Current Affairs June 07 | జాతీయం
ఎన్వీఎస్-01
ఇస్రో రెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్వీఎస్-01 శాటిలైట్‌ను మే 29న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీ, తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా ఈ నావిగేషన్ శాటిలైట్‌ను నింగిలోకి పంపారు. దీని జీవితకాలం 12 ఏండ్లు. దీని బరువు 2232 కిలోలు. ఇది భారత్ చుట్టూ 1500 కి.మీ. పరిధిలో సేవలను అందిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుబిడియం అటామిక్ క్లాక్‌ను శాటిలైట్‌లో అమర్చారు. వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన రంగాలకు ఈ శాటిలైట్ నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తుంది.
మో ఘర
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘మో ఘర (నా ఇల్లు)’ పథకాన్ని మే 29న ప్రకటించారు. గ్రామీణ పేదలు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు క్రెడిట్-లింక్డ్ హౌసింగ్ లోన్ అందించనుంది. దీని కింద రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీన్ని సులభ వాయిదాల్లో ఒక సంవత్సరం మారటోరియంగా మినహాయించి 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించవచ్చు. బిజూ జనతా దళ్ (బీజేడీ) 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందున ఈ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఇదే రోజు సీఎం నవీన్ పట్నాయక్ ‘ఒడిశా ఫర్ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటెల్ టెక్నాలజీస్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు.
ఈశాన్యంలో తొలి వందే భారత్
ఈశాన్య భారతంలో తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా మే 29న ప్రారంభించారు. అసోంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్గురి మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా, సీఎం హిమంత బిశ్వశర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నమో షేత్కారీ
మహారాష్ట్ర ప్రభుత్వం నమో షేత్కారీ మహా సన్మాన్ యోజన పథకాన్ని మే 30న ప్రారంభించింది. ఏటా రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీన్ని రైతుల పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. ఇదే రోజున పర్యాటక రంగంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘ఆయ్’ అనే జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం పాలసీ’ అమలుకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇండియా-ఈయూ
ఇండియా-ఈయూ కనెక్టివిటీ కాన్ఫరెన్స్ మేఘాలయలో జూన్ 1 నుంచి 2 వరకు నిర్వహించారు. ఈ సమావేశాన్ని మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ప్రారంభించారు. దీన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత్‌లోని ఈయూ ప్రతినిధుల బృందం, ఆసియా కాన్ఫ్లూయన్స్ నిర్వహించాయి. భారత ఈశాన్య రాష్ర్టాలు, పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో పెట్టుబడులను పెంచే అవకాశాలను అన్వేషించడంపై చర్చించారు. ఇండియా-ఈయూ కనెక్టివిటీ పార్ట్‌నర్‌షిప్‌ను 2021, మేలో ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?