పట్టుపట్టు.. గ్రూప్-2 కొట్టు
లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 తర్వాత అంతే క్రేజ్ ఉన్నవి గ్రూప్-2 ఉద్యోగాలు. నాయబ్ తహసీల్దార్, ఏసీటీవో, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎస్ఐ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల పంచాయతీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు గ్రూప్-2 ద్వారా భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1000 పోస్టులను భర్తీ చేశారు. అదేవిధంగా గత నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉండగా ప్రస్తుతం ఉండదు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.
గ్రూప్-2 పరీక్ష విధానం
- మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి.
- ఒక్కో పేపరుకు 150 మార్కులు.
- మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
- పరీక్ష విధానానికి సంబంధించిన సబ్జెక్టులు తదితరాలు కింది పట్టికలో ఉన్నాయి.
- గ్రూప్-2లో విజయం సాధించడానికి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, నిపుణులు చెప్పిన అంశాలు సంక్షిప్తంగా…
- గ్రూప్-2లో ప్రశ్నలు అన్ని మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. అయితే దీని కోసం కేవలం బిట్లు మాత్రమే చదివితే విజయం సాధించడం కష్టం. అంతేకాకుండా ఇటీవల జరిగిన గ్రూప్-1 పరీక్ష ద్వారా కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల స్థాయికి తగ్గ ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది.
- అభ్యర్థులు తప్పకుండా సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాలను ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకోవాలి.
- కాన్సెప్టులను అర్థం చేసుకుని వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- మార్కెట్లో దొరికే చాలా పుస్తకాల్లో ఆయా సంఘటనలకు సంబంధించిన తేదీలను తప్పుగా ఇచ్చారు. వాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి గుర్తు పెట్టుకోవాలి.
- మార్కెట్లో కనిపించిన ప్రతి పుస్తకం చదవకుండా సీనియర్లు, ఫ్యాకల్టీలు సూచించిన పుస్తకాలలో ఒకదాన్ని క్షుణ్ణంగా చదవడం మంచిది.
- ప్రభుత్వ గణాంకాలకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్లలో లభ్యమయ్యే వాటిని సేకరించి సొంత నోట్స్ తయారు చేసుకోవాలి.
- నిత్యం దినపత్రికలను తప్పక చదువుతూ సబ్జెక్టుకు వాటిని మేళవించుకోవడం తప్పనిసరిగా చేయాలి.
- మైక్రో, మ్యాక్రో ప్లాన్ వేసుకుని పట్టుదలతో చదివితే ఉద్యోగం సాధించడం కష్టమేమి కాదు.
- మరీ ముఖ్యంగా పుకార్లను నమ్మకుండా కేవలం పరీక్షపై దృష్టి పెడితే విజయం తథ్యం
- సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో, క్రమబద్ధమైన ప్రణాళిక వేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి.
- అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకున్న వారు విజేతలుగా నిలుస్తారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికే సుమారు 1000 మంది గ్రూప్-2 ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నారన్న విషయం గుర్తుంచుకుని ముందుకెళ్లండి. ఆల్ ది బెస్ట్.
విశ్లేషణతో చదివితే విజయం మీదే
ముందుగా అభ్యర్థులకు సిలబస్‌పై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ప్రతి పేపరుకు సమ ప్రాధాన్యంలో ఎంత సమయాన్ని కేటాయించాలనే ప్రణాళిక తప్పనిసరి. ఎన్ని పుస్తకాలు చదువుతున్నామన్నది కాకుండా ప్రతి పేపరుకు ఏవైనా రెండు మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని చదవడం ఉత్తమం. ప్రిపరేషన్ సమయంలో గ్యాప్ రాకుండా కొనసాగింపుగా చదివితే విజయం తప్పకుండా వరిస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు ధ్యానం చేస్తే సరిపోతుంది. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు నిరంతరం శ్రమించాలి. సామాజిక మాధ్యమాలు, వేడుకలకు వీలైనంత దూరంగా ఉండడం మేలు. ఫోన్లలో మన ప్రిపరేషన్‌కు సంబంధించిన విషయాల వరకే ప్రాధాన్యం ఇవ్వాలి. స్నేహితులతో వివిధ సబ్జెక్టులపై చర్చించడం వల్ల ఎక్కువగా గుర్తుండి సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రశ్నల స్థాయి మారినందున అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అవడం మంచిది. పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు తడబాటు లేకుండా సమాధానాలను ఎంపిక చేస్తేనే మార్కులు సొంతమవుతాయి. అప్పుడు విజయం మీ ముందు నిలుస్తుంది.
– చంద్రశేఖర్, నాయబ్ తహసీల్దార్, గుమ్మడిదల, సంగారెడ్డి జిల్లా
మాక్ టెస్టులతో మంచి మార్కులు
గ్రూప్-2 పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సిలబస్ మొత్తం కచ్చితంగా చదవాలి. అందులోని అన్ని టాపిక్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ తయారు చేసుకుని అందుకనుగుణంగా ప్రిపేర్ కావాలి. ఒకే సబ్జెక్టు కోసం రెండు కంటే ఎక్కువ పుస్తకాలు చదవితే ఫలితం ఉండదు. తెలుగు అకాడమీతో పాటు ప్రస్తుతం టాప్‌లో ఉన్న కాంపిటీటివ్ పుస్తకం ఎంచుకొని చదవాలి. ప్రతి పేపర్‌ను క్షుణ్నంగా చదివి, రివిజన్ చేసుకోవాలి. సబ్జెక్టుపై పూర్తి కమాండింగ్ వచ్చింది అనుకున్నాకే మాక్ టెస్ట్‌లు రాయాలి. ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే అంత ఎక్కువ పట్టు సాధించవచ్చు. గ్రూప్ డిస్కషన్స్, ఏదైనా ఒక టాపిక్‌ను ఎంచుకొని దాన్ని విశ్లేషించడం చేయాలి. ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నల సరళి గత పరీక్షల కంటే భిన్నంగా ఉంది. అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాలి. అందుకోసం ఆయా పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రశ్నలు ఎక్కువగా అప్లికేషన్ మెథడ్‌లో వస్తున్నాయి కాబట్టి ఆ తరహాలో ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీ సొంతం అవుతుంది.
– రఘునందన్‌రెడ్డి, 2nd ర్యాంకర్, గ్రూప్-II
తెలంగాణ చరిత్ర – ప్రాక్టీస్ బిట్స్
1. నిజాం కాలంలో భూమిని ఎన్ని భాగాలుగా విభజించారు?
ఎ) 2 బి) 4 సి) 3 డి) 5
2. నాలుగు భాగాల కింద విభజించిన భూములను ఏమని పిలిచేవారు?
1) ఖల్సా 2) సర్పేఖాస్
3) పైగా 4) జాగీరులు
5) పైవేవీకాదు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
3. సాలార్జంగ్ ఇనాం కార్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
ఎ) 1875
బి) 1885
సి) 1881 డి)1890
4. సాలార్జంగ్ జిలాబందీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టాడు?
ఎ) 1875 బి) 1865
సి) 1861 డి) 1870
5. 1861కి ముందు ఖల్సా ప్రాంతం ఎన్నివేల చదరపు మైళ్లు ఉండేది?
ఎ) 30,000 బి) 35,000
సి) 40,000 డి) 50,000
6. నిజాం బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 50 లక్షల రూపాయాల అప్పును రద్దు చేయడానికి గల కారణం?
ఎ) నిజాం అప్పు తిరిగి చెల్లించడం వల్ల
బి) ఆంగ్లేయులు రుణాలు మాఫీ చేయడంతో సి) ఎ, బి
డి) సిపాయిల తిరుగుబాటును అణచి వేయడంలో ఆంగ్లేయులకు సహకరించడం వల్ల
7. హైదరాబాద్ రాజ్యంలో భాగమైన సింగరేణి బొగ్గుగనులను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
ఎ) 1871 బి) 1875
సి) 1882 డి) 1885
8. నిజాం రాజ్యంలో 1856-57లో హైదరాబాద్, బొంబాయిని కలుపుతూ ఏ పట్టణం మీదుగా టెలిగ్రాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు?
ఎ) పుణె బి) రాయచూర్
సి) కర్నూల్ డి) పైవేవీకాదు
9. భూములను కొలిచేందుకు వినియోగించే 10 గజాల చైన్ నమునా కింద ఎలా ఉపయోగించేవారు?
ఎ) భిగా 8/8 బి) భిగా 6/6
సి) భిగా 6/8 డి) భిగా 9/9
10. భూములను సర్వేచేసి, వాటి హద్దులను, సారాన్ని, ఇతర అంశాలను నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన విభాగం ఏది?
ఎ) సెటిల్మెంట్ డిపార్ట్మెంట్
బి) సర్వే ఆఫ్ హైదరాబాద్ స్టేట్
సి) సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్
డి) డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సర్వే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?