హిందూ న్యాయశాస్త్ర సంహితను క్రోడీకరించినది ఎవరు? (భారతదేశ చరిత్ర)
గవర్నర్ జనరల్స్
1. బెంగాల్లో ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టింది ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్ 2) రాబర్ట్ క్లైవ్
3) వెల్లస్లీ 4) కారన్ వాలిస్
2. గవర్నర్ జనరల్ పేరును వైశ్రాయ్‌గా ఎప్పుడు మార్చారు?
1) 1858 2) 1885
3) 1905 4) 1917
4. జతపర్చండి?
1. ఫోర్ట్ విలియమ్ మొదటి గవర్నర్ జనరల్ ఎ. లార్డ్ మెకాలే
2. సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి బి. లార్డ్ కానింగ్
3. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొదటి న్యాయ సభ్యుడు
సి. వారన్ హేస్టింగ్స్
4. మొదటి వైశ్రాయ్తో పాటు గవర్నర్ జనరల్ డి. సర్ ఎలిజా ఇంపే
1) 1-సి, 2-ఎ, 3-డి,4-బి
2) 1-సి, 2-డి, 3-బి,4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ,4-బి
3. ఏ చార్టర్ చట్టంతో ఈస్టిండియా కంపెనీ చైనాతో ‘ స్వేచ్ఛా వాణిజ్యాన్ని’ రద్దుచేసింది?
1) 1813 2) 1853
3) 1833 4) 1861
5. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించిన చట్టం ఏది?
1) 1909 2) 1919
3) 1935 4) 1892
6. భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానాన్ని బెంటింక్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
1) 1829 2) 1835
3) 1833 4) 1814
7. జతపర్చండి?
1. బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం ఎ. 1813 చార్టర్ చట్టం
2. విద్యకోసం సంవత్సరానికి రూ. లక్ష కేటాయింపు బి. 1853 చార్టర్ చట్టం
3. నియంత్రణ బోర్డు, డైరెక్టర్ల కోర్టు రద్దు సి. 1858 చట్టం
4. పోర్టుఫోలియో పద్ధతి ప్రారంభం డి. 1861 భారత శాసనసభల చట్టం
1) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
4) 1-డి, 2-ఎ, 3-సి,4-బి
8. దేశ భాషా పత్రికలపై ఆంక్షలు విధించి పత్రికా స్వాతంత్య్రాన్ని హరించిన గవర్నర్ జనరల్?
1) రిప్పన్ 2) కర్జన్
3) కానింగ్ 4) లిట్టన్
9. నాలుగో మైసూర్ యుద్ధకాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు?
1) వెల్లస్లీ 2) లార్డ్‌మింటో
3) డల్హౌసీ 4) కారన్ వాలిస్
10. ఇల్బర్ట్ బిల్లు గురించి కింది వాటిలో వాస్తవం కాని స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్లు ఏది/ఏవి?
ఎ. ఇల్బర్ట్ బిల్లు పట్ల ఉన్న వివాదం, భారత జాతీయవాదం ఒక వ్యవస్థీకృత రూపం సంతరించుకోవడానికి తోడ్పడింది
బి. అసలు బిల్లు ప్రకారం, భారతీయుడైన న్యాయమూర్తి, యూరోపియన్‌ను కూడా విచారించగలడు
సి. భారతదేశంలోని బ్రిటిష్‌వారు తీవ్రం గా వ్యతిరేకించినప్పటికీ దీన్ని ఆమోదించారు
డి. బిల్లుకు అనుకూలంగా భారతీయులు ఏ విధమైన ఉద్యమం నిర్వహించలేదు
1) ఎ, డి 2) బి, సి 3) సి, డి 4) డి
11. కంపెనీ పాలనలో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) రాబర్ట్ క్లెవ్ 2) లార్డ్ కానింగ్
3) వారన్ హేస్టింగ్స్ 4) విలియం బెంటింక్
12. భారత్‌లో ఆంగ్లం ఉన్నత విద్యా మాధ్యమంగా ఎవరి కాలంలో ప్రారంభమైంది?
1) లార్డ్ విలియం బెంటింక్
2) లార్డ్ డల్హౌసీ
3) లార్డ్ ఎలెన్‌బరో 4) లార్డ్ ఆక్లాండ్
13. భారత్‌కి చివరి గవర్నర్ జనరల్, మొదటి వైశ్రాయ్?
1) లార్డ్ ఎల్గిన్ 2) లార్డ్ మేయో
3) లార్డ్ లారెన్స్ 4) లార్డ్ కానింగ్
14. జతపర్చండి?
1. కారన్ వాలిస్ ఎ. సహాయక సంధి పద్ధతి
2. వెల్లస్లీ బి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
3. విలియం బెంటింక్ సి.న్యాయ,రెవెన్యూ పాలనల విభజన
4. డల్హౌసీ డి. రాష్ట్రీయ అప్పీలు కోర్టులు, సర్క్యూ ట్ రద్దు
1) 1-ఎ, 2-సి, 3-డి,4-బి
2) 1-సి, 2-ఎ, 3-డి,4-బి
3) 1-సి, 2-ఎ, 3-బి,4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
15. భారత్‌లో మొదటి రైలు మార్గం, టెలిగ్రాఫ్ లైన్ ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి?
1) లార్డ్ మింటో 2) లార్డ్ ఆమ్హెరెస్ట్
3) లార్డ్ ఆక్లాండ్ 4) లార్డ్ డల్హౌసీ
16. హిందూ న్యాయశాస్త్ర సంహితను (Code of Hindu Law) క్రోడీకరించినది ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) విలియం బెంటింక్
3) కారన్ వాలిస్ 4) సర్జాన్ బార్లో
17. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1) వెల్లస్లీ 2) డల్హౌసీ
3) కారన్ వాలిస్ 4) హేస్టింగ్స్ ప్రభువు
18. జతపర్చండి?
1. జలియన్‌వాలా బాగ్ ఎ. హేస్టింగ్స్
2. రామదండు బి. వెల్లస్లీ
3. సైన్య సహకార ఒడంబడిక సి. గోపాల కృష్ణయ్య
4. పిండారీల అణచివేత డి. మైకేల్ డయ్యర్
1) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
2) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ,4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
19. ఎవరి కాలంలో ‘దండి యాత్ర’ జరిగింది?
1) లార్డ్ కర్జన్ 2) లార్డ్ మింటో
3) లార్డ్ రీడింగ్ 4) లార్డ్ ఇర్విన్
20. కలకత్తా, బొంబాయి, మద్రాస్‌లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
1) లార్డ్ కర్జన్ 2) డల్హౌసీ
3) లార్డ్ రిప్పన్ 4) విలియం బెంటింక్
21. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. జమీందార్లకు గల భూయాజమాన్యాలు తొలగింపు
బి. జమీందార్లకు దయాదాక్షిణ్యాలతో రాయితీలు ఇచ్చుట
సి. కంపెనీకి స్థిరమైన ఆదాయం కలిగించుట
డి. జమీందార్లను కంపెనీకి విశ్వాసపాత్రులుగా చేయటం
1) ఎ, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి
22. 1857 సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’గా వర్ణించింది ఎవరు?
1) ఆర్సీ మజుందార్
2) సర్ జేమ్స్ జేట్రమ్స్
3) నికల్సన్ 4) వీడీ సావర్కర్
23. ప్రతిపాదన (ఎ): బ్రిటిష్ పార్లమెంటు ఒక కొత్త చట్టాన్ని విడుదల చేసింది. తూర్పు ఇండియా కంపెనీ నుంచి అధికారాలను బ్రిటిష్ రాణికి బదిలీ చేశారు.
కారణం (ఆర్): భారతీయ వ్యవహారాలను మరింత బాధ్యతతో నిర్వహించడం.
1) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం. (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం
24. జతపర్చండి?
1. బొంబాయి ప్రెసిడెన్సీ ఎ. విలియం బెంటింక్
2. మద్రాసు ప్రెసిడెన్సీ బి. డల్హౌసీ
3. ఆగ్రా ప్రావిన్స్ సి. వెల్లస్లీ
4. ప్రజా పనుల శాఖ డి. హేస్టింగ్స్
ఇ. కారన్ వాలిస్
1) 1-ఎ, 2-డి, 3-బి,4-ఇ
2) 1-బి, 2-ఇ, 3-సి,4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ,4-బి
4) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
25.‘ప్రాచ్యదేశపు అబ్రహంలింకన్’ గా పేరొందిన గవర్నర్ జనరల్ ఎవరు?
1) బెంటింక్ 2) హేస్టింగ్స్
3) రిప్పన్ 4) డల్హౌసీ
26. ‘వెల్లస్లీ సైన్యసహకార’ విధానం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు?
1) 1797 2) 1798
3) 1799 4) 1800
27. భారతదేశానికి మొదటి బ్రిటిష్ వైశ్రాయ్?
1) లార్డ్ కానింగ్
2) లార్డ్ విలియం బెంటింక్
3) లార్డ్ కారన్ వాలిస్ 4) లార్డ్ వెల్లస్లీ
28. ‘నిజాయితీపరుడు, కాని బోల్ష్ విక్ కాబట్టి ప్రమాదకరమైన వ్యక్తి’ గాంధీజీని గురించి ఎవరు వ్యాఖ్యానించారు?
1) లార్డ్ విల్లింగ్టన్ 2) లార్డ్ ఇర్విన్
3) జనరల్ స్మట్స్ 4) బెర్కిని హెడ్
29. భారత్‌లో సివిల్ సర్వీస్‌ను మొట్టమొదట ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్?
1) వారన్ హేస్టింగ్స్
2) లార్డ్ కారన్ వాలిస్
3) లార్డ్ వెల్లస్లీ 4) లార్డ్ డల్హౌసీ
30. రంజిత్‌సింగ్‌తో ‘అమృత్సర్ సంధి’ 1809లో చేసుకున్న గవర్నర్ జనరల్ ఎవరు?
1) వెల్లస్లీ 2) హేస్టింగ్స్
3) మింటో 4) బెంటింక్
31. ‘పిండారి’ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1817-18 2) 1820-22
3) 1830-33 4) 1835-36
32. భారత్‌లో పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1884 2) 1873
3) 1893 4) 1853
33. 1919 సంవత్సరంలో రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా వైశ్రాయ్ శాసనమండలి నుంచి రాజీనామా చేసిన భారతీయ సభ్యడు ఎవరు?
1) తేజ్ బదూర్ సప్రూ
2) బీడీ సుకుల్
3) ఎమ్ఆర్ జయశంకర్
4) జీఎస్ కాపర్దే
34. కింది రెండు జాబితాలను పరిశీలించండి?
జాబితా-1 జాబితా-2
1.మేయో ఎ. ప్రభుత్వ రైలు మార్గాలను ప్రారంభించడం
2. నార్డ్ బ్రూక్ బి. వేల్స్ యువ రాజు సందర్శన
3. లిట్టన్ సి. ఢిల్లీ దర్బారు నిర్వహణ
4. రిప్పన్ డి. భారత్‌లో మొదట జనాభా గణన
పై జతల్లో సరిగా కూర్చిన జతలు ఏవి? కింద ఇచ్చిన సంకేతాలనుంచి సరైన సమాధానం ఎంపిక చేయండి.
1) పైవన్నీ 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
35. భారతీయుల్లో విద్యా వ్యాప్తి కోసం రూ. లక్ష కేటాయించిన చార్టర్ చట్టం ఏది?
1) 1813 చార్టర్ చట్టం
2) 1833 చార్టర్ చట్టం
3) 1853 చార్టర్ చట్టం
4) పిట్ ఇండియా చట్టం
36. పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల విభజనకు వేసిన కమిషన్ చైర్మన్ ఎవరు?
1) మింటో 2) చేమ్స్‌ఫర్డ్
3) రాడ్‌క్లిఫ్ 4) స్టావర్ట్ క్రిప్స్
37. ‘వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్’ ఏ గవర్నర్ జనరల్ కాలంలో జారీ చేశారు?
1) రిప్పన్ 2) లిన్లిత్గో
3) లిట్టన్ 4) కర్జన్
38. సిమ్లా సమావేశం ఏ వైశ్రాయ్ కాలంలో నిర్వహించారు?
1) లార్డ్ లిన్లిత్గో 2) లార్డ్ వెవెల్
3) లార్డ్ ఎలెన్‌బరో 4) లార్డ్ నార్త్‌బ్రూక్
39. భారత్‌లో ప్రభుత్వ సేవ వ్యవస్థను ప్రవేశపెట్టినది?
1) హేస్టింగ్స్ 2) బెంటింక్
3) లిట్టన్ 4) కారన్ వాలిస్
40. ‘పీష్వా’ పదవిని రద్దు చేసింది?
1) మింటో 2) లార్డ్ హేస్టింగ్స్
3) బార్లో 4) వెల్లస్లీ
41. జతపర్చండి?
1. గూరా యుద్ధం ఎ. మెట్కాఫ్
2. థగ్గీ అణచివేత బి. హేస్టింగ్స్
3. భారతీయ పత్రికల స్వేచ్ఛ సి. డల్హౌసీ
4. తపాల వ్యవస్థ ప్రారంభం డి. విలియం బెంటింక్
1) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
2) 1-బి, 2-డి, 3-సి,4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ,4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
42. భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని?
1) చర్చిల్ 2) అట్లీ
3) చాంబర్ లేనావి 4) విల్సన్
43. ‘స్థానిక స్వపరిపాలన పితగా’ ఖ్యాతి పొంది నది ఎవరు?
1) లిట్టన్ 2) కర్జన్
3) రిప్పన్ 4) ఇర్విన్
44. భారతదేశంలో చంపబడ్డ ఏకైక రాజప్రతినిధి ఎవరు?
1) డఫ్రిన్ 2) మేయో
3) లిట్టన్ 4) మింటో
45. శాసనసభల్లో ఎన్నికల పద్ధతి భారతదేశంలో మొదటగా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
1) 1861 చట్టం 2) 1892 చట్టం
3) 1909 చట్టం 4) 1919 చట్టం
46. కలకత్తా, బొంబాయి, మద్రాసులో 1865లో హైకోర్టు స్థాపించింది ఏ బ్రిటిష్ గవర్నర్ కాలం?
1) లార్డ్ లారెన్స్ 2) లార్డ్ కానింగ్
3) లార్డ్ మేయో 4) లార్డ్ రిప్పన్
47. ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో సైమన్ కమిషన్ భారత్‌కు వచ్చింది?
1) లార్డ్ ఇర్విన్ 2) లార్డ్ రీడింగ్
3) లార్డ్ విల్లింగ్టన్ 4) లార్డ్ వేవెల్
48. నందకుమార్ ఉరితీత ఉదంతం ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది?
1) వెల్లస్లీ 2) వారన్ హేస్టింగ్స్
3) కారన్ వాలిస్ 4) రాబర్ట్ క్లెవ్
జవాబులు
1-2, 2-1, 3-3, 4-4, 5-1, 6-2, 7-2, 8-4, 9-1, 10-3, 11-3, 12-1, 13-4, 14-2, 15-4, 16-1, 17-4, 18-2, 19-4, 20-2, 21-2, 22-4, 23-1, 24-3, 25-4, 26-2 , 27-1, 28-1, 29-2, 30-3, 31-1, 32-4, 33-2, 34-1, 35-1, 36-3, 37-3, 38-2, 39-4, 40-2, 41-4, 42-2 43-3, 44-2, 45-2 46- 4, 47-1, 48-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు