ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం కలిగిన క్షీరదాలు?
- డిసెంబర్ 23 శుక్రవారం తరువాయి
79. మూత్రనాళాల్లో కనిపించే ఉపకళా కణజాలం?
1) స్తరిత ఉపకళ2) పొలుసుల ఉపకళ
3) ఘనాకార ఉపకళ
4) గ్రంథి ఉపకళ
80. స్తంభాకార ఉపకళా కణజాలం కలిగిన భాగాలు?
ఎ. కొమ్ములు, గిట్టలు బి. రోమాలు
సి. గోర్లు, పొలుసులు డి. పక్షి ఈకలు
1) ఎ, బి, సి, డి 2) ఎ మాత్రమే
3) సి మాత్రమే 4) ఎ, బి
81. కింది వాటిలో సరైన అంశం?
ఎ. అవయవాలను, కండరాలను కలిపేకణజాలం ఉపకళా కణజాలం
బి. అవయవాలను, కండరాలను కలిపే
కణజాలం సంయోజక కణజాలం
సి. సంయోజక కణజాలం అంతర్భాగాలకుచట్రంలా ఉంటుంది
డి. సంయోజక కణజాలం స్వేచ్ఛాయుతంగా ఉంటుంది
ఎ) ఎ, బి, డి బి) బి, సి
సి) ఎ, బి, సి డి) ఎ, సి, డి
82. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. సంయోజక కణజాలం శరీర రక్షణకు తోడ్పడుతుంది
బి. శరీర కణాల మరమ్మతుకు సంయోజక కణజాలం తోడ్పడుతుంది
సి. సంయోజక కణజాలం కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవేవీ కావు
83. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. ఏరియోలార్ కణజాలంలో గల పెద్ద ఖాళీ ప్రదేశాలను ఏరియోల్స్ అంటారు
బి. ఏరియోల్స్ వేరు చేసినప్పుడు పలుచటి ద్రవం ఏర్పడుతుంది
సి. ఏరియోలార్ కణజాలంలో గల తంతువులు ఫైబ్రోబ్లాస్ట్‌లను కలిగి ఉంటాయి
డి. ఫైబ్రోబ్లాస్ట్లు పోషకాల రవాణాలో తోడ్పడుతాయి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) బి మాత్రమే
84. ఎడిపోజ్ కణజాలం గురించి సరైన అంశం?
ఎ. కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది
బి. ప్రొటీన్లను నిల్వ చేస్తుంది
సి. శరీరం నుంచి వేడిని బయటకు పంపుతుంది
డి. ఉష్ణ నిరోధకంలా పనిచేస్తుంది
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి 4) బి, డి
85. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. ఎముక శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది
బి. ఎముక అంతర అస్థిపంజర నిర్మాణంలో తోడ్పడుతుంది
సి. ఆస్టియోసైట్ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని అస్థిమజ్జలో ఉంటాయి
డి. ఎముక కాల్షియం పాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్‌తో ఏర్పడుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) డి మాత్రమే 4) పైవేవీ కావు
86. సొర చేప అస్థిపంజరాన్ని ఏర్పరిచే కణజాలం?
1) ఎముక 2) మృదులాస్థి
3) ఎడిపోజ్ 4) ఏరియోలార్
87. మృదులాస్థి కణజాలం గల శరీర భాగాలు?
1) పక్కటెముకల చివర 2) నాసికాగ్రం
3) చెవి డొప్ప 4) పైవన్నీ
88. కింది వాటిలో సరైన అంశం?
1) లిగమెంట్ ఎముకలను సంధి తలాల్లో కలిపి ఉంటుంది
2) లిగమెంట్ తక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటుంది
3) లిగమెంట్ స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటుంది
4) తంతువులు కొల్లాజన్తో నిర్మితమై ఉంటాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
89. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. స్నాయు బంధనం తంతుయుత కణజాలం
బి. కండరాలను ఎముకలతో కలిపే సంధితలాల్లో స్నాయు బంధనం ఉంటుంది
సి. స్నాయు బంధనం కొల్లాజన్తో నిర్మితమై ఉంటుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) పైవేవీ కావు
90. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేసే పదార్థం?
1) హెపారిన్ 2) పోర్పైరిన్
3) జాంథోనిన్ 4) ఐరన్
91. తంతువులు లేని సంయోజక కణజాలం?
1) ఎడిపోజ్ 2) ఏరియోలార్
3) లిగమెంట్ 4) రక్తం
92. రక్తం గురించి సరైన అంశం?
ఎ. ద్రవరూపక కణజాలం
బి. ప్రౌఢ మానవుడిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది
సి. ప్రౌఢ మానవుడిలో 10 లీటర్ల రక్తం ఉంటుంది
డి. ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది
1) ఎ, బి, డి 2) బి, డి
3) ఎ, సి 4) ఎ, డి
93. నీలి రంగు రక్తం గల జీవి?
1) బొద్దింక 2) కప్ప
3) నత్త 4) గొల్లభామ
94. తెలుపు రంగు రక్తం కలిగిన జీవులు?
ఎ. బొద్దింక బి. తేలు
సి. గొల్లభామ డి. నత్త
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ మాత్రమే
95. ఎర్ర రక్తకణాల గురించి సరైన అంశం?
ఎ. ఎరిత్రోసైట్లు అంటారు
బి. హీమోసయనిన్ ఉంటుంది
సి. హిమోగ్లోబిన్ ఉంటుంది
డి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు
1) ఎ, బి, డి 2) బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
96. ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం కలిగిన క్షీరదాలు?
ఎ. ఆవు బి. లామా
సి. ఒంటె డి. మానవుడు
1) ఎ, బి 2) బి, సి
3) బి మాత్రమే 4) పైవన్నీ
97. కణికాభ కణాల రకాలు?
1) 3 2) 4 3) 2 4) 5
98. సూక్ష్మ రక్షక భటులు అని వేటినంటారు?
1) న్యూట్రోఫిల్స్ 2) బేసోఫిల్స్
3) ఇసినోఫిల్స్ 4) లింఫోసైట్స్
99. కింది వాటిలో సరైన అంశం?
ఎ. తెల్ల రక్తకణాల జీవిత కాలం 12-13 రోజులు
బి. రక్త ఫలకికల్లో కేంద్రకం ఉంటుంది
సి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు
డి. తెల్ల రక్తకణాలను ల్యూకోసైట్లు అంటారు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
100. సార్వత్రిక దాత ఏ రక్త వర్గం?
1) AB 2) A
3) B 4) O
కణం కణాంగాల
1. కణానికి సంబంధించి సరికానిది?
ఎ. సజీవ కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్
బి. కణాన్ని మొదటగా ఓక్ చెట్టు బెరడులో కనుగొన్నారు
సి. కణం అంటే లాటిన్ భాషలో పెద్ద గది అని అర్థం
డి. కణం గురించిన అధ్యయనం-హిస్టాలజీ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
2. ‘అమ్ని-సెల్యూలా-డే-సెల్యూలే’కు సరైనది?
ఎ. కణాలు పూర్వపు కణాల నుంచి ఉద్భవిస్తాయి
బి. కణ విభజనకు సంబంధించింది
సి. కనుగొన్నది ష్లీడన్, ష్వాన్
డి. రుడాల్ఫ్ విర్కోవ్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
3. సరికాని జతను గుర్తించండి.
ఎ. అతిపెద్ద కణం- ఆస్ట్రిచ్ అండం
బి. అతిచిన్న కణం- శుక్రకణం
సి. అతిపొడవైన కణం- కండర కణం
డి. అకణ జీవి- వైరస్
1) ఎ, బి 2) బి, సి
3) డి మాత్రమే 4) సి మాత్రమే
4. కింది వాటిని జతపరచండి.
1. కణం ఎ. కారియాలజీ
2. కణజాలం బి. సైటాలజీ
3. కేంద్రకం సి. ఆంకాలజీ
4. క్యాన్సర్ డి. హిస్టాలజీ
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
5. నిశ్చితం-ఎ: కణాన్ని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అంటారు కారణం-ఆర్: ప్రతి జీవి కణంచేత నిర్మితమై ఉంటుంది
1) ఎ కు ఆర్ సరైన కారణం కాదు
2) ఎ కు ఆర్ సరైన కారణం
3) ఎ సత్యం, ఆర్ అసత్యం
4) ఎ అసత్యం, ఆర్ సత్యం
6. వాక్యం-ఎ: కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది- ష్లీడన్, ష్వాన్ వాక్యం-బి: కణ విభజనను కనుగొన్నది- రాబర్ట్ బ్రౌన్
1) ఎ సత్యం, బి సత్యం
2) ఎ అసత్యం, బి అసత్యం
3) ఎ సత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం
7. నిశ్చితం-ఎ: బ్యాక్టీరియా ఒక కేంద్రకపూర్వక జీవి కారణం-ఆర్: కేంద్రక త్వచం లోపించడం వల్ల కేంద్రకం అస్పష్టంగా ఉంటుంది
1) ఎ కు ఆర్ సరైన కారణం
2) ఎ కు ఆర్ సరైన కారణం కాదు
3) ఎ సత్యం, ఆర్ అసత్యం
4) ఎ అసత్యం, ఆర్ సత్యం
8. కిందివాటిలో సరికానిది గుర్తించండి.
1) బ్యాక్టీరియా 2) నాస్టాక్
3) అమీబా 4) అసిల్లటోరియా
9. ప్లాస్మిడ్కు సంబంధించి సరికానిది?
ఎ. బ్యాక్టీరియాలో అదనపు జన్యు పదార్థం
బి. జీవ సాంకేతిక శాస్త్రంలో ఉపయోగిస్తారు
సి. ఈస్ట్ కణంలో కూడా ఉంటుంది
డి. క్రోమోజోమ్‌లో ఉండును
1) ఎ, బి 2) సి, డి
3) బి, సి 4) ఎ, డి
10. ఒక విద్యార్థి కణాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తున్నప్పుడు అతడికి కణం లోపల కేంద్రకం అస్పష్టంగా కన్పిపించిందని సూచించాడు. అయితే అది ఏ కణం?
1) అకణం 2) బహు కణం
3) నిజకేంద్రక కణం
4) కేంద్రకపూర్వ కణం
11. కింది వాటిలో ఏకకణ జీవిని గుర్తించండి.
ఎ. ఈస్ట్ బి. అమీబా
సి. యూగ్లినా డి. ప్లాస్మోడియం
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) ఎ, సి
12. కేంద్రక పూర్వ కణానికి సంబంధించి సరికానిది?
ఎ. కేంద్రకం స్పష్టంగా ఉంటుంది
బి. కేంద్రక త్వచం ఉండదు
సి. జన్యు పదార్థం నగ్నంగా ఉంటుంది.
డి. 80s రకానికి చెందిన రైబోజోమ్‌లు ఉంటాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) ఎ, సి
13. కింది వాటిలో వృక్ష కణంలో మాత్రమే ఉండే కణాంగాలు ఏవి?
ఎ. ప్లాస్టిడ్లు బి. కణ కవచం
సి. రిక్తిక డి. సెంట్రియోల్లు
1) డి మాత్రమే 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
14. కింది వాటిని జతపరచండి.
1. కణ మేధస్సు ఎ. రైబోజోమ్‌లు
2. కణం వంట గది బి. రిక్తిక
3. ప్రొటీన్ కర్మాగారం సి. కేంద్రకం
4. కణ బాంఢాగారం డి. హరితరేణువు
1) సి, డి, ఎ, బి 2) సి, డి, బి, ఎ
3) డి, సి, ఎ, బి 4) డి, బి, సి, ఎ
15. నిశ్చితం-ఎ: కేంద్రకాన్ని కణ మెదడు అంటారు కారణం-ఆర్: కణంలో జరిగే అన్ని చర్యలు కేంద్రకం ఆధీనంలో ఉంటాయి
1) ఎ కు ఆర్ సరైన కారణం కాదు
2) ఎ కు ఆర్ సరైన కారణం
3) ఎ సత్యం ఆర్ అసత్యం
4) ఎ అసత్యం ఆర్ సత్యం
16. నిశ్చితం-ఎ: రిక్తికను కణ శక్తి బాంఢాగారం అంటారు కారణం-ఆర్: కణంలో విడుదలయ్యే వ్యర్థాలు రిక్తికలో నిల్వ ఉంటాయి
1) ఎ కు ఆర్ సరైన కారణం కాదు
2) ఎ కు ఆర్ సరైన కారణం
3) ఎ అసత్యం ఆర్ సత్యం
4) ఎ సత్యం ఆర్ అసత్యం
17. హరితరేణువుకు సంబంధించి సరైనది?
ఎ. కణంలో కణం అంటారు
బి. కణంలో వంట గది
సి. స్వయం ప్రతిపత్తిగల కణం
డి. శ్వాసక్రియ జరుగుతుంది
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
18. కింది ఏ కణాంగాల్లో DNA ఉంటుంది?
ఎ. కేంద్రకం బి. హరితరేణువు
సి. మైటోకాండ్రియా డి. లైసోజోమ్‌లు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
19. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కణంలో రెండు త్వచాలు కలిగిన కణాంగాల గురించి వివరించాలనుకున్నాడు. అయితే ఆయన కింది వాటిలో ఏ కణాంగాలను వివరించవచ్చు?
ఎ. రైబోజోమ్‌లు బి. లైసోజోమ్‌లు
సి. మైటోకాండ్రియా
డి. కేంద్రకం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) బి, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?