హైదరాబాద్‌లో ఐటీ.. ఉపాధిలో మేటి – ఐటీ పరిశ్రమ
ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌లో
కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమలో దేశంలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 1400 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 5.8 లక్షల మందికి ప్రత్యక్షంగా, 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా దేశంలోని ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు మార్గదర్శిగా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 2019-20లో
దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి.
- రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు ICTP (Information and Communication Technology Policy 2010-15)ని ప్రకటించారు. తెలంగాణ ఐటీ పాలసీ-2016 ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర అప్పటి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఇందులోని ముఖ్యాంశాలు..
- ఐటీ సంస్థల స్థాపన, ఎదుగుదల, ఎటువంటి ఇబ్బందుల్లేని ఆరోగ్యకరమైన పోటీలో కంపెనీలు పని చేయడానికి అనువైన వాతావరణం ఏర్పాటు
- అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన విద్యావంతులైన యువతకు నూతన నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలు
- ఎగుమతుల మొత్తాలు పెంచడం ద్వారా (రాష్ట్ర జీడీపీ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెంచటం
- రాష్ట్రంలో ఈ రంగానికి సంబంధించి కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య సామర్థ్యం పెంపును ప్రోత్సహించటం
- ఇంతర ప్రాంతాలకు (టైర్ 2 నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్) ఐటీని విస్తరించడం
- ప్రాంతీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సమాచార టెక్నాలజీని సాధనంగా ఉపయోగించడం
- MNC (Multi National Companies) కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న కంపెనీలు రాష్ట్రంలో స్థాపించబడ్డాయి. ఉదా: మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, డెల్, మోటోరోలా, డెలాయిట్, UBS, అమెజాన్, ఫేస్‌బుక్‌తో పాటు ఐటీ ప్రధాన కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, పోలారిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా వంటి ఎన్నో కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు మార్గదర్శిగా తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. 2020 జూలై 21న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఐటీ టవర్‌ను ప్రారంభించారు.
టీ-హబ్
- దీనిని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. టీ-హబ్ మొదటి దశకు పెట్టిన పేరు క్యాటలిస్ట్. విభిన్నమైన నవ పరిశ్రమలను అనుసంధానించడానికి టీ-హబ్ ఉపయోగపడుతుంది. ఇందులో ఐఎస్బీ, ఐఐఐటీ నల్సార్ వ్యవస్థాపక భాగస్వాములుగా ఉన్నాయి. టీ-హబ్ స్టార్టప్‌లలో కీలకమైన విద్యా సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికతలు, రిటైల్ రంగ సాంకేతికత, క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ, ఐటీఈఎస్ ఉన్నాయి. ద్వితీయ శ్రేణి టీ-హబ్‌గా వరంగల్ పట్టణాన్ని గుర్తించారు.
హైటెక్ సిటీ
- ‘హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిటీ’ మాదాపూర్‌లో నిర్మించిన టెక్నాలజీ టౌన్షిప్. దీనిలో1998లో మొదట సైబర్ టవర్స్ నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ రాజధానిగా పిలుస్తారు.
EMC (Electronic Manufacturing Clusters) - ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, డిజైనింగ్ తయారీలో హైదరాబాద్‌లో గ్లోబల్ హబ్‌గా రూపొందించేందుకు వ్యూహాత్మకంగా ప్రాధాన్యతనిస్తూ ఐటీ విధానం ఫ్రేమ్‌వర్క్ రూపొందించారు. మౌలిక సదుపాయాల కల్పనతో నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి అన్ని విధాలా మద్దతునిచ్చే వాతావరణం కల్పించడం, ఆర్థిక విధానం, పన్ను విధానం ఈ విధాన చట్రంలో పొందుపర్చారు.
- రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి e-City (ఫ్యాబ్ సిటీ)ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. మహేశ్వరంలో మరో EMCని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రత్యక్షంగా 0.40 లక్షలు, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరిశ్రమల క్లస్టర్‌ను మెదక్ జిల్లాలోని ముత్తిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేయనున్నారు.
సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం
- ఐటీ పెట్టుబడుల ప్రాంతం. దీనిని కేంద్ర, రాష్ర్టాలు సమష్టిగా అభివృద్ధి చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 15 లక్షలు, పరోక్షంగా 53 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
- హార్డ్‌వేర్ పార్కు: దీని విస్తీర్ణం 1109 ఎకరాలు. ఇది రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలో నెలకొని ఉంది.
టీ-బ్రిడ్జ్
- రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీలను ప్రపంచ మార్కెట్లోని అవకాశాలను అందుబాటులోకి తేవడం కోసం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 2016 అక్టోబర్ 15న టీ-బ్రిడ్జిని ప్రారంభించారు. టీ-హబ్, ఊబర్, టీఐఈలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. భారతదేశంలో ఇటువంటి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. టీ-బ్రిడ్జ్ అనేది దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డర్ అయిన టీ-హబ్‌కు విస్తరణ.
- తెలంగాణ పౌరులు తమ వాహనాల పత్రాలను వెంట పెట్టుకొనే భారం లేకుండా RTA నుంచి తమ డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ వంటి ధృవపత్రాలను భద్రపరుచుకోవచ్చు.
టీ-యాప్ ఫోలియో
- ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఇ-గవర్నెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పాలనను ప్రజలకు చేరవేసేందుకు అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం టీ-యాప్ ఫోలియోను ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్లో లభిస్తుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
- ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి రిజిష్ట్రర్ చేసుకోవాలి. మొబైల్ నెం., ఈ మెయిల్ ఐడీ, ఫేస్బుక్, జీ మెయిల్ నుంచి రిజిష్ట్రర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 150 సేవలు పొందొచ్చు.
గేమింగ్ & యానిమేషన్
- రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలో 2014, జనవరిలో దీన్ని ప్రారంభించారు. ఈ పార్కులో స్టూడియోలు, ల్యాబ్‌లు, బిజినెస్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉంటాయి. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి సంగారెడ్డిలో ఉంది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఈదుల నాగులపల్లిలో నెలకొని ఉంది.
టాస్క్ (T-TASK)
- తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ప్రారంభించారు. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ. నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తయారు చేసే విధంగా టాస్క్ కార్యక్రమాలను చేపడుతుంది.
టీ-ఫైబర్
- తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఓ వినూత్నమైన ఆవిష్కరణ. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కోసం తవ్విన కందకాలనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లైన్లు వేయడానికి వాడతారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 83.58 లక్షల కుటుంబాలకు డిజిటల్ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వస్తాయి.
- రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటి సమాచారాన్ని భద్రపరిచే రాష్ట్ర సమాచార నిధి కేంద్రాన్ని ప్రభుత్వం మణికొండలో నిర్మించనుంది.
డిజిటల్ తెలంగాణ ప్రోగ్రామ్
- దీనిని 2015 జూలై 1న ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి డిజిటల్ సేవలను అందించనున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC) దీని ద్వారా 4జీ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు హైదరాబాద్‌తో సహా ఇతర పట్టణాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తారు. డిజిటల్ అక్షరాస్యతను కల్పించి మీసేవ, ఈ పంచాయతీ సేవలను విస్తృతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
- పల్లె ప్రజలకు గ్రామస్థాయి సేవలన్నింటిని (పెన్షన్లు, ఇన్సూరెన్స్ సేవలు, బ్యాంకు సేవలు) గ్రామ స్థాయి మహిళల ద్వారా అందించడానికి పల్లె సమగ్ర సేవా కేంద్రాన్ని 2015, అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు.
ఐటీ క్లస్టర్
- రహేజా ఐటీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 110 ఎకరాల విస్తీర్ణం TSIICతో కలిసి మాదాపూర శేరిలింగంపల్లి మండలం (రంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేశారు.
వస్తుసేవల అంతర్జాలం (IOT- Internet of Things)
- వివిధ వస్తు సముదాయాల మధ్య అంతర్జాలం ఏర్పాటు ద్వారా సాఫ్ట్వేర్ ప్రోటోకాల్స్ ఉపయోగించి మానవజోక్యం లేకుండా నడిచే సమాచార వ్యవస్థనే వస్తుసేవల అంతర్జాలం అంటారు.
- వస్తువులు, పరికరాలను కలుపుతూ ఏర్పాటైన అంతర్జాలం ద్వారా మానవ జోక్యం లేకుండా దానంతటదే కమ్యూనికేషన్ నడవడం.
ఫార్మాసిటీ
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 12,500 ఎకరాల్లో ఔషధాల తయారీ, కాస్మోటిక్స్ తయారీ మొదలైన వాటికి సంబంధించి సకల సౌకర్యాలను కల్పిస్తారు. దేశంలో బల్క్ డ్రగ్స్ తయారీలో 1/3వ వంతు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.
- 960 కోట్లతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్
- దక్షిణకొరియాకు చెందిన ‘యాంగ్ వన్ కార్పొరేషన్’ రూ.960 కోట్లతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 1.75 డాలర్లు టర్నోవర్ కలిగిన ఈ సంస్థ ఏర్పాటుకు 300 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 12000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు.
- దీనిని వరంగల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2017, అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా జౌళి పార్కు పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దీని నినాదం: ‘కాటన్ టు క్లాత్, ఫాం టు ఫ్యాషన్’.
- రాష్ట్రంలో మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పరిశ్రమలు ఉండగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి తక్కువ పరిశ్రమలు ఉన్నాయి.
సామాజిక ఆర్థిక సర్వే 2021 పరిశ్రమ రంగం హైలైట్స్
- రాష్ట్రంలోని బయోటెక్ కంపెనీలు ప్రపంచంలో 1/3 వంతు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అత్యధికంగా 3,327 యూనిట్లు స్థాపించారు.
- టీఎస్ ఐ-పాస్ ద్వారా అత్యధికంగా థర్మల్‌పవర్ (29.7%) రియల్ఎస్టేట్, ఇండస్ట్రియల్పార్కు, ఐటీ భవనాల్లో 27.4% పెట్టుబడులు పెట్టడం జరిగింది.
- రంగారెడ్డి జిల్లా (34%), నల్లగొండ జిల్లా (18%)లో అత్యధికంగా ఫార్మా, కెమికల్ ఉత్పత్తులు జరుగుతాయి.
- టెక్స్టైల్, కాటన జిన్నింగ్‌లో రంగారెడ్డి (30%) మెదక్ (18%) ఉత్పత్తులు జరుగుతాయి.
- రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే అంశాల్లో ఔషధాలు అత్యధికంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఎగుమతుల్లో 1/3 వంతు కలిగి ఉంది.
- ఎగుమతులు సిద్ధంగా ఉన్న రాష్ర్టాల్లో జాతీయ స్థాయిలో రాష్ర్టానికి 6వ స్థానం, భూపరివేష్టిత రాష్ర్టాల్లో 2వ స్థానం కలిగి ఉంది.
- అమెరికా, చైనా, రష్యా దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేస్తున్నారు.
-జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Previous article
విత్త సంఘంలో చైర్మన్‌తోపాటు ఎంతమంది సభ్యులుంటారు?
Next article
Get ready to fly abroad
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?