ఖగోళ వస్తువుల వల్ల ఏర్పడే నీడను ఏమంటారు?
జనరల్ సైన్స్-3
(ఆగస్టు 4 తరువాయి)
117. పరమాణువులోని ముఖ్య భాగాలు ఏవి?
1) ప్రోటాన్లు 2) న్యూట్రాన్లు
3) ఎలక్ట్రాన్లు 4) పైవన్నీ
118. ప్రోటాన్ ద్రవ్యరాశి?
1) 1.605×10-25 2) 1.600×10-25
3) 1.672×10-27 4) 1.675×10-27
119. ఎలక్ట్రాన్ ఆవేశం?
1) -1.6×10-19 2) 1.6×10-19
3) 1.67×10-27 4) 1.62×10-25
120. X-కిరణాలను ఎవరు కనుగొన్నారు?
1) నీల్స్‌బోర్ 2) రాంట్జన్
3) థామ్సన్ 4) రూథర్‌ఫర్డ్
121. టాలమీ సిద్ధాంతం ప్రకారం చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏవిధంగా భ్రమణం చెందుతాయి?
1) వృత్తాకార కక్ష్య
2) దీర్ఘవృత్తాకార కక్ష్య
3) పరావలయ కక్ష్య 4) ఏదీకాదు
122. కోపర్నికస్ ప్రకారం..
1) సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు
2) చంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు
3) భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది
4) ఏదీకాదు
123. కెప్లర్ మొదటి నిమయం ప్రకారం..
1) సూర్యుడు భూమి చుట్టూ
వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాడు
2) చంద్రుడు భూమి చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాడు
3) గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుడు ఒక నాభి వద్ద ఉండేటట్లు పరిభ్రమిస్తాయి
4) ఏదీకాదు
124. గెలీలియో దేన్ని కనుగొన్నాడు?
1) సూర్యుడు క్రమగోళం కాదు
2) భూమి క్రమగోళం కాదు
3) చంద్రుడు క్రమగోళం కాదు
4) ఏదీకాదు
125. దూరంగా ఉన్న గెలాక్సీల కాంతి వర్ణపటం ఎరుపు రంగువైపు జరగటాన్ని ఏమంటారు?
1) గెలాక్సీల కదలిక 2) రెడ్ షిఫ్ట్
3) వర్ణపట మార్పు 4) ఏదీకాదు
126. సూర్యుని తర్వాత మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం?
1) ఆల్ఫా సెంటారీ 2) మిల్కీవే
3) కాపెల్లా 4) బెటిల్గిస్
127. నక్షత్రాల్లో శక్తి దేని వల్ల విడుదలవుతుంది?
1) హైడ్రోజన్ కేంద్రక సంలీనం
2) హైడ్రోజన్ కేంద్రక విచ్ఛిత్తి
3) హీలియం కేంద్రక విచ్ఛిత్తి
4) హీలియం కేంద్రక సంలీనం
128. చిన్న చిన్న కీటకాలు నీటి ఉపరితలంపై
నడవడానికి గల కారణం?
1) ఘర్షణ 2) స్నిగ్ధత
3) కేశనాళికీయత 4) తలతన్యత
129. విద్యుత్ ఫ్యూజ్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.
1) శ్రేణిలో కలుపుతారు
2) సమాంతరంగా కలుపుతారు
3) మిశ్రమ లోహంతో తయారుచేస్తారు
4) అధిక విద్యుత్ ప్రవాహాల నుంచి కాపాడుతుంది
130. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లోని ఏ ఎలక్ట్రానిక్ పరికరాలను వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్ సేవలకు ఉపయోగిస్తున్నారు?
1) ట్రాన్స్‌పాండర్ 2) థర్మోస్టాట్
3) టోనోమీటర్ 4) టెలీ మీటరు
131. ఖగోళ శాస్త్రజ్ఞుడికి నౌక నుంచి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
1) ఎరుపు 2) నలుపు
3) తెలుపు 4) నీలం
132. వస్తువు కంటే పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఎలా పొందవచ్చు?
1) కుంభాకార దర్పణం
2) పుటాకార దర్పణం
3) సమతల దర్పణం
4) పుటాకార కటకం
133. సూర్యకాంతి ఎన్ని సెకన్లలో భూమిని చేరుతుంది?
1) 100 సెకన్లు 2) 1000 సెకన్లు
3) 1×10-3 సెకన్లు 4) 480 సెకన్లు
134. ఖగోళ వస్తువుల వల్ల భూమిపై ఏర్పడే నీడను ఏమంటారు?
1) పెనంబ్రా 2) ఖగోళ నీడ
3) అంబ్రా 4) గ్రహణం
135. ‘కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది’ ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) ప్రొజెక్టర్ 2) కెమెరా
3) మ్యాజిక్ లాంతరు 4) సూక్ష్మదర్శిని
136. షేవింగ్ చేసుకోవడానికి ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు?
1) సమతల పుటాకార దర్పణం
2) సమతల కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం 4) 1, 2
137. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం?
1) నిజ ప్రతిబింబం
2) మిథ్యా ప్రతిబింబం
3) తలక్రిందులు 4) నిటారు
138. మోటారుకారులో ఉపయోగించే దర్పణం?
1) పుటాకార 2) కుంభాకార
3) సమతల 4) 1, 2
139. పుటాకార దర్పణం నాభ్యాంతర దూరం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) వస్తు దూరం 2) ప్రతిబింబ దూరం
3) 1, 2 4) దర్పణం వక్రతల వ్యాసార్థం
140. ఎండమావి ఏర్పడటానికి కారణం?
1) కాంతి పరావర్తనం 2) వక్రీభవనం
3) వ్యతికరణం
4) సంపూర్ణాంతర పరావర్తనం
141. ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణం?
1) కాంతి పరావర్తనం
2) కాంతి వక్రీభవనం
3) ధృవణం 4) కాంతి పరిక్షేపణ
142. హ్రస్వదృష్టిని ఎలా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) సమతుల కుంభాకారకటకం
4) సమతల పుటాకార కటకం
143. ఇంద్రధనస్సు దేనివల్ల ఏర్పడుతుంది?
1) వ్యాపనం 2) కాంతి పరిక్షేపణ
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) 1, 3
144. సర్ సీవీ రామన్‌కు నోబెల్ బహుమతి ఏ విషయంలో లభించింది?
1) కాంతి పరిక్షేపణం 2) ధృవణం
3) వ్యతికరణం 4) వివర్తనం
145. వేలిముద్రలను గుర్తించడానికి ఏ కాంతిని ఉపయోగిస్తారు?
1) మెర్క్యూరీ కాంతి 2) సూర్యకాంతి
3) ఐఆర్ కాంతి
4) అతి నీలలోహిత కాంతి
146. వజ్రం మెరవడానికి కారణం?
1) వక్రీభవనం 2) వివర్తనం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) పరావర్తనం
147. కాంతి తీవ్రతకు ప్రమాణాలు?
1) కాండెలా 2) ల్యూమెన్/మీ
3) ల్యూమెన్/మీ2 4) ఏదీకాదు
148. నీటి అసంగత వ్యాకోచనం వల్ల 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీటికి…?
1) సాంద్రత గరిష్టం
2) ఘనపరిమాణం కనిష్ఠం
3) సాంద్రత కనిష్ఠం 4) 1, 2
149. సముద్రయాన దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
1) ఫారడే 2) నాటికల్ మైల్
3) బార్ 4) ఆంపియర్
150. విద్యుత్ అయస్కాంత ప్రేరణ ద్వారా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది?
1) ట్రాన్స్ఫార్మర్ 2) డైనమో
3) రెక్టిఫైర్/రెక్టిఫయిర్ 4) కెపాసిటర్
151. సముద్రపు నీటిని తాగే నీటిగా మార్చే పద్ధతిని ఏమంటారు?
1) వడపోత 2) స్వేదన ప్రక్రియ
3) నీటి ఆవిరిగా మార్చుట
4) డీసాలినేషన్
152. సముద్రపు నీటి నుంచి ఉప్పును తయారు చేసే పద్ధతి?
1) ఉత్పతనం 2) ఇగురబెట్టుట
3) స్పటీకరణం 4) వడపోత
153. ఏ పదార్థంలో కార్బన్ అతి తక్కువ శాతం ఉంటుంది?
1) స్టీలు 2) పిగ్ ఇనుము
3) తుప్పు ఇనుము 4) కాల్చిన ఇనుము
154. ‘క్లోరినేషన్’ అంటే?
1) క్లోరైడ్లను క్లోరిన్గా మార్చుట
2) అపరిశుభ్రత నీటికి కొద్దిశాతం క్లోరిన్‌ను కలుపుట
3) రసాయనిక చర్యలో క్లోరిన్ ఏర్పడుట
4) లవణాన్ని ఏర్పరచునప్పుడు క్లోరిన్‌ను కలిగి ఉండుట
155. భారజలం అంటే?
1) వాయువు నీటిలో కరిగి ఉండుట
2) నీటిలో లవణాలు, ఖనిజాలు ఎక్కువగా కరిగి ఉండుట
3) హైడ్రోజన్ స్థానంలో డ్యుటీరియం ఉండుట
4) సేంద్రియ పదార్థాలు మలినాలుగా కరిగి ఉండుట
156. కిణ్వవ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు?
1) సల్ఫర్ డయాక్సైడ్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డయాక్సైడ్ 4) మీథేన్
157. గ్లూకోజ్ కిణ్వన ప్రక్రియలో ఏవేవి ఏర్పరుచుతుంది?
1) CO2, CH3OH
2) CO, ఆల్కహాల్ 3) CO2, H20
4) CO2, C2H5OH
158. కర్పూరాన్ని సులువుగా శుద్ధి చేసే ప్రక్రియ?
1) ఉత్పతనం 2) స్వేదనం
3) స్పటికీకరణం 4) వడపోత
159. వడపోత, ఇగురబెట్టుట ఉపయోగించి వేరు చేయగల మిశ్రమానికి ఉదాహరణ?
1) ఇసుక, నీరు 2) ఇసుక, గులకరాళ్లు
3) ఇసుక, ఉప్పు 4) నీరు, ఉప్పు
160. ఒక లోహాన్ని మరో లోహంతో లేదా అలోహంతో కలిపే సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు?
1) మిశ్రమలోహం 2) ఆలమ్
3) సంయోగపదార్థం 4) మిశ్రమం
161. థర్మల్ విద్యుత్ కేంద్రంలో…
1) బొగ్గులోని రసాయనిక శక్తి, ఉష్ణశక్తిగా మారి, తరువాత విద్యుచ్ఛక్తిగా మారుతుంది
2) బొగ్గులోని రసాయనిక శక్తి, యాంత్రిక శక్తిగా మారి, తరువాత విద్యుచ్ఛక్తిగా మారుతుంది
3) బొగ్గులోని రసాయనిక శక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది
4) వీటిలో ఏదీకాదు
162. మిశ్రమ ద్రావణంలోని ద్రావణాలను వాటి బాష్పీభవన స్థానాలను బట్టి వేరు చేయుట అంటే?
1) వేడి చేయుట 2) స్వేదన ప్రక్రియ
3) అంశిక స్వేదన ప్రక్రియ
4) ఇగుర్చుట
163. ఒక సంయోగ పదార్థంలోని ఒక మూలకం నుంచి వేరొక మూలకాన్ని తొలగించే చర్యను ఏమంటారు?
1) రసాయన స్థానభ్రంశం
2) ద్వంద్వ రసాయన వినియోగం
3) స్థిరానుపాత నియమం
4) బాహ్యానుపాత నియమం
164. కాథోడ్ కిరణాల్లోని కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రజ్ఞుడు?
1) జేజే స్టోనీ 2) నీల్స్‌బోర్
3) శ్రోడింజర్ 4) హైసన్ బర్గ్
165. పరమాణు కేంద్రకం వేటిని కలిగి ఉంటుంది?
1) ప్రోటాన్లు, న్యూట్రాన్లు
2) ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు
3) న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు
4) ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్
166. ఒక మూలంకంలో అతి చిన్న సూక్ష్మమైన కణం?
1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్
3) న్యూట్రాన్ 4) ఆటమ్
167. పరమాణువు పరమాణు భారం దేనికి సమానం?
1) ప్రోటాన్లు 2) న్యూట్రాన్లు
3) ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం
4) ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు
168. అయనీకరణం అంటే?
1) పరమాణులో ఎలక్ట్రాన్‌ను చేర్చడం లేదా తొలగించడం
2) పరమాణులో ఎలక్ట్రాన్‌ను తొలగించడం
3) పరమాణులో ఎలక్ట్రాన్‌ను చేర్చడం
4) పైవన్నీ
169. రేడియోధార్మిక చర్యలో విడుదలయ్యేవి?
1) ఆల్ఫా కిరణాలు 2) బీటా కిరణాలు
3) గామా కిరణాలు 4) పైవన్నీ
170. పొజెట్రాన్ భారాన్ని కలిగి ఉండేది?
1) ఆల్ఫా కిరణం 2) ప్రోటాన్
3) ఎలక్ట్రాన్ 4) న్యూట్రాన్
171. ద్రవ్యరాశి స్పెక్ట్రోగ్రాఫ్ అనే పరికరం వేటిని వేరుచేసి గుర్తిస్తుంది.
1) వేర్వేరు ద్రవ్యరాశులను
2) వివిధ విద్యుదావేశాలు, ద్రవ్యరాశుల నిష్పత్తి
3) వేర్వేరు అయస్కాంత ఆవేశాలుఉన్న కణాలను
4) ధనాత్మక, రుణాత్మక ఆవేశాలు ఉన్న కణాలను
172. పరమాణువులో రుణావేశపూరిత కణం ఏమటి?
1) న్యూట్రాన్ 2) ప్రోటాన్
3) ఎలక్ట్రాన్ 4) పొజెట్రాన్
173. ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఉంటాయని భావించిన వాడు?
1) రూథర్ ఫర్డ్ 2) జేజే థామ్సన్
3) నీల్స్‌బోర్ 4) సోమర్ ఫీల్డ్
174. మాక్స్ ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం వికిరణ శక్తి కింది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?
1) తరంగదైర్ఘ్యం 2) పౌనఃపున్యం
3) తరంగసంఖ్య 4) డోలనపరిమితి
175. న్యూక్లియాన్ కానిది?
1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్
3) న్యూట్రాన్ 4) ఏదీకాదు
176. పరమాణు వ్యాసార్థాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) ఆర్మ్‌స్ట్రాంగ్ 2) amu
3) ఎర్గ్స్ 4) ఏదీకాదు
177. న్యూక్లియాన్ అంటే?
1) 1 ప్రోటాన్, న్యూట్రాన్
2) 1 ప్రోటాన్, 1 ఎలక్ట్రాన్
3) 1 ప్రోటాన్, 1 పరమాణువు
4) 1 న్యూట్రాన్, 1 ఎలక్ట్రాన్
178. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం పడిపోదు, దీనికి కారణం భూమి గురుత్వాకర్షణ?
1) చంద్రుడి ఆకర్షణ చేత తుల్యం అవుతుంది
2) దీని స్థిర గమనానికి కావలసిన వడినిస్తుంది
3) దీని గమనానికి తగిన త్వరణాన్ని ఇస్తుంది
4) పైవన్నీ
179. అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం.
1) అపోలో-1 2) స్పుత్నిక్-1
3) ఆర్యభట్ట 4) ఏదీకాదు
– విజేత కాంపిటీషన్స్,
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?