ఇథిలిన్‌ను మోనోమర్గా కలిగి ఉండని రెసిన్ ఏది?
కృత్రిమ దారాలు- ప్లాస్టిక్స్
1. కింది వాటిని జతపరచండి.
మండించే పరీక్ష దారం
ఎ. జుట్టు కాలిన వాసన 1. అక్రలిక్
బి. పేపర్ కాలిన వాసన 2. ఉన్ని
సి. జ్వాలలో కరగడం 3. రేయాన్
ఎ) ఎ-2, బి-3, సి-1
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-1, బి-2, సి-3
డి) ఎ-2, బి-1, సి-3
2. సహజ దారపు వనరులు ఏవి?
1. చెట్లు 2. పెట్రోలియం
3. బొగ్గు 4. జంతువులు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 4 డి) 1, 3, 4
3. దారంలోని చిన్న యూనిట్‌ను ఏమంటారు?
ఎ) పాలిమర్ బి) మోనోమర్
సి) డైమర్ డి) ఏదీకాదు
4. కిందివాటిని జతపరచండి.
ఎ. కోడ్-1 1. హెచ్డీపీఈ అధిక సాంద్రత గల పాలిఇథిలిన్
బి. కోడ్-2 2. పీవీసీ పాలి వినైల్ క్లోరైడ్
సి. కోడ్-3 3. పీఈటీ
ఎ) ఎ-3, బి-1, సి-2 బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-1, సి-3 డి) ఎ-1, బి-2, సి-3
5. థర్మో ప్లాస్టిక్‌కు సంబంధించి సరికాని వాక్యం?
ఎ) ఇది ఒక పాలిమర్
బి) దీన్ని వేడిచేసినప్పుడు మృదువుగా, చల్లార్చినప్పుడు కఠినంగా మారుతుంది
సి) దీన్ని తిరిగి మరొక రూపంలోకి మార్చలేం
డి) పీవీసీ దీనికొక ఉదాహరణ
6. ఇథిలిన్‌ను మోనోమర్గా కలిగి ఉండని రెసిన్?
ఎ) పీఈటీ బి) హెచ్డీపీఈ
సి) ఎల్‌డీపీఈ డి) పీవీసీ
7. కాల్చినప్పుడు ఘాటైన వాసన వచ్చే దారం?
ఎ) పట్టు బి) నూలు
సి) ఉన్ని డి) నైలాన్
8. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) అక్రలిక్- సెల్యూలోజ్ దారం
బి) రేయాన్- నకిలీ ఉన్ని
సి) టెర్లిన్- పాలిస్టర్
డి) నైలాన్- కృత్రిమ పట్టు
9. కింది వాటిలో సరికానిది?
ఎ) సహజ దారాలు- ఉన్ని, నూలు, సిల్కు
బి) అనేక పాలిమర్ల కలయిక వల్ల ఏర్పడే పదార్థం మోనోమర్
సి) ఒకే విధమైన చిన్నచిన్న అణువులను మోనోమర్లు అంటారు
డి) కర్బన పదార్థాల పాలిమర్లను రెసిన్లు అంటారు
10. కింది వాటిలో సహజ పాలిమర్ కానిది?
ఎ) సెల్యూలోజ్ బి) స్టార్చ్
సి) పీవీసీ డి) ప్రొటీన్లు
11. కింది వాటిలో కృత్రిమ పాలిమర్ కానిది?
ఎ) నైలాన్ బి) పట్టు
సి) పాలిథిన్ డి) పీవీసీ
12. కింది వాటిలో దేన్ని కృత్రిమ ఉన్నిగాపరిగణించవచ్చు?
ఎ) టెరి ఊల్ బి) రేయాన్
సి) నైలాన్ డి) అక్రలిక్
13. సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్‌లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే సుపరిచిత పాలిస్టర్ రూపం ఏది?
ఎ) హెచ్డీపీఈ బి) పీవీసీ
సి) పీఈటీ డి) ఎల్‌డీపీఈ
14. రెసిన్‌ను గుర్తించేందుకు వాడే చిహ్నాల సరైన జత ఏది?
15. పాలి ఇథిలిన్ అనేది ఏ రకపు పొలిమరీకరణం వల్ల జరుగుతుంది?
ఎ) సంకలన పొలిమరీకరణం
బి) సంఘనన పొలిమరీకరణం
సి) కో పొలిమరీకరణం
డి) ఏదీకాదు
16. కింది వాటిలో నైలాన్ లక్షణం కానిది?
1. నైలాన్ దారం బలంగా ఉండి అధిక స్థితిస్థాపకత కలిగి ఉంటుంది
2. నైలాన్ ముడతలు పడదు
3 నైలాన్ తేలికైనది, మన్నికైనది, అధిక
ఒత్తిడిని తట్టుకోగలదు
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 2, 3 డి) ఏదీకాదు
17. కిందివాటిలో నైలాన్ ఉపయోగం కానిది?
1. కార్పెట్ల తయారీ
2. పారాచూట్ తాళ్ల తయారీ
3. గోధుమల తయారీ
4. ఈత దుస్తులు, తెరచాపల తయారీ
ఎ) 2 మాత్రమే బి) 3, 4 మాత్రమే
సి) 1 మాత్రమే డి) 1, 2, 3
18. మొక్కల సెల్యూలోజ్‌తో తయారైన కృత్రిమ పట్టు ఏది?
ఎ) రేయాన్ బి) అక్రలిక్
సి) నైలాన్ డి) పాలిస్టర్
19. కింది వాటిలో రేయాన్ లక్షణం కానిది ఏది?
1. రేయాన్ మృదువుగా, సిల్కీగా ఉంటుంది
2. చెమటను శోషణం చేసుకోదు
3. కాంతిని, మెరుపును కలిగి ఉంటుంది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) పైవన్నీ
20. కింది వాటిలో కృత్రిమ ఉన్ని అని దేన్నిపిలుస్తారు?
ఎ) టెరి ఊల్ బి) అక్రలిక్
సి) రేయాన్ డి) నైలాన్
21. రేయాన్ ఉపయోగం ఏమిటి?
1. దుస్తులు, దుప్పట్ల తయారీ
2. లంగోటాల తయారీ
3. బ్యాండేజీల తయారీ
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) 1, 2, 3
22. కింది వాటిలో సత్యమైనది?
ఎ. నేలబొగ్గు, నీరు, గాలి నుంచి తయారు చేసిన కృత్రిమ దారం- నైలాన్
బి. నైలాన్‌తో బ్రష్‌ల కుంచెలు తయారు చేస్తారు
సి. వినైల్ క్లోరైడ్ పొలిమరీకరణం చెంది పీవీసీ ఏర్పడుతుంది
ఎ) ఎ, బి మాత్రమే బి) బి, సి మాత్రమే
సి) ఎ, సి మాత్రమే డి) ఎ, బి, సి
23. కింది వాటిలో అక్రలిక్ లక్షణం కానిది?
1. అక్రలిక్ను సులభంగా వాష్ చేయవచ్చు. త్వరగా ఆరుతుంది
2. ప్లాస్టిక్ సీసాలను తయారు చేయవచ్చు
3. దీన్ని కృత్రిమ పాలిస్టర్ అంటారు
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) 1, 2, 3
24. రాజేష్: అక్రలిక్ను అల్లికలకు ఉపయోగిస్తారు
రమణ: స్వెటర్లు, దుప్పట్లు, వాహనాల కవర్ల తయారీలో అక్రలిక్ను ఉపయోగిస్తారు
ఎవరి ప్రతిపాదన అసత్యం?
ఎ) రాజేష్ బి) రమణ
సి) రాజేష్, రమణ డి) ఏదీకాదు
25. డై మిథైల్ ఈథర్ టెరిఫ్తాలిక్ ఆమ్లంతో చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని డై హైడ్రిక్ ఆల్కహాల్‌తో చర్యనొందించి దేన్ని తయారు చేయవచ్చు?
ఎ) అక్రలిక్ బి) పాలిస్టర్
సి) నైలాన్ డి) టెరి ఊల్
26. సత్య: పాలిస్టర్‌ను పెట్రో రసాయనాల నుంచి తయారు చేస్తారు
సీత: టెర్లిన్ అనేది కృత్రిమ పాలిస్టర్
ఎవరి ప్రతిపాదన సత్యం?
ఎ) సత్య బి) సీత
సి) సత్య, సీత డి) ఏదీ కాదు
27. కింది వాటిలో సరికానిది?
1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు
2. పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్‌ను తయారు చేసింది హెర్మిన్ స్టాడింగర్
3. అధిక అణుభారాలున్న కర్బన పాలిమర్లను ప్లాస్టిక్లు అంటారు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) 1, 2
28. కింది వాటిని జతపరచండి.
ఎ. టెర్లిన్ + నూలు 1. టెరి ఊల్
బి. టెర్లిన్ + సిల్క్ 2. టెరి సిల్క్
సి. టెర్లిన్ + ఊలు 3. టెరికాట్
ఎ) ఎ-2, బి-1, సి-3
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-3, బి-2, సి-1
డి) ఎ-3, బి-1, సి-2
29. ఫిల్మ్‌లు, వైర్లు, బకెట్ల తయారీలో ఉపయోగించేది?
ఎ) టెరికాట్ బి) పాలిస్టర్
సి) అక్రలిక్ డి) టెరి ఊల్
30. అలెగ్జాండర్ పార్క్ కు చెందని విషయం?
1. పార్కిసిన్ అనే పదార్థాన్ని మొదటిసారిగా అమెరికాలో ఉత్పత్తి చేశాడు
2. పార్కిసిన్ను ఉత్పత్తి చేయడానికి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని నత్రికామ్లంతో వేడిచేశాడు
3. పార్కిసిన్ తయారీ ప్రక్రియలో చివరగా ఏనుగు దంతాల రంగు గల పదార్థం ఏర్పడింది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1 మాత్రమే
31. స్థిరమైన ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు?
ఎ) అలెగ్జాండర్ పార్క్స్
బి) హెర్మన్ స్టాడింగర్
సి) లియో హెండ్రిక్ బేక్‌లాండ్
డి) ఏదీ కాదు
32. ప్లాస్టిక్‌లకు సంబంధించని విషయం?
1. ప్లాస్టిక్లన్నీ పాలిమర్లే కానీ పాలిమర్లు ప్లాస్టిక్లు కానవసరం లేదు
2. ప్లాస్టిక్‌లను అధిక ఉష్ణం, పీడనానికి గురిచేసినప్పుడు కావలసిన ఆకృతిలోకి మార్చవచ్చు.
3. ప్లాస్టిక్ పదార్థాలను క్షయం చెందిస్తుంది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) 1, 2
33. కింది వాటిలో ప్లాస్టిక్ ధర్మం కానిది?
1. తక్కువ బరువుతో ఎక్కువ దృఢంగా ఉంటాయి
2. ఇవి అధమ విద్యుత్ వాహకాలు
3. వీటిని కోరిన రంగుల్లో తయారు చేయవచ్చు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 2 మాత్రమే డి) ఏదీకాదు
34. సురేష్: థర్మో ప్లాస్టిక్‌లలో రేఖీయ శృంఖల నిర్మాణాలు ఉంటాయి
రమేష్: థర్మో ప్లాస్టిక్లు సంఘనన పొలిమరీకరణం వల్ల ఏర్పడతాయి
సోమేష్: థర్మో ప్లాస్టిక్‌లకు ఉదాహరణ బేకలైట్, ఫార్మాల్డిహైడ్
పై ప్రతిపాదనల్లో ఎవరి ప్రతిపాదన సరైనది?
ఎ) సురేష్ బి) రమేష్
సి) సోమేష్ డి) సురేష్, రమేష్
35. థర్మో ప్లాస్టిక్ కానిది?
ఎ) పాలిథిన్ బి) మెలనిన్
సి) పీవీసీ డి) పాలిస్టెరీన్
36. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్‌కు చెందని విషయం?
1. వీటిలోని మోనోమర్లు అడ్డంగా
అనుసంధానించి ఉంటాయి
2. వీటిని వేడిచేస్తే నల్లబొగ్గుగా మారుతాయి లేదా మండుతాయి
3. ఇవి సంఘనన పొలిమరీకరణం వల్ల ఏర్పడతాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) ఏదీ కాదు
37. కళ: ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు హెర్మన్ స్టాడింగర్
కల్పన: పీవీసీని పైపులు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, రెయిన్కోట్ల తయారీలో ఉపయోగిస్తారు
ఎవరి ప్రతిపాదన సరైనది?
ఎ) కళ బి) కల్పన
సి) కళ, కల్పన డి) ఏదీకాదు
38. థర్మో ప్లాస్టిక్‌కు సంబంధించి సరికాని వాక్యం?
ఎ) ఇది ఒక పాలిమర్
బి) దీన్ని వేడిచేసినప్పుడు మృదువుగా, చల్లబరిచినప్పుడు కఠినంగా మారుతుంది
సి) దీన్ని తిరిగి మరొక రూపంలోకి మార్చలేం
డి) పీవీసీ దీనికొక ఉదాహరణ
39. కిరణ్: అల్ప సాంద్రత గల పాలిథిన్తోప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు, పాల ప్యాకెట్లు తయారు చేస్తారు
వరుణ్: అధిక సాంద్రత గల పాలిథిన్‌తో బొమ్మలు, ప్లాస్టిక్ పాత్రలు తయారు చేస్తారు
ఎవరి ప్రతిపాదన సత్యం?
ఎ) కిరణ్ బి) వరుణ్
సి) కిరణ్, వరుణ్ డి) ఎవరూ కాదు
40. శిరీష్: మీథేన్‌ను కొద్దిపాటి ఆక్సిజన్‌తో కలిపి ఎక్కువ పీడనం వద్ద వేడిచేస్తే పాలిథిన్
ఏర్పడుతుంది
శిల్ప: ఎస్టర్ లింకేజీలను కలిగి ఉన్న పాలిమర్లను పాలి ఎస్టర్లు అంటారు
ఎవరి ప్రతిపాదన అసత్యం?
ఎ) శిరీష్ బి) శిల్ప
సి) శిరీష్, శిల్ప డి) ఏదీ కాదు
అక్రలిక్ ధర్మాలు
అక్రలిక్ మృదువుగా తేలికగా ఉంటుంది.
దీన్ని సులభంగా వాష్ చేయవచ్చు.
ఇది త్వరగా ఆరుతుంది.
ఇది ఒత్తిడిని తట్టుకుంటుంది.
ఇది ముడతలు పడదు.
ఇది రసాయనాలను తట్టుకోగలదు.
అక్రలిక్ ఉపయోగాలు
అక్రలిక్తో సాక్స్, స్వెటర్లు, శాలువాలు తయారు చేస్తారు.
దుప్పట్లు, రగ్గులు తయారు చేస్తారు.
తివాచీలు, ప్రమాణ సామగ్రి, వాహనాల కవర్లు తయారు చేస్తారు.
అల్లికలకు ఉపయోగిస్తారు.
దీంతో క్రీడా దుస్తులు తయారు చేస్తారు.
పాలిస్టర్ ధర్మాలు
పాలిస్టర్ ముడుతలు పడదు.
ఇది బలంగా, తేలికగా ఉంటుంది.
ఇది తక్కువ నీటిని శోషణం చేసుకుంటుంది.
పాలిస్టర్ త్వరగా ఆరిపోతుంది.
ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
అధిక ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది.
పాలిస్టర్ ఉపయోగాలు
పాలిస్టర్ ప్యాంట్స్, షర్ట్స్, సూట్స్, దుప్పట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
దీన్ని ప్లాస్టిక్ సీసాలు, ఫిల్మ్‌లు, వైర్లు, బకెట్ల తయారీలో ఉపయోగిస్తారు.
పాలిస్టర్‌ను మిగిలిన దారాలతో మిశ్రణం చేయడానికి ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు