అరబ్బీ క్యాలెండర్ మొదటి నెల పేరు ఏమిటి?
వాక్యాలను అమర్చుట
కింది ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న నాలుగు వాక్యాలతో కూడుకుంది. ప్రస్తుతం ఆ వాక్య నిర్మాణంలో అన్వయం, సమన్వయం లోపించింది. వాటిని శ్రద్ధగా చదివి లోపించిన సమన్వయాన్ని సరిచేసి రాస్తే ఒక క్రమబద్ధమైన పరిచ్ఛేదం అవుతుంది. మీ సమాధానాన్ని 1, 2, 3 లేదా 4 అని సమాధాన పత్రాల్లో గుర్తించండి.
1. a. చదవాలన్న కాంక్షతో BiPC తీసుకున్నది
b. అంజన SSC లో స్టేట్ టాపర్‌గా నిలిచింది
c. MBBSలో చేరింది
d. EMCETలో టాప్‌టెన్ ర్యాంకు సాధించింది
1. badc 2. abdc
3. cabd 4. dcab
2. a. గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానీషా
b. ఇతని కాలంలో భద్రాచలం తహసీల్దా రుగా కంచర్ల గోపన్న ఉండేవాడు
c. ఈయన శ్రీరామభక్తుడు
d. ప్రజల సొమ్ముతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు
1. bbca 2. acdb
3. cabd 4. abcd
3. a. కేంద్ర ప్రభుత్వం కదిలింది
b. అర్ధరాత్రి ‘తెలంగాణ’ ఇస్తున్నాం అనే ప్రకటన వచ్చింది
c. కేసీఆర్ దీక్ష చేపట్టిండు
d. తెలంగాణ సమాజం భావోద్వేగంలో మునిగిపోయింది
1. abcd 2. bcad
3. dcab 4. cdab
4. a. అయోధ్యకాండ b. కిష్కిందకాండ
c. అరణ్యకాండ d. బాలకాండ
1. badc 2. dacb
3. abcd 4. cabd
5. a. అతిథి దేవోభవ b. పితృదేవోభవ
c. మాతృదేవోభవ d. ఆచార్య దేవోభవ
1. cbcd 2. bacd
3. cbda 4. bcda
6. a. మొక్క b. పువ్వు
c. చెట్టు d. మకరందం
1. acbd 2. badc
3. cadb 4. bcda
7. a. ఉత్పత్తి ఖాతా b.లాభనష్టాల ఖాతా
c. ఆస్తి, అప్పుల పట్టి d. వర్తకపు ఖాతా
1. abcd 2. adbc
3. bacd 4. dabc
8. a. మెయిన్స్ పరీక్షలో గట్టెక్కాడు
b. సివిల్ సర్వీస్ పరీక్షల కోసం సిద్ధమయ్యాడు
c. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు
d. ప్రిలిమ్స్ పాసయ్యాడు
1. abcd 2. bdac
3. dabc 4. cabd
9. a. ప్రభుత్వ ఉఫాధ్యాయుడు కావాలనే కోరిక కలిగింది భరత్‌కి
b. ఉపాధ్యాయుడయ్యాడు
c. DSC అద్భుతంగా రాశాడు
d. టాప్ 2 లో అతని పేరుంది.
1. abdc 2. cadb
3. acdb 4. dabc
10. a. అమ్మకాలు విస్తృతమయ్యాయి
b. ఉత్పత్తి ప్రారంభమైంది
c. యజమాని ఉద్యోగులకు బోనస్ పంచాడు
d. సంస్థ లాభాల బాటలో పరుగెత్తుతోంది.
1. badc 2. dabc
3. cabd 4. abcd
11. a. పండ్లు b. విత్తనం
c. చెట్టు d. మొక్క
1. bdca 2. abcd
3. cabd 4. dcab
12. a. ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి
b. నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు
c. కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి
d. ఆశయం దిశగా ఆడుగేస్తుంది యువత
1. abcd 2. dbac
3. cdba 4. bacd
13. a. పల్లవి b. చరణం
c. పాట d. సాకి
1. abcd 2. dabc
3. cabd 4. dbac
14. a. రుత్విక్ ఆగష్టు 15న జెండా వందనం చేశాడు
b. విద్యా సంవత్సరం జూన్ 12 న ప్రారంభమైంది
c. సెప్టెంబర్ 9న రుత్విక్ తెలంగాణ భాషా దినోత్సవంలో పాల్గొన్నాడు
d. అక్టోబర్ 2న ‘లాల్‌బహదూర్’ శాస్త్రి జయంతి అని గుర్తించాడు
1. bacd 2. abcd
3. cabd 4. acdb
15. a. పంటలు ఎండిపోయాయి
b. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి
c. సకాలంలో వర్షాలు కురవలేదు
d. అప్పుల బాధలు ఎక్కువయ్యాయి
1. abcd 2. bcad
3. dcab 4. cadb
16. a. ఉన్నత చదువులు చదివారు కలాం
b. సామాన్య కుటుంబంలో జన్మించారు.
c. రాష్ట్రపతిగా సేవలందించారు.
d. శాస్త్రవేత్తగా ఎదిగి, కాంతి పుంజంలా వెలిగారు.
1. abcd 2.badc
3. dcba 4.cabd
17. a. సూర్యుడు ఉదయించాడు
b. చంద్రుని వెన్నెల కురుస్తోంది
c. మధ్యాహ్నభోజన సమయమైంది.
d. కలువలు విచ్చుకున్నాయి
1. acbd 2.bacd
3. cabd 4.dabc
18. a. విద్యార్థుల్లో మార్పులొచ్చాయి
b. తల్లిదండ్రులు సంతృప్తి చెందారు
c. ఉపాధ్యాయుడు విలువల పునాదులపై విద్యార్థుల వ్యక్తిత్వాన్ని నిర్మించాడు
d. ఉపాధ్యాయుడు వెలిగించిన దీపాలు
విద్యార్థులు
1. cadb 2. abcd
3. dabc 4. bdac
19. a. హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు
b. గాలిలో ఎగిరే బెలూన్‌లో ఈ వాయువును నింపుతారు
c. హెన్నీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త
d. ఈ వాయువుకు రంగులేదు
1. cadb 2. abcd
3. bcad 4. dabc
20. a. ఎంగిలిపూల బతుకమ్మ
b. అటుకుల బతుకమ్మ
c. ముద్దపప్పు బతుకమ్మ
d. అట్ల బతుకమ్మ
1. bdac 2. acbd
3. abcd 4. cdab
21. a. గ్రామం b. జిల్లా
c. మండలం d. రాష్ట్రం
1. acbd 2. dbac
3. abcd 4. dcab
22. a. దీనినే పీర్ల పండుగ అంటారు
b. ఈ నెలతో చంద్రుడు కనిపించిన ఐదవ రోజు నుంచి మొహర్రంపండుగ మొదలౌతుంది.
c. ఇస్లాం నూతన సంవత్సరం ఈ నెలతోనే మొదలవుతుంది
d. మొహర్రం అనేది అరబ్బీ క్యాలెండర్ మొదటి నెల పేరు
1. dcba 2. acbd
3. cadb 4. bacd
23. a. సింధూనది వల్ల ఈ దేశానికి పేరు వచ్చింది
b. భారతదేశాన్ని హిందూదేశం అని కూడా అంటారు
c. సింధూనది ఉపఖండానికి వాయవ్య భాగంలో ప్రవహిస్తూ ఉంది
d. భారత ఉపఖండంలో భారతదేశం అతిపెద్ద దేశం
1. abcd 2. dbac
3. dcab 4. abdc
24. a. దినపత్రిక b. మాసపత్రిక
c. వారపత్రిక d. పక్షపత్రిక
1. abcd 2. acdb
3. bcad 4. dabc
25. a. ముఖ్య అథితి వస్తున్నారు ఉత్కంఠ
b. కళాశాల వార్షికోత్సవం జరుగుతుంది
c. ముఖ్య అథితి విచ్చేస్తున్నారు-సందడి
d. ముఖ్య అథితి విచ్చేశారు-హంగామా
1. abcd 2. cabd
3. dabc 4. bacd
26. a. వీటిని అలలు లేదా తరంగాలు అంటారు
b. సముద్రంలో నీరు కదలకుండా ఎప్పుడూ ఉండదు
c. గాలి రాపిడి వల్ల సముద్రపు నీటి ఉపరితలంలో నీరు పైకి లేచి కిందికి పడుతుంది
d. ఈ విధంగా గాలి ప్రభావం వల్ల తరంగాలు ఒకటి తర్వాత మరొకటి లేచి క్రమంగా తీరాన్ని చేరుకుంటాయి
1. cabd 2. bacd
3. abcd 4. abdc
27. a. లగ్గం b. పూలు పండ్లు
c. సంతానం d. దాంపత్యం
1. badc 2. dacb
3. dabc 4. abcd
28. a. జంతువుల పట్ల దయతో ఉంటాను
b. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను
c. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను
d. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
1. dabc 2. bacd
3. cabd 4. dbac
29. a. శిల్పం b. కళాకౌశలం
c. శిల d. శిల్పి
1. abdc 2. abcd
3. cdba 4. dcba
30. a. మేనక వచ్చి వయ్యారంగా నాట్యం చేసింది
b. విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు దీక్షలో ఉన్నాడు
c. మేనక మత్తులో పడిపోయాడు విశ్వామిత్రుడు
d. తపస్సు భంగమైంది
1. abcd 2. dcab
3. acdb 4. badc
31. a. దండనాయకుడిగా నియమించబడ్డాడు బసవన్న
b. బిజ్జలుడి కొలువులో
c. బసవన్న గొప్ప శివభక్తుడు
d. దానగుణ సంపన్నుడు బసవన్న
1. abdc 2. abcd
3. cdba 4. cabd
32. a. మానవ జీవనమంతా నదీ పరీవాహకాల్లో విస్తరించింది.
b. జలధారలు ప్రాణికోటికి జీవనాధారాలు
c. చినుకులు కాలువలయ్యాయి
d. కాలువలు నదులుగా మారి మానవుడి అవసరాలను తీరుస్తున్నాయి
1. badc 2. abcd
3. bacd 4. cabc
33. a. మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలున్ని నేనే
b. చిన్నప్పటి నుంచి ఆకాశ రహస్యాలంటే చాలా ఇష్టం
c. ఆకాశంలో తిరగాలన్న ఆశ ఆశయంగా మారింది
d. ఆ నేర్పు యుద్ధ విమానం కనిపెట్టేలా చేసింది
1. abcd 2. dabc
3. badc 4. bacd
34. a. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు.
b. మల్బరీతో పాటు టస్సర్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు
c. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తారు.
d. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా (ఓక్) చెట్లపైన పెరుగుతాయి
1. dacb 2. bacd
3. acbd 4. bdac
35. a. ఉన్ని అథమ ఉష్ణవాహకం
b. మన శరీరం లోపలి వేడిని బయటికి పోకుండా కాపాడుతుంది
c. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది
d. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది
1. bcad 2. abcd
3. acbd 4. cbad
36. a. పాడిపంటలు పొంగిపొరలే – దారిలో నీవు పాటు పడవోయ్
b. మన శరీరంలోపలి వేడిని బయటికి పోకుండా కాపాడుతుంది
c. ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంటుంది
d. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది
1. bcad 2. abcd
3. acbd 4. cbad
37. a. కులము కన్న మిగుల గుణము ప్రధానంబు
b. విశ్వదాభిరామ వినురవేమ
c. మాటకన్న నెంచ మనస్సు దృఢము
d. పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
1. abcd 2. dcab
3. dabc 4. cabd
38. a. మానవునికి ఉపకారం చేసే సూక్ష్మజీవుల్లో ఒక రకమైన శిలీంధ్రాలలో పెనిసిల్లియమ్ ఒకటి
b. సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నవైనప్పటికీ మానవ జాతి విషయంలో వాటి ప్రాముఖ్యత ఎంతో ఉంది
c. దీని నుంచే పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ తయారు చేస్తారు
d. ఈ సూక్ష్మజీవుల్లో మానవ జాతికి
ఉపకారం చేసేవి అపకారం చేసేవి కూడా
ఉంటాయి
1. abcd 2. dbac
3. abdc 4. dbac
39. a. పంట కోతకు సిద్ధమైంది
b. పైరు ఏపుగా పెరిగింది
c. వర్షం సకాలంలో సరిపడినంత కురిసింది
d. రైతు పొలం దున్ని విత్తనాలు చల్లాడు
1. abdc 2. dcab
3. bacd 4. cdab
40. a. రాజుకు ‘పుస్తక’ ప్రచురణ సంస్థను స్థాపించాలన్న ఆలోచన వచ్చింది
b. ‘ప్రచురణలు’ విస్తృతంగా అమ్ముడు పోతున్నాయి
c. రచయితల బృందాన్ని సమకూర్చుకున్నాడు
d. కోటి రూపాయల పెట్టుబడితో సంస్థను
స్థాపించాడు.
1. abdc 2. dcba
3. cabd 4. adcb
సమాధానాలుః
1-1 2-4 3-4 4-2 5-3 6-1 7-2 8-2 9-3 10-1 11-1 12-4 13-2 14-1 15-4 16-2 17-1 18-1 19-1 20-2 21-1 22-1 23-2 24-2 25-4 26-2 27-1 28-2 29-3 30-4 31-3 32-3 33-4 34-4 35-3 36-2
37-4 38-4 39-2 40-4
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?