ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన హక్కు ఏది?

పాలిటీ
15. రాజ్యాంగ అత్యవసర స్థితి ప్రకటన దేనికి దారి తీస్తుంది?
1) రాష్ట్రపతి పాలన/ గవర్నర్ పాలన
2) స్వేచ్ఛ హక్కు తాత్కాలిక రద్దు
3) ఉద్యోగుల జీతాల్లో కోత
4) మధ్యంతర ఎన్నికల నిర్వహణ
16. జతపరచండి
ఎ) బాలల హక్కుల చట్టం 1. 1938
బి) వరకట్న నిషేధం 2. 1961
సి) వెట్టిచాకిరి నిర్మూలన 3. 1976
డి) బాల కార్మికుల నిషేధం 4. 1986
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
17. ప్రాథమిక హక్కులను తొలగించే (లేదా) తగ్గించే శాసనాన్ని రాష్ట్రం చేయలేదు. అందువల్ల శాసనంగా అన్వయించకూడనిది ఏది?
1) ఆర్డినెన్స్ 2) బై-లా
3) నియమం 4) రాజ్యాంగ సవరణ
18. భారత రాజ్యాంగంలోని దోపిడీకి వ్యతిరేకమైన హక్కును కల్పించేవి?
ఎ) మానవులతో వ్యాపారం చేయడాన్ని, వెట్టిచాకిరీని నిషేధించడం
బి) అస్పృశ్యత నిషేధం
సి) అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల పరిరక్షణ
డి) ఫ్యాక్టరీల్లో, గనుల్లోనూ బాలల నియామకాన్ని నిషేధించడం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి, డి 4) ఎ, డి
19. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) అధికరణ 18: దేశంలో అనాదిగా వస్తున్న వ్యక్తుల బిరుదులు, కీర్తి చిహ్నాల నిషేధం
బి) అధికరణ 17: అంటరానితనం పేరిట వివక్ష చూపొద్దు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీ కావు
20. జతపరచండి.
ఎ) 19 (1ఎ) 1. వాక్ స్వాతంత్య్రం
బి) 19 (1బి) 2. సభలు, సమావేశాలు
నిర్వహించుట
సి) 19 (1సి) 3. సంఘాలు ఏర్పరచు
కోవడం
డి) 19 (1జి) 4. వృత్తి స్వాతంత్య్రం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
21. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు 2) పార్లమెంటు
3) రాష్ట్రపతి
4) పరిమితులు విధించడానికి వీలు లేదు
22. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) 19 (2ఎ) అధికరణ దేశ సార్వభౌమత్వం సవాల్ గురించి తెలుపుతుంది
బి) 19 (2సి) అధికరణ శాంతి భద్రతలకు భంగం విషయమై వివరిస్తుంది
1) ఎ 2) బి 3) ఎ, బి
4) పైవేవీ కావు
23. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన నూతన ప్రాథమిక హక్కు?
1) విద్యా హక్కు
2) ఏ వృత్తినైనా చేపట్టే హక్కు
3) ఏ వ్యాపారాన్నైనా నిర్వహించే హక్కు
4) సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కు
24. కింది వాటిని జతపరచండి.
ఎ) PDACT 1. 1971
బి) MISA 2. 1950
సి) TADA 3. 1985
డి) POTA 4. 2002
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
25. సెల్ఫ్ ఇంక్రిమినేషన్తో సంబంధం ఉన్న కేసు కింది వాటిలో ఏది?
1) హుస్సేన్ ఆరా ఖాతూన్ Vs బీహార్ హోం సెక్రటరీ
2) పీఏ ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
3) నారాయణ్‌లాల్ Vs మాణెక్
4) టీకే రంగరాజన్ Vs తమిళనాడు
26. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన హక్కు ఏది?
1) దోపిడీని నిరోధించే హక్కు
2) ఆస్తి హక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు
4) మాట్లాడే హక్కు
27. కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది
బి) రాజ్యాంగంలోని పార్ట్-III, పార్ట్-IV ల మధ్య అనుసంధానం ఉండాలని మినర్వామిల్స్ కేసులో ఉటంకించారు
సి) రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ ఆదేశిక సూత్రాలకు కూడా న్యాయబద్ధత సమకూర్చాలని సిఫారసు చేసింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) బి
28. ‘Due process of law’ అనే సూత్రంతో సంబంధం ఉన్న కేసు?
1) ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్
2) మేనకాగాంధీ Vs UOI
3) కేహర్‌సింగ్ Vs UOI
4) కర్తార్‌సింగ్ Vs UOI
29. దేశంలో బ్రిటిష్ పౌరుడికి కింది వాటిల్లో ఏ హక్కు ఉండదు?
1) వృత్తి వర్తక స్వేచ్ఛ హక్కు
2) చట్టం ముందు సమానత్వం
3) జీవించే హక్కు
4) మత స్వాతంత్య్రపు హక్కు
30. భారత రాజ్యాంగం ఆర్టికల్ 20లో క్లాజు 2లోని ‘ద్వంద్వ విపత్తు’ పదం కింది వాటిలో దేన్ని సూచిస్తుంది?
1) న్యాయస్థానం శిక్ష విధించిన వ్యక్తిని అదే నేరానికిగాను శాఖాపరమైన విధానాల ద్వారా శిక్షించొద్దు
2) శాఖాపరంగా శిక్ష పొందిన వ్యక్తిని అదే నేరానికి న్యాయస్థానంలో విచారించొద్దు
3) ఒకే నేరానికి ఒక వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించొద్దు, శిక్షించొద్దు
4) క్రిమినల్ ప్రొసీడింగ్‌తో పాటు ఇంజక్షన్ పట్ల అవిధేయత చూపినందుకు ఒక వ్యక్తిని సివిల్ న్యాయస్థానంలోని ప్రొసీడింగ్‌కు లోను చేయొద్దు
31. జత పరచండి.
ఎ) ఐరిష్ రాజ్యాంగం 1) విద్యా హక్కు
బి) ప్రాథమిక హక్కు 2) సమాచార హక్కు
సి) చట్టబద్ధమైన హక్కు 3) సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వయిరి
డి) ఆదేశ సూత్రం 4) న్యాయ స్థానాలను ఆశ్రయించే హక్కు
ఇ) రాజ్యాంగ 5) ఆదేశ సూత్రాలు పరిహారపు హక్కు
1) ఎ-5, బి-1, సి-2, డి-3, ఇ-4
2) ఎ-4, బి-5, సి-3, డి-1, ఇ-2
3) ఎ-5, బి-1, సి-3, డి-2, ఇ-4
4) ఎ-4, బి-3, సి-2, డి-5, ఇ-1
32. రాజ్యాంగం ప్రకారం సమానత్వపు హక్కులో భాగం కానిది?
1) సామాజిక సమానత్వం
2) బిరుదుల రద్దు
3) అంటరానితనం రద్దు
4) ఆర్థిక సమానత్వం
33. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ. 22వ అధికరణ నిర్బంధ నివారణ చట్టాన్ని తెలియజేస్తుంది
బి. ఫినిషిల్ డిటెన్షన్ అనగా న్యాయస్థానం విచారణ తర్వాత వ్యక్తి నిర్బంధం
సి. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్త కోసం వ్యక్తి నిర్బంధం
1) ఎ కు బి సరైనది
2) ఎ కు సి సరైనది
3) ఎ కు బి, సి లు సరైనవి
4) ఎ సరైనది
34. దేశంలో మతపరమైన సమస్య ఎప్పటి నుంచి ఉంది?
1) ప్రాచీన మత సంప్రదాయాలు
2) మొగలుల పాలన
3) 20వ శతాబ్దం ప్రారంభంలో జన సామాన్య సమీకరణ, ఎన్నికల రాజకీయం
4) దేశ విభజన
35. ఏ సందర్భంలో జేఎస్మిల్ సంపూర్ణ వాక్ స్వాతంత్య్రాన్ని సెన్సార్షిప్ను సిఫారసు చేశారు?
1) తప్పుడు అభిప్రాయం సందర్భంలో
2) తప్పుడు అభిప్రాయం సందర్భంలోనూ, పాక్షికంగా వాస్తవమూ, పాక్షికంగా అవాస్తవమూ అయిన అభిప్రాయం సందర్భంలో
3) పాక్షికంగా వాస్తవమూ, పాక్షికంగా అవాస్తవమూ అయిన అభిప్రాయం సందర్భంలో
4) ఒక అభిప్రాయం పాక్షికంగా వాస్తవమూ పూర్తిగా వాస్తవమూ అవాస్తవమూ అనే దానితో నిమిత్తం లేకుండా అన్ని సందర్భాల్లో
36. సమన్యాయపాలనను ఎక్కడ ఉల్లంఘించడం జరుగుతుంది?
1) పరిమిత ఓటుహక్కు
2) దత్తం చేసిన శాసన నిర్మాణం
3) తనిఖీలు, సంతులనాళ రాహిత్యం
4) కార్యనిర్వాహకుడి క్వాజి న్యాయాధికారాలు
37. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 30 ఏది, కింది అంశాలతో దేన్ని వివరిస్తుంది?
1) ధర్మోధర్మ వికేంద్ర స్వేచ్ఛ
2) మత ప్రచార హక్కు
3) విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించుకొనే అల్ప సంఖ్యాకుల హక్కు
4) మెజారిటీ వర్గానికి సంబంధించిన సాంస్కృతిక, విద్యా హక్కులు
38. జత పరచండి.
ఎ) 27వ అధికరణ 1. మతపరంగా పన్నులు వసూలు
చేయొద్దు
బి) 28వ అధికరణ 2. ప్రభుత్వ సంస్థల్లో
మత ప్రభోదం
చేయొద్దు
సి) 26వ అధికరణ 3.మతాభివృద్ధికి
సంస్థలు ఏర్పాటు
చేసుకోవచ్చు
డి) 25వ అధికరణ 4.ప్రతి వ్యక్తి నచ్చిన
మతాన్ని స్వీకరించ వచ్చు
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
39. అంబేద్కర్ ఏ ఆర్టికల్‌ను రాజ్యాంగపు హృదయంగా అభివర్ణించారు?
1) 22 2) 14 3) 17 4) 32
40. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ. 29వ అధికరణ: దేశంలో ఏ ప్రాంతంలో నివసించే వారైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని అభివృద్ధి పరుచుకోవచ్చు
బి. 30వ అధికరణ: ఏ ప్రాంతం వారైనా తమ భాష, సంస్కృతి అభివృద్ధి కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు
1) ఎ ల2) బి 3) ఎ, బి
4) ఏవీకావు
41. సరైన వాక్యాలు ఏవి?
ఎ. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది రాజ్యాంగ పరిహారపు హక్కు అని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు
బి. రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి అధికరణ 32 వివరించును
1) ఎ, బి సరైనవి 2) ఎ సరైంది
3) బి సరైంది 4) పైవేవీ కావు
42. కింది స్వేచ్ఛల్లో భారత రాజ్యాంగం హామీ ఇవ్వనిది ఏది?
1) ఆస్తిని సొంతం చేసుకొనే, సంపాదించుకొనే, పరిష్కరించుకొనే స్వేచ్ఛ
2) దేశమంతటా తిరిగే స్వేచ్ఛ
3) శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ
4) ఏదైనా వర్తకాన్ని (లేదా) వృత్తిని ఆచరించుకొనే స్వేచ్ఛ
43. ఆస్తి హక్కు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు?
1) జాన్లాక్ 2) జాన్రాల్స్
3) నలాక్ 4) నోజిక్
44. ఆస్తిహక్కు ఏ వర్గానికి చెందింది?
1) న్యాయపరమైన హక్కు
2) ప్రాథమిక హక్కు
3) మానవ హక్కు
4) సహజ హక్కు
45. కింది వాటిని జతపరచండి.
ఎ) హెబియస్ కార్పస్ 1. పరమాదేశం
బి) మాండమస్ 2. బందీ ప్రత్యక్ష
సి) సెర్షియోరరీ 3. అధికారపృచ్ఛ
డి) కోవారెంటో 4. ఉత్ప్రేషణ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-3, బి-2, సి-1, డి-4
46. కింది ప్రాథమిక హక్కుల్లో భారత పౌరులకు మాత్రమే హామీ ఇచ్చి దేశంలో నివసిస్తున్న విదేశీయులకు ఇవ్వనివి ఏవి?
1) న్యాయం ముందు సమానత్వం, సమానమైన న్యాయ రక్షణ
2) వాక్, భావ ప్రకటన స్వాతంత్య్రం
3) జీవన స్వేచ్ఛ హక్కు
4) మత స్వాతంత్య్రపు హక్కు
47. జతపరచండి.
ఎ) 24వ రాజ్యాంగ
సవరణ 1. ప్రభుత్వాలు
చెల్లించే నష్టపరిహారం
బి) 25వ రాజ్యాంగ
సవరణ 2. ప్రాథమిక హక్కు
లతో సహా రాజ్యాం గంలో ఏ భాగమైనా
సవరించే అధికారం
పార్లమెంటు కలిగి
ఉండడం
సి) 26వ రాజ్యాంగ సవరణ
3. రాజభరణాల రద్దు
1) ఎ-1, బి-3, సి-2
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-1, బి-2, సి-3
48. స్వేచ్ఛా హక్కుకు సంబంధించిన అధికరణలు?
1) 14 నుంచి 18 2) 19 నుంచి 22
3) 23, 24 4) 25 నుంచి 28

F1
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?