సంఘజీవి – సామాజిక నియంత్రణ

సీడీపీవో పరీక్షల ప్రత్యేకం
సామాజిక నియంత్రణ
రూసో తన గ్రంథమైన Social Contractలో మనిషి స్వేచ్ఛగా జన్మించాడు కానీ ప్రతిచోటా సంకెళ్లతో బంధింపబడుతున్నాడు అని పేర్కొన్నాడు. మనుషులు వారి ప్రవర్తనకు సంబంధించి నియంత్రణను సమాజం చేతిలో పెట్టడం జరిగింది. ఇలా సమాజం తన సభ్యులను వివిధ మార్గాల ద్వారా నియంత్రణలో పెట్టడాన్ని ‘సామాజిక నియంత్రణ’ అంటారు.
lసామాజిక నియంత్రణ వల్ల సామాజిక క్రమం, సామాజిక ఐక్యత, సామాజిక దృఢత్వం అలాగే సమాజంలో విపరీత సామాజిక ప్రవర్తనలపై నియంత్రణ కలిగి బలహీనులకు కూడా రక్షణ, భరోసా లభిస్తుంది.
lసామాజిక నియంత్రణ అనే భావనలో వ్యక్తి శ్రేయస్సు కంటే ‘సమాజ శ్రేయస్సే గొప్పది’ ఇది సమాజంలో, వ్యక్తిలో అంతర్లీనంగా ఉంటుంది.
lSocial Control అనే పదాన్ని మొదటిసారి స్మాల్&విన్సెంట్ 1874లో తమ గ్రంథమైన Introduction to The Study of Societyలో వినియోగించారు.
l ‘E Ross’ ‘Social Control’ గ్రంథాన్ని రచించాడు. Ross ప్రకారం Social Controlలో ప్రజాభిప్రాయం, చట్టం, నమ్మకాలు, మతం, ఆదర్శాలు వంటివి కీలకంగా పనిచేస్తాయి.
సామాజిక నియంత్రణ, నిర్వచనం
1. సమాజంలో శాంతిని, ఉమ్మడి నియమాలను నిర్వహించడానికి సమాజం ఉపయోగించే ఒత్తిడి తరహాలో సామాజిక నియంత్రణ – ‘ఆగ్బర్న్, నిమ్కాఫ్’
2. క్రమబద్ధతను కాపాడేందుకు, మానవ ప్రవర్తనను నియంత్రించడానికి సమాజం ఉపయోగించే పద్ధతులనే ‘Social Control’ అంటారు – ‘మన్హమ్’
3. ‘మెకైవర్’ అభిప్రాయంలో సమాజం దానంతటదే నియంత్రించుకోవడం ‘సామాజిక నియంత్రణ’
4. సమాజం తన సభ్యులను అమోదయోగ్యంగా ప్రవర్తనలకు కట్టుబడే విధంగా చేయడమే ‘సామాజిక నియంత్రణ’
సామాజిక నియంత్రణ రూపాలు/రకాలు – సామాజిక నియంత్రణ అనేది వివిధ రూపాల్లో సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే సమాజం వివిధ రూపాల్లో సమాజంలో సభ్యుల ప్రవర్తనను నియంత్రింస్తుంటుంది.
ముఖ్యమైన సామాజిక నియంత్రణ రూపాలు –
1. ప్రత్యక్ష సామాజిక నియంత్రణ
l మనుషుల ప్రవర్తనను అనునిత్యం ప్రత్యక్షంగా లేదా ముఖాముఖిగా నియంత్రించేవే ప్రత్యక్ష సామాజిక నియంత్రణ రూపాలు. ఇవి కుటుంబం, ఇరుగుపొరుగు, ఇతర ప్రాథమిక సమూహాల ద్వారా కొనసాగుతాయి.
2. పరోక్ష సామాజిక నియంత్రణ
l మనుషుల ప్రవర్తనను ఆచారాలు, సంప్రదాయాలు, చట్టాలు, సంస్కృతి, నైతిక విలువలు వంటి వాటి ద్వారా నియంత్రించడాన్ని పరోక్ష సామాజిక నియంత్రణ అంటారు.
3. సకారాత్మక సామాజిక నియంత్రణ
l మనుషుల ప్రవర్తనని ప్రతిఫలాలు, అవార్డులు, రివార్డులు, గుర్తింపు, బిరుదులు, బహుమతులు వంటి వాటి ద్వారా నియంత్రించడమే సకారాత్మక సామాజిక నియంత్రణ. సకారాత్మక సామాజిక నియంత్రణలో వ్యక్తిని శిక్షించడం కంటే పొగడటం కనపడుతుంది.
ఉదా. – మంచి నడవడిక కలిగిన బాలుడిని పొగిడినప్పుడు ఇతర బాలురు కూడా అలాంటి నడవడికను నేర్చుకుంటారు.
4. నకారాత్మక సామాజిక నియంత్రణ
l వ్యక్తుల ప్రవర్తనను శిక్ష, దండన, తిట్టడం, కోపించడం వంటి చర్యల ద్వారా సరైన దారిలో పెట్టడాన్ని నకారాత్మక సామాజిక నియంత్రణ అంటారు.
ఉదా. – అభిలషణీయం కాని ప్రవర్తనను చూపిస్తున్న వ్యక్తిని దండించడం ద్వారా ఆ వ్యక్తిలో, అది గమనిస్తున్న ఇతరుల్లో కూడా మార్పు వస్తుంది
5. నియత సామాజిక నియంత్రణ
l మనుషుల ప్రవర్తనని రాత పూర్వకంగా, అధికార పూర్వకంగా ఏర్పరుచుకున్న నియమాలు, నిబంధనలు, విధానాల ద్వారా నియంత్రించడం
ఉదా. చట్టాలు, జైళ్లు కోర్టులు వంటి వాటిద్వారా సామాజిక నియంత్రణను చేపట్టడం.
6. ఇతర సామాజిక నియంత్రణ రూపాలు
l ‘హౌస్’ ప్రకారం సామాజిక నియంత్రణ అనేది ప్రధానంగా 2 రకాలు –
1. అధికారపూర్వక నియంత్రణ పద్ధతులు
2 అనుశాసన పూర్వక, ప్రతికాత్మక
నియంత్రణ పద్ధతులు
l ‘బెర్నాల్డ్’ ప్రకారం సామాజిక నియంత్రణ
1. చచేతన పూర్వక సామాజిక నియంత్రణ
2. అచేతనపూర్వక సామాజిక నియంత్రణగా ఉంటుంది
l సామాజిక నియంత్రణని సమూహ సామాజిక నియంత్రణ, సంస్థాగత సామాజిక నియంత్రణగా కూడా వర్గీకరించవచ్చు.
సామాజిక నియంత్రణ స్వభావం, లక్షణాలు
l ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాల్లో ఉంటుంది అంటే ఇది విశ్వవ్యాప్తమైనది.
l ఇది తనను తాను నియంత్రించుకుంటుంది
l ఒక సమాజానికి మరో సమాజానికి మధ్య సామాజిక నియంత్రణ పద్ధతుల వాడుకలో తేడాలు ఉండవచ్చు
l సామాజిక నియంత్రణ అనేది సమాజంలో ప్రతి సభ్యుడిపై తన ప్రభావాన్ని చూపెడుతుంది
l సమాజం పుట్టుక నుంచే సామాజిక నియంత్రణ ఉంది
l సామాజిక నియంత్రణ ఎళ్లప్పుడూ సామాజిక సంఘీభావానికి, సామాజిక అన్యోన్యతకు ప్రయత్నిస్తుంది
l సమాజంలోని వ్యక్తుల మధ్య పరస్పర ఆధారతలు, అన్యోన్యతలు ఉండాలంటే సామాజిక నియంత్రణ తప్పనిసరి
l సామాజిక నియంత్రణ అనేది మానవ సమాజాన్ని జంతు సమాజం నుంచి వేరుచేస్తుంది
సామాజిక నియంత్రణ సాధనాలు-
l సమాజంలో వ్యక్తుల ప్రవర్తనను నియంత్రిం చేందుకు వినియోగించే మార్గాలనే సామాజిక నియంత్రణ సాధనాలంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలు అవి…
1. నియత సామాజిక నియంత్రణ సాధనాలు
ఉదా. విద్య, చట్టం, కోర్టులు, నియమాలు నియంత్రణలు, కారాగారాలు మొదలైనవి
2. అనియత సామాజిక నియంత్రణ సాధనాలు
ఉదా. సంప్రదాయ బంధనాలు, కర్మలు, కట్టుబాట్లు, ఆచారాలు, మతం, జానపద రీతులు, మర్యాదలు మొదలైనవి
ఉదా. సంప్రదాయ నిబంధనలు, కర్మలు, కట్టుబాట్లు, ఆచారాలు, మతం, జానపద రీతులు, మర్యాదలు, మొదలైనవి
జానపద రీతులు –
l ‘William Graham Summer’ తన ‘Folkways’ గ్రంథంలో మొదటిసారి జానపద రీతులు లేదా Folkways అనే పదాన్ని ఉపయోగించారు. మనుషులు తరచూ చేసే చిన్నచిన్న ప్రవర్తన రూపాలు లేదా సాధారణ అలవాట్లు Folkways అంటారు.
ఉదా. Taking Bath Daily, Greeting Friends, Respecting Elders, Having food with Right Hand, Indoor Dressing Pattern, Outdoor Dressing Pattern, Winter and Summer Dressing Patterns.
l జానపద రీతులు ఎక్కడ రాసిపెట్టి ఉండవు కానీ సామాజిక వారసత్వంగా వస్తాయి. సమాజానికి భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వం, చట్టం వీటిని పాటించమని ఒత్తిడి చేయవు.
l నిత్యజీవితంలో మనుషులు చేసే చిన్న చిన్న కార్యక్రమాలే ‘జానపద రీతులు’.
సామాజిక రీతులు
l సమాజం కచ్చితంగా సూచించే ప్రవర్తన రీతులనే సామాజిక రీతులని ‘సమ్సర్’ తెలిపారు. సామాజిక రీతులు ఈ కింది రకాలుగా ఉంటాయి. అవి…
1. చేయవలసిన రీతులు
ఉదా. తల్లిదండ్రులను సంరక్షించడం, స్త్రీలను గౌరవించడం, దేశభక్తిని కలిగి ఉండటం
2. చేయకూడని రీతులు
వీటినే Negative Mores లేదా Donts అంటారు. వీటినే నిషేధాలు లేదా టాబూలని కూడా అంటారు.
ఉదా. దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు. రక్త సంబంధీకుల మధ్య వివాహం ఉండకూడదు లాంటివి. టాబూలనే అలిఖిత చట్టాలు అని కూడా అంటారు.
నోట్ – సుదీర్ఘ కాలం పాటు ప్రజలు పాటిస్తున్న ఉమ్మడి అలవాట్లను ఆచారాలు అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. రూసో సామాజిక ఒడంబడిక గురించి
ఏ గ్రంథంలో వివరించారు?
ఎ) Organismic Theory of Society
బి) Social Contract Theory
సి) Group Mind Theory
డి) Theory of Communication
2. సమాజాన్ని ఒక జీవితో పోల్చి సమాజాన్ని ‘Social Organism’ గా పిలిచింది ఎవరు?
ఎ) Auguste Comte బి) Ginsberg
సి) Herbert Spencer డి) Mac Iver
3. పాజిటివ్ ఫిలాసఫీ గ్రంథం రచించింది?
ఎ) ఆగస్ట్ కోమ్టే బి) ఘర్యే
సి) స్పెన్సర్ డి) ప్లేటో
4. సామాజిక చర్యలపై అవగాహన కలిగించేదే సమాజశాస్త్రం అని తెలిపిందెవరు?
ఎ) ఆగస్కామ్టే బి) ఘర్యే
సి) స్పెన్సర్ డి) మాక్స్‌వెబర్
5. Socious అనేది ఏ భాష పదం?
ఎ) గ్రీక్ బి) లాటిన్
సి) ఇంగ్లిష్ డి) రోమ్
6. సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజం అని తెలిపింది ఎవరు?
ఎ) కూలే బి) గిడ్డింగ్స్
సి) లేడియర్ డి) మెకైవర్
7. కింది వాటిలో సమాజం లక్షణం కానిది?
ఎ) పరస్పర చర్యలుంటాయి
బి) వ్యవస్థీకృతమై ఉంటుంది
సి) ప్రకర్యాలుంటాయి
డి) ప్రత్యేక సంస్కృతి ఉంటుంది
ఇ) ఏదీకాదు
8. ప్రతి సమాజం స్వతంత్రమైనదే అని తెలిపింది ?
ఎ) జాన్సన్ బి) మెకైవర్
సి) ప్లేటో డి) అరిస్టాటిల్
9. జెమిన్ షాప్ట్, జేషల్ షాప్ట్ అనే భావనలను తెలిపింది?
ఎ) ఫెర్టినాండ్ టెనిస్ బి) హరలాంబాస్
సి) గిడ్డింగ్స్ డి) డర్క్హైం
10. జెమిన్ షాప్ట్ అంటే?
ఎ) సమాజం బి) సంఘం
సి) సముదాయం డి) సమూహం
11. ఎవరు సమాజాలను మిలిట్రీ, పారిశ్రామిక, ఆధునిక సమాజాలుగా వర్గీకరించారు?
ఎ) స్పెన్సర్ బి) ముర్దాక్
సి) ఆగస్ట్ కామ్టే డి) టాల్కాట్ పర్సన్
12. జానపద సమాజాలు అనే భావనను తెలిపింది ఎవరు?
ఎ) గిడ్డింగ్స్ బి) కారల్ మార్క్స్
సి) ముర్దాక్ డి) రాబర్ట్ రెడ్‌ఫీల్డ్
13. మోర్గాన్ అభిప్రాయం ప్రకారం సమాజ కాలక్రమాన్ని గుర్తించండి.
ఎ) హింసాత్మక సమాజం – అనాగరిక సమాజం – నాగరిక సమాజం
బి) అనాగరిక సమాజం – హింసాత్మక సమాజం – నాగరిక సమాజం
సి) దిమ్మరి సమాజం – పశుపోషణ సమాజం – వ్యవసాయ సమాజం
డి) పశుపోషణ సమాజం – వ్యవసాయ సమాజం – పారిశ్రామిక సమాజం
14. సమాజంలో మొదటగా ఆదిమ కమ్యూనిజం ఉండేదని అభిప్రాయపడింది ఎవరు?
ఎ) ఏంగెల్స్ బి) కారల్‌మార్క్స్
సి) గిడ్డింగ్స్ డి) ఆగస్ట్ కామ్టే
15. సముదాయం అనే భావనకు ఎవరిని పితామహుడిగా పేర్కొంటారు?
ఎ) బోగారస్ బి) వెబర్
సి) ఫెర్టినాండ్ టెనిస్ డి) మెకైవర్
16. Community అనే ఆంగ్లపదం ఏ పదం నుంచి తీసుకున్నారు?
ఎ) Common బి) Communis
సి) Communico డి) ఎ, బి
17. స్థిరనివాసాలను సూచించేదే సముదాయం అని తెలిపిందెవరు?
ఎ) మకైవర్ బి) ఫెజ్
సి) బోగార్డస్ డి) ఎ, బి
18. సముదాయం అనే భావనకు సంబంధించి కింది వాటిని సరిగా జతపరచండి.
1. సామాన్య ఆసక్తులే సముదాయం ఎ. వెబర్
2. మేము అనే పరస్పర భావం కలిగి
ఉండటమే సముదాయం
బి. బోగార్డస్
3. ఉమ్మడి భౌగోళికతే సముదాయం
సి. కింగ్స్లే డేవిస్
4. ఒకే స్థానికత కలిగి
ఉండే సమూహమే సమాజం డి. ఆగ్బర్న్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

Elr
- Tags
- MAN
- nipuna
- social
- Social regulation
RELATED ARTICLES
-
Group 2,3 Special | ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
-
Group I Special | భారతదేశ వ్యవసాయ లక్షణాలు-రైతు కూలీల స్థితిగతులు
-
Group I Special – General Essay | కచ్ఛదీవు వివాదం.. భారత్, శ్రీలంక మధ్య వాగ్వాదం
-
Group I Special | జనాభా మార్పునకు తోడ్పడే ముఖ్య కారకాలు?
-
TSPSC Groups Special | జాతీయ మహిళా సాధికారత సంవత్సరం ఏది?
-
Economy – Group I Special | సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రైతుల ఆదాయం పెంచే అంశాలు
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education