సహకార వ్యవస్థ-వాణిజ్య బ్యాంకులు
సహకార వ్యవస్థ – సహకార బ్యాంకు వాణిజ్య బ్యాంకుల మధ్య భేదాలు
- ఆర్థిక వ్యవస్థలో సహకార వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకమైంది.
- ప్రపంచానికి ఈ సహకార వ్యవస్థను మొదట పరిచయం చేసింది రాబర్ ఓవన్ (స్కాట్లాండ్)
- సహకార వ్యవస్థను అభివృద్ధి చేసింది రైఫిజాన్ (జర్మనీ)
- రాబర్ట్ ఓవెన్ సహకార ఉద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు.
- ‘ఒక్కరి కోసం అందరూ – అందరి కోసం ఒక్కరు’ అనే నినాదంతో కలసి పనిచేయడం అనే ప్రాతిపదికన సహకార సూత్రం ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా సహకార వ్యవస్థ ఏర్పడింది.
- సహకారం అనే పదం లాటిన్ భాషా పదం అయిన కూపరారి నుంచి ఉద్బవించింది. కో అనే పదం మొదటి భాగం ‘తో’ అని, రెండవ భాగం ‘ఒపెరారి” అంటే పనిచేయడం.
భారతదేశంలో సహకార వ్యవస్థ :
- 1892లో మద్రాస్ ప్రభుత్వం ఫెడరిక్ నికల్సన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.
- ఈ కమిటీ రైఫిజాన్ జర్మనీలో అమలు చేసిన సహకార వ్యవస్థ విధానాన్ని భారత దేశంలో ప్రవేశ పెట్టాలని సూచించింది.
- భారతదేశానికి సహకార వ్యవస్థను పరిచయం చేసింది ఫెడరిక్ నికల్సన్.
- 1901లో లార్డ్ కర్జన్, ఎడ్వర్డ్లా కమిటీని నియమించగా ఈ కమిటీ కూడా భారత దేశంలో సహకార వ్యవస్థ ఏర్పాటును సూచించింది.
- 1904లో భారతదేశంలో మొదటిసారి సహకార పరపతి సంఘాల చట్టాన్ని రూపొందించారు.
- ఈ చట్టం ప్రకారం రైతులు వివిధ వృత్తులవారు, అల్పాదాయ వర్గాల ప్రజలు, 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు కనీసం 10 మంది సభ్యులు కలిసి పరపతి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం 1904 మార్చి 25న తమిళనాడులోని కాంజీవరంలో మొదటి సహకార బ్యాంకు ఏర్పడింది.
- సహకార పరపతి సంఘాల చట్టం 1904ను 1912లో సవరించి మార్కెటింగ్, ఉత్పత్తి, పొదుపు, బీమా మొదలైన పరపతియేతర రంగాలకు కూడా విస్తరించి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.
- 1919లో సహకార వ్యవస్థను రాష్ట్రజాబితాలో చేర్చారు.
- అనంతరం వివిధ స్థానిక ప్రభుత్వాలు అంటే బొంబాయి, మద్రాస్, హైదారాబాద్, ఒడిశా, బీహార్ ప్రెసిడెన్సీ సహకార చట్టాలు చేశాయి.
- స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్, సహకార రంగాలు అనే మూడు రంగాలతో కూడిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి విధానాన్ని అవలంభించింది.
- పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యం మూడు స్తంభాల్లో సహకార సంఘాలు ఒకటిగా భావించారు. మిగిలిన రెండు పంచాయతీ, మూడవది పాఠశాల.
- అంటే భారతదేశంలో సహకార రంగాల అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారు.
- 1951లో గోర్వాల అధ్యక్షతన నియమించిన అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే సంఘం 1954లో సమర్పించిన నివేదికలో మూడంచెల సహకార బ్యాంకుల వ్యవస్థ ఏర్పాటును సూచించింది.
1. గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంస్థలు (పీఏసీఎస్)
2. జిల్లాస్థాయిలో జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ)
3. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్సీబీ)
- 1964లో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల నిబంధనల చట్టం రూపొందించారుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఈ చట్టం ఆధారంగానే సహకార వ్యవస్థను అమలు చేస్తున్నాయి.
- 1963లో వైకుంఠలాల్ మెహతా కమిటీ సిఫారసులతోటి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీఎస్) ను ఏర్పాటు చేశారు.
- 1975 సం.లో ఆర్బీఐ చేత నియమించిన హజారి కమిటీ, దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్పకాలిక రుణాలను అందించే సహకార బ్యాంకులను ఏకం చేయాలని సూచించింది.
- 1991లో ప్రణాళిక సంఘం చేత చౌదరి బ్రహ్మప్రకాశ్’ కమిటీని నియమించగా ఇది దేశ వ్యాప్తంగా ఒకే రకమైన సహకార వ్యవస్థను తీసుకురావడం కోసం ‘మోడల్ కోఆపరేటివ్ యాక్ట్’ను రూపొందించాలని సూచించింది.
- 1985లో నియమించిన మోహన్‌కందా కమిటీ సూచనతో 1987 నుంచి సహకార వ్యవస్థలో సింగిల్ విండో పద్ధతి ఏకగవాక్ష పద్ధతి ద్వారా అన్ని రకాల రుణాలను ఒకే చోట అందిస్తున్నారు.
- సహకార వ్యవస్థ పునర్ నిర్మాణం పైన నియమించిన వైద్యనాథన్ కమిటీ (2004 ఆగస్టు -2005 ఫిబ్రవరి) సహకార వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని సూచించింది.
- ఈ కమిటీ సూచనతో 2012లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందింది.
- 19(1)e ఆర్టికల్‌లో సహకార సంఘాలు అనేపదం చేర్చారు.
- 243(Z) (m) నుంచి 243 (Z) (T) వరకు మొత్తం 13 ఆర్టికల్స్ చేర్చారు.
- PACS Primary Agriculture Credit Society
- DCCB- District cooperative Central Bank
- SCB State cooperative Bank
- NDBC – National cooperative Development Corporation.
సహకార బ్యాంకులు (Cooperative Banks)
- సహకార సూత్రం ఆధారంగా సేవా దృక్పథంతో పరపతి సంఘం సభ్యుల విత్త అవసరాలను తీర్చే నిమిత్తం నిర్వహించే బ్యాంకులను ‘సహకార బ్యాంకులు’ అంటారు.
- ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో నమోదు చేస్తే వాటిని షెడ్యూల్ సహకార బ్యాంకులు అంటారు.
- భారతదేశంలో షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకార పరపతి సంఘాల చట్టం ఆధారంగా రిజిస్ట్రేషన్ అవుతాయి.
- సహకార బ్యాంకులపైన నియంత్రణను ఆర్బీఐతోపాటుగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిగి ఉంటుంది
- ప్రస్తుతం 2020 సెప్టెంబర్‌లో షెడ్యూల్ సహకార బ్యాంకులపైన పూర్తి నియంత్రణ అధికారాన్ని ఆర్బీఐకి అప్పగించారు.
వాణిజ్య బ్యాంకులు- సహకార బ్యాంకుల మధ్యభేదాలు:
- వాణిజ్య బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఒకే చట్టం ద్వారా ఏర్పడతాయి. సహకార బ్యాంకులు ఆయా రాష్ర్టాల చట్టాల ద్వారా ఏర్పడతాయి.
- వాణిజ్య బ్యాంకులు లాభాపేక్షతో పని చేస్తాయి. సహకార బ్యాంకులు సేవా దృక్పథంతో పనిచేస్తాయి.
- వాణిజ్య బ్యాంకులు దేశంలో ఎక్కడైనా బ్రాంచీలు ఏర్పాటు చేయవచ్చు. సహకార బ్యాంకులు ఒక ప్రాంతం, రాష్ర్టానికి మాత్రమే పరిమితంగా ఉంటాయి.
- వాణిజ్య బ్యాంకులు విదేశాలలో కూడా బ్రాంచీలు కలిగి ఉండవచ్చు.
- సహకార బ్యాంకులు విదేశాల్లో బ్రాంచీలు కలిగి ఉండటానికి అవకాశం లేదు.
- వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు పొందవచ్చు.
- సహకార బ్యాంకుల్లో రాష్ట్ర సహకార బ్యాంకు మాత్రమే ఆర్బీఐ నుంచి రుణాలు పొందగలదు.
- వాణిజ్య బ్యాంకులపై ఆర్బీఐ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది.
- సహకార బ్యాంకులపైన ఆర్బీఐతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ కలిగి ఉంటాయి.
- వాణిజ్య బ్యాంకులపైన బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 పూర్తిగా వర్తిస్తుంది.
- సహకార బ్యాంకులపైన బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 పాక్షికంగా వర్తిస్తుంది.
- వాణిజ్య బ్యాంకులు ఒకే ఆంచెలో పనిచేస్తాయి.
- సహకార బ్యాంకులు బహుళ అంచెల్లో పనిచేస్తాయి.
- వాణిజ్య బ్యాంకులు షేర్ హోల్డింగ్‌ను బట్టి ఓటింగ్ పవర్ ఉంటుంది.
- సహకార బ్యాంకులకు ఒక సభ్యునికి ఒకే ఓటు ఉంటుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. సహకార వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు?
ఎ) రాబర్ట్ ఒవన్ బి) రైఫిజాన్
సి) నికల్సన్ డి) లార్డ్ కర్జన్
2. ప్రపంచంలో సహకార వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు?
ఎ) ఫెడరిక్ బి) నికల్సన్
సి) రైఫిజాన్ డి) రాబర్ట్
3. సహకారం అనే పదం ఏ భాష నుంచిఉద్భవించింది?
ఎ) గ్రీకు బి) లాటిన్
సి) ఇటాలియన్ డి) జర్మనీ
4. ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు అనేది ఏ బ్యాంకు నినాదం?
ఎ) సహకార బ్యాంకు
బి) వాణిజ్య బ్యాంకు
సి) రిజర్వ్‌బ్యాంకు
డి) యూనియన్ బ్యాంక్
5. భారతదేశానికి సహకార వ్యవస్థను పరిచయం చేసినది ఎవరు?
ఎ) నెహ్రూ బి) ఫెడరిక్ నికల్సన్
సి) రైఫిజాన్ డి) లార్డ్ కర్జన్
6. భారతదేశంలో మొదటి సహకార పరపతి సంఘాల ట్టం ఎప్పడు రూపొందించారు?
ఎ) 1900 బి) 1902
సి) 1904 డి) 1906
7. భారతదేశంలో మొట్టమొదటి సహకార బ్యాంకును ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కర్ణాటక
సి) కేరళ డి) తమిళనాడు
8. సహకార వ్యవస్థ ఏ జాబితాలో (భాగం) చేర్చారు?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా డి) ఎ, బి
9. భారతదేశంలో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు?
ఎ) నెహ్రూ బి) ఇంధిరాగాంధీ
సి) నౌరోజీ
డి) వల్లభాయ్ పటేల్
10. సహకార పరపతి సంఘాల చట్టం 1904ను ఎప్పుడు సవరించారు?
ఎ) 1906 బి) 1908
సి) 1910 డి) 1912
11. మూడంచెల సహకార బ్యాంకుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ?
ఎ) గోర్వాల కమిటీ బి) మెహతా కమిటీ
సి) హజారీ కమిటీ
డి) బ్రహ్మప్రకాశ్ కమిటీ
12. ఏ కమిటీ సూచనతో సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేశారు?
ఎ) హజారీ కమిటీ
బి) మెహతా కమిటీ
సి) మోహన్ కందా కమిటీ
డి) గోర్వాలా కమిటీ
13. సింగిల్ విండో పద్ధతికి మరొక పేరు?
ఎ) ఏకగవాక్ష పద్ధతి
బి) సహకార పద్ధతి
సి) ఏకరూప పద్ధతి డి) పైవన్నీ
14. 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1904 బి) 1906
సి) 1908 డి) 1912
15. సహకార వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని సూచించిన కమిటీ ఏది?
ఎ) బ్రహ్మప్రకాశ్ కమిటీ
బి) వైద్యనాథన్ కమిటీ
సి) అశోక్ మెహతా కమిటీ
డి) హజారీ కమిటీ
16. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది?
ఎ) వాణిజ్య బ్యాంకు
బి) రిజర్వ్ బ్యాంక్
సి) సహకార బ్యాంకు
డి) యూనియన్ బ్యాంక్
17. ఆర్బీఐ చట్టం 1934లోని 2వ షెడ్యూల్ లోని బ్యాంకులను ఏమంటారు?
ఎ) షెడ్యూల్ బ్యాంకులు
బి) నాన్‌షెడ్యూల్ బ్యాంకులు
సి) ఎ, బి
డి) స్వతంత్ర బ్యాంక్


Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






