టెక్నాలజీలో ముందడుగు-అభివృద్ధిలో మరోఅడుగు
సమాచార సాంకేతిక పరిజ్ఞానం
- సేవా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులోని ఉపరంగాలైన సమాచార సాంకేతిక పరిజ్ఞానం వల్ల గణనీయంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పవచ్చు.
- ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది.
- ఐటీ రంగంలో ప్రత్యేకించి డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్ మొదలైన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ విధానం రూపొందించింది.
- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ హబ్‌లలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఒకటి.
- దేశంలోని ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా-12 శాతం
దేశంలో ఐటీ రంగం నుంచి వస్తున్న ఆదాయంలో హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. - తెలంగాణ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఐటీ రంగం ఎగుమతులు సుమారు 68 శాతం వరకు ఉన్నాయి.
- తెలంగాణ ఐటీ ఉద్యోగాల కల్పన 7.2 శాతం ఉంటే జాతీయ సగటుగా 4.9 శాతంగా ఉంది.
- 2019-20లో రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్, ఐటీ ఎగుమతుల విలువ 1.3 లక్షల కోట్లు.
- 2018-19 తో పోలిస్తే 2019-20 సంవర్సరంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. కానీ జాతీయ సగటు 8.1 శాతంగా నమోదు అయింది.
- 2019-20లో మన రాష్ట్రం ఉద్యోగాలు కల్పనలో భారత్‌లో 19.1 శాతం వాటా కలిగి ఉంది.
ఐటీసీ విధాన చట్రం -2016
- భౌగోళిక ప్రాంతం దృష్ట్యా తెలంగాణ ఐటి పరిశ్రమకు కేంద్రంగా ఉంది.
- తెలంగాణ ప్రభుత్వం 2016లో తన తొలి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీని ప్రవేశ పెట్టింది.
- ఐటీసీ పాలసీ -2016 లక్ష్యాలు
ఐటీ సంస్థల స్థాపన ఎదుగుదల ఆరోగ్యకరమైన పోటీలో కంపెనీలు పోటీ పడటానికి అనువైన వాతావరణం ఏర్పాటు - ఎగుమతుల మొత్తం పెంచడం ద్వారా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పెంచటం
- ఈ రంగానికి సంబంధించి కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య సామర్థ్యం పెంపునకు ప్రోత్సహించడం
- రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఐటీని విస్తరించడం
- ప్రాంతీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సమాచార టెక్నాలజీని సాధనంగా ఉపయోగించడం.
- ఐటీసీ విధానం -2016 ప్రోత్సాహకాలు
ప్రభుత్వ భూమి కేటాయింపు - విద్యుత్ సరఫరాలో రాయితీ
- లీజు లేదా సబ్సిడీ రీఫండ్ చేయడం
- స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు, ట్రేడ్ మార్కు నాణ్యత, బదిలీ డ్యూటీ ధుృవీకరణ సర్టిఫికెట్, ఎగ్జిబిషన్ స్టాల్ కిరాయి మొదలైన ఖర్చులను తిరిగి చెల్లించడం.
- ఐటీసీ విధానం – విజన
రాష్ర్టాన్ని ఐటీ కంపెనీలకు అత్యంత ప్రాధాన్యత గల కేంద్రంగా తీర్చిదిద్దడం. - కీలకమైన టెక్నాలజీలను పెంపొందించడంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలపడం.
- పౌర సేవలను మెరుగుపరచడానికి ఐటీ సాధనాలను వినియోగించడం.
- పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో ముందుకొస్తున్న అవకాశాలను అత్యుత్తమంగా వినియోగించుకునేలా పౌరులకు సాధికారత కల్పించడం.
- దేశంలో టెక్నాలజీ పారిశ్రామికత్వానికి, ఇన్నోవేషన్‌కు ప్రముఖ ప్రపంచ కేంద్రంగా మార్చడం.
రెండో ఐటీసీ విధానం (2021-26)
- 2వ ఐటీసీ పాలసీని 2021లో ప్రారంభించారు. తెలంగాణ రెండో ఐటీసీ విధానం పౌరుల డిజిటల్.సాధికారత, ఆవిష్కరణ, వ్యవస్థాపకత వృద్ధి పెంచడానికి చోదకంగా పనిచేస్తుంది.
- 2020-21లో తెలంగాణ రాష్ట్రంలోని ఎగుమతులు రూ. 1.45 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి 3 లక్షల కోట్లకు పెంచాలనేది లక్ష్యం.
- ఐటీ ఆధారిత సేవల యూనిట్ల విస్తరణ
కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి వచ్చి తమ యూనిట్లను ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించడం. - ఐటీ ఆధారిత కంపెనీలను హైదరాబాద్‌లో కాకుండా ఇతర నగరాల్లో విస్తరించే విధంగా ప్రోత్సహించడం
ఎలక్ట్రానిక్స్. - మౌలిక వసతుల సహకారం కల్పించడం, అనుకూల విధాన వాతావరణాన్ని అందించడం, హైదరాబాద్‌ను ఎలక్ట్రానిక్స్, డిజైన్ పరిశ్రమకు ప్రపంచ కేంద్రంగా మార్చడం.
- తెలంగాణ రాష్ట్రం రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను (ఈఎంసీ) ఏర్పాటు చేస్తుంది.
ఎ) మహేశ్వరం సైన్సు పార్కు (600 ఎకరాలు)
బి) ఇ-సిటీ రావిర్యాల (310 ఎకరాలు)
సి) ఎల్ఈడీ ఉత్పత్తి, విడిభాగాల అసెంబ్లింగ్ యూనిట్ కోసం ఎల్ఈడీ పార్క్ నిర్మించారు. - డిజిటల్ తెలంగాణ
ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని బ్రాడ్ బ్యాండ్ ద్వారా అనుసంధానిచండం వై-ఫై సౌకర్యాన్ని కల్పించడం, 100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడం దీని లక్ష్యం. ప్రతి వ్యక్తికి డిజిటల్ వసతులు అందేలా చూడటం.
లక్ష్యాలు
- వాటర్‌గ్రిడ్ కందకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను వేయడం.
- ప్రధాన నగరాలు, పట్టణాల్లో వై-ఫై
- రాష్ట్రం మొత్తం 4జీ సేవలు కల్పించడం
- ప్రతిగ్రామ పంచాయతీలో అన్ని సేవలు అందే విధంగా ఇ- పంచాయతీ పథకం.
డిజిటల్ తెలంగాణ కార్యక్రమాలు
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (టీ-ఫైబర్)
- ఇది అధిక నాణ్యత దీర్ఘకాలిక మన్నిక కలిగిన పటిష్టమైన సురక్షితమైన ఆధునిక డిజిటల్ నెట్వర్క్ గల మౌలిక వసతి.
- రాష్ట్రం మొత్తానికి తక్కువ ధరలో హైస్పీడ్ బ్యాండ్ అనుసంధానించడం దీని లక్ష్యం.
- తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌ను 2015లో ప్రారంభించింది.
- దీని ద్వారా 10 జోన్లు (33 జిల్లాలకు) డిజిటల్ సేవలు అనుసంధానించబడతాయి.
- టీ-ఫైబర్ పనులు 2021 నాటికి పూర్తి అవుతాయని అంచనా
Tire-II నగరాలను IT-Hub అభివృద్ధి చేయడం. - ఐటీ టవర్స్ వంటివి వరంగల్, కరీంనగర్, ఖమ్మం మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో నిర్మించడం ద్వారా ఐటీ వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
- హైదరాబాద్ పశ్చిమ కారిడార్‌లో వృద్ధిని కొనసాగిస్తూ నగరం చుట్టూ ఐటీరంగం వృద్ధిని విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
హైదరాబాద్, పరిసరాల్లో కొత్త ఐటీ క్లస్టర్లు
- పశ్చిమ కారిడార్ వెలుపల కస్టర్లలో యూనిట్లను స్థాపించడానికి ITES కంపెనీలు గ్రిడ్ విధానాన్ని ప్రారంభించాయి.
కొంపల్లిలో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తుంది. - కొల్లూర్‌లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది.
- నూతన ఐటీ క్లస్టర్లును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి, ఉప్పల్ పోచారం, కొంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్ వరకు విస్తరిస్తున్నాయి.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
- తెలంగాణ నూతన ఆవిష్కరణల పాలసీలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌ను 2017లో ప్రారంభించారు.
- రాష్ట్రంలో ఇది సింగిల్ విండో ద్వారా స్టార్టప్‌లను, ఇంక్యుబేటర్ ఏర్పాటును పోత్సహిస్తుంది.
- ఇప్పటివరకు 100 ఆవిష్కరణలకు సహాయం చేస్తుంది.
- వ్యవస్థాపక సంస్కృతిని ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలు, పాఠశాలల్లో ఆవిష్కరణలు, సామాజిక ఆవిష్కరణలు ఇన్నోవేషన్ డిఫ్యూజన్ సహకారం, గ్రాస్ రూట్ ఆవిష్కరణల విభాగాల్లో పనిచేస్తుంది.
సాఫ్ట్‌నెట్
- సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ (ITC&C)ఆధ్వర్యంలో పని చేస్తుంది.
- 2002 నుంచి ఎర్త్ స్టేషన్ కూడా పనిచేస్తుంది.
టీ శాట్
- ITC&C ఆధ్వర్యంలో గల టీ-శాట్ నెట్వర్క్ ఛానల్ ద్వారా కొవిడ్-19 ఈ పాండమిక్ సమయంలో విద్యార్థులకు అంగన్ వాడీ పిల్లలకు 12 గంటలు తరగతులు అందించింది.
టీ-హబ్
- 2015 నవంబర్ 5న గచ్చిబౌలిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
- దీన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) ఏర్పాటు చేశారు.
- దీనిని ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థతెలంగాణ ప్రభుత్వం
ఐఐటీ హైదరాబాద్
ఐఎస్బీ- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ - నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్)
కొత్తతరం యువకులతో అంతర్గతంగా ఉన్న వ్యాపార స్ఫూర్తిని పెంపొందించేటకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉపాధి కల్పన సంపద సృష్టించడం ద్వారా హైదరాబాద్ నగరంలో ఐటీ, వ్యాపార సంస్థలకు సహజమైన పునాదిగాను ఒక క్రియాశీల సృజనాత్మక వ్యవస్థగా రూపొందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. - టీ హబ్ ద్వారా 1100 మందికి జాతీయ, అంతర్జాతీయ అంకుర సంస్థలకు సహాయం అందించింది.
- 70000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టీ హబ్ భవనం హైదరాబాద్‌కు మైలురాయిగా నిలిచింది.
టెక్నాలజీ హబ్
- 22 స్టార్టప్‌లకు కన్సల్టింగ్ సెషన్లను టీహబ్‌లో అనుబంధించిన టీ-ఫండ్‌కు 2021-2022 రాష్ట్ర బడ్డెట్లో రూ.15 కోట్లు కేటాయించారు.
- టీ-హబ్, టీఎస్‌హెచ్‌సీ, ఇతర పర్యాటక వ్యవస్థల భాగస్వాములతో కలిసి పనిచేస్తూ తెలంగాణలో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
మహిళా పారిశ్రామిక వేత్తల హబ్ (We-Hub)
- దేశంలోనే మొదటిసారిగా మహిళ వ్యవస్థా పకులను ప్రోత్సహించడానికి ఇంక్యుబేటర్, అంకుర సంస్థలను తీర్చిదిద్దడానికి తెలంగాణలో 2018లో మహిళా పారిశ్రామిక వేత్తల హబ్‌ను ప్రారంభించారు.
- 2018 నుంచి We-Hub ద్వారా 4527 మహిళా పారిశ్రామిక వేత్తల ద్వారా 1495 అంకుర కార్యక్రమాల ద్వారా విద్యార్థి మార్గదర్శకత్వం, సామర్థ్యంపెంపు, హకదాన్, క్రెడిట్ అంశాలు నిర్వహించింది.
- రాష్ట్రంలోని కొత్త మహిళా పారిశ్రామిక వేత్తలకు We-Hub చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను ఆసక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించడంలో, అభ్యసించడంలో, యువతుల ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యను అభ్యసించే మూడేళ్లలో We-Hub ద్వారా 1495 స్టార్టప్‌లను పెంచి దీనికి రూ. 56.8 కోట్ల నిధులు కేటాయించింది. దీని ద్వారా 2800 ఉద్యోగాలను కల్పించింది.
టీ- వర్క్స్
- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్ట్రో-మెకానికల్, మెకానికల్ స్టార్టప్‌లు, ఉత్పత్తుల అభివృద్ధి తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి టీ-వర్క్స్ ఏర్పడింది.
- దీని కోసం 2018 సెప్టెంబర్ 11న జి.ఇ. అప్లియెన్సెస్ అనుబంధ సంస్థ ఫస్ట్ బిల్డ్తోఓ టీ వర్క్స్ మౌలిక ఒప్పందాన్ని చేసుకుంది.
- ఈ తరహా ఒప్పందం భారత్‌లో మొట్టమొదటిది కాగా ప్రపంచ వ్యాప్తంగా మూడోది (మొదటిది యూఎస్ఏ, రెండోది చైనా).
- ఉత్పత్తి రూపకల్పన సేవలతో అంకుర సంస్థలను ప్రారంభించి MSME తయారీదారులు, పారిశ్రామికవేత్తలు వారి వినూత్న ఉత్పత్తుల కల్పనలకు దోహదం చేస్తుంది.
- టీ-వర్క్స్ ముఖ్యంగా అంకుర సంస్థల పరిశోధన, అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది.
- కొవిడ్-19 సమయంలో టీ వర్క్స్ శ్రామికులు ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సేవకులుగా సహాయం చేశారు.
- టీ వర్క్స్ ద్వారా కోవిడ్-19 వ్యాప్తి సమయంలో సరసమైన ధరలకు వైద్య పరికరాలు అవసరమైన వెంటిలేటర్లు అందించింది.
- టీ వర్క్స్ ద్వారా నిమ్స్, ఎడ్యు-ఫీల్స్
(హైదరాబాద్ అంకుర సంస్థల) సహకారంతో కొవిడ్ -19 రోగులకు చికిత్స చేసే ఫ్రంట్‌లైన్ సేవకులను రక్షించడానికి ‘ఏరోసోల్’ అనే రక్షణ పెట్టెను రూపొందించింది. - 2019 డిసెంబర్లో టీ వర్క్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెల్‌ను ప్రారంభించింది.
జీబీకే పబ్లికేషన్స్ సౌజన్యంతో…
Previous article
Disease that causes intolerance to gluten is?
Next article
సంఘజీవి – సామాజిక నియంత్రణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు