భారతదేశం బ్యాంకింగ్ వ్యవస్థ – నిర్మాణం
బ్యాంకు
ద్రవ్యాన్ని మారకం చేసే సంస్థను బ్యాంకు అంటారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పడిన ఒక ఆర్థిక సంస్థను బ్యాంకు అంటారు.
- రుణాలు తెచ్చే రుణాలు ఇచ్చే ఒక వ్యవస్థనే బ్యాంకు అంటారు.
- భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ -5 ప్రకారం బ్యాంకు అంటే కోరిన వెంటనేగాని ఇతర సమయంలోగాని, చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారా గాని తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికిగాని, పెట్టుబడి కోసం గాని ఉపయోగించేది.
- ప్రాచీన కాలంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కిందివారు బ్యాంకింగ్ విధుల పాత్రను పోషించేవారు.
- మద్రాస్ ప్రాంతంలో శెట్టియార్
- బీహార్ ప్రాంతంలో ష్రాఫ్‌లు
- పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో జగత్సేఠ్లు
- ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో షావుకారి
- భారతదేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసినది ఆంగ్లేయులు
- భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు 1770లో కలకత్తాలో ‘బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్’ ను అలెగ్జాండర్ & కంపెనీ, ఇంగ్లిష్ ఏజెన్సీ హౌస్ వారితో ఆధునిక స్థాయిలో స్థాపించారు. కానీ 1782లో దాన్ని మూసివేశారు.
- 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ (కలకత్తా)
- 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి
- 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌ను ఏర్పాటు చేశారు.
- పై మూడు బ్యాంకులను 1921లో విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపొందించారు.
- 1953లో గోర్వాలా అధ్యక్షతన గ్రామీణ పరపతి పరిశీలన సంఘం ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయాలని సూచించింది.
- గోర్వాలా కమిటీ సూచన మేరకు 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అందుకే భారతదేశంలో బ్యాంకింగ్ సం. జూలై 1 నుంచి ప్రారంభం అవుతుంది.
- యూరోపియన్ల సహకారంతో భారత దేశంలో మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు ‘అలహాబాద్ బ్యాంకు’ను 1865లో కలకత్తాలో స్థాపించారు.
- ఇది అతి ప్రాచీన వాణిజ్య బ్యాంకుగా 2020 వరకు కొనసాగింది.
- 2020లో అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు.
- పూర్తి భారతీయ యాజమాన్యంతో ఏర్పడిన తొలి వాణిజ్య బ్యాంకు ‘అవద్ వాణిజ్య బ్యాంకు’. 1881లో ఆగ్రాలో ఏర్పాటు చేశారు.
- అవద్ వాణిజ్య బ్యాంకును 1958లో మూసివేశారు.
- 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంకును లాలా లజపతి రాయ్. దయాల్ సింగ్ యాజితియా’ చేత మొదట లాహోర్‌లో ఏర్పడింది. తరువాత ఈ బ్యాంకును చండీగఢ్‌కు మార్చారు. ఇది ఇప్పటికి కొనసాగుతుంది.
- 1901లో పీపుల్స్ బ్యాంకును స్థానిక బ్యాంకుగా స్థాపించారు.
- 1905లో స్వదేశీ ఉద్యమం (వందేమాతరం ఉద్యమం) కారణంగా అనేక నూతన బ్యాంకులు స్థాపించడం జరిగింది.
- 1906లో బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
- 1907లో ఇండియన్ బ్యాంకును స్థాపించారు.
- 1909లో బ్యాంక్ ఆఫ్ బరోడాను స్థాపించారు.
- 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
- 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇదే ఏడాదిలో బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం చేయబడింది.
- జాతీయం చేసిన తొలి బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. 1959లో అనుబంధ బ్యాంకుల కోసం భారతీయ స్టేట్ బ్యాంకు చట్టం చేయబడింది.
- 1969 జూలై 19న 14 వాణిజ్య బ్యాంకు లను జాతీయం చేశారు.
- 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ) ఏర్పాటు.
- 1980 ఏప్రిల్ 15న 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
- 1982 జూలై 12న నాబార్డు ఏర్పడింది.
- 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఏర్పాటు చేశారు.
- 2013 నవంబర్ 19న మహిళాబ్యాంకు ఏర్పాటు చేశారు.
- 2014 నవంబర్‌లో పేమెంట్స్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఏర్పాటు.
- 2015 ఏప్రిల్ 8న ముద్రా బ్యాంక్ ఏర్పాటు చేశారు.
- 2015లో బంధన్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు ఏర్పడ్డాయి.
- 2017 లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు, మహిళాబ్యాంకు ఎస్బీఐలో విలీనం చేశారు.
- 2018లో దేనా(DENA) బ్యాంక్, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు.
- 2019 ఆగస్టు 10న 10 జాతీయ బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా మార్చారు.
ఆంధ్రాబ్యాంకు + కార్పొరేషన్ బ్యాంకు = యూనియన్ బ్యాంకు
2) అలహాబాద్ బ్యాంకు = ఇండియన్ బ్యాంకు
3) సిండికేట్ బ్యాంక్ = కెనరాబ్యాంకు
4) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ + యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా = పంజాబ్ నేషనల్ బ్యాంకు.
బ్యాంకింగ్ పదజాలం
జాతీయ బ్యాంకులు
భారత ప్రభుత్వం జాతీయం చేసి దేశవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వర్తించే ప్రభుత్వ రంగ బ్యాంకులను జాతీయ బ్యాంకులు అంటారు.
ఉదా: 1969లో భారత ప్రభుత్వం 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది.
ప్రాంతీయ బ్యాంకులు
ఏదైనా నిర్దేశించిన ప్రాంతానికి మాత్రమే పరిమితమై సేవలు అందించే బ్యాంకులను ప్రాతీయ బ్యాంకులు అంటారు.
ఉదా: 1975లో భారతదేశంలో ప్రారంభించిన 5 ఆర్ఆర్బీలు
రిటైల్ బ్యాంకింగ్
ఒక బ్యాంకు ఇతర బ్యాంకులు, విత్త సంస్థల Corporationsతో కాకుండా కేవలం బ్యాంకు వినియోగదారులతో మాత్రమే వ్యవహారాలు నిర్వహిస్తే దాన్ని రిటైల్ బ్యాంకింగ్ అంటారు
షాడో బ్యాంకింగ్ (Shadow Banking):
Business Corrpondents, Banking Agents వంటి మధ్యవర్తుల ద్వారా బ్యాంకులు తమ విధులను నిర్వర్తించడాన్ని Shadow Banking అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. భారత బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1948 బి) 1949
సి) 1950 డి) 1951
2. ప్రాచీన కాలంంలో భారతదేశంలోని మద్రాస్ ప్రాంతంలో బ్యాంకింగ్ విధుల పాత్రను పోషించిన వారిని ఏమంటారు?
ఎ) శెట్టియార్ బి) ష్రాఫ్‌లు
సి) జగత్సేఠ్లు డి) షావుకారి
3. ప్రాచీన కాలంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించిన వారిని ఏమనేవారు?
ఎ) ష్రాఫ్‌లు బి) శెట్టియార్
సి) సేఠ్లు డి) షావుకారి
4. భారతదేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసినది ఎవరు?
ఎ) అమెరికన్లు బి) ఆంగ్లేయులు
సి) ఇటాలియన్లు డి) జర్మన్లు
5. భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు ఏది?
ఎ) బ్యాంక్ ఆఫ్ మద్రాస్
బి) బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
సి) బ్యాంక్ ఆఫ్ బెంగాల్
డి) బ్యాంక్ ఆఫ్ బొంబాయి
6. ‘బ్యాంక్ ఆఫ్ బొంబాయి’ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1806 బి) 1840
సి) 1848 డి) 1770
7. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1929 బి) 1925
సి) 1920 డి) 1921
8. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్‌ను మొదట ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) కలకత్తా -1770
బి) బొంబాయి -1770
సి) కలకత్తా -1880
డి) బొంబాయి -1880
9. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేయాలని సూచించిన కమిటీ ఏది?
ఎ) గాడ్గిల్ కమిటీ బి) నారిమన్ కమిటీ
సి) గోర్వాలా కమిటీ
డి) నర్సింహం కమిటీ
10. భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు ఏది?
ఎ) అలహాబాద్ బ్యాంక్
బి) హిందుస్థాన్ బ్యాంక్
సి) ఇంపీరియల్ బ్యాంక్
డి) అవద్ బ్యాంక్
11. హిందుస్థాన్ బ్యాంకును ఏ సంవత్సరంలో మూసివేశారు?
ఎ) 1780 బి) 1781
సి) 1782 డి) 1783
12. అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకు లో ఏ సంవత్సరంలో విలీనం చేశారు?
ఎ) 2020 బి) 2021
సి) 2022 డి) 2019
13. ఎన్ని బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూపొందించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
14. పూర్తి భారతీయ యాజమాన్యంతో ఏర్పడిన తొలి వాణిజ్య బ్యాంకు?
ఎ) అవద్ బ్యాంకు
బి) అలహాబాద్ బ్యాంకు
సి) హిందుస్థాన్ బ్యాంకు
డి) ఇంపీరియల్ బ్యాంకు
15. అలహాబాద్ బ్యాంక్‌ను ఏ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) 1865 కలకత్తా బి) 1864 కలకత్తా
సి) 1865 మద్రాస్
డి) 1864 బొంబాయి
16. పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1893 బి) 1894
సి) 1895 డి) 1896
17. 1901లో స్థానిక బ్యాంకుగా ఏ బ్యాంకు ను స్థాపించారు?
ఎ) అవద్ బ్యాంక్ బి) పీపుల్స్ బ్యాంకు
సి) ఇండియన్ బ్యాంక్
డి) ఇంపీరియల్ బ్యాంకు
18. అవద్ బ్యాంకును ఏ సంవత్సరంలో మూసి వేశారు?
ఎ) 1955 బి)1956
సి) 1957 డి) 1958
19. బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1905 బి) 1906
సి) 1907 డి) 1908
20. ఇండియన్ బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1905 బి) 1906
సి) 1907 డి) 1908
21. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1910 బి) 1911
సి) 1912 డి) 1913
22. ఇంపీరియల్ బ్యాంకును భారతీయ స్టేట్ బ్యాంకుగా ఏ సంవత్సరంలో మార్పు చేశారు?
ఎ) 1950 బి) 1955
సి) 1960 డి) 1965
23. మొదటి సారిగా బ్యాంకుల జాతీయీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1969 బి) 1980
సి) 1965 డి) 1949
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు