Admitions
మహాత్మా జోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్
- కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు
- కోర్సును అందించే కాలేజీ, సీట్ల వివరాలు:
- ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మహిళా వ్యవసాయ కళాశాల, వనపర్తిలో 120 సీట్లు
- ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మహిళా వ్యవసాయ కళాశాల, కరీంనగర్-120 సీట్లు
- అర్హతలు: ఇంటర్లో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఉత్తీర్ణత లేదా డిప్లొమా (అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
- తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 2,00,000 మించరాదు.
- వయస్సు: 17- 22 ఏండ్ల మధ్య ఉండాలి.
- సీట్ల కేటాయింపు: బీసీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, జనరల్/ఈబీసీలకు 2 శాతం, అనాథలకు 3 శాతం సీట్లు కేటాయించారు.
- నోట్: టీఎస్ ఎంసెట్-2022 ర్యాంక్ సాధించిన వారికి 85 శాతం, పీజీటీఎస్ఏయూ అగ్రిసెట్ ర్యాంక్ ద్వారా 15 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు.
- ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 5
- మెరిట్ జాబితా వెల్లడి: డిసెంబర్ 10
- వెబ్సైట్: https://ug.mjptbcwreis.net
సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ యూనివర్సిటీ ఆఫ్ హైదారబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: ఎంబీఏ (ఫుల్‌టైం)
- సీట్ల సంఖ్య: 75
- విభాగాలు: ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, హెచ్ఆర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్-2022 ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక విధానం: క్యాట్-2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 15
- వెబ్సైట్: http://acad.uohyd.ac.in/ mba23.html
ఐఐఎస్‌టీలో పీహెచ్డీ
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- ప్రోగ్రామ్: పీహెచ్డీ- జనవరి 2023
- విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, మ్యాథ్స్, హ్యుమానిటీస్, ఫిజిక్స్
- అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు యూజీసీ-సీఎస్ఐఆర్-నెట్ జేఆర్ఎఫ్ లేదా జెస్ట్/గేట్, ఎన్బీహెచ్ఎం అర్హత సాధించి ఉండాలి.
- ఎంపిక: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 12
- స్క్రీనింగ్ టెస్ట్: డిసెంబర్ 21
- వెబ్సైట్: https://www.iist.ac.in/admissions/phd/regular
- స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్
పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఘియాసుద్దీన్ బాబూఖాన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్ (హైసెట్) ప్రకటన విడుదలైంది.
- హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్
- అర్హతలు: పదోతరగతి
- ఎంపిక: పదోతరగతి మార్కులు, ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- పరీక్ష తేదీలు: 2023, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు
- వివరాల కోసం https://hieset.inచూడవచ్చు.
- వరంగల్ నిట్‌లో పీహెచ్డీ
వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కింది కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
- కోర్సు: పీహెచ్డీ (ఫుల్‌టైం/పార్ట్ టైం)
- విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్, సీఎస్ఈ, బయోటెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
- అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు గేట్/క్యాట్ లేదా యూజీసీ, సీఎస్ఐఆర్ నెట్లో అర్హత సాధించి ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: వెబ్సైట్లో
- చివరితేదీ: డిసెంబర్ 4
- వెబ్సైట్: https://nitw.ac.in
- ఎల్ఐసీ స్కాలర్షిప్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అందించే గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2022 ప్రకటన విడుదలైంది.
- గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2022
- రెగ్యులర్ స్కాలర్షిప్ అర్హతలు: 2021-22 విద్యాసంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు/సంస్థల్లో ఏదైనా డిగ్రీ/ ఇంజినీరింగ్, మెడిసిన్, ఇంటిగ్రేటెడ్ కోర్సు, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తారు.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2,50,000 మించరాదు.
- నోట్: ఈ స్కాలర్షిప్ కింద ఏడాదికి మూడు వాయిదాల్లో రూ.20,000 అందజేస్తారు.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ అర్హతలు:
- పదోతరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఈ స్కాలర్షిప్ను ఇస్తారు.
- 2021-22 విద్యాసంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2,50,000 మించరాదు.
- ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ఇంటర్ లేదా ఒకేషనల్, ఐటీఐ లేదా డిప్లొమా కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది.
- నోట్: ఏ స్కాలర్షిప్ కింద ఏటా మూడు వాయిదాల్లో రూ.10,000 అందజేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 18
- వెబ్సైట్: https://licindia.in/Bottom-Links/Golden-Jubilee-Foundation/Scholarship
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
1857 తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?