ఆర్బీఐ సంప్రదాయక నిర్వహణ విధులు
ఎకానమీ
- బ్యాంకింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా / అత్యున్నత సంస్థగా / అపెక్స్ బ్యాంక్‌గా కేంద్రబ్యాంకు తన పాత్ర నిర్వహిస్తుంది.
- బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తూ మార్గదర్శకంగా పని చేయడం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడం కేంద్రబ్యాంకు ప్రధాన విధి
- భారతదేశంలో కేంద్ర బ్యాంకును రిజర్వుబ్యాంకుగా పేర్కొంటారు.
భారతీయ రిజర్వుబ్యాంకు విధులు
భారతదేశంలో ఆర్బీఐ నిర్వహించే విధులను రెండు రకాలుగా విభజింవచ్చు.
1. సంప్రదాయక నిర్వహణ విధులు
2. అభివృద్ధి ప్రోత్సాహక విధుల
కరెన్సీ నోట్ల జారీ
- ఒక రూపాయి నోటు, అన్ని నాణేలు తప్ప అన్ని కరెన్సీ నోట్ల ముద్రణ జారీలో ఆర్బీఐ గుత్తాధిపత్యం కలిగి ఉంది.
- ఆర్బీఐ చట్టం 1934ను 1956 సవరించి కనీస నిల్వల పద్ధతి ప్రవేశ పెట్టారు. ఆ తరువాత 1957లో మళ్ళీ సవరించి కనీస నిల్వల పద్ధతి ఆధారంగా 200 కోట్ల విలువతో సమానమైన బంగారం, విదేశీ కరెన్సీ రూపంలో ఆర్బీఐ వద్ద నిల్వ ఉంటుంది.
ఆర్బీఐ ప్రభుత్వానికి బ్యాంకరు, సలహాదారు, ఏజెంటు
- ఆర్బీఐ ప్రభుత్వానికి బ్యాంకరుగా సలహాదారుగా ఏజెంటుగా పనిచేస్తుంది.
- ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకరుగా, సలహాదారుగా, ఏజెంటుగా వ్యవహరిస్తుంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు నిల్వలను డిపాజిట్లుగా ఆర్బీఐ స్వీకరిస్తుంది. ప్రభుత్వం తరపున చెల్లింపులు చేస్తుంది.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాల వ్యవధితో కూడిన స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ‘ఓవర్ డ్రాఫ్ట్’ సౌకర్యం కల్పిస్తుంది
.
ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌లో భాగంగా ప్రభుత్వం తరఫున అమ్మడం, కొనడం ఆర్బీఐ చేస్తుంది. - కేంద్ర రాష్ర ప్రభుత్వాల అకౌంట్లను నిర్వహిస్తుంది. అంటే వాటి చెల్లింపులు చేస్తుంది. రుణాలను ఇస్తుంది. అంటే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్‌ను క్రీయశీలకంగా నిర్వహిస్తుంది.
- ఆర్బీఐ ప్రభుత్వం తరుపున జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో పాల్గొని తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది.
- ఆర్బీఐ ప్రభుత్వానికే కాకుండా బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది.
బ్యాంకులకు బ్యాంకు
- ఆర్బీఐ చట్టం 1934, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం 1949 ప్రకారం ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. అంటే ఒక కొత్త వాణిజ్య బ్యాంకును ఏర్పాటు చేయాలన్నా ఒక బ్యాంకు శాఖను ప్రారంభించాలన్నా ఆర్బీఐ అనుమతి పొందాలి.
- lబ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ రూపంలో ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి.
- ప్రతిబ్యాంకు వారం, వారం తమ వ్యవహారాలను ఆర్బీఐకి నివేదించాలి.
- దేశంలోని అన్ని ద్రవ్య సంస్థలకు ఆర్బీఐ అంతిమ రుణ దాతగా పనిచేస్తుంది.
- వాణిజ్య బ్యాంకులు ద్రవ్య కొరతను ఎదుర్కొన్నప్పుడు, తమవద్ద ఉన్న బాండ్లను, ట్రెజరీ బిల్లులను, సెక్యూరిటీలను హామీగా ఉంచుకుని ఆర్బీఐ నుంచి రుణం పొంద వచ్చు.
అంతిమ రుణదాత
- అర్హత గల బిల్లులను ఆర్బీఐ రీడిస్కౌంట్ చేస్తుంది. అవసరమైతే తిరస్కరించవచ్చు కూడా.
క్లియరింగ్హౌస్ల నిర్వహణ
- బ్యాంకుల మధ్య లావాదేవీలను నగదుతో ప్రమేయం లేకుండానే క్లియరెన్స్ హౌస్‌ల ద్వారా ఆర్బీఐ పరిష్కరిస్తుంది.
- ఆర్బీఐ ఈ క్లియరింగ్ హౌస్‌లను పెద్ద, పెద్ద నగరాల్లో అంటే ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్ కాన్పూర్, పాట్నా, నాగపూర్లలో ఏర్పాటు చేసింది.
- క్లియరెన్స్ హౌస్‌లు లేని చోట ఆర్బీఐ ప్రతినిధిగా ఎస్బీఐ పనిచేస్తుంది.
పరపతి నియంత్రణ
- వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి వల్ల ఆర్థికవ్యవస్థలో ఏర్పడే ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణాలను నియంత్రించడానికి ఆర్బీఐ పరిణామాత్మక (బ్యాంకురేటు ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్, రెపోరేటు, రివర్స్ రెపోరేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు) గుణాత్మక మార్జిన్లు, పరపతి రేషనింగ్, ప్రత్యక్ష చర్య, నైతిక ఉద్బోధ, వినియోగదారుల పరపతి నియంత్రణ) పద్ధతులను ఆర్బీఐ ఉపయోగిస్తుంది.
విదేశీ మారక ద్రవ్య సంరక్షణ
- దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మారకం రేటును స్థిరంగా ఉంచడానికి అమ్మకం కొనుగోళ్ళను / ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్బీఐ క్రమబద్ధం చేస్తుంది.
పర్యవేక్షక విధులు
- పర్యవేక్షక లక్ష్యాలను సాధించడానికి ఆర్బీఐ దేశంలోని వాణిజ్య బ్యాంకులకు లైసెన్స్‌లను జారీ చేయడం, తనిఖీ చేయడం, సమాచారం కోరడం పర్యవేక్షణ చేయడం చేస్తుంది.
సమాచార సేకరణ ముద్రించడం
- ప్రతి వారం, పక్షం, నెల, త్రైమాసిక, ఆర్ధ వార్షిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని బులెటిన్ల రూపంలో ఆర్బీఐ ముద్రిస్తుంది.
బ్యాంకింగ్ పదజాలం
ఓపర్డ్రాఫ్ట్
ఖాతాదారుడు తమ ఖాతాలో ఉన్న సొమ్ముకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి బ్యాంకు అనుమతి ఇస్తే దానిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కరెంట్ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది.
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్-క్యాష్ రిజర్వు రేషియో)
- వాణిజ్య బ్యాంకులు తమవద్ధ ఉన్న డిపాజిట్లలో కొంతభాగాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద హామీరూపంలో ఉంచాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. దీనిని ఆర్బీఐ నిర్దేశిస్తుంది.
చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్ – స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో)
వాణిజ్య బ్యాంకులు తన మొత్తం ఆస్తుల్లో కొంత భాగాన్ని ఆస్తులు / నగదు రూపంలో తమ వద్ధ నిల్వ ఉంచుకోవాలి. దీనినే ‘చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి’ అంటారు.
బహిరంగ మార్కెట్ వ్యవహారాలు (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్)
- కేంద్ర బ్యాంకు కొనే అమ్మే, సెక్యూరిటీ వ్యవహారాలను ‘బహిరంగ మార్కెట్ వ్యవహారాలు’ అంటారు.
మార్జిన్ నిర్ణయం
- కేంద్రబ్యాంకు రుణాలు ఇచ్చేటపుడు విలువైన వస్తువులను హామీగా పెట్టుకొని వాటి వాస్తవ విలువ కంటే తక్కువ ద్రవ్యాన్ని రుణాలుగా మంజూరు చేస్తుంది. అంటే తనఖా వస్తువుల వాస్తవిక విలువకు, రుణ విలువకు మధ్య గల తేడానే ‘మార్జిన్’ అంటారు.
నైతికోద్బోధ (Moral Suasion)
- ఆర్బీఐ తమ దిశ నిర్దేశాలను సలహాలను పాటించమని వాణిజ్య బ్యాంకులను కోరడాన్ని నైతిక ఉద్బోధ అంటారు.
పరపతి క్రమబద్దీకరణ
- ఆర్బీఐ రుణాలిచ్చే పద్ధతుల్లో మార్పులు తేవడాన్ని ‘పరపతి క్రమబద్దీకరణ’ అంటారు.
చట్టబద్ధ ద్రవ్యం (Legal Tender Money)
- వివిధ వస్తు సేవల కొనుగోళ్లకు (వినిమయ మాద్యంగా) చట్ట బద్ధంగా అందరూ అంగీకరించే ద్రవ్యాన్ని ‘చట్టబద్ధ ద్రవ్యం’ అంటారు.
1. కింది వాటిలో బ్యాంకింగ్ వ్యవస్థకు అత్యున్నత బ్యాంకు అపెక్స్ బ్యాంకు ఏది?
ఎ) ఎస్బీఐ బి) ఆర్బీఐ
సి) ఇంపీరియల్ బ్యాంక్
డి) యూనియన్ బ్యాంకు
2. కింది వాటిలో ప్రభుత్వానికి బ్యాంకరుగా, సలహాదారుగా ఏజెంటుగా పనిచేసేది ఏది?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీఐ
సి) ప్రపంచ బ్యాంకు
డి) ఇంపీరియల్ బ్యాంకు
3. కరెన్సీ నోట్ల ముద్రణ జారీలో ఏ బ్యాంకు గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది.
ఎ) భారతీయ స్టేట్ బ్యాంకు
బి) భారతీయ రిజర్వు బ్యాంకు
సి) యూనియన్ బ్యాంకు
డి) వాణిజ్య బ్యాంకు
4. ప్రభుత్వం తరఫున సెక్యూరిటీల విషయంలో ఓపెన్ మార్కెట్ వ్యవహా రాలను నిర్వహించేది ఏది?
ఎ) వాణిజ్యబ్యాంకు బి) కేంద్ర బ్యాంకు
సి) భారతీయ స్టేట్ బ్యాంకు డి) పైవన్నీ
5. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ వ్యవహారాలను క్రియాశీలంగా నిర్వహించే బ్యాంకు ఏది?
ఎ) యూనియన్ బ్యాంక్
బి) భారతీయ స్టేట్ బ్యాంకు
సి) భారతీయ రిజర్వు బ్యాంకు
డి) ప్రపంచ బ్యాంకు
6. కిందివాటిలో ఆర్బీఐ విధులు ఏవి?
ఎ) కరెన్సీ నోట్ల ముద్రణ జారీ చేయడం
బి) ప్రభుత్వానికి బ్యాంకుగా ఉండటం
సి) బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం
డి) పైవన్నీ
7. ఒక నూతన బ్యాంకును ఏర్పాటు చేయాలన్నా ఒక బ్యాంకు శాఖను ప్రారంభించాలన్నా దేని అనుమతి పొందాలి
ఎ) ప్రభుత్వం బి) ఎస్బీఐ
సి) ఆర్బీఐ డి) ప్రాంతీయ బ్యాంకు
8. కింది వాటిలో అంతిమ రుణదాతగా వ్యవహరించే బ్యాంకు ఏది?
ఎ) వాణిజ్య బ్యాంకు
బి) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు
సి) స్టేట్ బ్యాంకు డి) రిజర్వు బ్యాంకు
సమాధానాలు
1-బి 2-ఎ 3-బి 4-బి
5-సి 6-డి 7-సి 8-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు