కలిపి చదివితే.. కొలువు సొంతం!
డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1673 ఖాళీలను భర్తీచేయనున్నారు. సాధారణ డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి ఇదో సువర్ణావకాశం. ఇప్పటికే క్లరికల్ కేడర్ నోటిఫికేషన్ వెలువడింది. 2022లో ఎస్బీఐ నుంచి ఇది రెండో నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లు ప్రస్తుతం ఐబీపీఎస్ పరీక్షలు రాస్తున్నవారికి కూడా చక్కటి అవకాశం.ఈ నేపథ్యంలో ఎస్బీఐ పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ నిపుణ పాఠకుల కోసం..
- బ్యాంక్ పరీక్షలు సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య నిర్వహిస్తుంటారు. 3-4 నెలలు సన్నద్ధమైతే బ్యాంక్ ఉద్యోగం సాధించవచ్చు. ఎస్బీఐలో ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా చాలామంది పోటీపడుతుంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా కటాఫ్, మెరిట్ల అంచనా ప్రకారం ప్రిపేర్ కావాలి.
పరీక్ష విధానం
- ఇది మూడంచెల పరీక్ష. దీనిలో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ఫేజ్-1 ప్రిలిమినరీ
ఇది ప్రథమ పరీక్ష. దీనిలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి.
1) ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు, 30 మార్కులు
ఉంటాయి. సమయం 20 నిమిషాలు.
2) క్వాంటిటేటివ్ ఎబిలిటీస్- 35 ప్రశ్నలు, 35 మార్కులు.
సమయం 20 నిమిషాలు
3) రీజనింగ్ ఎబిలిటీస్- 35 ప్రశ్నలు, 35 మార్కులు.
సమయం 20 నిమిషాలు.
- ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో సాధించిన మార్కులు మెయిన్స్‌లో లెక్కించరు. దీనిలో విభాగాలవారీగా కటాఫ్ మార్కులు లేవు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 లేదా 0.25 శాతం మార్కులు కోత విధిస్తారు. కాబట్టి ప్రిలిమ్స్ చాలా కీలకం అని గమనించాలి. బ్యాంక్ పరీక్షల్లో ప్రిలిమ్స్ లెవల్లోనే పోటీ తీవ్రంగా ఉంటుంది. దీనిలో మెరిట్ మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్-మెయిన్స్ ప్రిపరేషన్ కలిపి చదవాలి.
ఫేజ్-2 మెయిన్స్
- ఇది ప్రధాన పరీక్ష. దీనిలో ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి.
- ఆబ్జెక్టివ్ టెస్ట్: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనిలో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్-50, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్-60, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40 మార్కులు. ఈ పరీక్ష సమయం 3 గంటలు.
- డిస్క్రిప్టివ్ టెస్ట్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే)- 50 మార్కులకు ఉంటుంది. సమయం 30 నిమిషాలు.
- నోట్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.
- ఫేజ్-2లో అర్హత సాధించినవారిని ఫేజ్-3కి ఎంపిక చేస్తారు.
- ఫేజ్-3లో సైకో మెట్రిక్టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయించారు. దీనిలో గ్రూప్ డిస్కషన్‌కు 20, ఇంటర్వ్యూకు 30 మార్కులు.
- ఏ జాబ్ సాధించాలన్నా ముందుగా దానికి తగ్గట్లు ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. విభాగాలవారీగా కావల్సిన పుస్తకాలు, మెటీరియల్స్, గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు, సొంత నోట్స్‌తో సన్నద్ధం కావాలి.
- బ్యాంక్ పరీక్షలకు ఒకే రకంగా సిలబస్ ఉంటుంది. మొత్తం 5 విభాగాల్లో జ్ఞానం సాధిస్తే ఈ పరీక్షను సులభంగా సాల్వ్ చేయవచ్చు. సాధారణంగా 6 నెలల కఠోర శ్రమతో ఉద్యోగం సాధించవచ్చు. ఇందుకు రోజుకు 10-12 గంటలు సాధన చేయాలి. విభాగాల వారీగా నిర్ణీత కాలవ్యవధి ప్రకారం టైం మేనేజ్మెంట్ పాటించాలి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించే అంశాలను గుర్తించి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
- ఎస్బీఐలో హెచ్చుస్థాయి ప్రశ్నలు అధికం. కాబట్టి స్టాండర్డ్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
- ప్రిలిమ్స్-మెయిన్స్ కోసం విడిగా కాకుండా, కలిపి చదవడం వల్ల సమయం ఆదా అవుతుంది. టాపిక్‌పై పూర్తి అవగాహనతో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది.
- గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే బ్యాంక్ పరీక్షలపై పూర్తి అవగాహన వస్తుంది.
- ప్రతి అంశంపై సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలామంచిది. ఇది రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
- టీ శాట్ టీవీ చానల్లో బ్యాంక్ పరీక్షల క్లాసులు ప్రసారం అవుతున్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. దీంతోపాటు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చే నిపుణ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.
- సాధారణంగా బ్యాంక్ పరీక్షలకు 5 విభాగాలు ఉంటాయి. 40 శాతం సిలబస్‌లో 80 శాతం మార్కులు ఉంటాయి. వాటిగురించి సాధన చేస్తే బ్యాంక్ ఉద్యోగం సాధించవచ్చు.
1) క్వాంటిటేటివ్-డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్
ఈ విభాగం ప్రిలిమ్స్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి బేసిక్ టాపిక్స్ 50 శాతం, కఠినమైన టాపిక్స్ నుంచి 50 శాతం మార్కులు వస్తాయి. దీనిలో బోడ్మాస్ అంశాలు, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్-ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి 60 శాతం ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా అర్థమెటిక్స్ టాపిక్స్ నుంచి శాతాలు-నిష్పత్తులు, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్స్ వంటివి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి.
మెయిన్స్‌లో 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ (డీఐ) నుంచే వస్తాయి. డీఐ నుంచి అన్ని మోడల్స్ ప్రిపేర్ కావడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు.
2) రీజనింగ్ ఆప్టిట్యూడ్
- ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్ విభాగం ఇది. ఎస్బీఐ పీవో పరీక్షలో రీజనింగ్ హెచ్చుస్థాయిలో ఉంటుంది. స్టాండర్డ్ టాపిక్స్ ఎంచుకొని రెండు దశలకు సన్నద్ధం అవడం ఉత్తమం. లాజికల్, అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్ వంటి అంశాలపై అవగాహనతో సాధన చేయాలి.
- దీనిలో నుంచి సాధారణంగా కోడింగ్-డీకోడింగ్, అనాలసిస్, లెటర్ సిరీస్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ టెస్ట్, రక్త సంబంధాలు వంటి 60 శాతం ప్రశ్నలు వస్తుంటాయి.
- మెయిన్స్‌లో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలతోపాటు సీటింగ్ అరెంజ్మెంట్, పజిల్స్, ఇన్పుట్ అవుట్‌పుట్ వంటివి చాలా కీలకం.
3) కంప్యూటర్ నాలెడ్జ్
- ఈ సబ్జెక్టు రీజనింగ్ విభాగంతో కలిపి వస్తుంది. సుమారు 15 ప్రశ్నల వరకు వస్తాయి.
- బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ జనరేషన్స్, ఫండమెంటల్స్, కంప్యూటర్ విభాగాలు, ప్రాసెసర్లు, సాఫ్ట్వేర్లు, బ్యాంక్ కార్యకలాపాల్లో కంప్యూటర్ యూజర్ యాప్‌ల నిర్వహణ, వైరస్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ కార్డుల పనితీరు వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్
- ఈ విభాగం ప్రిలిమ్స్-మెయిన్స్‌లో కామన్‌గా వచ్చే విభాగం. దీనిలో నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్స్, సెంటెన్స్ కరెక్షన్స్, రీ అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, ప్రిపోజిషన్స్, సినానిమ్స్-ఆంటానిమ్స్, ఇడియమ్స్-ఫ్రేజెస్ వంటి ముఖ్యమైన టాపిక్‌లు కీలకం.
- బ్యాంక్ పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కఠినంగా ఉంటుంది. 30-40 ప్రశ్నల వరకు కామన్ టాపిక్స్ నుంచి వస్తాయి. కాబట్టి హార్డ్‌వర్క్ చేస్తే కచ్చితంగా ఇందులో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందుకు ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలోని ఎడిటోరియల్స్ చదవాలి.
5) జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్
- మెయిన్స్‌లో జనరల్ అవేర్నెస్ విభాగం అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ, కార్యకలాపాలు, ఆర్థిక అంశాలు, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
- బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి బ్యాంక్ వినియోగదారుల సేవలు, వివిధ డిపాజిట్లు, ఆర్బీఐ వడ్డీరేట్లు, మానిటరీ పాలసీ సిఫారసులు, మొండి బకాయిలు-వసూలు చట్టాలు. వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం, డెబిట్-క్రెడిట్ కార్డుల వినియోగం, చెక్కులు, డీడీల నిర్వహణ ఇతర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- 50 శాతం ప్రశ్నలు ఈ అంశాల నుంచే వస్తాయి. నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, 2022-23 బడ్జెట్, 2021-22 ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిపోర్టులు, జీఎస్టీ, స్టాక్ మార్కెట్ అంశాలు, జీఐ ట్యాగ్లు, పేదరికం-నిరుద్యోగిత రకాలు నిర్మూలన పథకాలు, ద్రవ్యోల్బణం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు.
- కరెంట్ అఫైర్స్‌లో జాతీయ-అంతర్జాతీయ అంశాలు, పుస్తక రచయితలు, అవార్డులు-రివార్డులు, ముఖ్యమైన రోజులు, కామన్వెల్త్ గేమ్స్, భారత పథకాలు, క్రీడలు- క్రికెట్, బాక్సింగ్, టెన్నిస్, ఫుట్‌బాల్, చెస్, నోబెల్, పద్మపురస్కార గ్రహీతలు, బ్రిక్స్ సదస్సు, జీ-20, జీ-4, జీ-7 సదస్సులు, ఎస్సీవో సదస్సు వంటి వాటిని చదవాలి.
మొత్తం పోస్టులు- 1673
- ఎస్సీ-270, ఎస్టీ-131, ఓబీసీ-464, ఈడబ్ల్యూఎస్-160, జనరల్-648 పోస్టులు
- చివరితేదీ- అక్టోబర్ 12
- అర్హతలు- ఏదేని డిగ్రీ
- వయస్సు- 21-30 ఏండ్లు
- ప్రిలిమ్స్- డిసెంబర్ 17, 18, 19, 20
- మెయిన్స్- 2023, ఫిబ్రవరి/మార్చి
- ఫీజు- రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఉంటుంది.
- వెబ్సైట్- www.sbi.co.in/careers
మధు కిరణ్: డైరెక్టర్ఫోకస్ అకాడమీ హైదరాబాద్ 9030496929
- Tags
- Assistant Manager
- sbi
- SBI PO
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?