జేఈఈ మెయిన్ -2023
దేశంలో అత్యంత క్రేజీ ఎంట్రన్స్ టెస్ట్‌గా వాసికెక్కిన పరీక్ష.. జేఈఈ మెయిన్. ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మెయిన్ పరీక్ష వివరాలు సంక్షిప్తంగా….
జేఈఈ మెయిన్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
- (జేఈఈ)- మెయిన్ పేపర్-1 ద్వారా ఎన్ఐటీ, ఐఐఐటీ, సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర యూనివర్సిటీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాలను నిర్వహిస్తారు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పరీక్షగా మెయిన్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. పేపర్-2 ద్వారా బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- జేఈఈ మెయిన్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. దీనివల్ల అభ్యర్థులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. మొదటి సెషన్లో మంచి స్కోర్ రాకుంటే రెండో సెషన్లో స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
- మొదటి సెషన్ పరీక్ష రాయడం ద్వారా అనుభవం వస్తుంది. పరీక్ష స్వభావం, పరీక్షలో చేసిన తప్పులు తెలుసుకోవడం జరుగుతుంది. దీనివల్ల అభ్యర్థి రెండో సెషన్లో మరింత మంచిగా పరీక్ష రాసి మంచి స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది
- మెయిన్ పరీక్షను రెండుసార్లు నిర్వహించడం వల్ల బోర్డు పరీక్షలు లేదా అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో మొదటి సెషన్ పరీక్ష రాయకుంటే రెండో సెషన్ పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది.
- అభ్యర్థి రెండు సెషన్లు రాస్తే.. ఏ సెషన్లో మంచి స్కోర్ వస్తుందో దాన్ని మాత్రమే (బెస్ట్ స్కోర్‌ను) పరిగణనలోకి తీసుకుంటారు.
- జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా 2.50 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. వీరు అడ్వాన్స్డ్ పరీక్ష రాసి దానిలో వచ్చిన స్కోర్/ర్యాంక్ ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పరీక్ష విధానం
- పేపర్ -1 (బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహిస్తారు). ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్-2A (బీఆర్క్‌లో ప్రవేశాల కోసం). ఈ పరీక్షలో మ్యాథ్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్-2ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. పార్ట్-3 డ్రాయింగ్ టెస్ట్‌ను పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్-2B (బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం) పార్ట్-1 మ్యాథ్స్, పార్ట్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్-3 ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్‌ను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
నోట్: ప్రశ్నపత్రం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ) ప్రకారం ఇంగ్లిష్, తెలుగు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ మీడియంలలో ఉంటుంది. మొత్తం 13 భాషల్లో అభ్యర్థి తనకు నచ్చిన భాష (మీడియం)లో ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు.
- పేపర్-1: దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్, ఎంసీక్యూ, న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్షలో సెక్షన్-ఎలో ప్రతి సబ్జెక్టు నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌ను, సెక్షన్-బిలో 10 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలను ఇస్తారు. వాటిలో ఏవైనా ఐదింటిని రాయాలి.
- ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు.
- ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కును కట్ చేస్తారు.
- పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
ఎవరు అర్హులు ?
వయస్సు: జేఈఈ మెయిన్ రాయడానికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. కానీ అభ్యర్థులు 2021/2022లో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2023లో వయస్సుతో సంబంధం లేకుండా ఇంటర్ సెకండియర్ రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: గత మూడేండ్లుగా కొవిడ్-19 కారణంగా ఇంటర్ ఉత్తీర్ణులు జేఈఈ మెయిన్ రాసే అవకాశం ఇచ్చారు.
ఈ ఏడాది మార్కుల నిబంధనను తిరిగి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 65 శాతం, ఇతర అభ్యర్థులు అయితే తప్పనిసరిగా 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
- హయత్‌నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్
- దేశంలో మొత్తం 399 పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లో 24 పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేస్తుంది.
నోట్: దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్,
ఈ-మెయిల్‌ను పేర్కొనాలి.
- ఏదైనా సమాచారం ఉంటే దరఖాస్తు సమయంలో పేర్కొన్న సెల్ నంబర్, ఈ-మెయిల్‌కు ఎన్టీఏ పంపిస్తుంది.
ముఖ్యతేదీలుసెషన్-1
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2023 జనవరి 12ఫీజు చెల్లించడానికి
చివరితేదీ: 2023, జనవరి 12 (రాత్రి 11.50 వరకు)
పరీక్ష కేంద్ర పట్టణం వెల్లడి: 2023, జనవరి రెండో వారం
అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: 2023, జనవరి మూడో వారం
పరీక్ష తేదీలు: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31
సెషన్-2
దరఖాస్తు: ఆన్లైన్లో 2023 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం
చివరితేదీ: మార్చి 7
పరీక్ష తేదీలు: 2023, ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11ఫీజు: పేపర్-1కు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్సీఎల్) బాలురకు రూ.1000, బాలికలకు రూ.800/- అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ (పురుష/మహిళ), థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.500/-
– కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






