్పిదంగా వర్ణించాడు.
ఖిలాఫత్ ఉద్యమం - మొదటి ప్రపంచ యుద్ధం (1914-18)లో టర్కీని ఇంగ్లండ్ ఓడించి, టర్కీతో ఇంగ్లండ్ చేసుకున్న సేవర్స్ సంధి ద్వారా టర్కీ సుల్తాన్‌కు ఉన్న ఖలీఫా (మతాధిపతి) అధికారాన్ని రద్దు చేసింది. ఆ పరిణామం భారతదేశంలో ముస్లింలను కూడా కలవరపరిచింది. దానికి వ్యతిరేకంగా వారు ఇక్కడ ఉద్యమాన్ని నడిపారు. అదే ఖిలాఫత్ ఉద్యమం.
- టర్కీ సుల్తాన్ హోదా, అధికారాలు, మొదటి ప్రపంచ యుద్ధ పూర్వస్థాయికి పునరుద్ధరించడమే ఖిలాఫత్ ఉద్యమ లక్ష్యం. 1919 మార్చిలో అఖిల భారత ఖిలాఫత్ సంఘం ఏర్పడింది. దీనిలో ప్రముఖ పాత్ర వహించిన అలీ సోదరులు, మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ హకీమ్ అజ్మల్‌ఖాన్ మిగతావారు నాయకులు.
- 1919, అక్టోబర్ 17న ఖిలాఫత్ దినంగా పాటించారు. గాంధీ ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరిచాడు. హిందూ-మహ్మదీయుల మధ్య ఐక్యత సాధించడానికి ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక మంచి అవకాశంగా భావించాడు. 1919, నవంబర్‌లో గాంధీ అఖిల భారత ఖిలాఫత్ సంఘానికి అధ్యక్షుడు కూడా అయ్యాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు