General Studies | 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా?
జనరల్ స్టడీస్ (జూన్ 18 తరువాయి)
58. జతపరచండి.
1. చాకలి ఐలమ్మ ఎ. విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు కాల్చి చంపారు
2. దొడ్డి కొమురయ్య బి. రజాకార్లు చంపారు
3. బత్తిన మొగిలయ్య సి. విసునూరు రామచంద్రారెడ్డి వీరిభూములను ఆక్రమించుకున్నాడు
1) 1-బి, 2-సి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-సి, 2-బి, 3-ఎ
59. తెలంగాణ సాయుధపోరాటం జరిగిన కాలం?
1) 1944-49 2) 1945-50
3) 1946-51 4) 1947-52
60. ఆంధ్రమహాసభ, కిసాన్ సభలను కమ్యూనిస్టులు ఏ కాలం నాటికి చేజిక్కించుకున్నారు?
1) 1942 2) 1944
3) 1945 4) 1946
61. ఆంధ్రమహాసభ గ్రామస్థాయి శాఖలకు గల పేరు?
1) దళం 2) సంఘం
3) మిషనరీలు 4) రైతు సంఘటనలు
62. చాకలి ఐలమ్మకు చెందిన భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నించింది ఎవరు?
1) విసునూరి రామచంద్రారెడ్డి
2) వెదిరి రామచంద్రారెడ్డి
3) మునగాల రాజవెంకట రంగారావు
4) గద్వాల సోమనాద్రి నాయుడు
63. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
1) కడివెండి గ్రామంలో 1946, జూలైలో జమీందారు గూండాలతో దొడ్డి కొమురయ్యను చంపించాడు
2) నిజాం పాలనను, హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడటానికి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించారు
3) వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న బత్తిన మొగిలయ్యను కమ్యూనిస్టులు చంపేశారు
4) 1948లో స్వతంత్ర భారతదేశం ప్రజాభిప్రాయ చర్య తీసుకుని హైదరాబాద్‌ను విలీనం చేసుకుంది
64. శివాలిక్ పర్వత పాత భాగంలో 8-16 కి.మీ. మేర విస్తరించి ఉన్న మేఖలకు గల పేరు?
1) బాబర్ 2) టెరాయి
3) భంగర్ 4) ఖాదర్
65. కింది వాటిలో భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి లక్షణం కానిది?
1) ఇది పురాతన స్ఫటికాకా, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు కలిగి ఉంది
2) ఇందులో లోహ, అలోహ ఖనిజాలు లేవు
3) చుట్టూ గుండ్రటి కొండలతో, తక్కువ లోతుగల వెడల్పైన లోయలున్నాయి
4) ఈ పీఠభూమికి మూడువైపులి సముద్రాలున్నాయి
66. ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులకు సంబంధించి సరికానిది?
1) తూర్పున-తూర్పు కనుమలు
2) పశ్చిమాన – పశ్చిమ కనుమలు
3) దక్షిణాన – సహ్యాద్రి పర్వతాలు
4) పైవన్నీ సరైనవి
67. భారతదేశానికి భౌతిక పటంలో మధ్య ఉన్నత భూముల ఉనికిని సరిగా గుర్తించండి.
1) సింధూ మైదానానికి దక్షిణాన – గోదావరి నదికి ఉత్తరాన
2) నర్మదానదికి దక్షిణాన – కృష్ణానదికి ఉత్తరాన
3) నర్మదా నది – కావేరీ నదుల మధ్య ప్రాంతం
4) గంగా మైదానానికి దక్షిణాన – నర్మదా నదికి ఉత్తరాన
68. మధ్య ఉన్నత భూముల తూర్పు భాగంలో గల పీఠభూమి?
1) ఛోటానాగ్పూర్
2) మాళ్వా
3) దక్కన్ పీఠభూమి
4) ఆంధ్ర పీఠభూమి
69. దక్కన్ పీఠభూమి సరిహద్దులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి.
1) ఉత్తర – సాత్పూరా పర్వతాలు
2) తూర్పు – తూర్పు కనుమలు
3) పశ్చిమ – మైకాల్ పర్వత శ్రేణులు
4) దక్షిణం – నీలగిరి పర్వతాలు
70. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. దక్కన్ పీఠభూమి ఎ. మధ్య ఉన్నత భూముల పశ్చిమ ప్రాంతం
2. ఛోటానాగ్పూర్ బి. త్రిభుజాకారంలో ఉంది
3. మాళ్వా పీఠభూమి సి. ఖనిజాలకు నిలయం
1) 1-బి, 2-సి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి
71. కింది వాటిలో భారతదేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణులు?
1) మహదేవ్, కైమూర్ శ్రేణులు
2) వింధ్య, సాత్పూరా పర్వతాలు
3) కచార్, రాజమహల్ పర్వతాలు
4) పళని కొండలు, కార్డమమ్ కొండలు
72. కింది వాటిలో పడమటి కనుమల లక్షణం కానిది?
1) పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి
2) ఇవి అవిచ్ఛన్నమైన శ్రేణులు
3) ఇవి తూర్పు కనుమలు కంటే ఎత్తు తక్కువ
4) వీటి పొడవు 1600 కి.మీ.
73. దక్కన్ పీఠభూమి వాలును గుర్తించండి.
1) పడమటి నుంచి తూర్పునకు వాలి ఉంది
2) తూర్పు నుంచి పడమటికి వాలి ఉంది
3) ఉత్తరం నుంచి దక్షిణానికి వాలి ఉంటుంది
4) దక్షిణం నుంచి ఉత్తరానికి వాలి ఉంది
74. పడమటి కనుమలు నీలగిరి పర్వతాలు కలిసే ప్రదేశం?
1) గుడలూరు 2) కన్యాకుమారి
3) నల్లమల కొండలు 4) వెలికొండలు
75. ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం ఉదకమండలం గల పర్వతాలు?
1) తూర్పు కనుమలు
2) పశ్చిమ కనుమలు
3) ఆరావళీ పర్వతాలు
4) నీలగిరి పర్వతాలు
76. సింగరేణి బొగ్గు గనులకు చెందిన ఇల్లెందులోని బొగ్గు గని నంబర్?
1) నంబర్ 16 ఇైంక్లెన్
2) నంబర్ 18 ఇైంక్లెన్
3) నంబర్ 21 ఇైంక్లెన్
4) నంబర్ 25 ఇైంక్లెన్
77. జతపరచండి.
1. లోహ ఖనిజం ఎ. ముడిచమురు
2. అలోహ ఖనిజం బి. బాక్సైట్
3. ఇంధన ఖనిజం సి. మైకా
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-సి, 2-బి, 3-ఎ
78. జతపరచండి.
1. అల్యూమినియం ఎ. స్టెయిన్లెస్స్టీల్ తయారీ
2. అబ్రకం బి. తక్కువ బరువు
3. క్రోమియం సి. మెరిసే ఖనిజం
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
79. జతపరచండి.
1. ఆస్బెస్టాస్ ఎ. సిరామిక్ వస్తువుల తయారీ
2. బెరైటీస్ బి. వేడిని నిరోధించే పదార్థం
3. ఫెల్డ్‌స్పార్ సి. ముడి చమురు తవ్వకాల్లో ఉపయోగిస్తారు
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి
80. బాక్సైట్ ఖనిజం నుంచి తయారయ్యే లోహం?
1) వెండి 2) అల్యూమినియం
3) క్రోమియం 4) రాగి
81. జతపరచండి.
1. మైకా ఎ. ఆమ్లాల నిల్వ
2. స్టెయిన్లెస్ స్టీల్ బి. సిమెంట్ పరిశ్రమలో వినియోగం
3. డోలమైట్ సి. విద్యుత్ నిరోధం
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-బి, 2-సి, 3-ఎ
82. జతపరచండి.
1. అల్యూమినియం ఎ. విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వినియోగిస్తారు
2. మైకా బి. ఇళ్లకు పై కప్పుగా ఉపయోగిస్తారు
3. ఆస్బెస్టాస్ సి. విమానాల విద్యుత్ తీగల తయారీకి ఉపయోగిస్తారు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-సి, 3-ఎ
83. కింది వాటిలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే ఖనిజం?
1) బాక్సైట్ 2) మైకా
3) క్రోమియం 4) ఆస్బెస్టస్
84. బెరైటీస్ అనే ఖనిజం నుంచి లభించే మూలకం?
1) బోరాన్ 2) బెరీలియం
3) బేరియం 4) బ్రోమియం
85. సున్నపురాయి ప్రధానంగా ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
1) విద్యుత్ ఉత్పత్తి 2) రంగుల తయారీ
3) సిమెంటు తయారీ 4) చమురు శుద్ధి
86. కింది ప్రదేశాల్లో ముడిచమురు లభించే ప్రదేశం?
1) కోలారు 2) కొల్లూరు
3) కొత్తగూడెం
4) బాంబే హై (Bombay High)
87. దేశంలో, తెలంగాణలో గనుల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య వరుసగా?
1) 50 లక్షలు, 5 లక్షలు
2) 40 లక్షలు, 4 లక్షలు
3) 30 లక్షలు, 3 లక్షలు
4) 10 లక్షలు, 1 లక్ష
88. భారత ప్రభుత్వం గనులన్నింటినీ జాతీయం చేసిన సంవత్సరం?
1) 1952 2) 1961
3) 1973 4) 1984
89. ఇప్పటికీ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో గల గనులు?
1) నేలబొగ్గు 2) ముడిచమురు
3) మైకా 4) అణు ఖనిజాలు
90. 1993లో భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఖనిజ విధానం ప్రధాన ఉద్దేశం?
1) గనుల జాతీయం
2) గనుల ప్రైవేటీకరణ
3) ఖనిజాల ఎగుమతులు
4) ఖనిజాల దిగుమతులు, వినియోగం
91. 1993లో నూతన జాతీయ ఖనిజ విధానంలో లేని అంశాన్ని గుర్తించండి.
1) గనులను ప్రైవేటు కంపెనీలకు కౌలుకు ఇవ్వడం
2) ప్రైవేటు కంపెనీలు తవ్వి అమ్మే ఖనిజానికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి
3) లాభాలు వచ్చే ఖనిజాల గనులను జాతీయం చేయడం
4) ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టి సాంకేతిక పరిజ్ఞానం తీసుకువచ్చేందుకు అనుమతించబడటం
92. దేశంలోని శ్రామికుల్లో అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారి శాతం?
1) 72 శాతం 2) 82 శాతం
3) 92 శాతం 4) 52 శాతం
93. దేశంలో మొదటిసారి జనాభా గణన జరిగిన సంవత్సరం?
1) 1872 2) 1881
3) 1891 4) 1893
94. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా?
1) 121,01,93,422
2) 122,05,69,573
3) 123,05,69,573
4) 124,05,69,573
95. దేశంలో జనాభా నమోదు సేకరణ నిర్వహించే సంస్థ?
1) నీతి ఆయోగ్ 2) ప్రణాళిక సంఘం
3) సెన్సస్ ఆఫ్ ఇండియా
4) పాపులేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
96. భారతదేశ జనాభా గణనకు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తారు
2) 2011లో పురుషుల జనాభా 62,31,21,843
3) 2011లో స్త్రీల జనాభా 58,74,47,730
4) 1851 నుంచి భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తున్నారు
97. భారత జనాభా సేకరణలో కింది ఏ అంశాన్ని సేకరించరు?
1) విద్యార్హతలు 2) కులం
3) మతం 4) వృత్తి
98. దేశంలో మొదటిసారి పూర్తిస్థాయి జనాభా గణన జరిగిన సంవత్సరం?
1) 1871 2) 1881
3) 1891 4) 1872
99. సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో పనిచేసే వయస్సు వర్గం?
1) 15-40 సంవత్సరాలు
2) 18-45 సంవత్సరాలు
3) 15-52 సంవత్సరాలు
4) 15-59 సంవత్సరాలు
100. భారత జనాభా గణన ప్రకారం పిల్లలు అంటే?
1) 7 సంవత్సరాల లోపు వారు
2) 10 సంవత్సరాల లోపు వారు
3) 12 సంవత్సరాల లోపు వారు
4) 15 సంవత్సరాల లోపు వారు
101. సెన్సస్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ప్రతి 100 మంది మగ పిల్లలకు జన్మిస్తున్న ఆడపిల్ల సంఖ్య?
1) 89 2) 94 3) 103 4) 107
102. కింది ఏ రాష్ట్రంలో స్త్రీల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) కేరళ
3) తమిళనాడు 4) తెలంగాణ
జవాబులు
58.3 59.3 60.4 61.2
62.1 63.4 64.1 65.2
66.3 67.4 68.1 69.3
70.1 71.4 72.3 73.1
74.1 75.4 76.3 77.2
78.3 79.2 80.2 81.3
82.2 83.4 84.3 85.3
86.4 87.4 88.3 89.4
90.2 91.3 92.3 93.1
94.1 95.3 96.4 97.2
98.2 99.4 100.4 101.3
102.2
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?