Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
1. TS- i PASS కింద 2015 నుంచి జనవరి 2023 వరకు పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందడంలో ఈ కింది వాటిలో మొదటి మూడు జిల్లాలు ఏవి?
1) రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి
2) హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ
3) మేడ్చల్-మల్కాజిగిరి,
సంగారెడ్డి, రంగారెడ్డి
4) మేడ్చల్-మల్కాజిగిరి,
సంగారెడ్డి, నల్గొండ
2. TS-i PASS కింద 2015 నుంచి జనవరి 2023 వరకు పరిశ్రమల్లో అత్యధిక పెట్టుబడులను పొందిన మొదటి మూడు జిల్లాలు ఏవి?
1) రంగారెడ్డి, నల్గొండ,
భద్రాది కొత్తగూడెం
2) మేడ్చల్-మల్కాజిగిరి,
సంగారెడ్డి, నల్గొండ
3) రంగారెడ్డి, మేడ్చల్-
మల్కాజిగిరి, నల్గొండ
4) మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి
3. TS-i PASS కింద 2015 నుంచి జనవరి 2023 వరకు పరిశ్రమల్లో అత్యధికంగా ఉపాధి కల్పించిన మొదటి మూడు జిల్లాలు ఏవి?
1) రంగారెడ్డి, నల్గొండ, వరంగల్
2) రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి
3) సంగారెడ్డి, వరంగల్, నల్గొండ 4) సంగారెడ్డి, వరంగల్. రంగారెడ్డి
4. TS- i PASS అంశంలో సరైనవి గుర్తించండి?
ఎ. TS-i PASS ద్వారా అత్యధిక అనుమతి పొందిన పరిశ్రమలు సూక్ష్మ ఎంటర్ప్రైజెస్
బి. TS-i PASS ద్వారా అత్యధికంగా పెట్టుబడులను సేకరించిన పరిశ్రమలు- మెగా ఎంటర్ప్రైజెస్
సి. TS-i PASS ద్వారా అత్యధికంగా ఉపాధి లభించిన పరిశ్రమలు-
మెగా ఎంటర్ప్రైజెస్
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి
5. TS-i PASS ద్వారా 2022-23 సంవత్సరంలో ఏ పరిశ్రమలకు అత్యధికంగా ఆమోదం తెలిపినది?
1) సిమెంట్ 2) ఫార్మాస్యూటికల్
3) ఆగ్రో పరిశ్రమ 4) ఫుడ్ ప్రాసెసింగ్
6. TS-iPASS ద్వారా 2022-23 సంవత్సరంలో ఏ పరిశ్రమలకు అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించాయి ?
1) సిమెంట్ 2) ఫార్మాస్యూటికల్
3) ప్లాస్టిక్, రబ్బరు
4) ఫుడ్ ప్రాసెసింగ్
7. ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక సామర్థ్ధ్యం గల వ్యక్తుల నుంచి పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యం పెంచడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని మరింత సమానమైనదిగా మార్చడాన్ని ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ కింది వాటిలో ఏది ?
1) T- PRIDE 2) TS IIC
3) T-IDEA 4) TS IDC
8. తెలంగాణ నూతన “ పారిశ్రామిక విధాన చట్టం ( ఫ్రేమ్‌వర్క్ 2) , 2014 లక్ష్యం కింది అంశాలతో కూడి ఉంది.
ఎ. సంలీనించు (INCORPORRATE)
బి. ఆరంభించు (INCUBATE)
సి. దృఢపరచు ( INCULCATE)
డి. ఆవిష్కరించు (INNOVATE)
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, డి 4) ఎ, బి
9. తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏది పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా పని చేస్తుంది.
1) T- PRIDE 2) TS- I PASS
3) TS- IDE 4) TS IIC
10. తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMES ) వాటా ఏ జిల్లాలో అత్యధికంగా ఉంది.
1. హైదరాబాద్ 2. మేడ్చల్-మల్కాజిగిరి
3. రంగారెడ్డి 4. నల్గొండ
11. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME లను ప్రోత్సహించడం కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందం ( Memorandum of Standingi) కుదుర్చుకుంది?
1. అమెరికా 2. సింగపూర్
3. రష్యా 4. థాయ్‌లాండ్
12. కింది వాటిలో సరైనవి గుర్తించండి .
ఎ. TS గ్లోబల్‌లింకర్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్లోబల్ కొనుగోలుదారులు, అమ్మకందారులను సంప్రదించడంలో సహాయపడే డిజిటల్ నెట్ వర్కింగ్ వేదిక.
బి. Ts గ్లోబల్ లింకర్‌ను 2019లో ప్రభుత్వం ప్రారంభించింది
1. ఎ సరైంది
2. బి సరైంది
3. ఎ, బి సరైంది
4. ఎ, బి సరికానిది
13. కింది వ్యాఖ్యలను పరిశీలించండి
ఎ. నేతన్నకు చేయుత పథకం ద్వారా నేత కార్మికులకు సామాజిక భద్రతను అందించడానికి ఉద్దేశించబడింది .
బి. చేనేత మిత్ర స్కీం ద్వారా నూలు, రంగులు, రసాయనాలకు 40 శాతం
సబ్సిడీని అందించే ఉత్పాదకాల సబ్సిడీ పథకం.
పై వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
14. 2021-22 సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తులను ఆధారం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఎగుమతుల్లో వివిధ వస్తువుల వాటాను అవరోహణ క్రమంలో అమర్చండి
ఎ. ఫార్మాస్యూటికల్
బి. సేంద్రియ రసాయనాలు
సి. ఎలక్ట్రానిక్ యంత్రాలు
డి. న్యూక్లియర్ యంత్రాలు
సరైన జవాబును ఎంచుకోండి.
1) ఎ, బి, సి, డి 2) డి, సి, బి, ఎ
3) ఎ, డి, సి, బి 4) ఎ, బి, డి, సి
15. 2021-22 సంవత్సరంలో కింది ఏ దేశాలకు తెలంగాణా రాష్ట్ర వస్తువులు
ఎక్కువగా ఎగుమతి చేశారు?
1) యూఎస్ఏ, చైనా, బంగ్లాదేశ్
2) యూఎస్ఏ, చైనా, సింగపూర్
3) సింగపూర్, జపాన్, బ్రెజిల్
4) యూఎస్ఏ, చైనా, బ్రెజిల్
16. 2022-23 సంవత్సరంలో విదేశాలకు తెలంగాణ వస్తువులను ఎగుమతి చేసిన మొదటి మూడు జిల్లాలు ఏవి ?
1) మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి
2) మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి
3) మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నల్గొండ
4) మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, మెదక్
17. కింది వాక్యాలను పరిశీలించండి ?
ఎ. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ 5 విభాగాల్లో జాతీయ పర్యాటక అవార్డులను గెలుచుకుంది
బి. పర్యాటక అవార్డులను 2022 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భారత ప్రభుత్వం అవార్డులను అందజేసింది
పై వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరైనవి
18. 2022-23 సంవత్సరంలో తెలంగాణ సేవా రంగంలోని ఉపరంగాల్లో ఎక్కువ వాటాను కలిగి ఉన్నది?
1. రియల్ ఎస్టేట్
2. హోటల్స్, రెస్టారెంట్లు
3. ఆర్థిక సేవలు 4. ఇతర సేవలు
19. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. తెలంగాణ ప్రభుత్వం ICT పాలసీని ఏప్రిల్ 2016లో రెండవ ICT పాలసీని నవంబర్ 2021 సంవత్సరంలో విడుదల చేశారు.
బి. IT ఎగుమతులు 2020-21, 2021-22 సంవత్సరాల మధ్య 26.14 శాతం వృద్ధిరేటును కలిగి ఉన్నాయి.
పై వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
1. ఎ 2. బి 3. ఎ, బి
4. ఎ, బి సరికావు
20. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం , 2015-16, 2020-21 మధ్య తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది ?
1. 324 శాతం 2. 342 శాతం
3. 352 శాతం 4. 325 శాతం
21. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం. 100 చ.కి.మీ కు తెలంగాణ మొత్తం రహదారి సాంద్రత ఎంత?
1. 94.79 కి.మీ 2. 97.49 కి.మీ
3. 96.94 కి.మీ 4. 98.49 కి.మీ
22. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం 2021-22 నాటికి రాష్ట్రం లో మొత్తం పాఠశాలల సంఖ్య ఎంత ?
1. 41,369 2. 41,396
3. 41,639 4. 41,963
23. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం, హైదరాబాద్/గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లోని ఎన్ని ప్రధాన ఆసుపత్రుల్లో తెలంగాణ ప్రభుత్వం రోగుల సహాయకులకు రూ. 5 భోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1. 16 2. 18 3. 20 4. 23
24. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం తెలంగాణలో మొత్తం కాంట్రాక్ట్ కెపాసిటి విద్యుత్ సామర్థ్యం ఎంత
1. 17, 667 మెగావాట్స్
2. 16,767 మెగావాట్స్
3. 18,667 మెగావాట్స్
4. 18,766 మెగావాట్స్
25. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం తెలంగాణ మొత్తం ఎన్ని కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ కలిగి ఉంది?
1. 1,09,620 కి.మీ
2. 1,90,260 కి.మీ
3. 1,09,260 కి.మీ
4. 1,19,260 కి.మీ
26. అక్టోబర్ 2022 నాటికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), హైదరాబాద్ ఎన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానించబడింది?
1. 15 2. 17 3. 19 4. 20
27. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం కిందివాటిలో ఏ ప్రకటన తప్పు?
1. తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 18,069 మెగావాట్లు
2. రాష్ట్రంలో మొత్తం విద్యుత్
కనెక్షన్లు 174. 03 లక్షలు
3. 2014-15, 2021-22 మధ్యలో తెలంగాణ తలసరి విద్యుత్ లభ్యత 1.7 రెట్లు పెరిగింది
4. దక్షిణ భారత రాష్ర్టాల్లో తెలంగాణ మూడవ అతితక్కువ ప్రసార నష్టం కలిగి ఉంది.
28. JLL-CiTY- Momentum Index – 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత డైనమిక్ సిటీ కేటగిరిలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత ?
1. 2వ 2. 3వ
3. మొదటి 4. 4వ
29. తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్‌లుక్-2023 ప్రకారం, 2021-22లో తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల నుంచి అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు పరివర్తన రేటు ఎంత?
1. 67.01 శాతం 2. 77.01 శాతం
3. 87.01 శాతం 4. 97.01 శాతం
30. 2021-22లో వరి ఉత్పత్తికి సంబంధించి ఈ కింది మూడు భారతీయ రాష్ర్టాలను అవరోహణ క్రమంలో అమర్చండి
ఎ. పశ్చిమ బెంగాల్
బి. ఉత్తరప్రదేశ్
సి. పంజాబ్
1. ఎ>బి>సి 2. బి>ఎ>సి
3. బి>సి>ఎ 4. సి>ఎ>బి
31. తెలంగాణలో విద్యుత్ రంగం గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. 2014-15లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే
బి. 2021-22 నాటికి తలసరి వినియోగం 2,126 యూనిట్లకు పెరిగింది.
1. ఎ 2. బి
3. ఎ, బి 4. ఎ, బి కాదు
32. జూన్ 2023లో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ & స్టాటిస్టిక్స్ ప్రచురించిన “ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @ టెన్’ నివేదిక ఆధారంగా కింది ప్రకటనల్లో సరైనవి ఏవి?
2014-15 నుంచి 2022-23
మధ్య కాలంలో
I) తెలంగాణ జీడీపీ(GDP) 155.7
శాతానికి పెరిగింది .
II) ఈకాలంలో మొత్తం GSDP పెరుగుదల పరంగా తెలంగాణ రాష్ట్రం
2వ స్థానంలో నిలిచింది.
III) ఈ కాలంలో తెలంగాణ సేవల రంగం సగటున 13.1 శాతం వృద్ధిని సాధించింది .
1. I, II 2. II, III
3. I, II, III 4. I, III
33. 2020-21కి సంబంధించి ఆర్థిక కార్యకలాపం ద్వారా రాష్ట్ర స్థూల విలువ జోడింపు (GSVA)- బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్
(తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2023 ప్రకారం) ఈ కింది రాష్ర్టాలను వాటి ర్యాంక్‌లతో జతపరచండి.
సరైన ఎంపికను ఎంచుకోండి.
రాష్ర్టాలు ర్యాంక్
I. మహారాష్ట్ర ఎ. 2వ ర్యాంకు
II. తెలంగాణ బి. 7వ ర్యాంకు
III. తమిళనాడు సి. 1వ ర్యాంకు
1. I- C, II-B, III-A
2. I-B, II-C, III-A
3. I-A, II-B, III-C
4. I-A, II-C, III-B
34. డిసెంబర్-2021లో విడుదల చేసిన నీతి ఆయోగ్-4వ ఆరోగ్య సూచికలో పెద్ద రాష్ర్టాల్లో మొత్తం ఆరోగ్య పనితీరు పరంగా తెలంగాణ ఎన్నో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది?
1. 2వ 2. 3వ 3. 4వ 4. 5వ
35. 20వ పశుగణన-2019 ప్రకారం గొర్రెల
జనాభాలో తెలంగాణ ఎన్నో ర్యాంక్‌లో ఉంది.
1. 2వ 2. 1వ
3. 3వ 4. 4వ
జవాబులు
1-3 2-1 3-2 4-3
5-4 6-3 7-1 8-1
9-4 10. 1 11. 4 12. 3
13-3 14-1 15-1 16-2
17-3 18-1 19-3 20-2
21-2 22-1 23-2 24-1
25-3 26-2 27-4 28-3
29-4 30-1 31-3 32-3
33-1 34-2 35-2
పన్నాల శ్రవణ్ కుమార్
ఎకనామిక్స్ ఫ్యాకల్టీ,
9866709280
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు