సంక్షేమానికి చేయూత.. ఎదుగుదలకు ప్రోత్సాహం
దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాయి. 1995 నాటి వికలాంగుల చట్టం స్థానంలో దివ్యాంగులచట్టం-2016ను భారత ప్రభుత్వం 16 డిసెంబర్ 2016న ఆమోదించింది.
దివ్యాంగుల Rehabilitation Centresల చట్టం-2016
ముఖ్యాంశాలు
వైకల్యమున్న బాలబాలికలు ఉచిత విద్యను పొందవచ్చు.వికలాంగుల పట్ల ఏ విధమైన వివక్ష చూపినా జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించవచ్చు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు.
వికలాంగులైన మహిళలకు గర్భం తీసివేయలసి వచ్చినప్పుడు ఆమె అనుమతి తీసుకోవాలి. గతంలో ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా, ఈ చట్టం ఒకరికి పరిమితం చేసింది.
ఈ చట్టంలో రిజర్వేషన్లను 4 శాతానికి పెంచారు. (1995 చట్టం ప్రకారం 3 శాతం)
తమ పని తాము చేసుకోలేని ప్రభుత్వ సేవలకులు ఇద్దరు సంరక్షకులను నియమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
1995 చట్టంలో 7 రకాల వికలాంగులకు ప్రత్యేక రక్షణలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అయితే దివ్యాంగుల చట్టం-2016లో 21 రకాల వైకల్యాలకు ప్రత్యేక రక్షణలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అవి
1. అంధత్వం 2. దృష్టి లోపం
3. కుష్టు 4. వినికిడి
5. చలన వైకల్యం 6. మరుగుజ్జుతనం
7. బుద్ధిహీనత 8. మానసిక సమస్యలు
9. ఆటిజం 10. సెరిబ్రల్ పాల్సీ
11. మస్కులర్ డిస్ట్రోపే
12. నాడీ సంబంధ సమస్యలు
13. స్పెసిఫిక్ లెర్నింగ్
14. మల్టిపుల్ స్లెరోసిస్
15. మాట్లాడలేకపోవడం
16. తలసేమియా 17. హీమోఫీలియా
18. సికిల్ సెల్ డిసీజ్
19. మల్టిపుల్ డిజేబిలిటీస్
20. యాసిడ్ దాడి
21. పార్కిన్సన్స్ బాధితులు
ఈ చట్టం పరిధిలోకి ఆమ్లదాడి బాధితులను ఇటీవలే చేర్చారు.
ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
నోట్: దివ్యాంగుల గురించి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 41 పేర్కొంటుంది. ఈ ప్రకరణలో భారత ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులకు లోబడి నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతి కల్పించాలి. పనిచేయగల శక్తి సామర్థ్యాలున్న వారందరికి ఉపాధి కల్పించాలి. పని హక్కులను, విద్యాహక్కులను వినియోగించుకొనేటట్లు చర్యలు తీసుకోవాలి. అనేక సమస్యలతో సతమతమవుతున్నవారిపై దయ చూపడం కంటే సంఘీభావం ప్రకటించాలి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లలో దివ్యాంగులకు మూడు శాతం కేటాయిస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
దివ్యాంగుల సంక్షేమానికి సూచనలు
2016 సంవత్సరం నాటికి 2.6 కోట్ల మంది దివ్యాంగులున్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి రాష్ట్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లాల్లో సంక్షేమ అధికారులను నియమించాలి.
దివ్యాంగులందరికీ యుద్ధ ప్రాతిపదికన అన్ని రాష్ర్టాల్లో చెల్లుబాటయ్యేలా వైద్య ధ్రువీకరణ పత్రాలివ్వాలి.
దివ్యాంగుల కోసం రైల్వే శాఖ అదనంగా బోగీలను సంసిద్ధం చేయాలి.
అన్ని విశ్వ విద్యాలయాల్లో దివ్యాంగ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
దివ్యాంగులు పరీక్షలు రాసేందుకు ప్రస్తుతమిస్తున్న సమయానికి అదనంగా మరో 20 నిమిషాలివ్వాలి.
వికలాంగులు కాదు వారు విభిన్న ప్రతిభావంతులు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది.
పింఛను: వయసుతో నిమిత్తం లేకుండా అర్హులైన దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 3016 పింఛను అందిస్తుంది.
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు:
1 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తుంది.
ఆర్థిక పునరావాసం:
21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం వివిధ రకాల సబ్సిడీలతో రుణ సహాయం అందిస్తుంది.
వివాహ ప్రోత్సాహక బహుమతి:
వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే వారికి ప్రోత్సాహక బహుమతి అందజేస్తుంది.
వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు:
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం వసతి గృహాలు, దివ్యాంగ విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పింది.
ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు: అన్ని రంగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది.
4 సెప్టెంబర్ 2018 నుంచి వికలాంగత్వాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1. మానసిక అనారోగ్యం, 2. నరాల జబ్బులు, 3. రక్త సంబంధ జబ్బులు, 4. బహుళ అనారోగ్యం
అదేవిధంగా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తుంది.
కంప్యూటర్ శిక్షణ:
అంధులకు కంప్యూటర్ వినియోగానికి వీలుగా జాస్ సాఫ్ట్వేర్ ద్వారా శిక్షణ.
కృత్రిమ అవయవాల తయారీ, అమర్చే కేంద్రాలు: అన్ని రకాల వైకల్యం గల దివ్యాంగులకు ఆధునిక సాంకేతికతతో కూడిన ఉపకరణాలు అవయవాల తయారీ కేంద్రాల ద్వారా పంపిణీ.
వికలాంగుల క్రీడోత్సవాలు:
వికలాంగులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడోత్సవాలు, జిల్లాకు ఒక లక్ష కేటాయింపు.
ప్రజా సంబంధిత భవనాలు, ప్రదేశాల్లో అవరోధ రహిత వాతావరణం.
దివ్యాంగుల మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 29 మే 2018 నుంచి అమలులోకి వచ్చింది. ఇది గతంలో 1987లో ఉన్న చట్టం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.
ముఖ్యాంశాలు
మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అనారోగ్యానికి చికిత్స ఎలా పొందాలో లేదా చికిత్స ఎలా చేయకూడదో రోగి పేర్కొనవచ్చు.
ఒక వ్యక్తి తన లేదా ఆమె తరఫున ఆరోగ్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి నామినేట్ ప్రతినిధిని నియమించే హక్కు ఉంటుంది.
అనెస్తీషియా లేకుండా ఎలక్ట్రో కన్వల్యూసివ్ థెరపీ చేయరాదు.
నోట్: పుదుచ్ఛేరి ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
వృద్ధులు-సమస్యలు, సంక్షేమం
l 60 ఏళ్ల పైబడిన భారతీయ పౌరులను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రిటైర్మెంట్ వయస్సుతో సమానమైన 60 లేదా 65 ఏళ్ల వయస్సును వృద్ధాప్యపు ప్రారంభంగా పరిగణిస్తారు. హాజన్ అనే శాస్త్రవేత్త వృద్ధాప్యానికి సంబంధించిన స్టీరియోటైప్‌లను పేర్కొన్నాడు. అంతర్జాతీయ వృద్ధుల దినంగా అక్టోబర్ 1ను, అంతర్జాయ వృద్ధుల సంవత్సరంగా 1999ను జరుపుకొంటారు. వృద్ధుల సమస్యలు, వారి శారీరక స్థితి అధ్యయనాన్ని జెరంటాలజీ అంటారు.
రాజ్యాంగపరమైన రక్షణలు
ఆర్టికల్ 41: సీనియర్ సిటిజన్ల సంక్షేమం రాజ్యం విధి.
సామాజిక రక్షణ
1. హిందూ దత్తత, నిర్వహణ చట్టం
ఇది 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు గలవారికి సంబంధించింది.
ఇది దేశమంతా అమలులోకి వచ్చింది.
వృద్ధులకు తమ సంతానం నుంచి మద్దతు, సహాయం పొందే హక్కు కల్పిస్తుంది.
2. తల్లిదండ్రుల, వృద్ధుల సంక్షేమం,నిర్వహణ చట్టం
తహసీల్/సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటైన ట్రిబ్యునల్స్ ద్వారా వృద్ధుల హక్కులను సంరక్షించడం.
తమను నిర్లక్ష్యం చేస్తున్న కుమారులకు గతంలో ధారదత్తం చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోగలగడం.
వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్న కుమారులపై చట్టపరమైన చర్యలు. వీరికి గరిష్ఠంగా 3 నెలల జైలు శిక్ష, 5వేల జరిమానా విధించడం.
1. వయోశ్రేష్ఠ సమ్మాన్(వృద్ధులకు జాతీయ పురస్కార పథకం)
వృద్ధ తరానికి ప్రయోజనాన్ని కలిగించే సేవలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు తగిన గుర్తింపు నివ్వడానికి 2013లో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం (IDOP) సందర్భంగా అక్టోబర్ 1న 13 కేటగిరీల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ వయో శ్రేష్ఠ సమ్మాన్ ఇస్తారు.
2. Integrated Program for Older Persons (IPOP)- 1992
ఈ పథకం ప్రధాన లక్ష్యం వృద్ధాశ్రమాలు, మొబైల్ మెడికేర్ యూనిట్ల స్థాపన, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పంచాయతీరాజ్, స్థానిక సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం ఆర్థిక సహాయం అందజేయడం.
3. వరిష్ఠ పింఛన్ బీయా యోజన (2014)
ఈ పథకం ముఖ్య ఉద్దేశం 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం. ఈ పథకం వల్ల లబ్ధిదారులకు పింఛన్ రూ. 500 నుంచి రూ.5000 వరకు లభిస్తుంది. ఈ పథకాన్ని LIC నిర్వహిస్తుంది.
4. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పింఛన్ పథకం (IGNOAP-1995)
దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదవాడై ఉండాలి.
5. ప్రధానమంత్రి వయో వందన యోజన (2017)
ఇది వృద్ధాప్య సంక్షేమం కోసం ప్రారంభించిన న్యూ పెన్షన్ స్కీమ్.
దీన్ని మొదటగా 60 సంవత్సరాల వారికి కల్పించగా, ప్రస్తుతం ఈ వయస్సును 65కు పెంచారు. దీని నిర్వహణ బాధ్యతను LIC వారు చేపడతారు. దీని కింద పెన్షనర్ల డిపాజిట్లపై 8 శాతం వడ్డీరేటును చెల్లిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?