TS Govt Policies and Schemes | ‘మహిళల ఆరోగ్యం ఇంటింటికీ సౌభాగ్యం’ ఏ పథకం ట్యాగ్‌లైన్?
1. కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలు ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి?
1) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
2) పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
3) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
4) ఏదీకాదు
2. ఇటీవల ప్రారంభించిన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. 2023, ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ ప్రారంభించారు
బి. డిజైనర్లు/ఆర్కిటెక్టులు డా. ఆస్కార్ కాన్సెసావో, పొన్ని కాన్సెసావో
సి. నిర్మించిన సంస్థ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రై.లి.
డి. శంకుస్థాపన 2019, జనవరి 27
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
3. నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఏ అంశాలకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు?
ఎ. దళిత బంధు పథకం (2023-24 సంవత్సరానికి సంబంధించి)
బి. పోడు భూముల పట్టాలు
సి. కేసీఆర్ కిట్-పోషకాహార పథకం
డి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
4. తెలంగాణలో ఏర్పాటు చేసిన దేశంలో ఎత్తయిన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా హాజరైంది ప్రకాశ్ అంబేద్కర్
బి. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్
సి. విగ్రహ రూప శిల్పులు రామ్ వాంజీ సుతార్, అనిల్ వాంజీ సుతార్
డి. విగ్రహం బరువు 465 టన్నులు, ఖర్చు రూ.146.50 కోట్లు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
5. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన అవార్డుల్లో తెలంగాణకు 13 లభించాయి. ఏ విభాగం నుంచి ఏ గ్రామ పంచాయతీ అవార్డు పొందిందో సరైన వాటిని గుర్తించండి?
ఎ. ఉత్తమ ఆరోగ్య పంచాయతీ- గౌతంపూర్ (భద్రాద్రి జిల్లా)
బి. ఉత్తమ సుస్థిర నీటి పంచాయతీ- నెల్లుట్ల (జనగామ జిల్లా)
సి. సుపరిపాలన గ్రామ పంచాయతీ- చీమల్‌దరి (వికారాబాద్ జిల్లా)
డి. ఉత్తమ స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ- గంభీరావు పేట (సిరిసిల్ల జిల్లా)
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
6. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలకు సంబంధించి వంద శాతం సామాజిక భద్రతను సాధించి జాతీయ స్థాయి అవార్డు అందుకున్న గ్రామాన్ని గుర్తించండి.
1) మందొడ్డి 2) కంగట్పల్లి/కొనగట్టుపల్లి
3) ఎర్రవల్లి 4) సుల్తాన్పూర్
7. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. ఉమ్మడి రాష్ట్రంలోని వైద్య కళాశాలలు- 5
బి. 33 జిల్లాల్లో ఇప్పటి వరకు 12 జిల్లాల్లో కొత్తగా వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు
సి. ఈ ఏడాది మరో 9 కళాశాలలను ప్రారంభించారు
డి. ఇప్పటికే వీటిలో కామారెడ్డి, కుమ్రంభీం, ఖమ్మం, వికారాబాద్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
8. కేంద్ర జల్‌శక్తి శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ చేపట్టిన సర్వే ప్రకారం నల్లాల ద్వారా అందుతున్న తాగునీటిలో అత్యంత శుద్ధమైన తాగునీరు అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నల్లా నీటిలో ఎంత శాతం కలుషిత కారకాలు లేని శుద్ధమైన తాగునీరు అందిస్తుందని ఈ సర్వే తెలియజేసింది?
1) 98.9 2) 99.953
3) 97.953 4) 96.953
9. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) నివేదిక ప్రకారం రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ కేటగిరీలో 78.79 శాతం స్కోరు సాధించింది?
1) గుడ్ 2) వెరీగుడ్
3) బ్యాడ్ 4) ఏదీకాదు
10. సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి ఇటీవల మరణించారు. ఆయనకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా వెల్వర్తి గ్రామం
బి. టీటీడీ ప్రచురణల విభాగానికి ఇన్చార్జి ఎడిటర్‌గా పనిచేశారు
సి. నల్లగొండ మాండలిక పదకోశం నిఘంటువు రూపొందించారు
డి. జాషువా, గబ్బిలం కావ్యాలను సంస్కృతంలోకి అనువదించారు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి
11. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కూల్ రూఫ్ పాలసీకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి?
ఎ. కూల్ రూఫ్ పాలసీని ప్రభుత్వం 2023, ఏప్రిల్ 3న ప్రకటించింది
బి. ఈ విధానంలో నిర్మించే పై కప్పుల వల్ల ఉష్ణోగ్రత 2.10C నుంచి 4.30C వరకు తగ్గుతుంది
సి. 2023 నాటికి 300 చ.కి.మీ. పరిధిలో అమలు చేయాలని లక్ష్యం
డి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ లు ఈ పాలసీ అమలుకు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
12. ఇటీవల విడుదలై ఎన్నో అవార్డులను అందుకున్న ‘బలగం’ సినిమాకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. సినిమా దర్శకుడు వేణు యెల్దండి, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
బి. కొమురయ్య పాత్ర పోషించింది సుధాకర్ రెడ్డి
సి. సంగీతం భీమ్స్ సిసిరోలియో
డి. వాషింగ్టన్ (డీసీ) ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్, లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులకు సంబంధించి కొన్ని కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు అందుకుంది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
13. హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (బయోడైవర్సిటీ ఇండెక్స్)ని హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ఇటీవల విడుదల చేశారు. గతంలో ఒకసారి కింది ఏ సంవత్సరంలో హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేక సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను విడుదల చేశారు?
1) 2014 2) 2012
3) 2016 4) 2019
14. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్ విడుదల చేసిన వరల్డ్ హెల్తీయెస్ట్ సిటీస్ రిపోర్ట్-2023 ప్రకారం 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్ నగరంలో అపర కుబేరులు (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్లీ) ఎంత శాతం పెరిగినట్టు తన నివేదికలో పేర్కొంది?
1) 78 2) 68 3) 58 4) 88
15. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. ఈ పథకాన్ని 2023, మార్చి 8న కరీంనగర్ బుట్టిరాజారాం కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు
బి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు
సి. ప్రస్తుతం రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని ప్రారంభించారు
డి. ఈ పథక ట్యాగ్‌లైన్ ‘మహిళల ఆరోగ్యం ఇంటింటికీ సౌభాగ్యం’
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) బి, సి, డి
16. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను గుర్తించండి?
ఎ. అరవింద్ కేజ్రీవాల్ బి. భగవంత్ మాన్
సి. పినరయి విజయన్
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
17. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోం తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు (2 సార్లు) ప్రపంచ చాంపియన్‌గా నిలిచి రికార్డు సాధించిన నిఖత్ జరీన్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణిని ఓడించి 50 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది?
1) వియత్నాం 2) కంబోడియా
3) ఫిన్లాండ్ 4) ఏదీకాదు
18. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి సీఎం కేసీఆర్ సమక్షంలో ఇటీవల ఒప్పందం చేసుకొని, కింది ఏ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1) దివిటిపల్లి 2) నానక్‌రాం గూడ
3) కొంగరకలాన్ 4) ఏదీకాదు
19. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంభించబోయే ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన వివరాల ప్రకారం కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. (అధికారిక విధివిధానాలు/నిబంధనలు విడుదల కాలేదు)
ఎ. ఈ పథకం అమలు చేయాలని 2023, మార్చి 9న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు
బి. సొంత జాగా ఉన్న వారికి గృహ నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు
సి. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో సగటున 3 వేల మందికి 119 నియోజకవర్గాల్లో నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు
డి. పథకం అంచనా వ్యయం రూ.12,000 కోట్లుగా నిర్ధారించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
20. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పదాలు తెలంగాణ సంస్కృతికి తెలుగు ప్రజల అభిరుచికి, ప్రజాజీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని ఈ పాటకు ఆస్కార్ అవార్డు (ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో) వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ పాట రచయిత చంద్రబోస్ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి?
1) చల్లగరిగె గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
2) చిట్యాల గ్రామం, నల్లగొండ జిల్లా
3) వెదిరె గ్రామం, కరీంనగర్ జిల్లా
4) ఏదీకాదు
21. ఏ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ‘కేసీఆర్ డిజిటల్ కంటెంట్’ పేరుతో 3డీ యానిమేషన్ రూపంలో పదో తరగతి పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు?
1) సిరిసిల్ల 2) సిద్దిపేట
3) మెదక్ 4) సంగారెడ్డి
22. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7 మెగా టెక్స్టైల్స్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించింది. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల శాతాలకు సంబంధించి సరైనది?
1) 49, 51 2) 51, 49
3) 50, 50 4) ఏదీకాదు
23. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున శిక్షణ, అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. సీపీఆర్ పూర్తి అర్థాన్ని వివరించండి?
1) కార్డియో పల్మనరీ రీససిటేషన్
2) కార్డియో పల్స్ రిపిటీషన్
3) కార్డియో పల్స్ రికవరీ 4) ఏదీకాదు
24. మాజీ ప్రధాన మంత్రి, సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి హిందీలో రచించిన అనేక కవితలను ‘శిఖరం’ పేరుతో తెలుగులోకి అనువదించిన పాలమూరు జిల్లా రచయిత ఎవరు?
1) జలజం సత్యనారాయణ
2) కపిలవాయి లింగమూర్తి
3) గడియారం రామకృష్ణ శర్మ
4) ఎవరూకాదు
25. దేశంలో అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం టీ వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ, మంత్రి కేటీఆర్ ఏ రోజున ప్రారంభించారు?
1) 2023, మార్చి 1
2) 2023, మార్చి 2
3) 2023, మార్చి 3
4) 2023, మార్చి 4
26. కోయలు సామూహికంగా జరుపుకొనే పండుగలను గుర్తించండి.
ఎ. భూమి పండుగ
బి. ముత్యాలమ్మ పండుగ
సి. తాటిచెట్ల పండుగ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
27. కోయలు ప్రదర్శించే సంప్రదాయ నృత్యాలను గుర్తించండి.
ఎ. రేలా నృత్యం
బి. డోలి/మేళం నృత్యం
సి. కొమ్ము నృత్యం
డి. కుర్రె నృత్యం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
28. దేశంలో అతిపెద్దదైన, 2097 ఎకరాలు కలిగిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును ఏ జిల్లాలో అభివృద్ధి చేశారు?
1) వనపర్తి 2) మహబూబ్‌నగర్
3) గద్వాల 4) నాగర్‌కర్నూల్
సమాధానాలు
1-2, 2-3, 3-4, 4-1, 5-2, 6-2, 7-3, 8-2, 9-2, 10-1, 11-2, 12-3, 13-2, 14-1, 15-2, 16-2, 17-1, 18-3, 19-3, 20-1, 21-2, 22-1, 23-1, 24-1, 25-2, 26-4, 27-4, 28-2.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు