మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
- గ్రూప్స్ ప్రత్యేకం బయాలజీ
535. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. అండకణోత్పాదనలో ఒక అండ మాత్ర కణం నుంచి 4 అండాలు ఏర్పడుతాయి.
బి. శుక్రోత్పాదనలో ఒక శుక్రమాతృ కణం నుంచి 3 ధ్రువ దేహాలు ఒక శుక్ర కణం ఏర్పడుతుంది.
సి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు అనుబంధంగా బార్తోలిన్ గ్రంథులు ఉంటాయి.
సరికాని వాక్యాలు ఏవి?
1. ఎ, బి 2. బి, సి 3. సి, ఎ 4. ఎ, బి, సి
536. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ముష్కంలోని లీడిగ్ కణాలు శుక్రకణాలను ఏర్పరుస్తాయి.
బి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు అనుబంధంగా శుక్రాశయాలు పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథులుంటాయి.
సి. అండం, శుక్రకణాల కలయిక ఫాలోపియన్ నాళంలో కలుస్తాయి.
సరైనవి
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ మాత్రమే
537. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. బీజకణాల కలయిక జరగని
ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి
అంటారు.
బి. బీజకణాల కలయిక జరిగే
ప్రత్యుత్పత్తిని లైంగిక
ప్రత్యుత్పత్తి అంటారు.
సి. లైంగిక ప్రత్యుత్పత్తి ఉన్నత
జీవుల్లో జరుగుతుంది.
సరైనవి.
1. ఎ 2. బి
3. బి, సి 4. ఎ, బి, సి
538. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఏట్రియల్ నట్రియూరిటిక్ కారకం
రక్తనాళాన్ని విస్పారింపజేసి రక్త పీడనాన్ని తగ్గిస్తుంది.
బి. ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్
అస్థిమజ్జలో ఎర్రరక్త కణోత్పాదనను
ప్రేరేపిస్తుంది.
సి. సెక్రిటిన్ ప్రభావం వల్ల
జఠర గ్రంథులు Hcl, పెప్సినోజన్ను విడుదల చేస్తాయి.
సరికానివి .
1. ఎ, బి 2. బి
3. సి 4. ఎ
539. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. స్త్రీ బీజకోశాలను సైటోజెనిక్ గ్రంథులు అంటారు
బి. ప్రొజెస్టిరాన్ హార్మోన్ లైంగిక అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
సి. ఆండ్రోజన్లు(టెస్టోస్టిరాన్) ద్వితీయ పురుష లక్షణాలు, శుక్రజననం, పురుష లైంగిక ప్రవర్తనను కలిగిస్తాయి. సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
540. క్లోమగ్రంథి, దాని హార్మోన్లకు సంబంధించి దిగువ వాక్యాలు పరిశీలించండి.
ఎ. లాంగర్ హాన్స్ పుటికలలో ఆల్ఫా, బీటా కణాలుంటాయి.
బి.ఆల్ఫా కణాలు ఇన్సులిన్‌ను స్రవిస్తాయి
సి. బీటా కణాలు గ్లూకగాన్ను స్రవిస్తాయి.
సరైనవి
1. ఎ, బి 2. బి, సి 3. ఎ 4. సి
541. ఇన్సులిన్, గ్లూకగాన్లకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఇన్సులిన్ ైగ్లెకోజన్ను గ్లూకోజ్‌గా మారుస్తుంది.
బి. గ్లూకగాన్ గ్లూకోజ్‌ను ైగ్లెకోజన్గా మారుస్తుంది.
సి. గ్లూకగాన్, ఇన్సులిన్లు పరస్పరం వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ సమతాస్థితిని ఏర్పరుస్తాయి.
సరైనవి.
1. ఎ, బి 2. బి. సి
3. ఎ, బి, సి 4. సి మాత్రమే
542. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ మెల్లిటస్ అనే అపస్థితి కలుగుతుంది.
బి. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ లోపం వల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్ అపస్థితి కలుగుతుంది.
సి. గ్లూకోకార్టికాయిడ్ల అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి, అధికోత్పత్తి వల్ల కుషింగ్ వ్యాధి కలుగుతాయి.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. ఎ, సి 4. ఎ, బి, సి
543. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. థైమస్ గ్రంథి చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటుంది.
బి. పారాథార్మోన్ లోపం వల్ల క్రెటినిజం వ్యాధి కలుగుతుంది.
సి. థైరాక్సిన్ హార్మోన్ అసమతుల్యత వల్ల గాయిటర్ ఏర్పడుతుంది.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
544. కింది వాక్యాలను పరిశీలించండి
ఎ. హైపర్ థైరాయిడిజం వల్ల
ఎక్సోఫ్తాల్మిక్ గాయిటర్ వస్తుంది.
బి. హైపో థైరాయిడిజం వల్ల పిల్లల్లో క్రెటినిజం, పెద్దవారిలో మిక్సిడిమా అనే అపస్థితులు ఏర్పడుతాయి.
సి. థైరాయిడ్ గ్రంథి అతిపెద్ద గ్రంథి.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
545. పీనియల్ గ్రంథికి సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
ఎ. ఇది ద్వారాగోర్థపు పృష్టతలంలో ఉంటుంది.
బి. ఇది మెలటోనిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది.
సి. మెలటోనిన్ మానవుడిలో 24 గంటల దిన ప్రవర్తన, దేహ ఉష్ణోగ్రత, జీవక్రియలు, రుతుచక్రం, రక్షణ సామర్థ్యం వంటి చర్యలను నియంత్రిస్తుంది.
సరైనవి గుర్తించండి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
546. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఆక్సిటోసిన్ సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది .
బి. పెరుగుదల హార్మోన్/ సొమాటో ట్రోపిన్ అధికోత్పత్తి వల్ల పిల్లల్లో అతికాయం(జైగాంటిజం), పెద్దవారిలో ఆక్రోమెగాలి(గొరిల్లా ముఖం) అనే అపస్థితులు ఏర్పడుతాయి.
సి. పెరుగుదల హార్మోన్/ సొమాటో ట్రోపిన్ అల్పోత్తత్పి వల్ల శిశువుల్లో మరుగుజ్జుతనం
కుబ్జత్వం(Dwarfism) అనే అపస్థితి ఏర్పడుతుంది.
సరైనవి గుర్తించండి?
1. ఎ, బి, సి 2. ఎ, బి
3. బి, సి 4. సి, ఎ
547. చర్మానికి సంబంధించి దిగువ వాక్యాలను పరిశీలించండి.
ఎ. యుక్తవయస్సులో చర్మం ఉపరితల వైశాల్యం 11/2, చ.కి.మీ ఉంటుంది.
బి. TSH అనే వర్ణద్రవ్యం వల్ల చర్మం రంగు ఏర్పడుతుంది.
సి. చర్మానికి వైరస్ వల్ల పొంగు, ఆటలమ్మ, బ్యాక్టీరియా వల్ల కుష్టు, మెలనిన్ లోపం వల్ల బొల్లి, విటమిన్ల లోపం వల్ల పెల్లాగ్రా, శిలీంధ్రం వల్ల తామర అనే వ్యాధులు వస్తాయి.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2, బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
548. నాలుక గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. నాలుకలోని సూక్ష్మాంకురాల గోడల్లో సుమారు 10,000 రుచిగుళికలు ఉంటాయి.
బి. కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలకు మెటాలిక్ టేస్ట్ ఉంటుంది.
సి. నాలుకపై రెండు రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
549. ముక్కుకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం గల నాడీ కణాలు ముక్కులో ఉంటాయి.
బి. జంతువులతో పోలిస్తే మానవులకు గ్రహణ శక్తి తక్కువ ఉంటుంది.
సి. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సుమారు 1500 రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు.
సరైనవి ఏవి?
1. ఎ, బి, సి 2. బి, సి
3. సి. ఎ 4. ఎ, బి
550. చెవి గురించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. మధ్య చెవిలో రెండు ఎముకలుంటాయి.
బి. మానవుని చెవి 16-40,000 హెర్జ్ల వినే పౌనః పుణ్యగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
సి. చెవి సమతాస్థితిని కాపాడుతుంది.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
551. కన్ను గురించి దిగువ వాటిని పరిశీలించండి
ఎ. రెండు కళ్లతో ఒకే వస్తువును
చూడటాన్ని మోనాక్యులర్ విజన్ అంటారు.
బి. ఒక కన్నుతో ఒక వస్తువును
చూడటాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు.
సి. రెండు కళ్లు సమన్వయం లేకుండా వస్తువులను చూడటాన్ని బైఆక్యులర్ విజన్ అంటారు.
వీటిలో సరైనవి గుర్తించండి?
1. ఎ, బి, సి 2. ఎ
3. బి 4. సి
552. కన్ను గురించి దిగువ వాటిని పరిశీలించండి
ఎ. దండకణాలు(Rodcells) అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి.
బి. శంఖు కణాలు(Cone cells) రొడాప్సిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి.
సి. పక్షుల్లో టెలీస్కోపిక్ దృష్టి ఉంటుంది.
సరైనవి ఏవి?
1. ఎ 2. బి 3. సి 4. ఎ, బి, సి
553. నాడీ ప్రచోదనానికి సంబంధించి కింది వాటిని గమనించండి.
ఎ. నాడీ కణం ప్రేరణ ఇవ్వక ముందు విరామస్థితిలో ఉంటుంది.
బి. నాడీ కణానికి ప్రేరణ ఇచ్చినట్లయితే క్రియాశక్మం(ప్రచోదనం) ఏర్పడుతుంది.
సి. నాడీ కణాలు సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విద్యుత్ రసాయన ప్రవాహ రూపంలో సరఫరా చేస్తాయి.
సరైనవి ఏవి?
1. ఎ 2. ఎ, బి
3. ఎ, బి, సి 4. సి
554. వెన్నుపాము గురించి దిగువ వాక్యాలను పరిశీలించండి.
ఎ. మెదడు, శరీరభాగాలకు మధ్య
సంధాన కర్తగా పనిచేస్తుంది.
బి. వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపుతుంది.
సి. మానవుడిలో 21 జతల కశేరునాడులు/ వెన్నునాడులు ఉంటాయి
సరైనవి గుర్తించండి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
555. నాడీ వ్యవస్థకు సంబంధించి దిగువ వాక్యాలను గమనించండి.
ఎ. కపాలనాడులు, కశేరునాడులను కలిపి కేంద్రనాడీ వ్యవస్థ అంటారు.
బి. మెదడు, వెన్నుపాములను కలిపి
పరధీయ నాడీ వ్యవస్థ అంటారు.
సి. మెదడు గురించి అధ్యయనాన్ని
ఫ్రినాలజీ అంటారు.
సరైనవి ఏవి?
1. ఎ 2. బి 3. సి 4. ఎ, బి
556. మెదడుకు సంబంధించి దిగువ వాక్యాలను పరిశీలించండి
ఎ. మెదడులో సుమారు 100 బిలియన్ల నాడీ కణాలుంటాయి.
బి. మనం తీసుకున్న ఆక్సిజన్‌లో సుమారు 20 శాతం వరకు మెదడు ఉపయోగించుకుంటుంది.
సి. మెదడు సుమారు 700 గ్రాముల బరువుంటుంది.
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. బి, సి
3. సి, ఎ 4. ఎ, బి, సి
557. మెదడుకు సంబంధించి దిగువ వాక్యాలను పరిశీలించండి.
ఎ. దృష్టిలంబికలు, క్రూరా సెరిబ్రి అంత్యమెదడులో భాగం.
బి. అనుమస్తిష్కం, పాన్స్‌వెరోలి, మజ్జాముఖాలు, మధ్యమెదడులో భాగం
సి. ఘ్రాణలంబికలు, మస్తిష్కం, ద్వారాగోర్థములు అంత్య మెదడులో భాగం
సరైనవి ఏవి?
1. ఎ, బి 2. ఎ, బి, సి ఏవి కావు
3. బి, సి 4. ఎ, బి, సిలు అన్నీ
– డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు