అరటి చెట్టుకు వ్యతిరేక దిశలో ఉన్న చెట్టు ఏది?
- దిశలు (దిక్కులు) – పరీక్ష (డిసెంబర్ 24 తరువాయి)
37. ఉమేష్ నేరుగా P నుంచి Qకి 9 అడుగుల దూరం వెళ్లాడు. అప్పుడు అతడు కుడివైపునకు తిరిగి 4 అడుగులు నడిచాడు. తర్వాత అతడు కుడివైపునకు తిరిగి P నుంచి Qకి సమాన దూరం నడిచాడు. చివరగా అతడు కుడివైపునకు తిరిగి 3 అడుగులు నడిచాడు. అతడు ఇప్పుడు P నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?
1) 6 అడుగులు 2) 5 అడుగులు
3) ఒక అడుగు 4) 0 అడుగులు
38. శ్యామ్ 5 కి.మీ. తూర్పువైపు నడిచి, మళ్లీ ఎడమవైపునకు తిరిగి 6 కి.మీ. నడిచాడు. మళ్లీ కుడివైపునకు తిరిగి 9 కి.మీ. నడిచాడు. చివరగా అతడు కుడివైపునకు తిరిగి 6 కి.మీ. నడిచాడు. అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?
1) 26 కి.మీ. 2) 21 కి.మీ.
3) 14 కి.మీ. 4) 9 కి.మీ.
39. అమిత్ తన వీపు భాగం సూర్యుని వైపు ఉండే విధంగా నడక ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత అతడు ఎడమ వైపునకు తిరిగాడు. అప్పుడు కుడి వైపునకు తిరిగి మళ్లీ ఎడమ వైపునకు వెళ్లాడు. అతడు ఇప్పుడు ఏ దిక్కుగా వెళ్తున్నాడు?
1) ఉత్తరం లేదా దక్షిణం
2) తూర్పు లేదా పశ్చిమం
3) ఉత్తరం లేదా పశ్చిమం
4) దక్షిణం లేదా పశ్చిమం
40. రోహిత్ 25 కి.మీ. దక్షిణం వైపునకు నడిచాడు. అప్పుడు అతడు తనకు ఎడమవైపునకు తిరిగి 20 మీ. నడిచాడు. అతడు ఎడమవైపునకు తిరిగి 25 మీ. నడిచాడు. మళ్లీ అతడు తనకు కుడివైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంతదూరంలో ఏ దిక్కుగా ఉన్నాడు?
1) 30 మీ. తూర్పు
2) 35 మీ. ఉత్తరం
3) 30 మీ. పశ్చిమం
4) 45 మీ. తూర్పు
41. P అనే గ్రామానికి ఉత్తర దిక్కుగా Q అనే గ్రామం ఉంది. Q గ్రామానికి తూర్పుగా R అనే గ్రామం ఉంది. P అనే గ్రామానికి ఎడమ వైపుగా S అనే గ్రామం ఉంది. R అనే గ్రామానికి S అనే గ్రామం ఏ దిక్కుగా ఉంది?
1) పశ్చిమం 2) నైరుతి
3) దక్షిణం 4) వాయవ్యం
42. రాధ ఆగ్నేయంగా 7 కి.మీ. ప్రయాణించి, అప్పుడు పడమరకు 14 కి.మీ. ప్రయాణించింది. ఇక్కడ నుంచి, ఆమె వాయవ్యానికి 7 కి.మీ. ప్రయాణించి చివరగా తూర్పువైపునకు 4 కి.మీ. ప్రయాణించింది. ఆమె బయలుదేరిన స్థలం నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉంది?
1) 3 కి.మీ. 2) 4 కి.మీ.
3) 10 కి.మీ. 4) 11 కి.మీ.
43. సుందర్ 20 మీ. తూర్పునకు పరుగెత్తి, కుడివైపునకు తిరిగి 10 మీ. పరుగెత్తాడు. అప్పుడు అతడు కుడివైపునకు తిరిగి 9 మీ. పరుగెత్తాడు. దీనితర్వాత అతడు ఎడమవైపునకు తిరిగి 12 మీ. పరుగెత్తాడు. చివరగా కుడివైపునకు తిరిగి 6 మీ. పరుగెత్తాడు. అయితే సుందర్ ఇప్పుడు ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) ఉత్తరం
4) దక్షిణం
44. సచిన్ ఉత్తరంగా 20 కి.మీ. నడిచాడు. అతడు ఎడమవైపునకు తిరిగి 40 కి.మీ. నడిచాడు. అతడు మళ్లీ ఎడమవైపునకు తిరిగి 20 కి.మీ. నడిచాడు. చివరగా ఎడమవైపునకు తిరిగిన తర్వాత 20 కి.మీ నడిచాడు. అతడు బయలుదేరిన స్థానం నుంచి ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు?
1) 20 కి.మీ. 2) 30 కి.మీ.
3) 50 కి.మీ. 4) 60 కి.మీ.
45. లోకేష్ అతడి ఇంటి నుంచి ఉత్తరంగా 15 కి.మీ. వెళ్లాడు. అప్పుడు అతడు పశ్చిమానికి తిరిగి 10 కి.మీ., అక్కడ నుంచి దక్షిణానికి 5 కి.మీ. వెళ్లి చివరగా తూర్పునకు తిరిగి 10 కి.మీ. వెళ్లాడు. ఇప్పుడు అతడు తన ఇంటి నుంచి ఏ దిక్కున ఉన్నాడు?
1) తూర్పు 2) పశ్చిమం
3) ఉత్తరం 4) దక్షిణం
46. ఒక ఆట స్థలంలో దేవ్, కుమార్, నీలేష్, అంకుర్, పింటు ఉత్తరానికి అభిముఖంగా కింద ఇచ్చిన విధంగా నిలబడి ఉన్నారు.
1. కుమార్, అంకుర్‌కు కుడివైపునకు 40 మీ. దూరంలో నిలబడి ఉన్నాడు.
2. దేవ్, కుమార్‌కు దక్షిణంగా 60 మీ. దూరంలో ఉన్నాడు
3. నీలేష్, అంకుర్‌కు పశ్చిమంగా 25 మీ. దూరంలో ఉన్నాడు
4. పింటు, దేవ్‌కు ఉత్తరంగా 90 మీ. దూరంలో ఉన్నాడు
కుమార్‌కు ఎడమవైపు ఉన్న వ్యక్తికి ఈశాన్యంగా ఉన్నది ఎవరు?
1) దేవ్ 2) నీలేష్
3) అంకుర్ 4) పింటు
47. ఒక బాలుడు నీలేష్ నుంచి మొదలుపెట్టి, అంకుర్‌ను, తర్వాత కుమార్‌ను, తర్వాత దేవ్‌ను, ఆ తర్వాత పింటును కలవడానికి సమయం ఒక నిలువుగీతగా నడిస్తే అతడు ఎంత దూరం నడిచినట్లు?
1) 215 మీ. 2) 155 మీ.
3) 245 మీ. 4) 185 మీ.
కింది సమాచారం ఆధారంగా 48 నుంచి 51వ ప్రశ్న వరకు జవాబులు గుర్తించండి.
1. ఒక ఫ్లోర్లో రెండు వరుసల్లో ఉత్తరం, దక్షిణ దిక్కుగా ఉన్న ఆరు ఫ్లాట్లు P, Q, R, S, T, U లకు ఇచ్చారు
2. Q కు ఉత్తర దిక్కుగా ఉన్న ఫ్లాటు వచ్చింది కానీ S పక్క ఫ్లాట్ కాదు
3. S, U కు కర్ణాకారంలో (మూలలుగా) వ్యతిరేక దిశలో ఫ్లాట్లు వచ్చాయి
4. R పక్కలకు దక్షిణ ముఖంగా ఉన్న ఫ్లాటు, T కు ఉత్తర ముఖంగా ఉన్న ఫ్లాటు వచ్చింది
48. P, T ఫ్లాట్లు ఒకరికొకరివి మారితే ఎవరికి U ఫ్లాటు పక్కన వస్తుంది?
1) P 2) Q
3) R 4) T
49. కింది వాటిలో ఏ ఫ్లాట్ల సమూహానికి దక్షిణముఖంగా ఉన్న ఫ్లాట్లు వస్తాయి?
1) QTS 2) UPT
3) URP
4) సరిపడా సమాచారం లేదు
50. S, U కాకుండా ఏ జత ఫ్లాట్లు మూలగా వ్యతిరేక దిశలో ఒకదానికొకటి ఉన్నాయి?
1) Q, P 2) Q, R
3) P, T 4) T, S
51. Q, S కు మధ్యలో ఎవరి ఫ్లాటు ఉంది?
1) T 2) U 3) R 4) P
కింది సమాచారం ఆధారంగా 52 – 54 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
1. మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, అరటి, రాస్బెర్రి, ఆపిల్ అనే 8 చెట్లు రెండు వరుసల్లో ఉన్నాయి. ఒక్కోవరుసలో 4 ఉత్తరం, దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్నాయి
2. నిమ్మ, మామిడి, ఆపిల్ మధ్యలో ఉంది కానీ జామకు వ్యతిరేక దిశలో ఉంది
3. అరటి చెట్టు ఒక వరుస చివరన, జామకు సరిగ్గా కుడివైపు లేదా అరటి చెట్టు జామ చెట్టు తర్వాత ఉంది.
4. రాస్బెర్రీ చెట్టు ఒక వరుసకు చివరగా మామిడి చెట్టుకు మూలగా వ్యతిరేక దిశలో ఉంది
52. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1) బొప్పాయి చెట్టు సరిగ్గా ఆపిల్ చెట్టుకు దగ్గరగా ఉంది
2) ఆపిల్ చెట్టు సరిగ్గా నిమ్మ చెట్టు తర్వాత ఉంది
3) రాస్బెర్రి చెట్టు అయితే దానిమ్మకు
ఎడమవైపున లేదా తర్వాత ఉంది
4) దానిమ్మ చెట్టు మూలగా అరటి చెట్టుకు వ్యతిరేక దిశలో ఉంది
53. ఏ చెట్టు సరిగ్గా రాస్బెర్రీ చెట్టుకు వ్యతిరేకంగా ఉంది?
1) బొప్పాయి 2) దానిమ్మ
3) బొప్పాయి (లేదా) దానిమ్మ
4) సరిపడా సమాచారం లేదు
54. ఏ చెట్టు అరటి చెట్టుకు వ్యతిరేక దిశలో ఉంది?
1) మామిడి 2) దానిమ్మ
3) బొప్పాయి
4) సరిపడా సమాచారం లేదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?