బుద్ధుడు మళ్లీ నవ్వాడు ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
అణురంగం
# ఆవర్తన పట్టికలోని మూలకాల పరమాణు కేంద్రకాల స్థిరత్వాన్ని వాటి పరమాణు సంఖ్య ప్రభావితం చేస్తుంది.
# పరమాణు కేంద్రకాల్లో ఉండే ప్రోటాన్ల సంఖ్యను లేదా ఒక తటస్థ పరమాణువులోని ఎలక్టాన్ల సంఖ్యను పరమాణు సంఖ్యగా వ్యవహరిస్తారు.
# పరమాణు సంఖ్యను మూలకపు పరమాణువులకు ఉండే ఒక విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు.
#పరమాణు సంఖ్య ఆధారంగానే ఆవర్తన పట్టికలో ఒక మూలకం స్థానం నిర్ధారించబడుతుంది. అదేవిధంగా పరమాణు కేంద్రకాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయడంలోనూ ఈ సంఖ్య కీలకమవుతుంది.
# పరమాణు సంఖ్య పెరిగే కొద్ద్దీ పరమాణు కేంద్రకాల్లోని కేంద్రక కణాల సంఖ్య పెరుగుతుంది.
# 2, 8, 20, 28, 50, 82, 126,…. సంఖ్యలో కేంద్రక కణాలు (న్యూట్రాన్లు, ప్రోటాన్లు) కలిగిన మూలకాల పరమాణు కేంద్రకాలు స్థిరంగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వాటి కర్పరాలు పూర్తిగా నిండి ఉండటమే. ఈ సంఖ్యలను మ్యాజిక్ సంఖ్యలు అంటారు.
# మిగిలిన మూలకాల పరమాణు కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా ఉన్న మూలకాల్లో పరమాణు స్థిరత్వం అధికంగా కనిపిస్తుంది. ఫలితంగా ఈ మూలకాల పరమాణు కేంద్రకాలు తమ అస్థిరత్వాన్ని తగ్గించుకొనే క్రమంలో తమ కేంద్రకాల నుంచి గామా వికిరణాల రూపంలో శక్తిని కానీ, ఆల్ఫా, బీటా వంటి కణాలను ఉద్గారించి కానీ స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియను రేడియోధార్మికత అని, ఆ మూలకాలను రేడియోధార్మిక మూలకాలు అని వ్యవహరిస్తారు.
#రేడియోధార్మికత రెండు విధాలుగా జరుగుతుంది. అవి.
సహజ రేడియో ధార్మికత
కృత్రిమ రేడియో ధార్మికత
సహజ రేడియో ధార్మికత- సహజంగానే యురేనియం, థోరియం వంటి భారీ మూలకాలు రేడియోధార్మికతను వెలువరించే ప్రక్రియను సహజ రేడియో ధార్మికత అంటారు.
కృత్రిమ రేడియో ధార్మికత- ఆల్ఫా కణాల వంటి తేలిక కణాలతో నైట్రోజన్ వంటి తేలికపాటి మూలకాల పరమాణు కేంద్రకాలను తాడనం చెందించి రేడియోధార్మిక మూలకాలుగా పరివర్తనం చెందించే ప్రక్రియను కృత్రిమ లేదా ప్రేరిత రేడియో ధార్మికత అంటారు.
# కృత్రిమ రేడియో ధార్మికతను 1934లో ఐరీన్ క్యూరి, ఫ్రెడరిక్ జోలియట్ కనుగొన్నారు.
#అణుధార్మికత లేదా రేడియోధార్మికతకు ప్రమాణాలు బెకెరిల్, రూథర్‌ఫర్డ్, క్యూరీ.
#పరమాణువులు విచ్ఛిత్తి చెందినప్పుడు కేంద్రక శక్తి వెలువడుతుంది. ఈ ప్రక్రియను కేంద్రక చర్యలుగా పేర్కొంటారు.
కేంద్రక చర్యలు రెండు రకాలు. అవి.
కేంద్రక విచ్ఛిత్తి
కేంద్రక సంలీనం
కేంద్రక విచ్ఛిత్తి రెండు రకాలు. అవి.
ఒకటి నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి కాగా, మరొకటి అనియంత్రిత లేదా శృంఖల కేంద్రక విచ్ఛిత్తి.
#కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను 1938లో ఆటోహాన్, స్ట్రాస్‌మన్ కనుగొన్నారు.
#న్యూక్లియర్ రియాక్టర్ల వంటి పరికరాలతో కేంద్రక విచ్ఛిత్తి ద్వారా వెలువడే శక్తిని విద్యుత్ ఉత్పత్తి, ఇతర శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.
# న్యూక్లియర్ రియాక్టర్‌ను ఎన్రికో ఫెర్మి 1942లో కనుగొన్నాడు.
l# న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ, న్యూక్లియర్ బాంబు (ఆటంబాంబు)లో అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ జరుగుతుంది.
#రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో రేడియోధార్మికతను ప్రదర్శించని హైడ్రోజన్ వంటి తేలికైన మూలకాల పరమాణు కేంద్రకాలు అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల దగ్గర ఒకదానితో మరొకటి కలిసిపోయి వాటి కంటే బరువైన మరొక మూలక కేంద్రకంగా మారే ప్రక్రియను కేంద్రక సంలీనం అంటారు.
# కేంద్రక సంలీన ప్రక్రియ సూర్యుడు వంటి నక్షత్రాల వెలుతురు వేడిమి వెలువరించడంలోనూ హైడ్రోజన్ బాంబ్ తయారీలోనూ ఇమిడి ఉంటుంది.
అణుశక్తి-అనువర్తనాలు
# పారిశ్రామికంగా, ట్రిటియమ్ సహాయంతో లాంగ్ లాస్టింగ్ సెల్ తయారీలో, స్మోక్ డిటెక్టర్ తయారీలో, రేడియో ల్యుమినిసెన్స్ ధర్మం ఆధారంగా రహస్య సంకేతాలు పంపడానికి, రాత్రి వేళల్లో సహజ కాంతి జనకాలుగా వినియోగించడానికి, ఎలక్టో స్టాటిక్ కంట్రోల్ల రూపకల్పనలో, అణుధార్మిక ట్రేసర్లుగా వాడే రేడియో ఐసోటోప్‌లను ఉత్పత్తి చేయడానికి.
#వైద్యరంగంలో క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు రేడియేషన్ థెరపీలో
# ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విదేశాలకు ఎగుమతి చేసే ఆహార పదార్థాలను అణుధార్మికత సహాయంతో శుద్ధి చేయడానికి.
# వ్యవసాయ రంగంలో అణుధార్మికత సహాయంతో వివిధ వంగడాల్లో నూతన ఉత్పరివర్తనాలు రూపొందించడానికి, కీటకాల జనాభాను నియంత్రించడానికి.
——————————————————————————
పేరు – అణు ఇంధనం
ఉద్దేశం – విచ్ఛిత్తి ప్రక్రియను నిర్వహించడానికి, కొనసాగించడానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణలు – యురేనియం, ఫ్లూటోనియం, థోరియం. బెరీలియం.
—————————————————————————
పేరు – మితకారులు (మోడరేటర్స్)
ఉద్దేశం – న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించేవి.
ఉదాహరణలు – సాధారణ జలం, గ్రాఫైట్ కడ్డీలు, భారజలం, బెరీలియం.
————————————————————————-
పేరు – నియంత్రణ కడ్డీలు
ఉద్దేశం – అణు ఇంధనాల విచ్ఛిత్తి రేటును నియంత్రించే పదార్థాలు.
ఉదాహరణలు – బోరాన్, కాడ్మియం
——————————————————————————————————–
పేరు – న్యూట్రాన్ వనరులు
ఉద్దేశం – అణురియాక్టర్లలో విచ్ఛిత్తి ప్రక్రియ ప్రారంభం కావడానికి అవసరమయ్యే న్యూట్రాన్లను అందించే పదార్థాలు.
ఉదాహరణలు -క్యాలిఫోర్నియం-252, బెరీలియం, యాంటిమొని బెరీలియం మిశ్రమ లోహం
పేరు – న్యూట్రాన్ పాయిజన్
ఉద్దేశం – అణు రియాక్టర్లలో విచ్ఛిత్తి ప్రక్రియను గైవాన్-135. ఆపుటకు వాడే పదార్థాలు
ఉదాహరణలు -గైవాన్-135.
——————————————————————————————–
పేరు – శీతలీకరణి
ఉద్దేశం – శీతలీకరణి విచ్ఛిత్తి ప్రక్రియలో రియాక్టర్లలో వెలువడే ఉష్ణాన్ని వెలుపలకు చేరవేసే పదార్థాలు.
ఉదాహరణలు – సాధారణ జలం, భారజలం ద్రవ నైట్రోజన్, ద్రవ సోడియం
భారత్ లో అణుశక్తి
# భారత్ లో అణువిద్యుత్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, అణుధార్మికతకు సంబంధించిన సాంకేతికతను వివిధ రంగాలకు అనువర్తింప చేయడానికి 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేశారు. ఇది భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
# భారత్ అణువిద్యుత్ వాటా కేవలం 3 శాతం మాత్రమే కాగా దీనిని 2050 నాటికి 25 శాతం పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
# పరిమాణం దృష్ట్యా అణువిద్యుత్ భారతదేశ శక్తి రంగంలో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తోంది.
# భారత్ లో మొదటి అణు రియాక్టర్ కెనడా సహకారంతో రావత్‌భటా అటామిక్ పవర్ ప్లాంట్ లో 1963లో స్థాపించారు.
# బ్రిటన్ సహాయంతో ఆసియాలోనే మొదటిసారిగా అప్సర అనే పరిశోధన రియాక్టరును స్థాపించారు.
# అణుశక్తి రంగంలో మానవ వనరులకు శిక్షణ అందించడానికి, రేడియో ఐసోటోప్ లపై అవసరమైన పరిశోధనలు జరపడానికి, ఇతర శాంతియుత ప్రయోజనాల కోసం పరిశోధన రియాక్టర్లు ఉపయోగపడతాయి.
# భారత్ నెలకొల్పిన అణు రియాక్టర్ లకు అవసరమైన భారజలం ఉత్పత్తి చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ముంబై ప్రధాన కేంద్రంగా హెవీ వాటర్ బోర్డు ఏర్పాటయ్యింది.
# హెవీ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏడు భారజల ప్లాంట్లు నెలకొల్పబడ్డాయి. అవి.
HWP బరోడా, గుజరాత్
HWP హజీరా, గుజరాత్
HWP మణుగూరు, తెలంగాణ
HWP కోట, రాజస్థాన్
HWP థాల్ , మహారాష్ట్ర
HWP ట్యూటికోరిన్ , తమిళనాడు
HWP తాల్చేరు, ఒడిశా
భారత్ లో అణ్వస్త్ర పరీక్షలు
#రాజా రామన్న నేతృత్వంలో మొదటిసారి మే 18, 1974లో ‘స్మైలింగ్ బుద్ధ’ అనే సంకేత నామంతో జరిగింది.
#రెండో సారి 1998లో పోఖ్రాన్ , రాజస్థాన్ లో మే 11 నుంచి 13వరకు డాక్టర్ అబ్దుల్ కలాం నేతృత్వంలో ‘బుద్ధుడు మళ్లీ నవ్వాడు’ అనే సంకేత నామంతో నిర్వహించారు.
భారత్ లో అణుశక్తి రంగంలో కృషి చేస్తున్న సంస్థలు
# భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ , ముంబై
# అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్
# రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇండోర్
# ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ, తేని (తమిళనాడు)
# వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ , కోల్ కతా
# ఎలక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , ముంబై
# ఇండియా రేర్ ఎర్త్ లిమిటెడ్ , ముంబై
# న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , ముంబై
# హెవీ వాటర్ బోర్డ్, ముంబై
# న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్
# బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, ముంబై
# హొమీభాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్ , ముంబై
# టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రిసెర్చ్, హైదరాబాద్ , ముంబై
# అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, ముంబై
# టాటా మెమోరియల్ సొసైటీ, ముంబై
# సాహా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, కోల్ కతా
# ఇన్ స్టిట్యూట్ ప్లాస్మా రిసెర్చ్, గాంధీనగర్
భారత్ లో నెలకొల్పిన ఇతర పరిశోధనా రియాక్టర్లు
పరిశోధన రియాక్టర్ పేరు సామర్థ్యం వాడే ఇంధనం
అప్సర 1 MW ఎన్ రిచ్డ్ యురేనియం
అప్సర-U 2 MW LEU
పూర్ణిమ-1 1 W ఫ్లూటోనియం
పూర్ణిమ- 2 100Milli W యురేనియం 233
పూర్ణిమ-3 1 W యురేనియం 233
కామిని 30 KW యురేనియం 233
ధ్రువ 100 MW సహజ యురేనియం
సిరస్ 40 MW సహజ యురేనియం
జర్లీనా 100 W సహజ యురేనియం
భారత్ లో నెలకొల్పిన అణువిద్యుత్ రియాక్టర్లు
కాక్రపారా అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్ 2 440 MW
నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్ 2 440 MW
కూడంకుళం న్యూక్లియర్ పవర్ స్టేషన్ తమిళనాడు 2 2000 MW
కైగా జనరేటింగ్ స్టేషన్ కర్ణాటక 4 880 MW
మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడు 2 440 MW
రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్ 6 180 MW
తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్ర 4 1400 MW
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?