The Future of Engineering | నైపుణ్యం ఉంటే భావి ఇంజినీర్లు మీరే
The Future of Engineering | ఇంజినీరింగ్ చదివేవారికి సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించడం ముఖ్యం. సర్టిఫికెట్తో ఏమీ రాదు. మనం నేర్చుకున్న దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు భావి ఇంజినీర్లుగా ఎదగడానికి పాటించాల్సిన సూత్రాలు.. ఎంచుకునే బ్రాంచీతో పాటు అదనంగా ఏం నేర్చుకుంటే భవిష్యత్తు ఉంటుందో సీడీసీ, సీబీఐటీ అడ్వైజర్ డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ఆయన మాటల్లోనే..
ఎంత నేర్చుకున్నామనేదే ముఖ్యం
ఇంజినీరింగ్లో విద్యార్థులు ఏ బ్రాంచీ ఎంచుకున్నా మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ఎంచుకున్న బ్రాంచీలో ఎంత సామర్థ్యం సాధించామనేదే ముఖ్యం. ఐటీ రంగంలో రాణించేందుకు అన్ని రకాల బ్రాంచీలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఏ బ్రాంచీ చదివినా కంప్యూటర్కు సంబంధించిన సబ్జెక్టులు ఉంటున్నాయి. అందువల్ల ఏ బ్రాంచీ తీసుకున్నా కంప్యూటర్ బేస్డ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏఐసీటీ మేజర్, మైనర్ డిగ్రీ అనే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మెకానికల్ తీసుకున్న విద్యార్థి కెమికల్ ఇంజినీరింగ్లో మైనర్ డిగ్రీ చేయొచ్చు. సీఎస్ఈ తీసుకున్న విద్యార్థి సివిల్ ఇంజినీరింగ్లో మైనర్ డిగ్రీ కూడా చేయవచ్చు. ఈ విధానం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంజినీరింగ్కు సంబంధించి ఏ సెక్టార్లోనైనా రాణించొచ్చు. అనేక సంస్థలు ఆన్లైన్లో ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. వీటిని వినియోగించుకుంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు.
ఐటీ రంగంలో అపార అవకాశాలు
ఐటీ రంగంలో అన్ని రకాల బ్రాంచీల విద్యార్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. సమాజంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది… టెక్నాలజీ ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో నిత్యం గమనిస్తూ ఉండాలి. అందుకనుగుణంగా ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఐటీలో ప్రొడక్ట్ కంపెనీల్లో (మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలైనవి) సీఎస్ఈ వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రొడక్ట్ అండ్ సర్వీస్ కంపెనీల్లో (విప్రో, టెక్మహీంద్ర తదితరాలు) అన్ని బ్రాంచీల వారు (కెమికల్, మెటలర్జీ, సివిల్, ఈఈఈ, బయోటెక్నాలజీ మొదలైనవి) ఉద్యోగాలు సాధించవచ్చు. వీటితో పాటు మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ సెక్టార్ చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ రంగంలో రాణించడానికి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్కు అపార అవకాశాలున్నాయి.
కంప్యూటర్ పరిజ్ఞానం అదనపు అర్హత
ఇంజినీరింగ్ పూర్తయ్యేలోపు సంబంధిత సబ్జెక్టులతో పాటు కంప్యూటర్లోని ఏదైనా కోర్సును నేర్చుకుంటే ఏ సెక్టార్లోనైనా ఉద్యోగం సంపాదించవచ్చు. ఇంటర్నెట్లో అనేక ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నేర్చుకుంటే మంచిది. ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థలు ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిని నేర్చుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి.
– కాసాని కుమారస్వామి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం