కొలువుల ధమాకా!
రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. నూతనసంవత్సరం కొంగొత్త ఆశలను మోసుకొచ్చింది. 2022 పోతూపోతూ వేలాది ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చిపోయింది. ఇక మిగిలిన తంతు అంటే భర్తీ ప్రక్రియ అంతా 2023లో జరుగనున్నది. వేలాది ఉద్యోగాల భర్తీ జరుగనున్న ఈ కొలువుల ధమాకాలో తడాఖా చూపించడానికి పాటించాల్సిన కొన్ని ప్రధాన అంశాలు సంక్షిప్తంగా మీ కోసం…
చరిత్రలో మొదటిసారి
దేశంలో ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ఇదొక అపూర్వ ఘట్టంగా భావించవచ్చు. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పోస్టులను ఒకేసారి భర్తీ చేయడానికి స్వల్ప వ్యవధిలో నోటిఫికేషన్లు రావడం దేశ చరిత్రలో మొదటిసారి అయిండవచ్చు. అంతేకాకుండా జేఎల్, డీఎల్, వైద్యశాఖ, ఇంజినీర్లు, రవాణా, లైబ్రేరియన్లు ఇలా అనేక రకాల ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. ఆలస్యమైనా అధిక శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా (సుమారు 95 శాతం) వచ్చిన ఈ నోటిఫికేషన్లు తెలంగాణ నిరుద్యోగుల పాలిట వరం. అపూర్వ అవకాశం.
ఏ పరీక్ష రాయాలి?
అయితే దాదాపు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేనికి ప్రిపేర్‌కావాలి అనేది సంశయం. ప్రధానంగా మీకు ఏ కొలువు చేయాలని ఉందో దానిపైనే దృష్టి పెట్టడంతోపాటు అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఏం చదవాలి?
అన్ని నోటిఫికేషన్లలో సిలబస్ అంశాలు ఒకేలా ఉన్నాయి. కేవలం స్థాయి మాత్రమే తేడా ఉంటుంది. సిలబస్‌లో కాఠిన్యతలో తేడా ఉంటుంది. ప్రశ్నలు అడిగే విధానంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్-1లో ప్రిలిమ్స్ చదివితే గ్రూప్-2లో ఒక పేపర్ పూర్తవుతుంది. అదేవిధంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రిపేర్ అయితే సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుంది. దీన్ని ఆబ్జెక్టివ్ విధానానికి అప్లయ్ చేస్తే సరిపోతుంది. చాలా అంశాలు ఉమ్మడిగానే ఉన్నాయి. ఇక జేఎల్, డీఎల్ వంటి పరీక్షలు కొంత భిన్నం అయినప్పటికీ వాటిలో జీఎస్‌కు గ్రూప్స్ ప్రిపరేషన్ సరిపోతుంది. వారి ఆప్షనల్ చదువుకుంటే సరిపోతుంది.
పరీక్ష పరీక్షకు మధ్య కొంత కాలవ్యవధి ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ చేస్తూ, సమయానుకూలంగా అప్లికేషన్ విధానాన్ని పాటిస్తే తప్పక కొలువు సొంతం చేసుకోవచ్చు
ఏకాగ్రతే..
ఏం చదివినా, ఏ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయినా ఫోకస్డ్గా చదవడమనేది చాలా ప్రధానం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి లక్ష్య సాధనే ప్రధానంగా ప్రిపరేషన్ కొనసాగించడం ముఖ్యం. ప్రిపేర్ అయ్యే పరీక్ష సిలబస్‌ను పక్కన పెట్టుకొని ఏకాగ్రతతో ఆయా అంశాలను ఆకళింపు చేసుకుంటే విజయం మీదే.
పుకార్లకు దూరంగా..
నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ పరీక్షలు జరుగవు, కోర్టు కేసులవుతాయి, లేకుంటే ఎన్నికలు వస్తాయి ఇలా అనేక రకాల పుకార్లు వస్తుంటాయి. కానీ వీటికి దూరంగా ఉండటం మేలు. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే తప్పనిసరిగా ఆయా పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిందే. ఇప్పటివరకు నోటిఫికేషన్లు వచ్చి రద్దు అయిన ఘటనలు లేవు. తప్పనిసరిగా ఆ పోస్టులను భర్తీ చేస్తారు. దీనికొక ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే గురుకులాలు, పోలీస్, గ్రూప్-2, గ్రూప్-4, పంచాయతీ సెక్రటరీ ఇలా అనేక ఉద్యోగాల భర్తీ వడివడిగా పూర్తయ్యింది. మన పక్కనే ఉన్న వేలాదిమంది నేడు కొలువులు చేస్తూ మనకు కనిపిస్తున్నారు. వారంతా ఆయా పరీక్షలకు సీరియస్‌గా ప్రిపేరై సాధించారు. జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం మీ వంతు. ఒకేసారి పదుల సంఖ్యలో నోటిఫికేషన్లు రావడం వరం. దీన్ని ఒడిసి పట్టుకుంటే ఉద్యోగం మీ సొంతం.
హార్డ్ + స్మార్ట్ వర్క్
విజయానికి దగ్గరి దారి అంటూ ఏది ఉండదు. ప్రణాళికబద్ధంగా పరీక్షలకు ప్రిపేర్కావడమే విజయానికి మార్గం. చదివే అంశాలను స్మార్ట్‌గా చదవడం వల్ల సమయం ఆదా కావడమేకాకుండా రిపీటెడ్ రివిజన్‌కు ఆస్కారం లభిస్తుంది. ప్రాక్టీస్‌కు ఎక్కువ చాన్స్ లభిస్తుంది. విజయావకాశాలు మరింత పెరుగుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?