భౌగోళిక సమాచార వ్యవస్థలో ప్రధాన భాగాలు ? పోటీ పరీక్షల ప్రత్యేకం
రిమోట్ సెన్సింగ్ & జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా
1. భారతదేశంలో కింది వాటిలో విపత్తు నిర్వహణలో ఉపయోగించే శాస్త్రసాంకేతికతకు నోడల్ ఏజెన్సీగా ఏది వ్యవహరిస్తుంది?
1) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్స్
2) ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్
3) పై రెండూ సరైనవే 4) ఏదీకాదు
2. మొదటిసారిగా దేశంలోనే విపత్తు నిర్వహణ ఇన్ఫో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) అసోం
3) ఉత్తరాఖండ్ 4) పై మూడూ
3. జాతీయ వ్యవసాయ క్షామ అసెస్మెంట్, నిర్వహణా వ్యవస్థలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) నాసా 2) ఇస్రో
3) యూఎన్ఓ 4) ఏదీకాదు
4. కింది వాటిలో వేటి కలయికతో ‘జియో ఇన్ఫర్మేటిక్స్’ విపత్తుల నిర్వహణలో కీలకపాత్ర నిర్వహిస్తుంది?
ఎ. రిమోట్ సెన్సింగ్
బి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం
సి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం
డి. ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీసులు
1) ఎ 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
5. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే సంస్థకు సంబంధించి సరైనది?
1) ఎప్పటికప్పుడు సముద్రంలోని ఉష్ణోగ్రతను, అలల తాకిడిని పసిగడుతూ సమాచారాన్ని న్యూఢిల్లీలోని ‘సెంటర్ రిసీవింగ్ స్టేషన్’కు చేరవేస్తుంది
2) ఆధునిక పరికరాలతో ఇది రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థగా ఉంది
3) ఇది రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తుంది
4) పైవన్నీ సరైనవే
6. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు దేనికి దారితీస్తాయి.
1) విపత్తు నిర్వహణకు మార్గాలు
2) దేశ పేరును ప్రచారం చేస్తాయి
3) ఆర్థిక భారాన్ని సృష్టిస్తాయి
4) ఏదీ కాదు
7. భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి?
1) 1988 2) 1989
3) 1980 4) 1985
8. కింది వాటిలో థర్మల్ సెన్సార్లకు సంబంధించి సరైనది?
1) థర్మల్ సెన్సార్లు కాంతి తరంగ దైర్ఘ్యాలను నమోదు చేయవు
2) ఇవి వస్తువుల నుంచి వచ్చే ఉష్ణాన్ని నమోదు చేస్తాయి
3) వీటిని పగటి సమయంలోను, రాత్రి సమయంలోను ఉపయోగించుకోవచ్చు
4) పైవన్నీ
9. కింది వాటిలో ‘రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల’ ద్వారా ఎటువంటి కార్యక్రమాలను తెలుసుకోవచ్చు
ఎ. సహజ వనరుల అన్వేషణ, నిర్వహణ, అంచనా
బి. పర్యవేక్షణ, నేరస్తుల కదలికలు
సి. మెరుగైన రవాణా వ్యవస్థ అభివృద్ధి, ఉపరితల దృశ్యాల చిత్రీకరణ
డి. దేశ సరిహద్దు ప్రాంతాల్లో, శత్రు దేశాల సైనికుల కదలికలు
ఇ. దేశ భద్రతా వ్యవస్థపై నిఘా వంటి కార్యక్రమాలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి, ఇ,
3) ఎ, బి, సి, డి, ఇ 4) ఎ, డి
10. 1949లో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) హొనాలులు (అమెరికా)
2) కోబ్ (జపాన్)
3) బ్యాంకాక్ (థాయిల్యాండ్)
4) జెనీవా (స్విట్జర్లాండ్)
11. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఉపగ్రహంలో కెమెరాలు రికార్డు చేయగలిగే తరంగ దైర్ఘ్యాలను రేడియేషన్ ‘విండోస్’ అని అంటారు
బి. ప్రతి నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాలను నమోదు చేసే పరికరాన్ని ‘సెన్సార్’లు అంటారు
సి. సెన్సార్ల రిజల్యూషన్ సామర్థ్యం అంటే రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచి స్పష్టంగా చూడగలిగే శక్తి
1) ఎ 2) బి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
12. ఏ ప్రాంతీయ కేంద్రాల ద్వారా రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని దేశమంతటా ప్రసారం చేస్తుంది?
1) బెంగళూరు, డెహ్రాడూన్
2) జోధ్‌పూర్, కోల్‌కతా
3) నాగ్‌పూర్ 4) పైవన్నీ
13. కింది వాటిలో సరైనది ఏది?
1) రాబోయే భూకంపాల పరిమాణాన్ని అంచనా వేయడానికి న్యూమరికల్ నమూనాలతో భ్రంశ స్థానచలన రేట్ల పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు
2) వరద ప్రణాళిక మ్యాపింగ్ లైడార్ అందించే ఇమేజ్‌లు బాగా సహకరిస్తాయి
3) విపత్తు అనంతరం జరిగే నష్టాలను అంచనా వేయడానికి ఇకోనాస్ పంపించే ఆప్టికల్ ఇమేజ్‌లు ఉపయోగపడతాయి
4) పైవన్నీ
14. విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ వల్ల ప్రయోజనాలు ?
1) విపత్తుల దుర్బలత్వ ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాలవ్యవధిలో చిత్రీకరిస్తుంది
2) భూకంప ప్రదేశాలు, వరద ప్రభావిత ప్రాంత పటాలను అందిస్తుంది
3) విపత్తులకు గురయ్యే ప్రదేశాల్లో ముందు జాగ్రత్త చర్యలు, ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి, తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది 4) పైవన్నీ
15. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) కేబినెట్ సెక్రటరీ 2) ప్రధాన మంత్రి
3) రక్షణ శాఖ మంత్రి 4) ఉపరాష్ట్రపతి
16. సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ ఉపగ్రహాలు వృత్తాకార ధృవకక్ష్యలో ఉత్తరం నుంచి దక్షిణం దిశలో భూమికి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తాయి?
1) 500 కి.మీ. నుంచి 1500 కి.మీ. వరకు
2) 600 కి.మీ. నుంచి 1600 కి.మీ. వరకు
3) 400 కి.మీ. నుంచి 1400 కి.మీ. వరకు
4) 650 కి.మీ. నుంచి 1600 కి.మీ. వరకు
17. భూమధ్యరేఖ చుట్టూ భూమికి 36,000 కి.మీ. ఎత్తులో ఉన్న స్థిర వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను ఏమంటారు?
1) జియో సింక్రోనస్ ఉపగ్రహాలు
2) లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు
3) సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ ఉపగ్రహాలు
4) ఏదీకాదు
18. రాష్ట్ర స్థాయిలో విపత్తుల నిర్వహణ బాధ్యతలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) మంత్రి మండలి 2) గవర్నర్
3) చీఫ్ సెక్రటరీ
4) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ
19. కింది వాటిలో సరైనది?
1) వాతావరణంలో వివిధ రసాయనాల గాఢతను అంచనా వేయడానికి ‘లైడార్’ను వినియోగిస్తారు
2) వస్తువుల ఎత్తును, నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ‘ఎయిర్ బోర్న్ లైడార్’ను ఉపయోగిస్తారు
3) ‘డాప్లర్ రాడార్’ ద్వారా వేగ పరిమితులు, గాలి వేగం వాతావరణ వ్యవస్థలో గాలి దిశ, వర్షపాతం, దాని తీవ్రతను అంచనా వేస్తారు
4) పైవన్నీ
20. కింది వాటిలో రేడియో మెట్రిక్ రిజల్యూషన్‌కు సంబంధించి సరైనది గుర్తించండి
1) ఒక రేడియేషన్ విభిన్న తీవ్రతల సంఖ్య మధ్య వ్యత్యాసాన్ని సెన్సార్ స్పష్టంగా గుర్తించగలుగుతారు
2) గ్రే స్కేల్లోని 256 స్థాయిల నుంచి రంగు (వర్ణం) 16384 ఇంటెన్సిటస్ లేదా షెడ్ల వరకు ఇది ప్రతి బ్యాండ్‌లో 8 నుంచి 14 బిట్ల మధ్య ఉంటుంది
3) ఇది ఇన్స్ట్రుమెంట్ నాయిస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది 4) పైవన్నీ
21. మొట్టమొదటిసారి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉపయోగించేది కింది వాటిలో ఏది?
1) టెంపోరల్ రిజల్యూషన్
2) రేడియో మెట్రిక్ రిజల్యూషన్
3) స్పాటియల్ రిజల్యూషన్
4) స్పెక్టల్ రిజల్యూషన్
22. జియోరిఫరెన్సింగ్లో వాడే పద్ధతులు ఏవి?
1) రేడియోమెట్రిక్ కరెక్షన్
2) టోపోగ్రాఫిక్ కరెక్షన్
3) ఆటోస్ఫియరిక్ కరెక్షన్
4) పైవన్నీ
23. కింది వాటిని జతపరచండి
1. దోషాలను, అవరోధాలను సరిచేస్తుంది ఎ. రేడియో మెట్రిక్ కరెక్షన్
2. టెరైన్ కరెక్షన్ అని కూడా అంటారు బి. టోపోగ్రాఫిక్ కరెక్షన్
3. వాతావరణంలో పొగ మంచును తొలగిస్తుంది
సి. ఆటోస్ఫియరిక్ కరెక్షన్
4. వర్షపాతం, దాని తీవ్రతను అంచనా వేస్తారు
డి. డాప్లర్ రాడార్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
24. విపత్తు అంటే ?
1) సహజమైన ప్రకృతి వైపరీత్యం
2) మానవ ఉత్పాదకం
3) 1, 2 4) 1, 2 సరైనవి కావు
25. కింది వాటిలో సరైనది?
1) ఆప్టికల్ సెన్సార్లు దృశ్యకాంతులను, పరారుణ కిరణాలను పరిశీలిస్తాయి
2) 1983లో ప్రయోగించిన రోహిణి RS-D2 ఉపగ్రహంలో స్మార్ట్ సెన్సార్లను ఉపయోగిస్తారు
3) నిష్క్రియాత్మక విధానంలో ఉపయోగించే సెన్సార్లు సూర్యకాంతిని మాత్రమే పరావర్తనం చెందించగలుగుతాయి
4) పైవన్నీ
26. ఏ విధానంలో ఉపయోగించే సెన్సార్లకు స్వతహాగా కాంతిని వెదజల్లే సామర్థ్యం ఉంటుంది?
1) సక్రియాత్మక విధానం
2) నిష్క్రియాత్మక విధానం
3) పైరెండూ 4) స్మార్టు సెన్సార్లు
27. ఉపగ్రహ మైక్రోవేవ్ రేడియో మీటర్ వేటికి సంబంధించిన డేటాను అందించగలవు
1) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత
2) సముద్ర గాలులు
3) వాతావరణంలో తేమ శాతం
4) పైవన్నీ
28. భూకంపాలను ముందుగా పసికట్టడానికి భూగర్భ జలంలో ఏ వాయువులు ఉపయోగపడతాయి
1) హీలియం 2) రేడాన్
3) CO2, హైడ్రోజన్ సల్ఫైడ్లు
4) పై మూడూ సరైనవే
29. కింది వాటిని జతపరచండి
1. ఒక ప్రదేశపు సమాచారాన్ని ఫొటోల ద్వారా పొందడం ఎ. ఇమేజ్ స్కానర్
2. ఒక ప్రదేశపు సమాచారాన్ని సంఖ్యల రూపంలో పొందవచ్చు బి. నాన్ ఇమేజ్ స్కానర్
3. ఒక ప్రదేశపు ఫొటోను దాని పొడవు వెంబడి తీయవచ్చు సి. లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి
30. కింది వాటిలో ప్యాంక్రోమ్యాటిక్ కెమెరాస్కు సంబంధించి సరైనది
1) ఒక ప్రదేశపు ఫొటోను వివిధ రంగుల్లో చిత్రీకరిస్తాయి
2) IRIS-IC, IRIS-ID ఉపగ్రహాల్లో దీనిని పే లోడ్‌గా ఉపయోగించడం జరిగింది
3) ఇది 5.8 మీటర్ల అత్యధిక రిజల్యూషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
4) పైవన్నీ
31. కింది వాటిలో సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ ఉపగ్రహాలకు సంబంధించి సరికానిది?
1) ఉత్తరం నుంచి దక్షిణానికి పరిభ్రమించే ప్రతిసారి ఈ ఉపగ్రహం భూమిని నిరంతరం వీక్షిస్తూ ఉంటుంది.
2) భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలన్నీ ఈ కోవకు చెందినవే
3) ఇన్శాట్ ఉపగ్రహాలన్నీ ఈ కోవకు చెందిననవే
4) ఈ తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఉపయోగిస్తారు
32. భౌగోళిక సమాచార వ్యవస్థలో ప్రధాన భాగాలు ?
ఎ. విపత్తు ప్రభావిత పటాలను తయారు చేసుకోవచ్చు
బి. సమాచారాన్ని సమగ్రంగా పరిష్కరించుకోవచ్చు
సి. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు
డి. వ్యక్తులకు, సంస్థలకు, విద్యాలయాలకు, ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగకరం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
33. భౌగోళిక సమాచార వ్యవస్థలో ప్రధాన భాగాలు ఏవి?
ఎ. హార్డ్ వేర్ బి. సాఫ్ట్ వేర్
సి. దత్తాంశం డి. ప్రజలు
ఇ. పద్ధతులు
1) ఎ, బి, సి 2) సి, డి, ఇ
3) ఎ, బి, సి, డి, ఇ 4) ఎ, బి, సి, డి
34. మన దేశానికి చెందిన ఇన్శాట్ ఉపగ్రహాలు కింది ఏ ఉపగ్రహ వర్గానికి చెందినవి?
1) లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు
2) సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ ఉపగ్రహాలు
3) జియో సింక్రోనస్ ఉపగ్రహాలు
4) ఏదీకాదు
35. భౌగోళిక సమాచార వ్యవస్థలో దత్తాంశం ఏ రూపంలో ఉంటుంది?
1) సంఖ్యల రూపంలో
2) వాక్యాల రూపంలో
3) పటాలు, బొమ్మల రూపంలో
4) పైవన్నీ
36. భౌగోళిక సమాచార వ్యవస్థ ప్రధానంగా భౌగోళిక నమూనాలతో పని చేస్తుంది?
1) వెక్టార్ నమూనా 2) రాస్టార్ నమూనా
3) పైరెండూ 4) ఏదీకాదు
37. కింది వాటిలో సరైనది?
1) వెక్టార్ నమూనాలో సమాచారం బిందువుల రూపంలో, రేఖల రూపంలో, బభుజి రూపంలో నిల్వచేస్తారు
2) రాస్టార్ నమూనాలో సమాచారం అనేది వివిధ పిక్సెల్స్ రూపంలో ఉంటుంది
3) పిక్సెల్స్ వివిధ అడ్డు వరుసల్లోను, నిలువు వరుసల్లోను అమరుస్తారు
4) పైవన్నీ
38. జీఐఎస్‌లో ఏ అంశాలుంటాయి?
ఎ. ఇన్పుట్ బి. డేటా బేస్
సి. అనాలసిస్ డి. ఔట్పుట్
1) ఎ, బి 2) ఎ, సి
3) సి, డి 4) పైవన్నీ
సమాధానాలు
1.1 2.1 3.2 4.3 5.4 6.3 7.1 8.4 9.3 10. 1 11.3 12.4 13.4 14.4 15.1 16.1
17. 1 18.3 19.4 20.4 21.1 22.4 23.1 24.3 25. 4 26.1 27.4 28.4
29.1 30.4 31.3 32.3 33.3 34.3 35.4 36.3 37.4 38.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట,
హైదరాబాద్
- Tags
- desaster
- GIS
- remote sensing
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు