సర్వాయి పాపన్న గౌడ్ మొదటి కోటను ఎక్కడ నిర్మించాడు? (పోటీ పరీక్షల ప్రత్యేకం)
మొగల్ సామ్రాజ్యం
# క్రీ.శ 1526లో బాబర్ భారతదేశంపై దండెత్తి మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
# మొగలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్థాన్, మంగోలియా దేశాలకు చెందినవారు.
# బాబర్ (1526-1530) క్రీ.శ 1504లో కాబూల్‌ను వశంచేసుకొని 1526లో ఇబ్రహీంలోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రాను ఆక్రమించి మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
# బాబర్ కుమారుడైన మాయూన్ (1530-1556) షేర్‌ఖాన్ చేతిలో ఓటమి పొంది, ఇరాన్ పారిపోయాడు. సఫావిద్షా సహాయంతో తిరిగి 1555లోఢిల్లీని ఆక్రమించాడు.
# మాయూన్ కుమారుడు అక్బర్ (1556-1605) 13 సంవత్సరాల వయస్సులో రాజ్యాధికారాన్ని చేపట్టి అఫ్గానిస్థాన్, కశ్మీర్, దక్కన్ ప్రాంతాలను రాజ్యంలో కలిపాడు.
# అక్బర్ కుమారుడు జహంగీర్ (1605-1627)
# జహంగీర్ కుమారుడైన షాజహాన్ (1627-1658) తాజ్‌మహల్ నిర్మాత. సింహాసనం కోసం కుమారుల మధ్య సంఘర్షణలో ఔరంగజేబు విజయం. సోదరుల్ని చంపి తండ్రిని ఆగ్రా జైలులో ఖైదు చేశాడు.
# ఔరంగజేబు (1658-1707) అస్సాంపై గెలుపు, బీజాపూర్, గోల్కొండ రాజ్యాల్ని ఆక్రమించాడు.
# శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపన చేశాడు.
# మొగలులు కొందరు రాజపుత్రులతో వివాహ సంబంధాలు పెట్టుకోగా, చిత్తోడ్కు చెందిన సిసోడియా రాజపుత్రులు మొగలుల అధికారాన్ని ఎదురించారు.
# మొగల్లు స్థానిక రాజుల్ని ఓడించినా గౌరవించి వారి రాజ్యాన్ని వారికే అప్పగించారు.
# స్థానిక రాజకుమార్తెలను వివాహమాడి రాజపుత్రులతో సఖ్యత కొనసాగించారు.
# జహంగీర్ తల్లి అంబర్ (జైపూర్) రాకుమార్తె, షాజహాన్ తల్లి జోధ్‌పూర్ యువరాణి.
# మొగలులు తురుష్కులు, ఇరానియన్లు, భారత ముస్లింలు, అఫ్గాన్లు, రాజపుత్రులు, మరాఠాలకు ఉద్యోగాలు కల్పించి మున్సబ్దార్లుగా నియమించుకుని సైనిక హోదా కల్పించారు. ప్రత్యక్ష ఆధీనంలో, కొత్తరాజ్యాలపై దండయాత్రలు, తిరుగుబాట్ల అణచివేత, ప్రాంత పాలన బాధ్యతలు, రాజభవనం రక్షణ బాధ్యతలను అప్పగించారు.
# మున్సబ్దార్లకు స్వతంత్ర అధికారాలు లేవు. చక్రవర్తి అభీష్టం మేరకు నడుచుకోవాలి.
# మున్సబ్దార్లను 2లేదా 3 సంవత్సరాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసేవారు.
# వీరు నిర్ణీత సంఖ్యలో గురపు రౌతులను, అశ్వక దళాన్ని పోషించి సమీక్షలో చూపించి, నమోదు చేయాలి. గురాలకు ముద్రలను వేయించి, జీతభత్యాలు పొందేవారు.
# మున్సబ్‌దార్ పదవి వంశపారంపర్యం కాదు. మున్సబ్‌దార్ ఆస్తి అతని మరణానంతరం చక్రవర్తికి చెందుతుంది.
# జాగీర్ల నుంచి వచ్చే పన్నుల ఆదాయం నుంచి మున్సబ్దార్లు జీతాలు తీసుకునేవారు. మిగతా సొమ్మును చక్రవర్తికి పంపేవారు.
# జాగీరు పరిపాలన బాధ్యతను చక్రవర్తి నియమించిన అధికారులు చూసుకునేవారు.
# అక్బర్ ప్రవేశపెట్టిన పన్నుల విధానాన్ని ‘జబ్త్’ గా వ్యవహరించేవారు.
# అక్బర్ ఆర్థికమంత్రి తోడర్మల్ భూములు సర్వేచేయించి, పన్నులను నిర్ణయించాడు.
# భూమి శిస్తు వసూలు చేసిన జమీందార్లకు శిస్తులో వాటా లభించేది.
# అబుల్‌ఫజల్ రాసిన ‘అక్బర్ నామా’ లో అక్బర్ ప్రవేశపెట్టిన పాలన, మత విధానాల గురించి ఉంది.
# అక్బర్ మతపర చర్చల కోసం ముస్లిం, హిందూ, పండితులు, రోమన్ క్యాథలిక్స్, జొరాష్ట్రియన్స్ను ఫతేపూర్‌సిక్రీ ఇబాదత్ఖానాకు ఆహ్వానించి చర్చలు జరిపేవాడు.
# భిన్న మతస్థుల మధ్య వివక్షత చూపే పద్దతి లేకుండా, సహనంతో కూడిన ‘సుల్హ్-ఇ-కుల్’ (ప్రపంచశాంతి) కోసం యత్నించాడు.
# ‘సుల్హ్-ఇ-కుల్’ అమల్లో చక్రవర్తికి అబుల్ ఫజల్ సహాయం చేశాడు. ఇదే విధానాన్ని జహంగీర్, షాజహాన్ పాటించారు.
# మొగలుల పరిపాలనలో దక్కన్ పాలకుడిగా చిన్ ఖులిచ్ఖాన్ (నిజాం ఉల్ ముల్క్) పనిచేశాడు. మొగల్ చక్రవర్తులు బలహీన పడటంతో హైదరాబాద్ రాష్ట్రంలో 1724లో అసఫ్‌జాహీ వంశపాలన స్థాపించాడు.
# హైదరాబాద్ రాజ్య సంరక్షణకై మైసూర్, మరాఠా పాలకులతో నిరంతరం యుద్ధాలు చేయవలసి రావడంతో, బ్రిటిష్ వారితో సైన్యసహకార ఒప్పందం చేసుకున్నారు.
# 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సంస్కరణలు ప్రవేశపెట్టి ఆసిఫియా గ్రంథాలు, విక్టోరియా స్మారక అనాథశాల, మహబూబియా బాలికల పాఠశాల ఏర్పాటు చేశాడు. 1908లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు, సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచి ఆశ్రయం కల్పించి ప్రార్థనలు చేశాడు.
# సాలార్జంగ్ 1853-1883 వరకు దివాన్‌గా పనిచేసి వలసవాద అభివృద్ధి పథకాలను ఆహ్వానించాడు.
# సర్వాయి పాపన్నగౌడ్ ఔరంగజేబు పాలనా కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకోని ఖిలాషాపూర్ కోట నిర్మించి రాజధానిగా పాలించాడు.
# పాపన్న సర్వాయిపేటలో మొదటికోటను నిర్మించాడు. తాటికొండ, వేములకొండలో కోటలు నిర్మించి భువనగిరి, కొలనుపాక, చేర్యాల, హుస్నాబాద్ కోటలను నియంత్రించాడు.
# పాపన్న గౌడ్‌ను అణచివేయడానికి ఔరంగజేబు పంపిన సేనాని రుస్తుమ్ దిల్‌ఖాన్. అతని అనుచరుడు ఖాసీంఖాన్‌ను పాపన్న అంతం చేశాడు.
# ఔరంగజేబు మరణానంతరం సుబేదార్ కంబక్షఖాన్ దక్కన్‌పై నియంత్రణ కోల్పోయాడు.
# సర్వాయి పాపన్నగౌడ్ వరంగల్ కోటను 01-04-1708లో ఆక్రమించాడు.
# పాపన్నను 1712లో బంధించి శిరచ్ఛేదం చేశారు.
మాదిరి ప్రశ్నలు
1. మొగలులకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. మధ్య ఆసియా ఉజ్బెకిస్థాన్, మంగోలియా దేశాలకు చెందినవారు
బి. క్రీ.శ 1506లో మాయిన్ కాబూల్‌ను ఆక్రమించాడు
సి. క్రీ.శ 1526లో బాబర్ ఇబ్రహీంలోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు
డి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే ఎరకోట మొగల్ చక్రవర్తుల నివాసం
1) ఎ,సి,డి 2) ఎ,సి
3) బి,డి 4) ఎ,బి,డి
2. జతపర్చండి?
చక్రవర్తి పరిపాలన కాలం
ఎ. అక్బర్ 1. 1605-1627
బి. షాజహాన్ 2. 1658-1707
సి. జహంగీర్ 3. 1627-1650
డి. ఔరంగజేబు 4. 1556- 1605
5. 1526-1530
1) ఎ-1, బి-3, సి-3, డి-5
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-5
3. మొగల్ సామ్రాజ్య స్థాపకుడు?
1) అక్బర్ 2) మాయిన్
3) బాబర్ 4) ఔరంగజేబు
4. మాయిన్ ఎవరి చేతిలో ఓడిపోయి ఇరాన్ పాలకుడైన సఫావిద్ షా సహాయాన్ని పొందాడు?
1) షేర్‌ఖాన్ 2) అక్బర్
3) అహ్మద్‌షా అబ్దాలి 4) ఔరంగజేబు
5. దక్కన్ ప్రాంతంలో మొగల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన చక్రవర్తి?
1) మాయిన్ 2) షేర్‌ఖాన్
3) షాజహాన్ 4) బాబర్
6. ఏ మొగల్ చక్రవర్తి పాలనలో సింహాసనం కోసం కుమారుల మధ్య తీవ్రసంఘర్షణలు జరిగాయి?
1) అక్బర్ 2) మాయిన్
3) షాజహాన్ 4) జహంగీర్
7. చివరి మొగల్ చక్రవర్తి ఔరంగజేబుకు సంబంధించి సరైనది?
ఎ. వారసత్వ పోరులో సోదరుల్ని హత్యచేసి సింహాసనం అధిష్ఠించాడు
బి. తాజ్‌మహాల్, ఎరకోటను నిర్మించాడు
సి. మతసహనం పాటించి అన్ని మతాలను ఆదరించాడు
డి. తండ్రి షాజహాన్‌ను ఆగ్రాజైలులో నిర్బంధించాడు
1) ఎ, బి, సి 2) బి, సి
3) బి, సి, డి 4) ఎ, డి
8. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఏ మొగల్ చక్రవర్తి కాలంలో స్థాపించాడు?
1) ఔరంగజేబు 2) అక్బర్
3) షాజహాన్ 4) జహంగీర్
9. మొగల్ చక్రవర్తుల పాలనా కాలాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి?
ఎ. జహంగీర్ బి. అక్బర్
సి. షాజహాన్ డి. ఔరంగజేబు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, ఎ, డి
3) బి, ఎ, సి, డి 4) ఎ, సి, డి, బి
10. మొగలులతో అధికారాన్ని చాలా కాలం పాటు నిలువరించిన రాజపుత్రులు?
1) రాథోడ్ 2) సిసోడియా
3) కుష్వా 4) చిత్తోర్
11. మున్సబ్దార్కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) చక్రవర్తి ప్రత్యక్ష ఆధీనంలో సైనిక హోదా కలిగి ఉండేవారు
2) తమ జాగీరుకు సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండేది
3) ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీలు ఉండేవి
4) వీరు చక్రవర్తిని భవంతిని, కోటల్ని కాపాడే బాధ్యతలు కలిగి ఉండేవారు.
12. మున్సబ్దార్లు నిర్వహిచే బాధ్యతల్లో లేనిది ఏది?
1) నిర్ణీత సంఖ్యలో గురపు రౌతులను, అశ్వక దళాన్ని పెంచి పోషించాలి
2) అశ్వక దళం నమోదు, ముద్రలు వేయించి వాటి సంఖ్య ఆధారంగా జీతభత్యాలు పొందేవారు
3) మున్సబ్‌దార్ మరణానంతరం పదవి వారి కుమారులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది
4) జాగీర్ల నుంచి పన్నులు వసూలు చేసి చక్రవర్తులకు పంపించేవారు
13. అక్బర్ పాలనలో భూములు సర్వే చేయించిన ఆర్థికమంత్రి?
1) తోడర్మల్
2) రాజా భగవాన్‌దాస్
3) రాణా ప్రతాప్ 4) మాన్సింగ్
14.మొగలుల పాలనలో జబ్త్గా వ్యవహరించే రెవెన్యూ విధానంలోని ప్రధానాంశాలు?
ఎ. ప్రతి పంటకు నగదు రూపంలో చెల్లించా ల్సిన పన్నును నిర్ణయించారు
బి. రెవెన్యూ బ్లాకులు ఏర్పాటు చేశారు
సి. గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతంగా అమలుచేశారు
డి. ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి, కట్టాల్సిన పన్నులు నిర్ణయించారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
15. మొగలుల కాలంలో పన్నుల వసూలుకు నియమించిన జమీందార్లకు సంబంధించి సరైనది కాదు?
1) వంశపారంపర్యంగా బాధ్యతలు సంక్రమించేవి
2) వీరిని చక్రవర్తి నియమించేవాడు
3) వీరు సొంత బలగాలను పోషించుకునేవారు
4) వీరికి పన్నులు వసూలు చేసింనందుకు శిస్తులో వాటా లభించేది
16. అక్బర్నామా రచించిన అక్బర్ ఆస్థాన సభ్యుడు?
1) తోడర్మల్ 2) అబుల్ ఫజల్
3) బీర్బల్ 4) బైరాంఖాన్
17. అక్బర్ ఫతేపూర్ సిక్రిలో నిర్వహించిన మతచర్చల్లో పాల్గొనని మతస్థులు?
1) ముస్లిం పండితులు
2) జొరాస్ట్రియన్లు
3) హిందూ పండితులు
4) షింటోమతం
18. సుల్హ్-ఇ-కుల్ సిద్ధాంతాలను తమ పాలనలో అమలుచేయని మొగల్ చక్రవర్తి?
1) అక్బర్ 2) జహంగీర్
3) షాజహాన్ 4) ఔరంగజేబు
19. అక్బర్ మతచర్చలకు వేదికైన భవనం పేరు?
1) లాల్‌దర్వాజ 2) బులంద్ దర్వాజ
3) ఇబాదత్‌ఖానా 4) జామామసీదు
20. అసఫ్‌జాహీ పాలకుల కాలక్రమం ఆధారంగా వరుసక్రమంలో అమర్చండి?
ఎ. నిజాం అలీఖాన్
బి. నిజాం ఉల్‌ముల్క్
సి. మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి. మీర్ మహబూబ్ అలీఖాన్
1) ఎ, సి, డి, బి 2) బి, ఎ, డి, సి
3) డి, సి, బి, ఎ 4) బి, డి, ఎ, సి
21. క్రీ.శ. 1724లో అసఫ్జాహి వంశ పాలనను స్థాపించినది?
1) నిజాం అలీఖాన్ 2) ముజఫర్ జంగ్
3) నిజాం ఉల్ ముల్క్ 4) అఫ్జల్ ఉద్దౌలా
22. అసఫ్‌జాహీ పాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టిన నిజాం ప్రభువు ఎవరు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) నిజాం అలీఖాన్
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) నాసర్ జంగ్
23. మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మాణాల్లో లేనిది?
1) విక్టోరియా స్మారక అనాథశాల
2) అసిఫియా గ్రంథాలయం
3) ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కాలేజీ
4) మహబూబియా బాలికల పాఠశాల
24. వలసవాద అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన నిజాం ప్రభుత్వ దివాన్?
1) సాలార్జంగ్-1 2) కిషన్ ఫర్హాద్
3) సాలార్ జంగ్-3
4) సయ్యద్ అలీ ఇమామ్
25. 1908లో మూసీనది వరదల సందర్భంలో మతరహితంగా ప్రార్థనలు చేసిన నిజాం రాజు ఎవరు?
1) మహబూబ్ అలీఖాన్
2) ఉస్మాన్ అలీఖాన్
3) నిజాం అలీఖాన్ 4) సికిందర్ జా
సమాధానాలు
1-1 2-3 3-3 4-1 5-3 6-3 7-4 8-1 9-3 10-2 11-2 12-3 13-1 14-3 15-2 16-2 17-4 18-4 19-3 20-2 21-3 22-4 23-3 24-1 25-1
డాక్టర్. రాచర్ల గణపతి
పాఠ్యపుస్తకాల రచయిత & విషయ నిపుణులు
హన్మకొండ
9963221590
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?