‘తమాషా’ జానపద నాటక రూపం ఏ రాష్ట్రానికి చెందినది?
భారతదేశ సంస్కృతి కళలు-2
63. కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) మధ్యప్రదేశ్లోని భీంబెట్కా గుహ చిత్రాలు అతి ప్రాచీనాలు
2) భారతీయ కుడ్య చిత్ర రచన 2వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు కొనసాగింది
3) తూర్పు భారతదేశంలో బౌద్ధం, పశ్చిమంలో జైనం ప్రధాన చిత్రకళా వస్తువులు
4) అక్బర్ వివిధ చిత్రకారులను రప్పించి, చిత్రకారుల రాజుగా ప్రసిద్ధిచెందారు
64. సరికాని జతను గుర్తించండి
1) అజంతా – కుడ్య చిత్రాలు
2) పెట్రోగ్లిఫ్స్- చరిత్ర పూర్వయుగ చిత్రాలు
3) మొగలాయిలు – తాళపత్ర చిత్రకళ
4) జహంగీర్ – చిత్రకారుల రాజు
65. ‘స్థపతి’ అంటే –
1) వాస్తు పురుషుడు 2) ప్రధాన శిల్పి
3) శిల్ప గురువు 4) దేవాలయ నిర్మాత
66. దేవాలయ శిల్ప శాస్త్రం ఏ శాస్త్రంతో ప్రభావితమైంది ?
1) ఆగమ శాస్త్రం 2) మంత్ర శాస్త్రం
3) నాట్య శాస్త్రం 4) అర్థశాస్త్రం
67. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రత్యేక శిల్పకళా సంప్రదాయం ?
1) గాంధార 2) శాతవాహన
3) అమరావతి 4) పాలరాయి
68. జతపరచండి
1. స్థపతి ఎ. వడ్రంగి
2. సూత్రగ్రాహి బి. పథక నిర్మాణ నిపుణుడు
3. తక్షకుడు సి.ప్రధాన పర్యవేక్షకుడు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-బి, 2-ఎ, 3-సి
69. ‘నాట్యశాస్త్రం’ రచించినది?
1) నందికేశ్వరుడు 2) పతంజలి
3) భరతముని 4) నటరాజ రామకృష్ణ
70. దక్షిణ భారత నాట్యరీతి కానిది?
1) కూచిపూడి 2) మోహినీ అట్టం
3) మణిపురి 4) పేరిణి
71. జతపరచండి
1. కూచిపూడి ఎ. ఆంధ్రప్రదేశ్
2. కథక్ బి. ఉత్తర భారతదేశం
3. కథాకళి సి. కేరళ
4. పేరిణి డి. తెలంగాణ
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
72. సిద్ధేంద్ర యోగి ఏ నాట్యాన్ని పరిపుష్టం చేశారు?
1) భరతనాట్యం 2) పేరిణి
3) కూచిపూడి 4) పైవన్నీ
73. ‘కలాపం’ ఏ నాట్యానికి చెందిన ప్రక్రియ?
1) భరతనాట్యం 2) కథక్
3) కూచిపూడి 4) పేరిణి
74. సరిగా జతపరచని దానిని గుర్తించండి?
1) వెంపటి చిన సత్యం- కూచిపూడి
2) రుక్మిణీదేవి అరండేల్- భరతనాట్యం
3) బిర్జూ మహరాజ్- కథాకళి
4) కేలూచరణ్ మహాపాత్ర- ఒడిస్సీ
75. సరిగా జతపరచని దానిని గుర్తించండి
1) భరతనాట్యం- తమిళనాడు
2) కూచిపూడి- ఆంధ్రప్రదేశ్
3) కథక్-కేరళ
4) పేరిణి- తెలంగాణ
76. శరీర భాగాలను సూక్ష్మంగా కదిలిస్తూ చేసే నృత్యం ఏ సాంప్రదాయపు ప్రత్యేకత?
1) మోహినీ అట్టం 2) కథాకళి
3) కథక్ 4) కూచిపూడి
77. కింది వాటిలో జగన్మోహిని నృత్యం ప్రధానాంశంగా ఉన్నది?
1) భరతనాట్యం 2) మోహినీ అట్టం
3) కూచిపూడి 4) మణిపురి
78. కింది వాటిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి
1) మణిపురి- భక్తిభావం
2) పేరిణి- వీర రసం
3) కథాకళి- సూక్ష్మమైన శారీరక విన్యాసం
4) భరతనాట్యం- పురుషాభినయ ప్రధానం
79. ఆపాతమధురమైన కళ
1) నాట్యం 2) కవిత్వం
3) సంగీతం 4) చిత్రలేఖనం
80. సంగీత ప్రధాన వేదం?
1) రుగ్వేదం 2) యజుర్వేదం
3) సామవేదం 4) అధర్వణవేదం
82. హిందూస్థానీ సంగీతంలో ప్రస్తుత ‘థాట్’ పద్ధతిని ప్రవేశపెట్టింది?
1) విష్ణు నారాయణ్ భాత్కుండే
2) పండిట్ జస్రాజ్
3) తాన్సేన్ 4) అమీర్ ఖుస్రూ
83. కర్నాటక సంగీతంలో ‘మేళకర్త’ రాగ భావన ప్రారంభించింది?
1) విద్యారణ్య స్వామి 2) వేంకట మఖి
3) గోవింద దీక్షితులు 4) పురందరదాసు
84. కర్నాటక సంగీతానికి ఆద్యుడు?
1) త్యాగరాజు
2) ముత్తుస్వామి దీక్షితార్
3) అన్నమయ్య 4) పురందరదాసు
85. పద్యం, గద్యం కలిసిన కావ్యం
1) ప్రబంధం 2) మహాకావ్యం
3) ఖండకావ్యం 4) చంపూ కావ్యం
86. కవిత్వ రచనలో ఏ రచనను అత్యున్నతమైనదిగా భావిస్తారు?
1) నాటక రచన 2) మహాకావ్య రచన
3) గేయ రచన 4) జానపద రచన
87. నౌటంకీ, కుమవన్, థాలీ అనే జానపద నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) బీహార్
88. కింది సంగీత వాయిద్యాలను వాటికి సంబంధించిన ప్రఖ్యాత వాయిద్యకారులతో జతపరచండి.
సంగీత వాయిద్యాలు వాయిద్యకారులు
ఎ. సంతూర్ 1. పండిట్ రవిశంకర్
బి. వయోలిన్ 2. గోపాలకృష్ణ
సి. మృదంగం 3. పాల్ఘాట్ మణి
డి. షెహనాయ్ 4. బిస్మిల్లాఖాన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
89. 2020 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను పొందిన ప్రదేశం?
1) రామప్ప ఆలయం 2) చంద్రగిరి కోట
3) శ్రీకాళహస్తి ఆలయం 4) చార్మినార్
90. గుజరాత్లోని రాణీ-కీ-వావ్ అనే కట్టడాన్ని ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తించింది?
1) 2014 2) 2015
3) 2016 4) 2017
91. భారతదేశపు జాతీయ స్వీట్ ఏది?
1) కలాఖండ్ 2) మైసూర్ పాక్
3) జిలేబీ 4) రసగుల్ల
92. వైశాఖి పండుగను చేసుకునే రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) బీహార్ 4) పంజాబ్
93. కింది వాటిలో లిటిల్ అండమాన్లో నివసించే గిరిజన జాతి?
1) సెంటినెలీ 2) షాంపెన్
3) బంగె 4) పైవన్నీ
94. దేశంలో వేణువు వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు ?
1) పండిట్ హరిప్రసాద్ రాసియా
2) టి.ఆర్. మహాలింగం
3) పన్నాలాల్ ఘోష్
4) పైవారందరూ
95. కింది వారిలో హరికథా పితామడిగా ప్రఖ్యాతి చెందిన వారు?
1) ఆదిభట్ల నారాయణదాసు
2) ధర్మవరపు కృష్ణమాచార్యులు
3) గిరీష్ చంద్ర ఘోష్
4) రామదాసు పంతులు
96. కింది వారిలో జయదేవుడు రచించిన ‘గీత గోవిందం’ ఆధారంగా ప్రదర్శించే నృత్యం?
1) మణిఫురి 2) కథక్
3) మోహినీ అట్టం 4) ఒడిస్సీ
97. భారతరత్న భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందిన వారు?
1) హిందూస్థానీ సంగీతం
2) కర్ణాటక సంగీతం 3) భరతనాట్యం
4) తబలా వాయిద్యం
98. కింది వాటిలో వెదురు నృత్యంగా ప్రసిద్ధి చెందింది?
1) ఓట్టం థుల్లాల్ 2) కలివి పానట్టం
3) చిరా 4) యక్షగానం
99. విశాఖ మన్యంలో పేరొందిన గిరిజన నృత్యం ?
1) జతాతిన్ 2) థింసా
3) కోలాటం 4) ఝూమ్
100. తెలుగు క్యాలెండర్లో మొదటి నెల?
1) చైత్రం 2) జ్యేష్టం
3) శ్రావణం 4) భాద్రపదం
101. గుడిపడ్వా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?
1) పశ్చిమ బెంగాల్ 2) పంజాబ్
3) గుజరాత్ 4) మహారాష్ట్ర
102. పేరిణి నాట్యాన్ని పునరుద్ధరించి, అభివృద్ధిపరిచిన వారు?
1) నటరాజ రామకృష్ణ
2) వెంపటి చినసత్యం
3) వేదాంతం సత్యనారాయణ
4) సిద్ధేంద్ర యోగి
103. యక్షగానం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం?
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) కేరళ 4) కర్ణాటక
104. యునెస్కో గుర్తించిన ‘మహాబోధి ఆలయ ప్రాంగణం’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) హర్యానా
3) బీహార్ 4) ఢిల్లీ
105. ఖజురహో (నృత్య పండుగ), పుష్కర్ ఉత్సవం, తీజ్ పండుగలను చేసే రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) బీహార్
3) పశ్చిమబెంగాల్ 4) గోవా
106. సింహం భారతదేశపు జాతీయ జంతువుగా ఏ సంవత్సరం గుర్తించారు?
1) 1972 2) 1982
3) 1992 4) 2010
107. అసోం రాష్ట్రంలో నివసించే ప్రముఖ గిరిజన జాతి?
1) గారోలు, కర్బీలు 2) మిక్రీ, బోడోలు
3) చుటియాలు, అబోర్లు 4) పైవారందరూ
108. అల్లారఖాఖాన్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు?
1) తబలా 2) సితార్
3) మృదంగం 4) వీణ
109. బెంగాలీ నాటక రంగంలో ప్రముఖ పాత్ర వహించి ప్రసిద్ధిచెందినవారు?
1) యోగీంద్ర చంద్రగుప్త 2) తారాచరణ్
3) రామనారాయణ్ తర్కరత్న
4) దీనబంధు మిత్ర
110. ‘స్పియర్ డాన్స్’ అనే ప్రసిద్ధ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?
1) నాగాలాండ్ 2) మిజోరాం
3) మణిపూర్ 4) ఒడిశా
111. ‘పేదవాని కథాకళి’గా ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యం?
1) గౌడియా నృత్యం 2) కుడియాట్టం
3) చకియార్ కోతు 4) ఓట్టం థుల్లాల్
112. వేటి సమ్మేళనాన్ని భరతనాట్యం అంటారు?
1) భావం 2) రాగం
3) తాళం 4) పైవన్నీ
113. తమిళనాడులో ఉన్న యునెస్కో గుర్తించిన ప్రపంచ సాంస్కృతిక స్థలం ?
1) బృహదీశ్వరాలయం
2) నీలగిరి మౌంటెన్ రైల్వే
3) మహాబలిపురం కట్టడాలు 4) పైవన్నీ
114. ‘గంగౌర్’ అనే పండుగను ప్రముఖంగా చేసే రాష్ట్రం ?
1) రాజస్థాన్ 2) బీహార్
3) మణిపూర్ 4) ఒడిశా
115. దేశపు జాతీయ కూరగాయగా గుర్తింపు పొందింది?
1) బంగాళదుంప 2) తీపి గుమ్మడికాయ
3) వంకాయ 4) మణిపూర్ దోసకాయ
116. రుక్మిణీదేవి అరుండేల్ ఏ రంగంలో సుప్రసిద్ధులు?
1) నాదస్వరం 2) మోహినీ అట్టం
3) భరతనాట్యం 4) వీణ
117. తమిళనాడులో నివసించే ప్రముఖ గిరిజన తెగ ?
1) కోటాలు 2) బుడగలు
3) ఇరుళలు 4) పైవారందరూ
118. ‘పథర్ కట్టి’ అనే రాతి కళకు ఏ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రసిద్ధమైన ఆలయాలకు ఉదాహరణగా ఉన్నాయి?
1) ఒడిశా 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) గోవా
119. నాట్యం, గానం, హాస్యంతో కూడిన జానపద నాటక రూపమైన ‘భావై’ అనే జానపద నాటకం ఏ రాష్ట్రానికి చెందినది?
1) రాజస్థాన్ 2) హర్యానా
3) గుజరాత్ 4) మధ్యప్రదేశ్
120. దేశంలో అత్యంత ప్రాచీనమైన హస్తకళా రూపం ‘ఢోక్రా’ వస్తువుల తయారీ ఆరంభమైన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్ 2) మధ్యప్రదేశ్
3) సిక్కిం 4) బీహార్
121. కళలు, పురాతత్వ శాస్త్రం, మానవ శాస్త్రం, ప్రాచీన పత్రాలు, మ్యూజియాలను, నిర్వహిస్తున్న సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడం, వివిధ సంస్థల కార్యక్రమాలకు మార్గనిర్దేశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘జాతీయ సాంస్కృతిక మండలి’ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1954 2) 1974
3) 1981 4) 1983
122. దేశంలో వయోలిన్ వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ?
1) గోపాలకృష్ణన్ 2) సుబ్రహ్మణ్యం
3) కన్నక్కుడి వైద్యనాథన్
4) పైవారందరూ
123. దేశంలో పార్శీలు చేసే పండుగ ?
1) జంషెడ్-ఇ-నౌరోజ్ 2) కొర్దార్ సాల్
3) ఏపేటి 4) పైవన్నీ
124. ‘తమాషా’ అనే ఆసక్తికరమైన జానపద నాటక రూపం కింది ఏ రాష్ట్రానికి చెందినది?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక 4) గుజరాత్
125. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గిరిజన జాతిని గుర్తించండి
1) మీనాలు 2) భిల్లులు
3) గుజ్జర్లు 4) పైవారందరూ
126. జాతీయ సరీసృపం?
1) రాచనాగు 2) పైథాన్
3) శ్వేతనాగు 4) నల్లతాచు
127. సిక్కిం రాష్ట్రంలో కాంచనజంగ నేషనల్ పార్కు ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక స్థలంగా గుర్తించింది?
1) 2016 2) 2017
3) 2018 4) 2019
128. కేలు చరణ్ మహాపాత్ర ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందారు?
1) కథాకళి 2) మణిపురి
3) కథక్ 4) ఒడిస్సీ
జవాబులు
63.4 64.3 65.2 66.1 67.3 68.1 69.3 70.3 71.3 72.3 73.3 74.3 75.3 76.2 77.2 78.4 79.3 80.3 81.1 82.1
83.1 84.4 85.4 86.1 87.1 88.1 89.1 90.1 91.3 92.4 93.4 94.4 95.1 96.4 97.1 98.3 99.2 100.1 101.4 102.1
103.4 104.3 105.1 106.1 107.4 108.1 109.4 110.1 111.4 112.4 113.4 114.1 115.2 116.3 117.4 118.1
119.3 120.2 121.4 122.4 123.4 124.1 125.4 126.1 127.1 128.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?