విత్త సంఘంలో చైర్మన్‌తోపాటు ఎంతమంది సభ్యులుంటారు?
1. ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా (లేదా) పన్ను ఆదాయం ద్వారా వచ్చిన రాబడిని ఆ సంవత్సరపు జాతీయాదాయం జీడీపీ శాతంగా చెప్పడాన్ని ఏమంటారు?
1) పన్ను ఎగవేత (Tax Evasion)
2) ప్రత్యేక విధింపులు
(Special Charges)
3) భూమి శిస్తు (Land Revenue)
4) ట్యాక్స్ జీడీపీ రేషియో
2. ప్రభుత్వ రాబడి మార్గాలు లేదా ప్రభుత్వ ఆదాయ మార్గాలు ఎన్ని?
1) 2 రకాలు 2) 3 రకాలు
3) 4 రకాలు 4) 5 రకాలు
3. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పన్నుల వ్యవస్థ ఏ ఆశయాలను ప్రయోజనాలను కలిగి ఉండాలని ఎవరు పేర్కొన్నారు?
1) టి.టి. కృష్ణమాచారి
2) జే.ఆర్. హిక్స్
3) ప్రొఫెసర్ కౌల్టర్ 4) కీన్స్
4. సెస్ అంటే ?
1) సర్వీస్ ట్యాక్స్
2) అమ్మకం ట్యాక్స్
3) కార్పొరేషన్ ట్యాక్స్
4) ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం పన్నుపై పన్ను విధించడం
5. రాజా చెల్లయ్య కమిటీ తమ పన్ను సంస్కరణల్లో ఏ ట్యాక్స్‌ను తగ్గించాలని సూచించింది?
1) కార్పొరేషన్ ట్యాక్స్
2) ఇన్‌కం ట్యాక్స్
3) ల్యాండ్ ట్యాక్స్
4) వస్తుసేవల ట్యాక్స్
6. వ్యయంపై పన్ను (Expenditure Tax) ఏ కమిటీ సిఫారసుల మేరకు 1957లో టి.టి. కృష్ణమాచారి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ప్రవేశపెట్టారు?
1) ప్రొ. నికోలస్ కాల్డర్ కమిటీ
2) ప్రొ. కాల్డర్ కమిటీ
3) ప్రొ. రాజా చెల్లయ్య కమిటీ
4) ప్రొ. నరసింహ కమిటీ
7. 1979 -80లో పొగాకు మీద ఎక్సైజ్ సుంకం తొలగించారు. ప్రత్యామ్నాయంగా సిగరెట్లు, బీడీలు, నమిలే పొగాకు నశ్యం మీద సుంకం విధించే పన్నును ఏమంటారు?
1) Sumptuary Tax 2) Green Tax
3) Advolarem Tax 4) Sin Tax
8. గ్రీన్ టాక్స్ అంటే ?
1) ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో పన్ను విధిస్తే
2) పంచదార, అగ్గిపెట్టెలు, ఉక్కు దిమ్మెలపై పన్ను విధిస్తే
3) పర్యావరణ వినాశనాన్ని తగ్గించే విషయంలో పన్ను విధిస్తే
4) పారిశ్రామిక వస్తువుపై పన్ను విధిస్తే
9. భారతదేశంలో అమ్మకపు పన్నును ఎప్పుడు ప్రవేశ పెట్టారు.
1) 1927 2) 1937
3) 1947 4) 1957
10. జీఎస్టీని తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం?
1) అమెరికా 2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా 4) ఫ్రాన్స్
11. రాష్ర్టాలకు వ్యాట్ తర్వాత అధిక రాబడిని అందించిన పన్ను ఏది?
1) లైఫ్‌ట్యాక్స్ 2) సేల్స్ ట్యాక్స్
3) ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్
4) స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ
12. జీఎస్టీని మొదట ఆమోదించిన రాష్ట్రం?
1) బీహార్ 2) జార్ఖండ్
3) అస్సాం 4) అరుణాచల్ ప్రదేశ్
13. జీఎస్టీని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
1) 2013 ఏప్రిల్ 1
2) 2015 జూలై 1
3) 2016 జూన్ 1 4) 2012 జూలై 1
14. జీఎస్టీ చట్టం ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేస్తారు?
1) 279 (ఎ) 2) 279 (బి)
3) 278 (ఎ) 4) 278 (బి)
15. రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ ప్రకారం కేంద్రం, రాష్ర్టాలకు చెందిన పన్నుల విభజన జరుగుతుంది?
1) 4వ షెడ్యూల్ 2) 5వ షెడ్యూల్
3) 6వ షెడ్యూల్ 4) 7వ షెడ్యూల్
16. జీఎస్టీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎవరు ఉంటారు?
1) రక్షణశాఖ 2) మంత్రిత్వ శాఖ
3) ఆర్థిక శాఖ 4) న్యాయశాఖ
17. ప్రత్యక్ష పన్నుల పరిశీలన పన్నుల ఎగవేత నల్లధనం గురించి ఏ కమిటీ సూచించింది?
1) భూత లింగం కమిటీ (1967)
2) ఎన్.డి. తివారీ కమిటీ (1967)
3) కె.ఎన్. వాంఛూ కమిటీ (1970)
4) పి.సి.ఛోక్సీ కమిటీ (1977)
18. పన్నుల టాస్క్‌ఫోర్స్ (2002- విజయ్ కేల్కర్) కమిటీ ఏ సూచనలు ఇచ్చింది?
1) ప్రత్యక్ష పన్నుల పరిశీలన
2) కస్టమ్స్ డ్యూటీలపై సూచనలు ఇవ్వడానికి
3) ప్రత్యక్ష పన్నుల సులభతరం, హేతుబద్దీకరణ
4) ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.
19. మూడో విత్త సంఘం అధ్యక్షుడు ఎవరు?
1) ఎ.కె. చందా 2) సి. రంగరాజన్
3) వై.వి. రెడ్డి 4) ఎస్.కె. సింగ్
20. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులలో భాగంగా కేంద్రం నుంచి రాష్ర్టాల వాటా ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు?
1) 22 శాతం నుంచి 32 శాతం
2) 32 శాతం నుంచి 42 శాతం
3) 42 శాతం నుంచి 52 శాతం
4) 52 శాతం నుంచి 62 శాతం
21. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నష్ట పరిహారాన్ని కేంద్రం ఏ విధంగా భరించాలని సూచించింది?
1) మొదటి 3 సంవత్సరాలు – 100 శాతం
2) మొదటి 3 సంవత్సరాలు – 75 శాతం
3) మొదటి 3 సంవత్సరాలు – 50 శాతం
4) మొదటి 3 సంవత్సరాలు – 25 శాతం
22. 1969లో 5వ విత్త సంఘం మొదటిసారి ప్రవేశ పెట్టింది. అందులో మొదట ప్రత్యేక హోదా పొందిన 3 రాష్ర్టాలు ఏవి?
1) అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం
2) మణిపూర్, త్రిపుర, ఉత్తరాఖండ్
3) అస్సాం, నాగాలాండ్, జమ్ముకశ్మీర్
4) పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్
23. మొదటి విత్త సంఘం నిర్దేశిత లక్ష్యం ఏమిటి?
1) రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి.
2) రాబడిలోటు భర్తీ, పాలనాభివృద్ధి
3) స్థానిక పాలనా సంస్థల అభివృద్ధి
4) విద్యాభివృద్ధికి, బడ్జెట్‌లోటు భర్తీ చేయడానికి
24. విత్త సంఘంలో చైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు?
1) 1+2 2) 1+3
3) 1+4 4) 1+5
25. పార్థసారథి షోమ్ కమిటీ విదేశీ పెట్టుబడిదారుల సమస్యలను అధ్యయనం చేసి యాంటీ ఎవిడెన్స్ ట్యాక్స్ రూల్‌ను కనీసం 3 సంవత్సరాలు వాయిదా వేయడం వంటి సిఫారసులు చేసింది?
1) విజయ్ కేల్కర్ కమిటీ 2) రేఖీ కమిటీ
3) చందా కమిటీ 4) కాల్డర్ కమిటీ
26. వ్యాట్‌ను చివరగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం?
1) హర్యానా 2) జార్ఖండ్
3) ఉత్తరప్రదేశ్ 4) బీహార్
27. పరోక్ష పన్నుల్లో అమ్మకం పన్నును మొదట జర్మనీ దేశం ఏ సంత్సరంలో ప్రవేశ పెట్టింది?
1) 1937 2) 1938
3) 1939 4) 1916
28. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) ను వేటిపై విధిస్తారు?
1) అంతర్జాతీయ విక్రయాలపై
2) క్లబ్ మెంబర్షిప్ చెల్లింపులపై
3) సేవాపన్నుపై
4) సెక్యూరిటీస్ లావాదేవీలపై
29. ప్రపంచంలోని అతిపురాతనమైన పన్ను ఏది?
1) ఎగుమతి పన్ను
2) దిగుమతి పన్ను
3) సేవలపై పన్ను
4) కస్టమ్స్ పన్ను
30. ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ ఏ సంవత్సరం ప్రకారం విధిస్తారు?
1) 1941 2) 1951
3) 1961 4) 1971
31. మరణ సుంకం లేదా వారసత్వ పన్ను అని దేన్ని అంటారు?
1) ఎస్టేట్ డ్యూటీ
2) కస్టమ్స్ డ్యూటీ
3) గ్రాంట్స్ డ్యూటీ
4) పైవేవీకాదు
32. భారతదేశంలో ఇన్‌కం ట్యాక్స్ అనేది ఏ ట్యాక్స్‌ను పోలి ఉంది?
1) Regressive tax system
2) Progressive tax system
3) Proportional tax system
4) Advaloram tax system
33. వస్తు ఉత్పత్తి ప్రక్రియలో ఒకదశలోనే పన్ను విధింస్తే దాన్ని ఏ పన్ను అంటారు?
1) అనుపాత పన్ను
2) పురోగామి పన్ను
3) తిరోగామి పన్ను
4) ఏకస్థాన పన్ను
34. పన్ను పరిధి అంటే?
1) పన్ను దేని ఆధారంగా విధిస్తారో తెలియజేసేది
2) పన్ను చెల్లించేవారి సంఖ్యను తెలియజేస్తుంది
3) పన్నురేటుకి, పన్ను పరిధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది
4) ఎంతశాతం పన్ను విధిస్తారో తెలియజేసేవి
35. పన్ను చెల్లించే వ్యక్తి ప్రభుత్వం చేసే సేవలతో నిమిత్తం లేకుండా నిర్బంధం చెల్లించేదే పన్ను అని అన్నది ఎవరు?
1) సెలిగ్మన్ 2) జె.ఎం.కీన్స్
3) అలెన్జార్జ్ 4) డాల్టన్
36. ‘కలిసి పనియేయడం’ అనే ప్రాతిపదికన ఏర్పాటు చేసిన బ్యాంకులు ఏవి?
1) వాణిజ్య బ్యాంకులు
2) సహకార బ్యాంకులు
3) యూనియన్ బ్యాంకులు
4) పైవన్నీ
37. Quid-Pro-Quo అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) గ్రీకు భాష 2) పర్షియన్
3) అరేబియన్ భాష 4) లాటిన్ భాష
38. సాధారణంగా పన్ను జీడీపీ నిష్పత్తిలో తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు?
1) పన్ను ఎగవేత
2) పన్ను అభిలషణీయ స్థాయి
3) పన్ను రాబడి 4) పైవేవీకాదు
39. దేశంలో ఆదాయపన్ను 1886లో పునర్‌ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ విధించే పన్ను ఏది?
1) నిర్దిష్ట పన్ను
2) మూల్యానుగత పన్ను
3) ఏకస్థాన పన్ను
4) శాశ్వత పన్ను
40. దేశంలో తిరోగామి మార్పును 1980లో ఇందిరాగాంధీ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహించుటకు విధించి ఏ సంవత్సరంలో రద్దు చేశారు?
1) 1981 2) 1982
3) 1983 4) 1984
41. 1978లో ఝా కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్ ఎంక్వయిరీ కమిటీ సుంకం ఎగవేతను తగ్గించుటకు ఏ రకమైన ట్యాక్స్‌ను సిఫారసు చేసింది?
1) CENVAT 2) MODVAT
3) Service Tax 4) VAT
42. పోల్ ట్యాక్స్ అంటే?
1) సెక్యూరిటీస్ లావాదేవీలపై విధించేది
2) క్లబ్ మెంబర్షిష్పై విధించేది
3) బోనస్, పీఎఫ్‌పై విధించేది
4) సంపద ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని రకాల వర్గాలపై విధించేది
43. 2009-2010లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన పన్ను రద్దు చేశారు?
1) FBT ( Frinz Benfit tax)
2) CST ( Central sales tax)
3) CTT (Commodity transaction tax)
4) Poll tax
44. ట్యాక్స్ అవాయిడెన్స్ (Tax avoidance) అంటే?
1) చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును చూపి పన్ను పరిధి నుంచి తప్పించుకొనుట
2) చట్టవ్యతిరేకంగా తప్పుడు లెక్కలు చూపి పన్ను ఎగవేయుట
3) పన్ను రేటుకి, పన్ను రాబడికి మధ్యగల సంబంధాన్ని సూచించేది
4) చట్టబద్ధంగా ప్రభుత్వానికి చూపించకుండా పన్ను పరిధి నుంచి తప్పించుకొనుట
45. వ్యాట్‌ను సూచించినది ఎవరు?
1) సుష్మనాథ్
2) అభిజిత్ సేన్
3) సైమన్ కుజినెట్స్
4) వాన్ సైమన్స్
ప్రాంతీయ మండళ్లు
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం ప్రధాన మంత్రి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి ఒక నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. ఈ ప్రాంతీయ మండళ్లలో సంబంధిత రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు లేదా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్టినెంట్ గవర్నర్లు ఉంటారు.
- ఈ ప్రాంతీయ మండళ్లకు నీతిఆయోగ్ చైర్మన్ (ప్రధానమంత్రి) లేదా ఆయన నియమించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటారు.
జాతీయ సమైక్యత మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర, చట్టేతర సంస్థే. 1961లో ఏర్పాటు చేశారు. 2010లో పునర్ వ్యవస్థీకరించారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. దేశ ఐక్యత, సమగ్రతలకు సంబంధించి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించటం దీని ముఖ్య ఉద్దేశం.
జాతీయ అభివృద్ధి మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర, చట్టేతర సంస్థే 1952లో కేబినెట్ నిర్ణయం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉంటాడు. ప్రణాళికా సంఘంలోని సభ్యులందరూ ఇందులో సభ్యులే. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను ఆమోదిస్తుంది, అమలుతీరును పరిశీలించే ప్రాధాన్యతను మార్పు చేయొచ్చు. ప్రస్తుతం ఇది రద్దు అయింది.
-సంతోష్
విషయ నిపుణులు , కరీంనగర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?