ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
పాలిటీ
1. కింది వాటిలో ఏవి రాజ్యాంగ ప్రకరణ 51(ఎ) అనుసారం ఒక భారతీయుడి ప్రాథమిక విధులు?
ఎ. సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై నమ్మకం
బి. రాజ్యాంగానికి కట్టుబడి జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి
సి. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను, సమైక్యతను కాపాడాలి
డి. ఉన్నత వారసత్వ సంపద అయిన దేశ ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించడం
ఇ. సమాంజంలోని పేదలకు, బలహీన వర్గాలకు సహాయం అందించాలి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఇ 4) ఎ, డి, ఇ
2. కింది వాటిలో ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి ఏది?
1) వారి విధుల పట్ల నమ్మకంగా వ్యవహరించాలి
2) పిల్లల గౌరవాన్ని తగ్గించే చర్యలు విడనాడాలి
3) మానవ ప్రాణి గౌరవాన్ని తగ్గించే చర్యలను విడనాడాలి
4) మహిళలను గౌరవించాలి
3. ప్రాథమిక విధులు వేటిని గుర్తుచేసేందుకు ఉద్దేశించాయి?
1) రాజ్యాంగం ద్వారా కల్పించిన విధులను రాజ్యం నిర్వహించడం
2) న్యాయ వ్యవస్థ సక్రమ న్యాయ నిర్వహణను చేయడం
3) ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య నడవడిక మౌలిక నిబంధనలు పాటించడం
4) ప్రజల సంక్షేమం కోసం శాసనసభ చట్టాలు చేయడం
4. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం?
1) ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు
2) ప్రతి పౌరుడి ప్రాథమిక విధి
3) ఆదేశిక సూత్రాలు
4) ప్రతి పౌరుడి సాధారణ విధి
5. ఎవరి సిఫారసుల అనుసారం ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం-1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) సంతానం కమిటీ 2) సి. రంగరాజన్
3) స్వరణ్ సింగ్ 4) గాడ్గిల్ కమిటీ
6. కింది వాటిలో ప్రాథమిక విధుల జాబితాలో లేనిది?
1) జాతీయ గీతాన్ని గౌరవించాలి
2) ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి
3) జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను, కట్టడాలను రక్షించడం
4) సహజ పర్యావరణాన్ని పరిరక్షించాలి
7. 1953లో ప్రధానమంత్రి నెహ్రూ ఎవరి అధ్యక్షతన భాషా ప్రయుక్త రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ అధ్యయన కమిషన్ను ఏర్పాటు చేశారు?
1) టి.టి. కృష్ణమాచారి
2) వల్లభాయ్ పటేల్
3) ఫజల్ అలీ 4) జి.బి. పంత్
8. భారత పార్లమెంట్ వేటిని ఏర్పాటు చేయడానికి రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టంను 1956లో ఆమోదించింది?
1) 16 రాష్ర్టాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు
2) 15 రాష్ర్టాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు
3) 14 రాష్ర్టాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు
4) 24 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
9. కింది వారిలో ఎవరు 1948లో నియమించిన భాషా ప్రయుక్త ప్రావిన్సుల వాంఛనీయత విచారణమ్ కమిషన్ అధ్యక్షుడు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) జస్టిస్ ఎస్.కె. థార్
3) జస్టిస్ ఫజల్ అలీ
4) పట్టాభి సీతారామయ్య
10. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది?
1) 1956 2) 1960
3) 1963 4) 1966
11. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) యూఎస్ఎస్ఆర్ 2) వైపర్ (జర్మనీ)
3) అమెరికా 4) జపాన్
12. సర్ధార్ స్వరణ్ సింగ్ ఎన్ని ప్రాథమిక విధులను ప్రస్తావించారు?
1) 6 2) 8 3) 9 4) 10
13. ‘ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు’ ఈ భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా 2) నార్వే
3) ఆస్ట్రేలియా 4) యూఎస్ఎస్ఆర్
14. బలమైన కేంద్ర సమాఖ్య అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం?
1) అమెరికా 2) కెనడా
3) జపాన్ 4) యూఎస్ఎస్ఆర్
15. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలగింపు?
1) అమెరికా 2) బ్రిటన్
3) కెనడా 4) యూఎస్ఎస్ఆర్
16. రాష్ట్రపతి ఎన్నిక విధానం?
1) బ్రిటన్ 2) అమెరికా
3) ఐరిష్ 4) యూఎస్ఎస్ఆర్
17. భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలున్నాయి?
1) 18 2) 22 3) 26 4) 21
18. ‘సింధి’ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 71-1992 2) 21-1967
3) 92-2003 4) 96-2011
19. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాం?
1) ఐరిష్ 2) సౌత్ ఆఫ్రికా
3) జపాన్ 4) వైమర్ (జర్మనీ)
20. ఉపరాష్ట్రపతి పదవిని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాం?
1) బ్రిటన్ 2) అమెరికా
3) యూఎస్ఎస్ఆర్ 4) నార్వే
21. కర్ణాటక హైకోర్టును ఎప్పుడు స్థాపించారు?
1) 1916 2) 1948
3) 1884 4) 1949
22. పట్నా హైకోర్టును ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1949 2) 1916
3) 2013 4) 2019
23. కిందివాటిని కాలక్రమంగా అమర్చండి.
ఎ. నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు
బి. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టం
సి. హర్యానా రాష్ట్ర ఏర్పాటు
డి. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు
1) డి, బి, సి, ఎ 2) బి, డి, సి, ఎ
3) డి, బి, ఎ, సి 4) బి, డి, ఎ, సి
24. సిక్కిం రాష్ట్ర ఏర్పాటు?
1) 1974 2) 1975
3) 1972 4) 1971
25. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు?
1) 1972 2) 1971
3) 1973 4) 1975
26. హర్యానా రాష్ట్ర ఏర్పాటు?
1) 1963 2) 1960
3) 1966 4) 1965
27. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?
1) 1965 2) 1976
3) 1979 4) 1982
28. భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించినది?
1) ఆర్టికల్ 48(ఎ) 2) ఆర్టికల్ 51(ఎ)
3) ఆర్టికల్ 48 (ఎ), ఆర్టికల్ 51(ఎ)
4) ఏదీకాదు
1. భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి?
1) 365 2) 395
3) 464 4) 469
2. భారత రాజ్యాంగం ప్రకారం దేశ మొదటి పౌరుడు ఎవరు?
1) రాష్ట్రపతి 2) లోక్సభ స్పీకర్
3) ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి
3. భారత రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి?
1) 12 2) 10 3) 14 4) 8
4. సింధి భాషను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 71-1992 2) 96-2011
3) 21-1967 4) 61-1988
5. భారత రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని అధికార భాషలున్నాయి?
1) 22 2) 8 3) 14 4) 12
6. ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం?
1) 52-1985 2) 61-1988
3) 1-1951 4) 71-1992
7. గోవా రాష్ర్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1975 2) 1984
3) 1987 4) 1971
8. సిక్కింకు సహరాష్ట్ర హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 36-1975 2) 32-1973
3) 35-1974 4) 92-2003
9. పౌరసత్వం అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఐర్లాండ్ 4) స్పెయిన్
10. కిందివాటిలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాష?
1) ఉర్దూ 2) నేపాలి
3) కొంకణి 4) భోజ్పురి
11. ప్రాథమిక హక్కులు అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) బ్రిటన్ 2) జపాన్
3) అమెరికా 4) సౌత్ ఆఫ్రికా
12. కింది వాటిని జతపరచండి.
1. హర్యానా ఎ. 1975
2. గోవా బి. 1966
3. సిక్కిం సి. 1972
4. మణిపూర్ డి. 1987
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
13. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
1) 1953 2) 1992
3) 1956 4) 1958
14. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
1) 29, 7 2) 28, 9
3) 28, 8 4) 28, 6
15. ఆదేశిక సూత్రాలు అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) సౌత్ ఆఫ్రికా 2) జపాన్
3) ఐర్లాండ్ 4) స్పెయిన్
16. ఒరియాను ఒడియాగా మార్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 97-2011 2) 96-2011
3) 92-2003 4) 61-1988
17. కింది వాటిని జతపరచండి.
1. ఆంధ్రప్రదేశ్ ఎ. 75
2. బిహార్ బి. 58
3. మహారాష్ట్ర సి. 100
4. ఉత్తరప్రదేశ్ డి. 78
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
18. కొంకణి భాషను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 92-2003 2) 61-1988
3) 71-1992 4) 96-2011
19. కింది వాటిని జతపరచండి.
1. తమిళం ఎ. 2008
2. తెలుగు బి. 2005
3. ఒరియా సి. 2004
4. సంస్కృతం డి. 2014
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
20. ఆంధ్రప్రదేశ్ హైక్టోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2018 2) 2014
3) 2019 4) 2020
21. ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని ఏ భాగంలో పొందుపర్చారు?
1) పార్ట్-1 2) పార్ట్-4
3) పార్ట్-3 4) పార్ట్-2
22. పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1976 2) 1978
3) 1955 4) 2019
23. బోడో, డోగ్రీ భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1) 21-1967 2) 92-2003
3) 61-1988 4) 71-1992
24. కింది వాటిని జతపరచండి.
రాజ్యాంగ ఉన్నత పదవులు కనీస వయస్సు
1. రాష్ట్రపతి ఎ. 35
2. ప్రధానమంత్రి బి. 30
3. వార్డు సభ్యులు సి. 25
4. రాజ్యసభ సభ్యుడు డి. 21
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
25. 2023 నాటికి భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య?
1) 26 2) 21 3) 25 4) 24
కె.శ్రీనివాసరావు
పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?