‘వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (సవరణ) బిల్-2022’కు ఆమోదం..(జాతీయం)22-06-2022

ఫ్రూట్స్ సాఫ్ట్ వేర్
‘ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఫ్రూట్స్ సాఫ్ట్ వేర్’ను కర్ణాటక ప్రభుత్వం జూన్ 13న ప్రారంభించింది. వివిధ పథకాల ప్రయోజనాలను రైతులు సులభంగా పొందేలా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం ఈ సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు.
వైస్ చాన్స్‌లర్ బిల్
పశ్చిమబెంగాల్ రాష్ట్ర యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లకు సంబంధించిన ‘వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (సవరణ) బిల్-2022’ను ఆ రాష్ట్ర శాసనసభ జూన్ 13న ఆమోదించింది. పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీలకు ఆ రాష్ట్ర సీఎం వైస్ చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారని ఈ బిల్ ఉద్దేశం. 294 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభలో 182 మంది అనుకూలంగా, 40 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
నేవీ ఎక్సర్సైజ్
ఇండియా, ఇండోనేషియా (Ind-Indo Corpat) నావికాదళాల 38వ ఎక్సర్సైజ్ అండమాన్ సముద్రం, మలక్కా జలసంధిలో జూన్ 13న ప్రారంభమయ్యింది. జూన్ 24 వరకు నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్ నేవీలోని అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ) యూనిట్ పాల్గొన్నది. భారత ప్రభుత్వం ప్రాంతీయ సముద్ర భద్రత కోసం ప్రారంభించిన ‘సాగర్ (Security And Growth for All in the Region)’లో భాగంగా ఈ విన్యాసాలు చేపట్టింది. ఇరు దేశాలు ఈ విన్యాసాలను 2002 నుంచి నిర్వహిస్తున్నాయి.
తొలి ప్రైవేట్ రైలు
దేశ రైల్వే చరిత్రలో తొలి ప్రైవేట్ రైలును ప్రారంభించినట్లు దక్షిణ రైల్వే అధికారులు జూన్ 14న వెల్లడించారు. ‘భారత్ గౌరవ్’ పథకం కింద ‘దేఖో అప్నా దేశ్’ పేరుతో రైలు ప్రారంభించిన ఈ రైలు తమిళనాడులోని కోయంబత్తూర్ నార్త్ స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ వరకు ప్రయాణించింది.
ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ నిర్మాణం పూర్తయిందని అధికారులు జూన్ 14న వెల్లడించారు. ఈ పోస్టాఫీస్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్-స్పితి జిల్లాలోని హిక్కిం గ్రామంలో ఉంది. అంతకుముందు ఓ పూరింట్లో ఉండే ఈ పోస్టాఫీస్‌ను పోస్ట్ బాక్స్ ఆకారంలో నూతనంగా నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 14,567 (4440 మీ.) అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం పిన్‌కోడ్ 172114.
కార్యదర్శుల సమావేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మొట్టమొదటి జాతీయ సమావేశాన్ని జూన్ 15న హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశ ఉద్దేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా జాతీయ విద్యా విధానం, పట్టణ పాలన, పంటల వైవిధ్యీకరణ, నూనెగింజలు, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించడంపై చర్చించారు.
పృథ్వీ-2
స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో జూన్ 15న వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ క్షిపణిని పరీక్షించారు. రెండు ఇంజిన్లతో ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని 350 కి.మీ. దూరం గల లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల బరువు గల అసా్త్రలను మోసుకెళ్లగలదు.
ఆసియాన్ సదస్సు
ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జూన్ 16, 17 తేదీల్లో నిర్వహించారు. ఆసియాన్‌తో భారత్ సంబంధాలు 1982లో ప్రారంభించి 30 ఏండ్లు అయిన సందర్భంగా ఈ సమావేశాలు చేపట్టారు. భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహపరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చర్చించారు.
Latest Updates
TSPSC Group-1 Prelims Practice Test | తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ కర్త?
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?