విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
29. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) కేసీఆర్ 2003, మార్చి 27న ఢిల్లీకి వెయ్యికార్ల యాత్ర చేపట్టాడు
2) జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూసోరెన్ ఆహ్వానం మేరకు ఈ యాత్ర చేపట్టడం జరిగింది
3) ఈ ర్యాలీ అనంతరం రాంలీలా మైదానం (ఢిల్లీ)లో జరిగిన సభలో రాంవిలాస్ పాశ్వాన్ తెలంగాణకు మద్దతు పలికారు
4) వెయ్యి కార్ల యాత్ర గురించి వి. ప్రకాశ్ ‘టీఆర్ఎస్ పదేండ్ల ప్రయాణం’ అనే పుస్తకంలో వివరించాడు
30. టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవ సభ గురించి సరికాని వాటిని గుర్తించండి?
ఎ) ఈ సభను వరంగల్ జైత్రయాత్రగా పిలిచారు
బి) ఈ సభకు కేసీఆర్ సైకిల్‌పై వచ్చారు
సి) ఈ సభకు 15 లక్షల మంది ప్రజలు హాజరుకావడంతో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఈ సభను దేశంలోని
అతిపెద్ద సభగా వర్ణించారు
డి) ఈ సభ 2002 ఏప్రిల్ 27న
హనుమకొండలో జరిగింది
1) ఎ, బి, సి సరికావు
2) బి, సి సరికావు
3) ఎ, డి సరికావు 4) డి సరికాదు
31. జలసాధన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ కింది పాదయాత్రలు నిర్వహించారు?
ఎ) రాజోలిబండ నీరు తరలింపు గురించి (మహబూబ్‌నగర్) అలంపూర్ నుంచి గద్వాల వరకు
బి) నాగార్జునాసాగర్ ఎడమ కాలువ కోసం కోదాడ నుంచి హాలియా వరకు
సి) శ్రీరాంసాగర్ వరద కాలువ కోసం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
32. కింది వాటిని జతపరచండి.
ఉద్యమకారులు : ఉద్యమ ప్రదేశాలు
1) బన్వరీలాల్ పురోహిత్ : ఎ) హరిత ప్రదేశ్
2) బాబులాల్ తివారీ : బి) ప్రత్యేక విదర్భ
3) కేసీఆర్ : సి) ప్రత్యేక బుందేల్‌ఖండ్
4) అజిత్ సింగ్ : డి) తెలంగాణ
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ : 2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి : 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
33. 2003, సెప్టెంబర్ 9న కొత్త రాష్ర్టాల కోసం జాతీయ ఫ్రంట్ ఏర్పడింది. దీనికి కన్వీనర్ ఎవరు?
1) కేసీఆర్
2) బాబులాల్ తివారీ
3) శిబూసోరెన్
4) బన్వరీలాల్ పురోహిత్
34. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కింది ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంది?
ఎ) సీపీఐ బి) సీపీఎం
సి) కాంగ్రెస్ (ఐఎన్‌సీ) డి) టీడీపీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
35. 2004లో కేసీఆర్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచేవారు?
ఎ) సిద్దిపేట శాసనసభ
బి) గజ్వేల్ శాసనసభ
సి) కరీంనగర్ లోక్‌సభ
డి) మెదక్ లోక్‌సభ
1) బి, డి 2) ఎ, డి
3) ఎ, సి 4) బి, సి
36. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి గెలిచిన స్థానాల గురించి సరైన వాక్యం?
1) 42 శాసనసభ , 6 లోక్‌సభ స్థానాలకు పోటీ, 36 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలు గెలిచింది
2) 42 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ, 26 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలుపు
3) 52 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ, 26 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలుపు
4) 26 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ, అన్నింటిలో గెలుపు
37. 2004 యూపీఏ కేంద్రప్రభుత్వంలో చేరిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన మంత్రి పదవుల్లో సరికాని వాక్యం?
ఎ) కేసీఆర్‌కు మొదట కార్మికశాఖ మంత్రి, తర్వాత ఓడరేవుల మంత్రిత్వశాఖ
బి) ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
సి) కేసీఆర్ మొదటగా ఓడరేవుల మంత్రిత్వ శాఖ, తర్వాత కార్మికశాఖ మంత్రి
డి) ఆలె నరేంద్రకు వ్యవసాయ శాఖ మంత్రి. కేసీఆర్‌కు రవాణా శాఖ మంత్రి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) సి, డి
38. 2004లో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కేబినేట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై మంత్రులుగా నియమించబడినవారు?
ఎ) డా.జి. విజయరామారావు
బి) ఈటల రాజేందర్
సి) టి. హరీశ్‌రావు
డి) నాయిని నరసింహారెడ్డి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
39. తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకొనుటకు ‘విస్తృత స్థాయిలో అంగీకారం’ పార్టీల సంప్రదింపులకు 2005లో ఏర్పాటు చేసిన కమిటీ?
1) గులాంనబీ ఆజాద్ కమిటీ
2) సుశీల్ కుమార్ షిండే కమిటీ
3) దిగ్విజయ్ సింగ్ కమిటీ
4) ప్రణబ్ ముఖర్జీ కమిటీ
40. 2005, సెప్టెంబర్ 10న జరిగిన జన జాగరణ సేన గురించి సరికాని వాక్యం?
1) విద్యార్థి యువకుల్లో తెలంగాణ ఉద్యమం పట్ల అంకిత భావం కలిగించటానికి టీఆర్ఎస్ ఈ కార్యక్రమం
నిర్వహించింది
2) ఈ కార్యక్రమానికి చీఫ్ కమాండర్ ఉమాకాంత్
3) వి. ప్రకాశ్ పర్యవేక్షణలో ఇది జరిగింది
4) తెలంగాణలోని ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులకు తెలంగాణ ఉద్యమంపై అవగాహన కార్యక్రమం
41. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కింది పార్టీలతో పొత్తు ఏర్పాటు చేసుకొని మహాకూటమిగా అవతరించింది?
ఎ) కాంగ్రెస్ (ఐఎన్‌సీ) బి) సీపీఐ
సి) సీపీఎం డి) టీడీపీ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి 4) బి, డి
42. 2009 ఎన్నికల్లో వివిధ రకాల పార్టీల మ్యానిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరికానిది?
1) టీడీపీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం, రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తాం
2) సీపీఐ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సహకరిస్తాం
3) బీజేపీ : జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాం
4) సీపీఐ-ఎం: తెలంగాణకు మద్దతు ఇస్తాం
43. దేవేందర్‌గౌడ్ ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పార్టీని ఏ పార్టీలో విలీనం చేశాడు?
1) టీఆర్ఎస్ 2) కాంగ్రెస్
3) టీడీపీ 4) ప్రజారాజ్యం
44. కింది వాటిలో హైదరాబాద్ ఫ్రీజోన్ విధానానికి దారి తీసిన పేరా / నిబంధన సంఖ్య ఎంత?
1) 14(ఎ) 2) 14(సి)
3) 14(బి) 4) 14 (ఎఫ్)
45. 2009, అక్టోబర్ 21న కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని నినదించినది ఏ సభలో?
1) ఉద్యోగుల గర్జన సభ – సిద్దిపేట
2) తెలంగాణ ఆత్మగౌరవ సభ –
నల్లగొండ
3) సింహగర్జన సభ – కరీంనగర్
4) తెలంగాణ గర్జన సభ –
సికింద్రాబాద్
46. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
1) 14(ఎఫ్) ప్రకారం హైదరాబాద్‌లో పనిచేసే పోలీస్ వ్యవస్థ ఫ్రీజోన్‌గా పరిగణించబడుతుంది
2) ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పోలీసులకు వ్యతిరేకంగాట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది
3) 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీజోన్ అని తీర్పు ఇచ్చింది
4) పైవన్నీ సరైనవే
47. 2009 నవంబర్ 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సంఘాలన్నీ కలిసి విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీగా (ఓయూ జేఏసీ) ఏర్పడ్డాయి. దీనికి చైర్మన్ ?
1) పిడమర్తి రవి
2) బాల్క సుమన్
3) ప్రొ. కోదండరాం
4) పైవారెవరూ కాదు
48. కింది వాక్యాల్లో సరికానిది?
1) కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు
2) నిరాహార దీక్ష కోసం సిద్దిపేట దగ్గర రంగనాథపల్లికి వెళ్లేదారిలో కరీంనగర్‌లోని అల్గునూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేశారు
3) కేసీఆర్ అరెస్టు చేసి వరంగల్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు
4) శ్రీకాంతాచారి అనే టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు
49. 2009 డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతారని ప్రకటించినపుడు ఆయన ఏ మంత్రిత్వశాఖలో ఉన్నారు?
1) ఆర్థిక శాఖమంత్రి
2) హోంశాఖ మంత్రి
3) రక్షణ శాఖ మంత్రి
4) న్యాయశాఖ మంత్రి
50. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ గురించి సరికానిది?
1) 2009 డిసెంబర్ 24న
టీజేఏసీ ఏర్పడింది
2) కన్వీనర్ – ప్రొ. కోదండరాం,
కో కన్వీనర్- మల్లేపల్లి లక్ష్మయ్య
3) టీజేఏసీలోని పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ టీడీపీ ఫోరం.
4) టీజేఏసీలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన పార్టీ బీజేపీ
51. కింది వాటిని జతపరచండి?
టీ-జేఏసీ భాగ స్థాపకులు స్వామ్యసంస్థలు
1) తెలంగాణఉద్యోగుల సంఘం ఎ) విఠల్
2) టీఎన్జీవో అసోసియేషన్ బి) దేవీ ప్రసాద్
3) డాక్టర్స్ జేఏసీ సి) బూరనర్సయ్య గౌడ్
4) తెలంగాణగెజిటెడ్ ఆఫీసర్స్అసోసియేషన్ డి) శ్రీనివాస్ గౌడ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
52. 2009లో డా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కమిటి?
1) రోశయ్య కమిటీ
2) జానారెడ్డి కమిటీ
3) ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ
4) చిన్నారెడ్డి కమిటీ
53. తెలంగాణ ఏర్పడితే మనం హైదరాబాద్‌లో విదేశీయులం అవుతాం అని పేర్కొన్నవారు?
1) ఎన్. చంద్రబాబు నాయుడు
2) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
3) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
4) లగడపాటి రాజగోపాల్
54. తెలంగాణ అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి (2010, జనవరి 5) కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరైన తెలంగాణ ప్రాంత వ్యక్తి?
1) జానారెడ్డి 2) శ్రీధర్‌బాబు
3) ఉత్తమ్ కుమార్ రెడ్డి
4) దామోదర రాజనరసింహ
55. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 2010 జూలై 31న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే?
1) జి. కిషన్ రెడ్డి
2) యెండల లక్ష్మీనారాయణ
3) బండారు దత్తాత్రేయ
4) డా. లక్ష్మణ్
56. మానుకోట సంఘటన కింది ఎవరి పర్యటనలో భాగంగా జరిగింది?
1) ఎన్. చంద్రబాబు నాయుడు
2) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
3) కిరణ్ కుమార్ రెడ్డి
4) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- Tags
- BRS
- KCR
- Lok Sabha elections
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు