వరంగల్ డిక్లరేషన్ సదస్సు జరిగిన సంవత్సరం?
22 డిసెంబర్ 2022 తరువాయి..
126. సరికానిది ఏది?
1. 1987లో టీపీఎస్ పునరుద్ధరణలో భూపతికృష్ణమూర్తి ముఖ్య పాత్ర పోషించారు
2. భూపతికృష్ణమూర్తికి హైదరాబాద్ సింహం అని బిరుదు కలదు
ఎ) 1 బి) 1, 2
సి) 2 డి) 1, 2 సరైనవి
127. సరైనది గుర్తించండి?
1. Telangana Information trust
ఏర్పాటులో నాట్యకళా ప్రభాకర్
ప్రముఖుడు
2. TIT ఏర్పాటులో జయశంకర్ కృషి లేదు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 తప్పు
128. TIT ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక?
ఎ) జీవనాడి బి) వడిసెల
సి) మా తెలంగాణ డి) NOTA
129. OU FORUM FOR TELANGANA అనే సంస్థ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
ఎ) కాళోజి బి) ప్రొ.లక్ష్మణ్
సి) దాశరథి డి) ప్రొ.కేశవరావ్ జాదవ్
130. సరైనది?
1. 1992లో ఓయూలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మనోహర్‌రెడ్డి ఏర్పాటు చేయలేదు
2. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఓయూలో చిన్న రాష్ర్టాల సదస్సు నిర్వహించారు
3. ముఖ్యఅతిథి జార్జ్ ఫెర్నాండెజ్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
131. సరైన సమాధానం ఎంపిక చేయండి?
1. ముచ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితి స్థాపించారు
2. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1992లో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వచ్చారు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 తప్పు
132. సరికానిది గుర్తించండి.
1. జల సాధన సమితి 1992, ఆగస్టులో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు
2. నల్లగొండ జిల్లాను మరో సొమాలియాగా మార్చకుండా SRBCని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి)1, 2 తప్పు
133. సరైనది?
ఎ) 1993లో Telangana Legislators Forum ఏర్పాటు
బి) TLF ఏర్పాటులో వెలిచాల జగపతిరావు ముఖ్యుడు
సి) TLF కన్వీనర్‌గా జానారెడ్డి నియామకం
డి) అన్నీ సరైనవే
134. 1996లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఏ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది
ఎ) తెలంగాణ బి) ఉత్తరాఖండ్
సి) జార్ఖండ్ డి) ఛత్తీస్‌గఢ్
135. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని పునః ప్రారంభించాలని ఏ సమావేశంలో నిర్ణయించారు.
ఎ) నిజామాబాద్ బి) హైదరాబాద్
సి) కరీంనగర్ డి) షాద్‌నగర్
136. మల్లెపల్లి రాజాం ట్రస్ట్ వారు ఎక్కడి నుంచి స్మారక ఉపన్యాసాలు నిర్వహిస్తారు
ఎ) జనగామ (గోదావరిఖని)
బి) మంథని
సి) వాంకిడి డి) పాల్వంచ
137. సరికానిది?
1. తెలంగాణ పదం అసెంబ్లీలో ప్రస్తావించొద్దు అని చెప్పినవారు స్పీకర్ నాదెండ్ల
2. దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తావించగా స్పీకర్ తెలంగాణను వెనుకబడిన ప్రాంతం అని సూచించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) 1, 2 సరైనవి
138. 1997, ఫిబ్రవరిలో విద్యా రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యుడు?
ఎ) నారాయణరెడ్డి
బి) జీవన్‌రెడ్డి
సి) ఈటల రాజేందర్
డి) కేసీఆర్
139. సరైన సమాధానం ఇవ్వండి
1. 19 జనవరి, 1997లో ఓయూ ఫోరమ్ ఫర్ తెలంగాణ సదస్సు అశోక టాకీస్‌లో నిర్వహించారు
2. 19 జనవరి, 1997లో అశోక టాకీస్ సదుస్సు గులాం రసూల్ స్మారకార్థం పాశం యాదగిరి ఏర్పాటు చేశారు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1, 2 తప్పు
140. సరైన సమాధానం ఎంపిక చేయండి?
1. అశోక టాకీస్ సదస్సులో తెలంగాణ సంస్కృతి వివక్షపై చర్చ
2. అశోక టాకీస్ సదస్సు కరపత్రం- సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న
సోదరుల ఆత్మగౌరవ సభ
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) 1, 2 తప్పు
141. ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం ఎవరు ఆవిష్కరించారు?
ఎ) జయశంకర్ బి) ఇన్నయ్య
సి) గద్దర్ డి) పాశం యాదగిరి
142. ‘అమ్మా తెలంగాణమా’.. పాట ఎవరికి సంబంధించింది?
ఎ) గద్దర్ బి) గోరటి వెంకన్న
సి) అందెశ్రీ డి) నందిని సిధారెడ్డి
143. సరైనది?
1. 1997, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరి సభ జరిగింది
2. తెలంగాణ హక్కుల పోరాట సభ దగాపడ్డ తెలంగాణ పేరుతో నిర్వహణ
3. సాగు, తాగు నీటిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి గాదె ఇన్నయ్య తీర్మానం చేశారు
ఎ) 1, 2 బి) 2
సి) 1, 2, 3 డి) 1, 2 తప్పు
144. సరికానిది ఏది?
1. భువనగిరి సభ మొదటి రోజు సమావేశానికి ప్రొ.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు
2. ప్రొ.విశ్వేశ్వర్రావు పొలిటికల్ సైన్స్‌లో ప్రొఫెసర్
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 సరైనవి
145. భువనగిరి సమావేశానికి సంబంధించి తప్పుగా ఇవ్వబడినది ఏది?
ఎ) గద్దర్ తన బృందం ఆట పాటలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు
బి) సభను కాళోజి ప్రారంభించారు
సి) గాదె ఇన్నయ్య ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆమోదం
డి) ప్రైవేటీకరణను నిలిపివేయాలని తీర్మానం చేయలేదు
146. గద్దర్‌పై కాల్పులు జరిగిన రోజు?
ఎ) 6 ఏప్రిల్, 1997
బి) 16 ఏప్రిల్, 1997
సి) 26 ఏప్రిల్, 1997
డి) 6 మే, 1997
147. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి మా కార్యక్రమం పేరుతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంస్థ?
ఎ) పీపుల్స్‌వార్
బి) తెలంగాణ మహాసభ
సి) బీజేపీ డి) కాంగ్రెస్
148. తెలంగాణ ప్రగతి వేదిక కన్వీనర్?
ఎ) మాచిరెడ్డి కిషన్
బి) దాశరథి రంగాచార్య
సి) సుంకిరెడ్డి నారాయణరెడ్డి
డి) రాపోలు ఆనందభాస్కర్
149. తెలంగాణ మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) భువనగిరి బి) వరంగల్
సి) సూర్యాపేట డి) హైదరాబాద్
150. మహాసభ సమావేశానికి సంబంధించి సరికానిది?
ఎ) ధోఖాతిన్న తెలంగాణ సదస్సు పేరుతో నిర్వహించారు
బి) 1997, ఆగస్టు 11న జరిగింది
సి) చెరుకు సుధాకర్ అధ్యక్షుడు
డి) ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షగా సమావేశం
151. సరైనది ఏది?
1. తెలంగాణ మహాసభకు చెరుకు సుధాకర్ అధ్యక్షత వహించారు
2. తెలంగాణ మహాసభ పత్రిక వి.ప్రకాశ్ సంపాదకులు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 తప్పు
152. సరైనది గుర్తించండి.
1. 1997లో తెలంగాణ ఉద్యమ కమిటీ
చైర్మన్‌గా ఇంద్రారెడ్డి నియామకం
2. జయశంకర్, కేశవరావుజాదవ్ ముఖ్యులు
ఎ) 1 బి) 2
సి) 1, 2 తప్పు డి) 1, 2
153. జై తెలంగాణ పార్టీ ఎవరు స్థాపించారు?
ఎ) ఇంద్రారెడ్డి
బి) నాగం జనార్ధన్‌రెడ్డి
సి) సబిత ఇంద్రారెడ్డి
డి) ఇన్నయ్య
154. జై తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం ఎక్కడ నిర్వహించారు?
ఎ) శామీర్‌పేట బి) శంషాబాద్
సి) చంపాపేట్
డి) చాంద్రాయణగుట్ట
155. జై తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం ముఖ్య అతిథి?
ఎ) జార్జ్ ఫెర్నాండెజ్ బి) శిబూసోరెన్
సి) జయశంకర్ డి) వైఎస్ఆర్
156. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించినవారు?
ఎ) నాగారం అంజయ్య
బి) మందకృష్ణ మాదిగ
సి) అద్దంకి దయాకర్
డి) కంచె ఐలయ్య
157. సరికానిది ఏది?
ఎ) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
– మల్లేపల్లి లక్ష్మయ్య
బి) 1 నవంబర్, 1996 తెలంగాణ సదస్సు – భూపతికృష్ణమూర్తి
సి) టీఎల్‌ఎస్వో కృషి వల్ల ఎంఏ తెలుగులో ఆళ్వార్ స్వామి రంగు నవలను సిలబస్‌లో చేర్చారు
డి) సమైక్య రాష్ట్రంలో ఆంధ్రులు తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి ప్రజల వలె చూస్తున్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు
158. 1997లో ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో నిర్వహించిన సదస్సుకు ఎవరు కన్వీనర్లు?
ఎ) ప్రొ.విశ్వేశ్వరరావు
బి) ప్రొ.సింహాద్రి
సి) ఎ, బి డి) పైవేవీ కావు
159. ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో సదస్సు ఎవరు ప్రారంభించారు?
ఎ) జార్జ్ ఫెర్నాండెజ్
బి) శిబూసోరెన్
సి) జయశంకర్
డి) హనుమంతరావు
160. ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో సదస్సు ఎక్కడ నిర్వహించారు?
ఎ) కేయూ బి) ఓయూ
సి) నల్లగొండ డి) ఢిల్లీ
161. తెలంగాణ ఐక్యవేదిక ఎన్ని ప్రజా సంఘాల కూటమిగా ఏర్పడింది?
ఎ) 18 బి) 28 సి) 38 డి) 24
162. సరైనది గుర్తించండి.
1. తెలంగాణ ఐక్యవేదిక ప్రధాన ఉద్దేశం – సమష్టి నాయకత్వం, ప్రాధాన్యతతో తెలంగాణ రాష్ట్రమే సమస్యలకు పరిష్కారం
2. ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ కోసం 2 కమిటీలు ఏర్పాటు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1, 2 తప్పు
163. ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం?
ఎ) జల దృశ్యం బి) గోల్డెన్ త్రిషోల్డ్
సి) జన దృశ్యం డి) తెలంగాణ భవన్
164. సరికానిది?
1. తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ పత్రికను ట్యాంక్‌బండ్‌పై కాళోజి ఆవిష్కరించారు
2. ప్రకాశ్, సామ జగన్‌రెడ్డి సంపాదకులు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1, 2 సరైనవి
165. వరంగల్ డిక్లరేషన్ సదస్సు ఎప్పుడు జరిగింది?
ఎ) 1997, డిసెంబర్ 28, 29 తేదీల్లో
బి) 1997, డిసెంబర్ 18, 19 తేదీల్లో
సి) 1997, డిసెంబర్ 14, 15 తేదీల్లో
డి) 1997 డిసెంబర్ 8, 9 తేదీల్లో
166. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి?
1. డబ్ల్యూజీఎల్ డిక్లరేషన్ ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షను తెలియజేసింది
2. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ
ఎ) 1 బి) 2
సి) 1, 2 సరైనవి డి) 1, 2 తప్పు
167. వరంగల్ డిక్లరేషన్ సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది?
ఎ) ప్రొ.సాయిబాబ బి) కాళోజి
సి) వరవరరావు డి) గద్దర్
168. వరంగల్ డిక్లరేషన్స్ సదస్సు ఎన్ని డిమాండ్స్ ఆమోదించింది?
ఎ) 35 బి) 50 సి) 40 డి) 34
169. తెలంగాణ జనసభ సదస్సు ఎక్కడ జరిగింది?
ఎ) అమీర్‌పేట్ బి) అంబర్పేట్
సి) హఫీజ్‌పేట డి) చంపాపేట్
170. జనసభ సదస్సు ముఖ్య అతిథి/అతిథులు?
ఎ) యాసిన్ మాలిక్ బి) ఖగేన్
సి) ఎ, బి డి) ఎంటీ ఖాన్
171. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి?
1. జనసభ సదస్సులో కాళోజి ‘క్విట్ తెలంగాణ’ పిలుపునిచ్చారు
2. ఈ సదస్సులో కాళోజి జన తెలంగాణ పత్రికను ఆవిష్కరించారు
ఎ) 1, 2 సరైనవి బి) 1, 2 తప్పు
సి) 1 సరైంది, 2 తప్పు
డి) 2 సరైంది, 1 తప్పు
172. ఒక్క ఓటు-రెండు రాష్ర్టాలు అని ప్రకటించిన పార్టీ?
ఎ) కాంగ్రెస్ బి) బీజేపీ
సి) బీఎస్పీ డి) టీడీపీ
-టి.సురేష్‌కుమార్
టీఎస్ ఉద్యమ ఫ్యాకల్టీ, కరీంనగర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?