Sociology – Group 2, 3 Special | నిర్మల్ పెయింటింగ్ ఏ చిత్రకళను పోలి ఉంటుంది?
తెలంగాణ సమాజం
1. స్టేట్మెంట్స్
ఎ. దేశంలో తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణం పరంగా 11వ స్థానంలో జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది
బి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978
సి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 73.44 శాతం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) బి, సి
2. తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వాలుగా పరిగణిస్తున్న బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ఎప్పుడు గుర్తించారు?
1) 2014, జూన్ 2 2) 2014, జూన్ 16
3) 2015, జూన్ 2 4) 2015, జూన్ 16
3. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సమ్మక్క-సారక్క జాతరను నిర్వహించే గిరిజన తెగ?
1) గోండ్ 2) కోయ
3) భిల్ 4) కొండ రెడ్లు
4. తెలంగాణలోని ఏ దేవాలయంలో హనుమంతుడు ఒక వైపు, నరసింహ స్వామి ముఖం మరొక వైపు కనిపిస్తుంది?
1) యాదాద్రి 2) కొండగట్టు
3) ధర్మపురి 4) కొమురవెల్లి
5. తెలంగాణలో 16వ శతాబ్దంలో ప్రారంభమైన నిర్మల్ పెయింటింగ్ ఏ చిత్రకళను పోలి ఉంటుంది?
1) విజయనగర 2) మొగల్
3) తంజావూరు 4) మెహర్గఢ్
6. బియ్యం పిండితో చెసే ఉత్తర తెలంగాణ వంటకం?
1) గట్క 2) సర్వపిండి
3) మురుకులు 4) మరమరాలు
7. తప్పుగా పేర్కొన్న అంశం?
1) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా 15.44 శాతం
2) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా 10.34 శాతం
3) ‘జయ జయహే తెలంగాణ’ అనే పాటను అందెశ్రీ రచించారు
4) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ముస్లిం జనాభా 12.69 శాతం
8. వెట్టి రూపం, రాష్ర్టాలను జతపర్చండి.
ఎ. సుమంగళి తిత్తమ్ 1. పశ్చిమ బెంగాల్
బి. గొట్టి 2. కేరళ
సి. బాదెన్ 3. తమిళనాడు
డి. కట్టునాయకిన్ 4. ఒడిశా
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
9. నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో వెట్టిని ఏమని పిలిచేవారు?
1) జీతం 2) బేగార్
3) భగేలా 4) కమియ
10. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వెట్టి వ్యవస్థను నిషేధించారు?
1) 23 2) 24 3) 40 4) 45
11. దేశంలో వెట్టి రద్దు ఆర్డినెన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1975, జూలై 25
2) 1975, ఆగస్టు 25
3) 1975, సెప్టెంబర్ 25
4) 1975, అక్టోబర్ 25
12. స్టేట్మెంట్స్
ఎ. జోగినులుగా మార్చబడుతున్న వారిలో 90 శాతం పైన 8 నుంచి 12 ఏండ్ల మధ్య వయస్సుగల దళిత బాలికలు ఉంటున్నారు
బి. షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్‌లో జోగినిల జనాభా కూడా ఎక్కువగా ఉంది
సి. 1922లో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆదిహిందూ సాంఘిక సదస్సులో జగన్ మిత్ర మండలి తరఫున భాగ్యరెడ్డి వర్మ జోగిని వ్యవస్థను నిషేధిస్తూ తీర్మానం చేశారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
13. జోగిని వ్యవస్థ ఆధారంగా 1979లో రూపొందించిన చలన చిత్రం?
1) జోగిని 2) ప్రత్యూష
3) వైదేహి 4) ఎల్లమ్మ కథ
14. మతం ముసుగులో వ్యభిచారం అనే పుస్తకాన్ని రచించింది?
1) బోయ జంగయ్య 2) వీఆర్ రాసాని
3) వకుళాభరణం లలిత
4) వీ శాంతి ప్రబోధ
15. తెలంగాణ ప్రభుత్వం జోగిని, దేవదాసీలను కూడా ఒంటరి మహిళలుగా పరిగణిస్తూ ఎప్పటి నుంచి ఆసరా పెన్షన్‌ను అందిస్తుంది?
1) 2015 2) 2016
3) 2017 4) 2018
16. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగిని, దేవదాసీ వ్యవస్థలను నిషేధిస్తూ చట్టాలను రూపొందించిన సంవత్సరం?
1) 1986 2) 1987
3) 1988 4) 1989
17. జతపర్చండి.
జోగిని/ దేవదాసీ రాష్ట్రం/ జిల్లా
ఎ. భవాని 1. కర్ణాటక
బి. బసివి 2. రంగారెడ్డి
సి. అంబాబాయి 3. కరీంనగర్
డి. మాతంగి 4. గోవా
ఇ. పార్వతి, శివపార్వతి
5. ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
4) ఎ-4, బి-1, సి-2, డి-5, ఇ-3
18. జోగిని, దేవదాసీ వ్యవస్థల నిర్మూలనలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్?
1) జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్
2) జస్టిస్ రఘునాథ రావు కమిషన్
3) జస్టిస్ రామచంద్రరాజు కమిషన్
4) జస్టిస్ నవీన్ రావు కమిషన్
19. జతపర్చండి.
ఎ. అంతర్జాతీయ బాలల దినోత్సవం 1. నవంబర్ 14
బి. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2. జూన్ 1
సి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం 3. నవంబర్ 20
డి. జాతీయ బాలల హక్కుల దినోత్సవం 4. జూన్ 12
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-4, సి-3, డి-1
20. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ?
1) లోక్ జంబీష్ 2) ప్రథమ్
3) ఎంవీ ఫౌండేషన్
4) బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక సంఘటన్
21. జతపర్చండి.
ఎ. బాలల జాతీయ చార్టర్ 1. 1989
బి. బాలల జాతీయ విధానం 2. 2003
సి. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కన్వెన్షన్ 3. 1974
డి. బాలల జాతీయ కార్యాచరణ ప్రణాళిక 4. 2005
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
22. స్టేట్మెంట్స్
ఎ. అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 11
బి. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24
సి. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల లింగ నిష్పత్తి (0-6 వయస్సు) 1000:988
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి
24. యునిసెఫ్ సహకారంతో దేశంలో బాలికల విద్యాసంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇంటర్నెట్ ఆధారిత పథకం?
1) సుకన్య బాలికల సమృద్ధి యోజన
2) ప్రమాణ్
3) డిజిటల్ జెండర్ అట్లాస్
4) మహానిర్మాణ్
25. బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం-2012 ప్రకారం బాలలు లైంగిక వేధింపులకు గురైన సందర్భంలో సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్?
1) 1097 2) 1096
3) 1908 4) 1098
26. తెలంగాణలో బాలల సంరక్షణ, వారి అభివృద్ధి కోసం 2015లో ఏర్పాటు చేసిన సంస్థ?
1) తెలంగాణ బాలికల సంరక్షణ సంస్థ
2) తెలంగాణ బాలికల సాధికారత సంస్థ
3) తెలంగాణ బాలికల సంరక్షణ, సాధికారత సంస్థ
4) తెలంగాణ బాలికల అభివృద్ధి సంస్థ
28. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల తీర్మానాన్ని ఎప్పుడు రూపొందించింది?
1) 1988, నవంబర్ 20
2) 1989, నవంబర్ 20
3) 1990, నవంబర్ 20
4) 1991, నవంబర్ 20
29. మానవ అక్రమ రవాణా, బాలికల విక్రయం, కిడ్నాపింగ్, బలవంతంగా వ్యభిచారంలోకి చేర్చిన బాలికలను, మహిళలను రక్షించి వారికి పునరావాసం కల్పించే పథకం?
1) విముక్తి-2006 2) ఉజ్వల-2007
3) భరోసా-2008 4) పరివర్తన్-2010
30. సర్వశిక్షా అభియాన్-2001 లక్ష్యాలను గుర్తించండి?
ఎ. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
బి. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం
సి. డ్రాపవుట్స్‌ను తగ్గించడం
డి. బాల్యవివాహాలను నిర్మూలించడం
ఇ. వలసల నివారణ
ఎఫ్. బాలలకు వృత్తి విద్యలో శిక్షణ అందించడం
1) ఎ, బి, సి, డి, ఇ 2) బి, సి, డి, ఇ, ఎఫ్
3) సి, డి, ఇ, ఎఫ్ 4) ఎ, బి, సి, డి, ఇ
31. సముదాయ ఆధారిత స్తరిత వ్యవస్థ..
1) తెలంగాణలో ఫ్లోరోసిస్ నివారణకు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్
2) తెలంగాణలో ఫ్లోరోసిస్ నివారణకు ఐఐటీహెచ్ నల్లగొండ, వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్
3) తెలంగాణలో ఫ్లోరోసిస్ నివారణకు చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్
4) తెలంగాణలో ఫ్లోరోసిస్ నివారణకు ఐఐటీ కాన్పూర్ ఆదిలాబాద్, వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్
32. తెలంగాణలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న నల్లగొండలో ఫ్లోరోసిస్ నివారణకు నల్లగొండ టెక్నిక్‌ను రూపొందించిన సంస్థ?
1) జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఢిల్లీ)
2) జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ (నాగపూర్)
3) జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (నాగపూర్)
4) జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ అభివృద్ధి సంస్థ (చెన్నై)
33. గ్రామాల నుంచి మొదట చిన్న పట్టణాలకు అక్కడి నుంచి పెద్ద నగరాలకు ప్రజలు వలస పోవడాన్ని ఏమని పిలుస్తారు?
1) సోపాన 2) తిరుగు
3) పరిణామ 4) పరివర్తన
34. ఆర్థికపరమైన కారకాలు, కారణాలు వలసలను ప్రధానంగా ప్రోత్సహిస్తాయని పేర్కొన్న శాస్త్రవేత్త?
1) జెలెన్స్కీ 2) రావెన్స్టీన్
3) ఎవరెట్ లీ 4) స్టీఫెన్ లాస్కీ
35. ఒక సంవత్సర కాలంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి వలస వచ్చిన వారి సంఖ్యకు ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారి సంఖ్యకు మధ్యగల తేడాను ఏమంటారు?
1) స్థూల వలస
2) పరివర్తన చెందిన వలస
3) ప్రాంత వలస 4) నికర వలస
36. ప్రపంచీకరణ నేపథ్యంలో జరగుతున్న వలస?
1) మేధో వలస
2) సీమంతర శ్రామిక వలస
3) స్థూల వసల 4) నికర వలస
23. పథకం, వాటి లక్ష్యాలను జతపర్చండి.
ఎ. జననీ సురక్ష యోజన 1. 2 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు వృత్తివిద్యలో శిక్షణ అందించడం
బి. వందేమాతరం 2. దేశంలో ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడం
సి. సబల 3. గర్భిణులకు ఆహార, ఆరోగ్య భద్రతలను కల్పించడం
డి. బాలకిరణాలు 4. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా
పౌష్టికాహారాన్ని అందించడం
1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-2, బి-3, సి-4, డి-1
27. ఐపీసీ సెక్షన్లు, అంశాలను జతపర్చండి.
ఎ. సెక్షన్ 293 1. మైనర్ బాలికలపై భర్త లైంగికంగా హింసించడం నేరం
బి. సెక్షన్ 315 2. బాలలను అసభ్యకరంగా చిత్రీకరించడం నేరం
సి. సెక్షన్ 372 3. భ్రూణ, శిశు హత్యలు నేరం
డి. సెక్షన్ 376 4. మైనర్ బాలికలను వేశ్య వృత్తి కోసం విక్రయించడం నేరం
1) ఎ-2, బి-4, సి-1, డి-3 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4 4) ఎ-2, బి-3, సి-4, డి-1
సమాధానాలు
1-3, 2-2, 3-2, 4-2,
5-1, 6-2, 7-2, 8-3, 9-3, 10-1, 11-4, 12-2, 13-.., 14-3, 15-3, 16-3, 17-4, 18-2, 19-4, 20-3, 21-3, 22-1, 23-4, 24-3, 25-4, 26-3, 27-4, 28-2, 29-2, 30-4, 31-2, 32-3, 33-1, 34-2, 35-4, 36-2, 37-3, 38-2.
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?