ఉర్దూ చాజర్గా కీర్తించిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
21వ తేదీ తరువాయి
43. తల్లికోటయుద్ధం (క్రీ.శ.1865)లో పాల్గొనని బహమనీ రాజ్యం?
1) బీజాపూర్ – ఆదిల్షాహి వంశం
2) బేదర్ – బహీద్షాహీ వంశం
3) బీరార్ – ఇమాద్ షాహీ వంశం
4) గోల్కొండ – కుతుబ్‌షాహీ వంశం
44. కింది వాటిలో సుల్తాన్ కులీ కుతుబ్‌షా బిరుదు కానిది?
1) ఖవాస్ ఖాన్
2) అమర్ -ఉల్-ఉమ్రా
3) జల్-ఉల్-వాహ్
4) కుతుబ్-ఉల్-ముల్క్
45. ఏ సంవత్సరంలో హైదరాబాద్‌లో సంభవించిన ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించాడు
1) 1563-1564 2) 1573-1574
3) 1583-1584 4) 1593-1594
46. కింది వాటిని జతపరచండి?
1) సుల్తాన్ కులీకుతుబ్‌షా
ఎ) 1512-1543
2) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా బి) 1550-1580
3) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా సి) 1612-1626
4) అబుల్హాసన్ తానీషా డి) 1672-1687
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
47. కింది వాటిలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ఆస్థానంలో లేని కవి?
ఎ) పొన్నెగంటి తెలగనాచార్యుడు
బి) సారంగు తమ్మయ్య
సి) అద్దంకి గంగాధరుడు
డి) కందుకూరి రుద్రకవి
ఇ) గణేష పండితుడు
1) ఎ, సి 2) బి, సి
3) సి, ఇ 4) బి, ఇ
48. కింది వాటిని జతపరచండి?
1) షాబందర్ ఎ) ప్రధానరేవు అధికారి
2) మకద్దమ్ బి) గ్రామాధికారి
3) కుల్కర్ణి సి) గ్రామకరణం
4) దేశ్‌ముఖ్ డి) పరగణం గణకుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
49. కింది వాటిలో రామరాయలు ఎవరి కాలంలో సేనాపతిగా పనిచేశాడు?
1) జంషీద్ కులీ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
3) సుల్తాన్ కులీకుతుబ్ షా
4) మహ్మద్ కులీ కుతుబ్‌షా
50. అబుల్ హాసన్ తానీషా గురించి సత్య ప్రవచనం?
1) ఇతని గురువు షారజు కట్టాల్
2) ఇతని ప్రధాని మాదన్న
3) ఇతని సర్వసైన్యాధ్యక్షుడు అక్కన్న
4) పైవన్నీ సరైనవే
51. లైలామజ్ను అనే కావ్యాన్ని రాసిన మీర్జా మహ్మద్ అమీన్ ఏ కులీకుతుబ్‌షా కాలానికి చెందినవారు?
1) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) అబుల్ హాసన్ తానీషా
52. కిందివాటిలో సత్య ప్రవచనం?
ఎ) యయాతి చరిత్రను పొన్నెగంటి తెలగనాచార్యుడు రచించాడు
బి) యయాతి చరిత్ర తెలుగులోమొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
53. కిందివాటిని జతపరచండి?
1) సారంగు తమ్మయ్య
ఎ) వైజయంతీ విలాసం
2) మల్లారెడ్డి బి) శివధర్మోత్తరం
3) మరిగంటి
సంగనార్యుడు సి) దశరథ రాజనందన
4) నేబతి
కృష్ణయామాత్యుడు
డి) రాజనీతి రత్నాకరం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
54. కుతుబ్‌షాహీల కాలంనాటి దిగుమతులకు సంబంధించి సరికానిది?
1) పింగాణీ, గాజు
2) పట్టు, అగరు చెక్క
3) వజ్రాలు, ఇనుము
4) లేగరం, రక్త చందనం
55. ఉర్దూ చాజర్గా కిర్తీంచిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
1) మహ్మద్ కులీ కుతుబ్ షా
2) సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా
3) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
4) అబుల్ హాసన్ తానీషా
56. ఇబ్రహీం కులీకుతుబ్‌షా నిర్మించిన కట్టడాలకు సంబంధించి సరికానిది?
1) చందన్ మహల్, చార్ కమాన్
2) పూల్‌బాగ్ తోట, ఇబ్రహీం బాగ్
3) హుస్సేన్‌సాగర్, లంగర్లు
4) ఇబ్రహీం పట్నం చెరువు, మూసీపై పురానాపూల్
57. ‘పెట్టెడు బంగారాన్ని నెత్తిన పెట్టుకొని వృద్ధురాలు కూడా గోల్కొండ రాజ్యంలో నిర్భయంగా ప్రయాణం చేయగలదు’ అని వాఖ్యానించింది?
1) అబ్దుల్ ఫతా 2) పెరిస్టా
3) ఖుదాబందామీర్జా
4) మీర్ మోమిన్
58. కింది జతల్లో సరికానిది?
1) పీష్వా-ప్రధానమంత్రి
2) మీర్ జుమ్లా – పోలీస్ కమిషనర్
3) ఐనుల్ ముల్క్- యుద్ధమంత్రి
4) మజుందార్-ఆడిటర్
59. హైదరాబాద్ నిర్మాత ఎవరు?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
2) మహ్మద్ కులీకుతుబ్‌షా
3) సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా
4) అముల్ హాసన్ తానీషా
60. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ) పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది
బి) సతీసహగమనం అమల్లో ఉండేది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
61. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) హలుడు -గాధాశప్తశతి
2) సోమదేవుడు – కధా సరిత్సాగరం
3) హరిసేనుడు – బృహత్కథకోశం
4) క్షేయేంద్రుడు- బృహత్కథ
62. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) శాతవాహనులు మౌర్యులు పరిపాలనా విధానాన్ని కొనసాగించారు.
బి) శాతవాహనులు కేంద్రీకృత విధానాన్ని అనుసరించారు.
1) ఎ 2) బి
3) రెండూ సరైనవే 4) ఏదీకాదు
63. శ్రీముఖుడి గురించి సత్యప్రవచనం?
1) మత్స్యపురాణం ఇతన్ని ‘సిముక’
‘చిముక’ అని పిలుస్తుంది.
2) వాయుపురాణం ఇతన్ని సింధుక అని పిలుస్తుంది.
3) విష్ణుపురాణం ఇతన్ని బల ప్రుచ్చకుడు అని పిలుస్తుంది
4) పైవన్నీ సరైనవే
64. కిందివాటిలో గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు కానిది?
త్రిసముద్రత్రోయ పీతవాహన, క్షత్రియ దర్పమానవర్థన
2) దక్షిణాపధపతి, అప్రతిహరచక్ర
3) వినవర్తి చతుర్వర్ణ సంకర, శకయవన పహ్లవ నిఘూదనుడు
4) ఏకశూరుడు, క్షహరాటవంశ నిర్మూలన కర్త
65. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) కుంతల శాతకర్ణికి సంస్కృతాన్ని నేర్పిన పండితుడు ‘శర్వవర్మ’.
బి) శర్వవర్మ ‘కాతంత్య్ర వ్యాకరణం’ అనే సంస్కృత గ్రంథాన్ని రాశాడు.
1) ఎ 2) బి
3) రెండూ సరైనవే 4) ఎదీకాదు
66. కిందివాటిని జతపరచండి.
1) కొల్హాపూర్ ఎ) కుర వంశం
2) మైసూర్ బి) ఛుటు వంశం
3) విజయపురి సి) ఇక్షాకులు
4) మహారాష్ట్ర డి) మహారథులు,మహాభోజులు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
67. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) శాతవాహనులు వైదికమతాన్ని
అనుసరించారు.
బి) దక్షిణ భారతదేశానికి వైదిక మతం
అగస్త్యుని ద్వారా ప్రవేశించింది.
1) ఎ 2) బి
3) రెండూ సరైనవే 4) ఎదీకాదు
68. ఆంధ్రుల గురించి పేర్కొంటున్న అశోకుని శిలాశాసనం ఎన్నోది?
1. 6వ శిలా శాసనం
2) 10వ శిలా శాసనం
3) 9వ శిలా శాసనం
4) 13వ శిలా శాసనం
69. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) మహతరక – గ్రామరక్షకుడు
2) గుమిక- గ్రామపాలకుడు
3) రజ్జుగాహక- భూమి సర్వేఅధికారి
4) బాంఢాగారిక-మతవ్యవహారాలు
70. కింది వాటిని జతపరచండి?
1) మూలపురుషుడు ఎ) శాతవాహనుడు
2) స్థాపకుడు బి) సిముఖుడు
3) గొప్పవాడు సి) గౌతమీపుత్ర శాతకర్ణి
4) చివరివాడు డి) పులోమావి -3
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
71. శ్రీపర్వతం ప్రాంతాన్ని ఏమని అభివర్ణిస్తారు?
1) దక్షిణ భారతదేశపు గయ
2) హీనయాన పవ్రితస్థలం
3) మహాయాన ఆరాధన
4) దక్షిణ భారతదేశపు లుంబినీ
72. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) వీరపురుషదత్త్తుడి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధం అత్యధికంగా వ్యాప్తి చెందింది.
బి) వీరపురుషదత్తుడిని దక్షిణాది అశోకుడు అంటారు.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
73. కింది వాటిని జతపరచండి?
1) మహాతలవర ఎ) శాంతిభద్రతలు
2) మహదండనాయక బి) శిక్షలు విధించే వారు
3) కోష్టాగారిక సి) కోశాధికారి
4) ప్రాడ్వివాకులు డి) ప్రధాన న్యాయమూర్తి
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
74. ధర్మకీర్తి గురించి సత్యప్రవచనం?
1) ఇతను ఆంధ్రదేశంలో చివరి బౌద్ధాచార్యుడు
2) ఇతను నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు
3) ఇతను కంచి ధర్మపాలుని శిష్యుడు
4) పైవన్నీ సరైనవే
75. ఇక్ష్వాకుల కాలంలో హారితి అంటే ఏమిటి.?
1) పాపులను శిక్షించే దేవత
2) శిశువులను రక్షించే దేవత
3) ఒక గొప్ప కట్టడం
4) పశువులను రక్షించే దేవత
76. కింది వాటిలో సరైనది?
ఎ) ఐలాండ్ మ్యూజియం కృష్ణానదిపై
నాగార్జునసాగర్ రిజర్వాయర్ మధ్యలోఉంది.
బి) ఇది భారతదేశంలో ఏకైక, ప్రపంచంలో రెండో ఐలాండ్ మ్యూజియం.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
77. ఆంధ్రదేశంలోని తొలిహిందూ దేవాలయం ఏది?
1) పుష్పభద్రస్వామి ఆలయం
2) అష్టభుజస్వామి ఆలయం
3) నొడగేశ్వర ఆలయం
4) బద్దెగేశ్వర ఆలయం
78. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) ఇక్షాకుల కాలంలో గ్రామాధికారిని తలవీర అంటారు.
బి) ఇక్షాకుల కాలంలో గ్రామపాలనాధికారం వంశపారం పర్యంగా జరిగేది.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) రెండు సరికావు
79. ఆర్యదేవుడి గురించి సత్య ప్రవచనం?
1) ఇతను చిత్తశుద్ధి ప్రకరణ అనే గ్రంథాన్ని రచించాడు
2) ఇతని ఇతర రచనలు సూత్రాంకార,
శతుఃశతకం. శతశాస్త్రం, అక్షరస్క
3) ఇతను ఆచార్య నాగార్జునున్ని సంహరించాడు
4) పైవన్నీ సరైనవే
80. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల్లో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు తెలియజేసే శాసనం ఏది?
1) హిరహబగళి శాసనం
2) విళపట్టి శాసనం
3) మంచికల్లు శాసనం
4) రెంటాల శాసనం
81. కిందివాటిని జతపరచండి?
1) సిఫాసాలార్ ఎ) సేనాపతి
2) నాజీర్ బి) శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ అధికారి
3) సర్ఖేల్ సి) రెవెన్యూ అధికారి
4) షాబందర్ డి) రేవు పట్టణాలకు అధికారి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-డి, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
82. నికొలావ్ మనుషి గురించి సత్య ప్రవచనం ఏది?
1) ఇతను ఇటాలియన్ భాషలో రాసిన Storia Do Mogor అనే పుస్తకంలో గోల్కొండ దర్బార్, ఆనాటి చిత్రలేఖనం గురించి వివరించారు.
2) 17వ శతాబ్దానికి దర్పణంగా చెప్పే ఈ పుస్తకాన్ని 1907లో విలియం ఇర్విన్ ఆంగ్లంలోకి అనువదించాడు
3) ఇతను వెనిస్ (ఇటలీ)కి చెందిన వైద్యుడు
4) పైవన్నీ సరైనవే
83. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) నిజాముద్దీన్ అహమ్మద్ -తబాఖత్-ఎ-అక్బారి
2) ముతమ్మద్ఖాన్ -ఇఖ్బాల్నామ
3) మహమ్మద్ కాజిమి-కితాబ్-ఉల్-లుబాబ్
4) అబ్దుల్ హమీద్ లాహోరి -పాదుషానామా
84. కింది వాటిలో సత్యప్రవనం?
ఎ) ఆచార్య షేర్వాణి History of qutub shahi Dynasty లో 1565లో జరిగిన యుద్ధాన్ని బన్నిహట్టి యుద్ధమని పిలిచారు
బి) రాబర్ సివెల్ తాను రాసిన A Forgotten Empire లో తళ్లికోట యుద్ధమని పిలిచాడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
ఏఎన్ రావు , ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?