తక్కువ సమయంలో ఎక్కువ సాధన చేద్దాం
20 రోజుల జేఈఈ మెయిన్ ప్రిపరేషన్
ఫిజిక్స్
గత ప్రశ్నపత్రాల్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో తెలుసుకోవాలి.
చాప్టర్లను నాలుగు విభాగాలుగా విభజించుకోవాలి.
1) సులభమైన, ఎక్కువ వెయిటేజీ ఉన్నవి
2) కష్టమైనవి, ఎక్కువ వెయిటేజీ ఉన్నవి
3) సులభమైనవి, తక్కువ వెయిటేజీ ఉన్నవి
4) కష్టమైనవి, తక్కువ వెయిటేజీ ఉన్నవి
మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో స్టాటిక్స్, రే ఆప్టిక్స్, మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, గ్రావిటేషన్ వంటి చాప్టర్లు మొదటి రకం.
సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్, క్లాసికల్ మ్యాగ్నటిజమ్ వంటి చాప్టర్లు అత్యంత సులభమైనవి. ఈ చాప్టర్లు ఒక్కొక్కటి 3 గంటల సమయంలో రివైజ్ చేయవచ్చు. ప్రతి చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల వీటిపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
రొటేషనల్ మెకానిక్స్ వంటి చాప్టర్లు ఎక్కువ వెయిటేజీ ఉన్న కష్టమైనవి. వీటిపై సమయానుసారంగా ఎక్కువ సాధన చేయాలి.
ఫిజిక్స్ జేఈఈ మెయిన్ సిలబస్‌లో పార్ట్-ఎ 80 శాతం వెయిటేజీ, పార్ట్-బి 20 శాతం వెటెటేజీ ఉంటుంది.
పార్ట్-బిలో ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో సులభంగా స్కోర్ చేయవచ్చు.
1) చాప్టర్ డిఫికల్టీ లెవల్, వెయిటేజీని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత రివిజన్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలి.
2) ఈ రివిజన్ ప్లాన్ ప్రకారం ప్రతి చాప్టర్ థియరీ రివైజ్ చేసి ముఖ్యమైన ఫార్ములాలన్నీ రివిజన్ నోట్‌బుక్‌లో రాసుకోవాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ఆన్లైన్లో యూట్యూబ్ చానళ్ల నుంచి నేర్చుకోవడం వల్ల సమయం వృథా అవుతుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది.
3) థియరీ రివైజ్ చేశాక, చాప్టర్ వైజ్ గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు వేగం గంటకు 25 ప్రశ్నలు ఉండేటట్లు చూసుకోవాలి.
4) వారంలో రెండుసార్లు ఎన్టీఏ అభ్యాస్ వెబ్సైట్లో ఉన్న ప్రాక్టీస్ పేపర్లను సాల్వ్ చేయాలి.
5) జేఈఈ మెయిన్ పరీక్షలో ముందుగా సులభమైన ప్రశ్నలు, తర్వాత మధ్యస్థంగా ఉన్న ప్రశ్నలను సాల్వ్ చేయాలి. సమయానుగుణంగా కష్టమైన ప్రశ్నలను చివరలో సాల్వ్ చేయాలి. Save and Mark for reviw చేసి చివరలో సాల్వ్ చేయాలి.
6) జేఈఈ మెయిన్-2022లో న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు నెగెటివ్ మార్క్స్ లేవు. కానీ జేఈఈ మెయిన్ 2023లో అన్ని ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గెస్ వర్క్ చేయకుండా ఉండటం మంచిది.
7) న్యూమరికల్ టైప్ ప్రశ్నల్లో చాయిస్ ఉంటుంది. 10 ప్రశ్నల్లో కేవలం 5 మాత్రమే సాల్వ్ చేయాలి.
అందువల్ల కాన్ఫిడెంట్‌గా ఉన్న చాప్టర్లలోని ప్రశ్నలను ఎంచుకొని సాల్వ్ చేయాలి.
8) ఏకాగ్రత పెరగడం కోసం ప్రతిరోజూ 5-10 నిమిషాలు ప్రాణాయామం లేదా ధ్యానం చేయాలి.
కెమిస్ట్రీ
పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఎన్టీఏ ప్రత్యేకమైన జేఈఈ సిలబస్‌ను సిఫారసు చేసినప్పటికీ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగానే తయారు చేశారు.
ప్రశ్నపత్రంలో వివిధ అంశాలకు ఇచ్చిన వెయిటేజీ ప్రకారం అధ్యయన సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి.
క్లిష్టమైన అంశాలను (కర్బన సమ్మేళన శాస్త్రం, భౌతిక రసాయ శాస్త్రం) నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. కేవలం పునర్విమర్శ (అకర్బన సమ్మేళన శాస్త్రం) అవసరమయ్యే అంశాలపై తక్కువ సమయాన్ని వెచ్చించాలి.
ఏ టాపిక్‌ను మిస్ కాకుండా చూసుకోడానికి రివిజన్ షెడ్యూల్ స్టడీ ప్లాన్‌లో భాగంగా ఉండాలి.
ప్రతి అధ్యాయానికి నోట్స్ సిద్ధం చేసుకోవాలి.
మాక్‌టెస్టులు తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో అర్థమవడంతో పాటు కచ్చితత్వం, వేగం మెరుగుపడుతుంది.
చదివేటప్పుడు ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవడం చాలా ముఖ్యం.
ఫిజికల్ కెమిస్ట్రీ (భౌతిక రసాయన శాస్త్రం)లో ప్రావీణ్యం కోసం సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.
ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని ప్రతిచర్య విధానాలను అధ్యయనం చేయాలి (ప్రతిచర్య పేరు, మెకానిజం, కొన్ని ఉదాహరణలు ఇందులో ముఖ్యమైనవి)
అకర్బన రసాయన శాస్త్రం (ఇనార్గానిక్ కెమిస్ట్రీ) క్లాస్-2లోని పీరియాడిక్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీస్, రసాయన బంధం (కెమికల్ బాండింగ్) అదే విధంగా క్లాస్-12లోని కో ఆర్డినేషన్ కెమిస్ట్రీ, మెటలర్జీ లాంటి అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.
ఈ అంశాల్లోని ప్రావీణ్యత మిగిలిన అంశాలైన ఎస్-బ్లాక్, పీ-బ్లాక్, డీ, ఎఫ్-బ్లాక్ సమగ్ర అవగాహన కోసం ఎంతగానో దోహదపడుతుంది.
కెమిస్ట్రీలో కొత్త ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం, ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇలా ప్రశ్నలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల సూత్రాలు, భావన (కంటెంట్)లు బాగా గుర్తుంటాయి.
ఒకే సమస్యను పరిష్కరించడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించడం ద్వారా విశ్లేషణ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి.
గత పేపర్ల నుంచి కెమిస్ట్రీ ప్రశ్నలను పరిష్కరించడం ద్వారా ప్రధాన పరీక్షలో అడిగే ప్రశ్నల విధానం, క్లిష్టత గురించి అవగాహన ఏర్పడుతుంది.
ఒక అధ్యాయం పూర్తయి తర్వాత చాప్టర్ల వారీగా మాక్‌టెస్టులు, మొత్తం సిలబస్ పూర్తయిన తర్వాత పూర్తి నిడివి మాక్‌టెస్టులను రాయాలి.
కచ్చితంగా రోజూ షెడ్యూల్‌ను అనుసరిస్తూ చదవాలి. సమయ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
గణితం
దీనిలో మ్యాథమెటికల్ రీజనింగ్, సెట్స్ అండ్ రిలేషన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొద్దిగా సులభమైన చాప్టర్లు.
మ్యాట్రిసెస్ ఆఫ్ డిటర్మినల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్స్ అండ్ 3డీ, ట్రిగ్నోమెట్రీ మధ్యస్థ తరహా చాప్టర్లు.
డిఫరెన్షియల్ ఆఫ్ ఇంటర్నల్ క్యాలిక్యులస్, కాంప్లెక్స్ నంబర్స్, పీ అండ్ సీ, ప్రాబబిలిటీ, బైనామినల్ థియరమ్ చాప్టర్లు కొద్దిగా కఠినమైనవి.
ఏదైనా చాప్టర్‌ను తీసుకున్నప్పుడు ఆ చాప్టర్‌కు సంబంధించి గత నాలుగు సంవత్సరాల్లో (2019, 20, 21, 22) ఇచ్చిన ప్రతి ప్రశ్నను సాధన చేయాలి. ఆ ప్రశ్నలను బాగా అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్‌ను ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం నుంచి సాధన చేస్తే ర్యాంక్ సాధించవచ్చు.
ఎన్టీఏ వెబ్సైట్లో ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్‌ను సాధన చేయడం వల్ల ప్రధాన పరీక్ష ఎలా ఎదుర్కోవాలో అవగాహన వస్తుంది.
ప్రతి చాప్టర్‌ను పునశ్చరణ చేయడం వల్ల, గత, మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల చిన్న చిన్న తప్పులు తగ్గి, సమాధానాలు వేగంగా గుర్తించవచ్చు.
నితిన్ కుమార్
మ్యథ్స్ ఫ్యాకల్టీ (ఐఐటీ ఢిల్లీ)
మాడ్యులస్ కాలేజీ
7993376333
బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సులు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బీఎస్సీ హెల్త్ సైన్సెస్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు: బీఎస్సీ అనెస్థీషియాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్.
నోట్: వీటితోపాటు బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ రెండు కోర్సులు ఉన్నాయి. కానీ ఈ కోర్సులు ఏ కాలేజీకి మంజూరు కాలేదు.
అర్హతలు: ఇంటర్ బైపీసీ (బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్) లేదా బ్రిడ్జ్ కోర్సు ఇంటర్ (బయాలజీ, ఫిజికల్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2022, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు (ఏడాదిన్నర ఇంటర్న్‌షిప్)
ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జనవరి 10
వెబ్సైట్: https://www.knruhs.telangana.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు